Photo Credit: Twitter
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెలెక్టర్లపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడం ఆసక్తి రేపుతుంది. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ రైల్వైస్‌తో మ్యాచ్ సందర్భంగా మొదటి రోజు ఆట అనంతరం జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై తన ఆకోశ్రాన్ని వెళ్లగక్కాడు.
మంచిగా ఆడుతున్నప్పటికీ, తనను ఎంపిక చేయకపోవడం బాధను కలిగిస్తుందని సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో చోటు దక్కకపోవడంతోనే సర్ఫరాజ్ సెలెక్టర్ల తీరుపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ''ప్రతిరోజు ఉదయం లేవగానే నన్ను నేను ఒక ప్రశ్న వేసుకుంటాను. అసలు నేనేందుకు కష్టపడాలి? ఎవరి కోసం కష్టపడాలి? ప‌్రాక్టీస్ కోసం ఉదయం 5 గంటలకు ఎందుకు నిద్రలేవాలి? నేను ఇప్పటికే టీమిండియా తరఫున ఆడాను. ఒకప్పుడు బాగా లావుగా ఉన్నావని అంతా హేళన చేయడంతో ఆఫ్ సీజన్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి 22 కిలోలు తగ్గాను. అయితే నేను లావుగా ఉన్నప్పుడే బాగా ఆడేవాడినని చాలా మంది ఆట పట్టించారు.
కానీ వీటిన్నింటిని నేను పట్టించుకోను. కాబట్టి సాధారణ ప్రయత్నాలతోనే ముంబై జట్టులో కొనసాగగలను. కానీ నా తండ్రి నౌషాద్ కష్టాన్ని చూసినప్పుడు ఆయన కోసమైనా మైదానంలో రాణించాలనిపిస్తుంది. అవకాశాలు కోసం ఎదురుచూడను. సెలెక్టర్లు నన్ను ఎంపిక చేస్తే జాతీయ జట్టుకు ఆడుతాను. లేదంటే ఇలాగే ఓపిక ఉన్నంత వరకు దేశవాళీ క్రికెట్ ఆడుకుంటూ పోతాను.'' అని చెప్పుకొచ్చాడు.
ఇక సర్ఫరాజ్ ఖాన్ తన కెరీర్‌లో టీమిండియా తరఫున ఇప్పటివరకు ఆరు టెస్టులాడి 371 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 66 మ్యాచ్‌ల్లో సర్ఫరాజ్ 5,354 పరుగులు సాధించాడు. ఇందులో 18 సెంచరీలు ఉన్నాయి.
ఇదీ చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ స్టార్ క్రికెటర్


