రంజీ ట్రోఫీ.. బౌల‌ర్ల వికెట్ల వేట‌ | Ranji Trophy 2026-27: Karnataka bowls out-Rajasthan all out for 78 Runs | Sakshi
Sakshi News home page

రంజీ ట్రోఫీ.. బౌల‌ర్ల వికెట్ల వేట‌

Nov 2 2026 1:35 PM | Updated on Nov 2 2026 1:40 PM

Ranji Trophy 2026-27: Karnataka bowls out-Rajasthan all out for 78 Runs

Photo Credit: Twitter

దేశ‌వాలీ టోర్నీ రంజీ ట్రోఫీలో సోమ‌వారం నాలుగో రౌండ్ మ్యాచ్‌లు మొద‌ల‌య్యాయి. గ‌త మూడు రౌండ్‌ల మ్యాచ్‌ల‌కు భిన్నంగా ఈసారి తొలి రోజు ఆట‌లో బౌల‌ర్లు చెల‌రేగారు. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ బౌల‌ర్లు వికెట్ల వేట కొన‌సాగించారు. తొలి సెష‌న్ ముగిసేలోపే చాలా జ‌ట్లు క‌నీసం ఆరు కంటే ఎక్కువ వికెట్లు కోల్పోవ‌డం విశేషం. 

గ్రూప్‌-డిలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాజ‌స్తాన్ 78 ప‌రుగుల‌కు ఆలౌటైంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ బౌల‌ర్ల‌లో అభిషేక్ కుమార్ 5 వికెట్లు తీయ‌గా, జితేంద్ర రానా మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. గ్రూప్‌-బిలో క‌ర్నాట‌క‌తో మ్యాచ్‌లో అస్సాం 135 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. క‌ర్నాట‌క బౌల‌ర్ల‌లో రితేశ్ భ‌క్త‌ల్, శ్రీక‌ర్ శెట్టి చెరో 5 వికెట్ల‌తో చెల‌రేగారు. 

గ్రూప్‌-సిలో మ‌హారాష్ట్ర‌తో మ్యాచ్‌లో బెంగాల్ 143 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అభిషేక్ పొరెల్ (54) అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. మ‌హారాష్ట్ర బౌల‌ర్ల‌లో త‌న‌య్ సంఘ్వి 4 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, ప్ర‌దీప్ ద‌దే, రాజ్‌వ‌ర్ధన్ హంగ్రేక‌ర్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. గ్రూప్‌-డిలో ఉత్త‌రాఖండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో హ‌ర్యానా 8 వికెట్ల న‌ష్టానికి 117 ప‌రుగులు చేసింది. ఉత్త‌రాఖండ్ బౌల‌ర్ల‌లో మయాంక్ మిశ్రా ఆరు వికెట్ల‌తో చెల‌రేగ‌గా, దేవేంద్ర సింగ్ రెండు వికెట్లు తీశాడు.

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన నమీబియా.. ఐర్లాండ్‌కు షాక్‌!

కివీస్‌తో తొలి వ‌న్డే.. చిక్కుల్లో టీమిండియా స్టార్ బౌల‌ర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement