breaking news
Ranji Trophy 2026-27
-
గుంటూరు కుర్రాడు భారీ సెంచరీ.. పంజాబ్‌తో మ్యాచ్ డ్రా
రంజీ ట్రోఫీ-2027 సీజన్లో తొలి విజయం కోసం ఆంధ్ర జట్టు నిరీక్షణ కొనసాగుతోంది. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా ఛండీగఢ్ వేదికగా పంజాబ్-ఆంధ్ర మధ్య జరిగిన మ్యాచ్ డ్రా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 592 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.పంజాబ్ బ్యాటర్లలో సాన్వీర్ సింగ్(375 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 205) భారీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు వికెట్‌కీపర్ సైల్ ఆరోరా(144), ఎమన్‌జోత్ సింగ్ చాహల్(122) సెంచరీలతో కదం తొక్కారు. ఆంధ్ర బౌలర్లలో సాయితేజ మూడు, కె ఎస్ నరసింహ రాజు, త్రిపురాన విజయ్, సౌరభ్ కుమార్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.పంజాబ్ జట్టు తొలి రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. అనంతరం ఆంధ్ర జట్టు కూడా ధీటుగా బదులిచ్చింది. చివరి రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 505 పరుగులు చేసింది.ఆంధ్ర బ్యాటర్లలో గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ (223 బంతుల్లో 176, 19 ఫోర్లు) తన ఆరో ఫస్ట్ క్లాస్ సెంచరీతో చెలరేగగా... కరణ్ షిండే (198 బంతుల్లో 73 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. సీఆర్ జ్ఞానేశ్వర్ (49) రాణించగా, రేవంత్ రెడ్డి (3) విఫలమయ్యాడు. కాగా ఈ సీజన్లో ఆంధ్ర జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. రెండింట ఓటమి, మరో రెండింటిని డ్రాగా ముగించింది. -
ఉత్కంఠ పోరు.. ఒక్క వికెట్ తేడాతో హైదరాబాద్ విజయం
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో హైదరాబాద్ తమ జోరును కొనసాగిస్తోంది. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా జింఖానా క్రికెట్ మైదానం వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క వికెట్ తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ఛత్తీస్గడ్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 9 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంలో అనికేత్ రెడ్డి(39), అభిరథ్ రెడ్డి(68),వరుణ్ గౌడ్(55), రక్షణ్ రెడ్డి(15) కీలక పాత్ర పోషించారు. చివరి వికెట్ పడగొట్టి విజయం సాధించాలన్న ఛత్తీస్‌గఢ్ ఆశలపై హైదరబాద్ టెయిలాండర్లు అనికేత్, రక్షణ్ తమ వీరోచిత పోరాటంతో నీళ్లు జల్లారు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో ఆధిత్య సింగ్ మూడు,ధర్మేంద్రసింహ్ జడేజా, జయంత్ యాదవ్, అజయ్ జాదవ్ మండల్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేసింది. అంజూ తివారీ(72), వికల్ప్ తివారీ(69) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేసింది. రాహుల్ రాదేశ్(72), హిమతేజ(46) టాప్ స్కోరర్లగా నిలిచారు. ఛత్తీస్‌గఢ్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. ఛత్తీస్గడ్ రెండో ఇన్నింగ్స్‌లో 254 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి హైదరాబాద్ ముందు ఛత్తీస్‌గఢ్ 256 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఈ టార్గెట్‌ను హైదరాబాద్ చేధించి మూడో విజయాన్ని నమోదు చేసింది. -
పృథ్వీ షా మెరుపులు.. పది వికెట్ల తేడాతో ఘన విజయం
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో భాగంగా బెంగాల్‌తో మ్యాచ్‌లో మహారాష్ట్ర ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టును ఏకంగా పది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. కోల్‌కతా వేదికగా సోమవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య బెంగాల్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది.మహారాష్ట్రకు 75 పరుగుల ఆధిక్యంమహారాష్ట్ర బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలు కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ అర్ధ శతకం (54)తో రాణించాడు. అతడికి తోడు ప్రదీప్త ప్రామాణిక్ 31 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 143 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు ఆలౌట్ అయింది.మహారాష్ట్ర బౌలర్లలో తనయ్ సంఘ్వీ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ప్రదీప్ దాధే, రాజ్‌వర్దన్ హంగర్గేకర్, సిద్దేశ్ వీర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ కాగా.. 75 పరుగుల ఆధిక్యం లభించింది. తనయ్ సంఘ్వీ అజేయ హాఫ్ సెంచరీ (60)తో సత్తా చాటాడు.186 పరుగులకు ఆలౌట్.. లక్ష్యం 111 ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్ ఈసారి 186 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ పోరెల్ మరోసారి అర్ధ శతకం (65)తో అలరించగా.. సుమంత గుప్తా సైతం హాఫ్ సెంచరీ (59) బాదాడు. ఫలితంగా బెంగాల్ మహారాష్ట్రకు 111 పరుగుల లక్ష్యం విధించగలిగింది.పృథ్వీ షా మెరుపులు.. సచిన్ అర్ధ శతకంఆటకు ఆఖరి రోజైన గురువారం నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర వికెట్ నష్టపోకుండా పనిపూర్తి చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన ఓపెనర్, కెప్టెన్ పృథ్వీ షా ఈసారి మెరుపులు మెరిపించాడు. కేవలం 50 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 53 పరుగులతో అజేయంగా నిలిచాడు.పృథ్వీ షాకు తోడు మరో ఓపెనర్ సచిన్ దాస్ కూడా అజేయ అర్ధ శతకం (68 బంతుల్లో 61)తో రాణించాడు. ఫలితంగా 19.4 ఓవర్లలోనే 114 పరుగులు చేసిన మహారాష్ట్ర పది వికెట్ల తేడాతో బెంగాల్‌ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్లో ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మహారాష్ట్ర... రెండో విజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రతో మ్యాచ్‌లో బెంగాల్ పేసర్, టీమిండియా వెటరన్ స్టార్ మహ్మద్ షమీ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.ఇదీ చదవండి: IND vs NZ: ‘అతడు తుదిజట్టులో లేకపోయినా పెద్దగా తేడా ఉండదు’ -
రంజీ ట్రోఫీలో సంచలనం.. సౌరాష్ట్రను చిత్తు చేసిన త్రిపుర
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో పెను సంచలనం నమోదైంది. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ సౌరాష్ట్రను 133 పరుగుల తేడాతో త్రిపుర చిత్తు చేసింది. 342 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర కేవలం 208 రన్స్‌కే ఆలౌటైంది. ఈ భారీ లక్ష్య చేధనలో సౌరాష్ట్రను త్రిపుర ఆఫ్ స్పిన్నర్ సందీప్ సర్కార్ దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో చెలరేగిన సందీప్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్లతో అదరగొట్టాడు. మొత్తంగా 8 వికెట్లు పడగొట్టి త్రిపురకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. సౌరాష్ట్ర బ్యాటర్లలో అర్పితా వాసవడ (189 బంతుల్లో 89 పరుగులు) ఒక్కడే అర్ధ సెంచరీతో పోరాడాడు చివరి వికెట్‌గా అతడిని మణిశంకర్ మురాసింగ్ రనౌట్ చేయడంతో త్రిపుర విజయం లాంఛనమైంది.సంక్షిప్త స్కోర్లుత్రిపుర (1వ ఇన్నింగ్స్): 313/10 (శ్రీదామ్ పాల్ 86)సౌరాష్ట్ర (1వ ఇన్నింగ్స్): 182/10 (సందీప్ సర్కార్ 4/48)త్రిపుర (2వ ఇన్నింగ్స్): 210/10 (శ్రీదామ్ పాల్ 50)సౌరాష్ట్ర (2వ ఇన్నింగ్స్): 208/10 (అర్పితా వాసవడ 89, సందీప్ సర్కార్ 4/81)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శ్రీదామ్ పాల్ (86 & 50) -
రంజీల్లో చరిత్ర సృష్టించిన తమిళనాడు క్రికెటర్
రంజీ ట్రోఫీ 2026-27లో తమిళనాడు జట్టు మూడో విజయాన్ని సాధించింది. ఎలైట్ గ్రూప్-డిలో భాగంగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు ఇన్నింగ్స్ 259 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఫాలోఆన్ ఆడిన చండీగఢ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 64.5 ఓవర్లలో 218 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ అర్జున్ ఆజాద్ (60), కెప్టెన్ మనన్ వోహ్రా (59) అర్థసెంచరీలతో రాణించగా, మరో ఓపెనర్ నెహాల్ పజ్నీ (26) పర్వాలేదనిపించాడు. తమిళనాడు బౌలర్లలో అజిత్ రామ్ ఏడు వికెట్లతో చండీగఢ్ పతనాన్ని శాసించగా, కెప్టెన్ సాయి కిషోర్ రెండు, శరవణ కుమార్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 571 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రదోశ్ రంజన్ (335 బంతుల్లో 208) డబుల్ సెంచరీ బాదగా, అజిత్ రామ్ (115 నాటౌట్) శతకం సాధించాడు. ఇక చండీగఢ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగులకే కుప్పకూలింది. సోను యాదవ్ 4 వికెట్లు తీయగా, శరవణ కుమార్, సాయి కిషోర్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ ద్వారా తమిళనాడు క్రికెటర్ అజిత్ రామ్ రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించాడు. తమిళనాడు తరఫున ఒక రంజీ మ్యాచ్‌లో సెంచరీతో పాటు ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన నాలుగో క్రికెటర్‌గా అజిత్ రామ్ నిలిచాడు. గతంలో ఏజీ రామ్‌సింగ్ 1935-36లో (121 నాటౌట్; 6-32 వర్సెస్ హైదరాబాద్), బీసీ అల్వా 1950-51లో (138, 5-82 వర్సెస్ మైసూరు), ఎస్ వాసుదేవన్ 1978-79లో (100 నాటౌట్, 5-21 వర్సెస్ కేరళ) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక తమిళనాడు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక డ్రాతో గ్రూప్-డిలో తొలి స్థానంలో కొనసాగుతుంది.రైల్వేస్ టార్గెట్ 379 పరుగులుగ్రూప్-డిలో భాగంగా రైల్వేస్ జట్టు ఎదుట ముంబై 379 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ప్రస్తుతం రైల్వేస్ జట్టు వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. ఇషాన్ గోయల్ (15) క్రీజులో ఉన్నాడు. అంతకముందు ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 234 పరుగులకు డిక్లేర్ చేసింది. ఓపెనర్ దివ్యాన్ష్ సక్సేనా (136 బంతుల్లో 100 నాటౌట్) అజేయ సెంచరీ సాధించగా, మరో ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ (79) అర్థసెంచరీ చేశాడు. ఆఖర్లో సర్ఫరాజ్ ఖాన్ (25 బంతుల్లో 29 నాటౌట్) మెరిశాడు. రైల్వేస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ కాగా, అంతకముందు ముంబై జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. అంగ్క్రిష్ రఘువంశీ, సర్ఫరాజ్ ఖాన్, అకాశ్ ఆనంద్, షామ్స్ ములానీ అర్థసెంచరీలు సాధించారు.115 not out & 7/48 Ajith Ram becomes only the fourth Tamil Nadu player to score a century and take a five-wicket haul in the same Ranji Trophy match. The last TN player to achieve this feat was their Ranji Trophy-winning captain, S. Vasudevan, in 197 #tnca #ranji #tamilnadu https://t.co/FuVjhozjkM— dk_drjr (@DineshK57215640) November 5, 2026 A memorable win, a strong bowling partnership! Ajith Ram S and Sai Kishore share their thoughts on Tamil Nadu’s performance against Uttarakhand in the Ranji Trophy 2026-27. 🤩 #RanjiTrophy #TamilNaduCricket #TNCA #TNCricket https://t.co/VjiGhEgB2a— TNCA (@TNCACricket) October 21, 2026ఇదీ చదవండి: ఆల్‌టైమ్ టాప్-5 వన్డే క్రికెటర్లు వీరే!.. కోహ్లికి దక్కని చోటు#HBD Kohli: 10 రోజుల పనిలో 626 పరుగులు -
పృథ్వీ షా విఫలమైనా!... ఒకే ఒక్క పరుగుతో..
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో భాగంగా మహారాష్ట్రతో మ్యాచ్‌లో బెంగాల్ ఎట్టకేలకు ఆధిక్యంలోకి వచ్చింది. వెలుతురులేమి కారణంగా బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి 24 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేయగలిగింది. తద్వారా ఒక్క పరుగు ఆధిక్యంలో నిలిచింది.143 పరుగులకే ఆలౌట్ కోల్‌కతా వేదికగా సోమవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ అర్ధ శతకం (54)తో రాణించగా.. ప్రదీప్త ప్రామాణిక్ 31 పరుగులు చేశాడు.పృథ్వీ షా విఫలమైనా..మహారాష్ట్ర బౌలర్లలో తనయ్ సంఘ్వీ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ప్రదీప్ దాధే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, సిద్దేశ్ వీర్ తలా రెండు వికెట్లు కూల్చారు. అనంతరం మహారాష్ట్ర 218 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ పృథ్వీ షా (12) విఫలమైనా.. సిద్దేశ్ వీర్ (28), సౌరభ్ నవాలే (28), రాజ్‌వర్దన్ (24), ప్రదీప్ దాధే (27) ఓ మోస్తరుగా రాణించారు. తనయ్ సంఘ్వీ అజేయ అర్ధ శతకం (60)తో సత్తా చాటాడు.75 పరుగుల ఆధిక్యంబెంగాల్ బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు, షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లు కూల్చగా.. మహ్మద్ కైఫ్ రెండు, సూరజ్ సింధు జైస్వాల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు తొలి ఇన్నింగ్స్‌లో 75 పరుగుల ఆధిక్యం లభించింది.ఒక్క పరుగు ఆధిక్యంలోకి బెంగాల్అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (9) మరోసారి విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన సుదీప్ ఘరామి (12) నిరాశపరిచాడు. నాలుగో నంబర్ బ్యాటర్, సుదీప్ ఛటర్జీ డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అంకుర్ పాల్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.ఈ క్రమంలో బుధవారం ఆట ముగిసేసరికి అభిషేక్ పోరెల్ 23, సూరజ్ సింధు జైస్వాల్ సున్నా పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా నాలుగు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసిన బెంగాల్.. ఒక్క పరుగు ఆధిక్యంలోకి వచ్చింది. ఇవీ చదవండి: రోహిత్ భాయ్ వల్లే ఇలా!.. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు: గిల్అద్భుతం.. అతడిని టెస్టుల్లోనూ ఆడించండి: టీమిండియా దిగ్గజం -
పరుగుల వరద.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన అనామక బ్యాటర్
భారత దేశవాళీ క్రికెట్లో ఇటీవలి కాలంలో ఓ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అతడే చిన్మయ్ సుతార్. ముంబైలో జన్మించిన ఈ అనామక బ్యాటర్ ప్రస్తుతం మిజోరం జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.సుతార్ కొద్ది రోజుల కిందట రంజీ ట్రోఫీలో క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసి చరిత్ర సృష్టించాడు. బిబి నింబాల్కర్ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.సుతార్ తాజాగా మరో భారీ ఘనత సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం తర్వాత తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు (834) చేసిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు బషీర్ షా (831) పేరిట ఉండిన ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.బషీర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తన తొలి ఇన్నింగ్స్‌ల్లో 831 పరుగులు చేస్తే.. ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు చిన్మయ్‌కు కేవలం 5 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి. మిజోరం తరఫునే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన చిన్మయ్ తన తొలి ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 35, 99, 400 నాటౌట్, 125, 175 స్కోర్లు చేశాడు.ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో 175 పరుగులు చేయడంతో చిన్మయ్ ఈ భారీ రికార్డు సాధించాడు. చిన్మయ్ రికార్డు శతకం కారణంగా మిజోరం ఈ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఇదీ చదవండి: కోహ్లి మెరుపులు.. తొలి వన్డేలో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా -
సెలక్టర్లకు వార్నింగ్.. నిప్పులు చెరిగిన మహ్మద్ షమీ
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో టీమిండియా వెటరన్, బెంగాల్ స్పీడ్ స్టార్ మహ్మద్ షమీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఎలైట్ గ్రూపు-సిలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ నిప్పులు చెరిగాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.తొలి ఇన్నింగ్స్‌లో 23.5 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. కేవలం 37 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు షాబాజ్ అహ్మద్ మూడు, మహ్మద్ కైఫ్ రెండు వికెట్లు సాధించారు. ఫలితంగా మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఆలౌటైంది. మహారాష్ట్ర బ్యాటర్లలో తన్మయ్ సంఘ్వీ(60) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ పృథ్వీ షా(12) మరోసారి నిరాశపరిచాడు.షమీ పునరాగమనం చేస్తాడా?కాగా మహ్మద్ షమీ గత రంజీ సీజన్లోనూ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. రంజీతో పాటు విజయ్ హాజారే ట్రోఫీలోనూ అతడు రాణించాడు. అయినప్పటికి అతడికి భారత సెలక్టర్లు నుంచి మాత్రం పిలుపు రావడం లేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున చివరిసారిగా ఆడిన షమీ.. ఆ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లు తీసి సత్తా చాటడంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ మూడు వికెట్లు సాధించాడు.అయితే ఆ తర్వాత ఐపీఎల్ 2025లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దాని తర్వాత జరిగిన దేశవాళీ సీజన్లో తిరిగి ఆకట్టుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు, రంజీ ట్రోఫీలో 13 ఇన్నింగ్స్‌ల్లో 37 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇంత రాణించినా షమీకి భారత జట్టులో చోటు దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడంతో షమీని కూడా తిరిగి ఎంపిక చేయాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
భారత బ్యాటర్ ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
భారత బ్యాటర్ చిన్మయ్ సుతార్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 123 ఏళ్లుగా.. ఆస్ట్రేలియా ఆటగాడు బిల్ పోన్స్‌ఫోర్డ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. మిజోరాం జట్టు తరఫున చిన్మయ్ సుతార్ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ సందర్భంగా ఈ రెడ్‌బాల్ టోర్నీలో అరంగేట్రం చేశాడు.135 పరుగులతో అజేయంగాతాజాగా అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా 29 ఏళ్ల చిన్మయ్ శతక్కొట్టాడు. ఆనంద్‌లోని లాల్ బహదూర్ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య మంగళవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి ఈ వన్‌డౌన్ బ్యాటర్ 232 బంతులు ఎదుర్కొని.. 12 ఫోర్ల సాయంతో 135 పరుగులతో అజేయంగా నిలిచాడు.123 ఏళ్ల రికార్డు బ్రేక్ఇక అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగానే.. చిన్మయ్ సుతార్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించాడు. అరంగేట్రం తర్వాత ఐదు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ బిల్ పోన్స్‌ఫోర్డ్ (Bill Ponsford 1921-1922) పేరిట ఉండేది. అతడు ఆడిన తొలి ఐదు ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌లో 724 పరుగులు చేయగా.. చిన్మయ్ 748 పైచిలుకు పరుగులతో బిల్‌ను అధిగమించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసేసరికి మిజోరాం మూడు వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి.. 81 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.ఇదీ చదవండి: Asia Cup: పాకిస్తాన్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆరోజే! -
విధ్వంసకర శతకం.. ఆపై అజేయ డబుల్ సెంచరీ
గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఉర్విల్ పటేల్ అదరగొట్టాడు. కేరళతో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదిన ఈ బరోడా ఆటగాడు.. అదే జోరు కొనసాగిస్తూ అజేయ ద్విశతకంతో అలరించాడు.కాగా రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్- కేరళ జట్ల మధ్య సోమవారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. తొమ్మిది వికెట్ల నష్టానికి 534 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.91 బంతుల్లోనే శతకంఓపెనర్లలో అభిషేక్ దేశాయ్ (42) రాణించగా.. ఆర్య దేశాయ్ (95) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. మిగిలిన వారు ఓ మోస్తరుగా రాణించగా.. ఆరో స్థానంలో వచ్చిన ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 91 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్... దానిని డబుల్ సెంచరీగా మార్చాడు.తొలి డబుల్ సెంచరీమొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో 227 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్ పటేల్.. 17 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 210 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా అతడికి రంజీ క్రికెట్లో ఇదే తొలి డబుల్ సెంచరీ ఇక విశాల్ జైస్వాల్ అర్ధ శతకం (77) బాదగా.. మనన్ హింగ్రాజియా 33, అమిత్ దేశాయ్ 36 పరుగులతో రాణించారు. కేరళ బౌలర్లలో నెడుమంకులి బాసిల్ మూడు వికెట్లు తీయగా.. ఆదిత్య సర్వాటే రెండు, ఎండీ నిధీశ్, జలజ్ సక్సేనా, వైశాఖ్ చంద్రన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. 💯 in just 91 balls for Urvil Patel 👏 3️⃣rd FC HUNDRED for Gujarat's WK-Batter 🔥 Updates ▶️ https://t.co/9SDceLaOZW #RanjiTrophy | @mflone_ https://t.co/UCy3NvSUfU— BCCI Domestic (@BCCIdomestic) November 3, 2026ఇవీ చదవండి: అతడి ఖేల్ ఖతం.. టీమిండియా తలుపులు మూసుకుపోయినట్లే! -
సెలెక్టర్లపై టీమిండియా క్రికెటర్ ఆక్రోశం
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెలెక్టర్లపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడం ఆసక్తి రేపుతుంది. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ రైల్వైస్తో మ్యాచ్ సందర్భంగా మొదటి రోజు ఆట అనంతరం జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై తన ఆకోశ్రాన్ని వెళ్లగక్కాడు. మంచిగా ఆడుతున్నప్పటికీ, తనను ఎంపిక చేయకపోవడం బాధను కలిగిస్తుందని సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో చోటు దక్కకపోవడంతోనే సర్ఫరాజ్ సెలెక్టర్ల తీరుపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ''ప్రతిరోజు ఉదయం లేవగానే నన్ను నేను ఒక ప్రశ్న వేసుకుంటాను. అసలు నేనేందుకు కష్టపడాలి? ఎవరి కోసం కష్టపడాలి? ప్రాక్టీస్ కోసం ఉదయం 5 గంటలకు ఎందుకు నిద్రలేవాలి? నేను ఇప్పటికే టీమిండియా తరఫున ఆడాను. ఒకప్పుడు బాగా లావుగా ఉన్నావని అంతా హేళన చేయడంతో ఆఫ్ సీజన్లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి 22 కిలోలు తగ్గాను. అయితే నేను లావుగా ఉన్నప్పుడే బాగా ఆడేవాడినని చాలా మంది ఆట పట్టించారు. కానీ వీటిన్నింటిని నేను పట్టించుకోను. కాబట్టి సాధారణ ప్రయత్నాలతోనే ముంబై జట్టులో కొనసాగగలను. కానీ నా తండ్రి నౌషాద్ కష్టాన్ని చూసినప్పుడు ఆయన కోసమైనా మైదానంలో రాణించాలనిపిస్తుంది. అవకాశాలు కోసం ఎదురుచూడను. సెలెక్టర్లు నన్ను ఎంపిక చేస్తే జాతీయ జట్టుకు ఆడుతాను. లేదంటే ఇలాగే ఓపిక ఉన్నంత వరకు దేశవాళీ క్రికెట్ ఆడుకుంటూ పోతాను.'' అని చెప్పుకొచ్చాడు.ఇక సర్ఫరాజ్ ఖాన్ తన కెరీర్లో టీమిండియా తరఫున ఇప్పటివరకు ఆరు టెస్టులాడి 371 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 66 మ్యాచ్‌ల్లో సర్ఫరాజ్ 5,354 పరుగులు సాధించాడు. ఇందులో 18 సెంచరీలు ఉన్నాయి.ఇదీ చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ స్టార్ క్రికెటర్తిలక్ వర్మకు అంత సీన్ లేదు..! -
చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్.. 59 ఏళ్ల రికార్డు బ్రేక్
రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు, విదర్భ స్టార్ హర్ష్ దూబే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మధ్యప్రదేశ్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్లతో చెలరేగాడు.నాగ్‌పూర్ వేదికగా టాస్ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్‌కు దిగిన విదర్భ 209 పరుగులకు మధ్యప్రదేశ్‌ను ఆలౌట్ చేసింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు వణుకు పుట్టించాడు.మొత్తంగా 23.1 ఓవర్లు బౌలింగ్ చేసిన హర్ష్ దూబే.. 53 పరుగులు ఇచ్చి ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో విదర్భ తరఫున ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు కూల్చిన, అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు అరుణ్ ఓగిరాల్ పేరిట ఉండేది. 1967లో అరుణ్ మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో 39 పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో విదర్భ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు👉హర్ష్ దూబే: నాగ్‌పూర్ వేదికగా 2026లో మధ్యప్రదేశ్ మీద (9-53)👉అరుణ్ ఓగిరాల్: నాగ్‌పూర్ వేదికగా 1967లో మధ్యప్రదేశ్ మీద (8-39)👉ప్రీతం గాంధీ: అల్వార్ వేదికగా 1997లో రాజస్తాన్ మీద (8-61).మ్యాచ్ విషయానికొస్తే.. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్ కాగా.. సోమవారం నాటి తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి విదర్భ నాలుగు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్ కంటే ఇంకా 153 పరుగులు వెనుకబడి ఉంది. ఇదీ చదవండి: IND vs NZ: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ టైమింగ్స్, లైవ్‌స్ట్రీమింగ్ వివరాలు -
రంజీ ట్రోఫీ.. బౌలర్ల వికెట్ల వేట
దేశవాలీ టోర్నీ రంజీ ట్రోఫీలో సోమవారం నాలుగో రౌండ్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. గత మూడు రౌండ్ల మ్యాచ్‌లకు భిన్నంగా ఈసారి తొలి రోజు ఆటలో బౌలర్లు చెలరేగారు. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ బౌలర్లు వికెట్ల వేట కొనసాగించారు. తొలి సెషన్ ముగిసేలోపే చాలా జట్లు కనీసం ఆరు కంటే ఎక్కువ వికెట్లు కోల్పోవడం విశేషం. గ్రూప్-డిలో హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ 78 పరుగులకు ఆలౌటైంది. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో అభిషేక్ కుమార్ 5 వికెట్లు తీయగా, జితేంద్ర రానా మూడు వికెట్లు పడగొట్టాడు. గ్రూప్-బిలో కర్నాటకతో మ్యాచ్‌లో అస్సాం 135 పరుగులకు కుప్పకూలింది. కర్నాటక బౌలర్లలో రితేశ్ భక్తల్, శ్రీకర్ శెట్టి చెరో 5 వికెట్లతో చెలరేగారు. గ్రూప్-సిలో మహారాష్ట్రతో మ్యాచ్‌లో బెంగాల్ 143 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ పొరెల్ (54) అర్థసెంచరీతో రాణించాడు. మహారాష్ట్ర బౌలర్లలో తనయ్ సంఘ్వి 4 వికెట్లతో చెలరేగగా, ప్రదీప్ దదే, రాజ్వర్ధన్ హంగ్రేకర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. గ్రూప్-డిలో ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హర్యానా 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఉత్తరాఖండ్ బౌలర్లలో మయాంక్ మిశ్రా ఆరు వికెట్లతో చెలరేగగా, దేవేంద్ర సింగ్ రెండు వికెట్లు తీశాడు.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన నమీబియా.. ఐర్లాండ్‌కు షాక్!కివీస్‌తో తొలి వన్డే.. చిక్కుల్లో టీమిండియా స్టార్ బౌలర్! -
8 వికెట్లతో సత్తాచాటిన తనీష్.. ముంబైకి హ్యాట్రిక్ విజయం
రంజీ ట్రోఫీ-2027 ఎలైట్ గ్రూప్-డిలో ముంబై జట్టు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో ముంబైకి ఇది వరుసగా మూడో విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తమ మొదటి ఇన్నింగ్స్‌లో 430 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ముంబై ఇన్నింగ్స్‌లో అంగ్క్రిష్ రఘువంశీ(114), ముషీర్ ఖాన్(109) భారీ సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం హర్యానా తమ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ 6 వికెట్లతో సత్తాచాటగా.. తనీష్ కొటియన్ మూడు వికెట్లు పడగొట్టాడు.అయితే 160 పరుగుల తేడాతో ఉండడంతో హర్యానాను ముంబై ఫాలో ఆన్ ఆడాలని నిర్ణయించింది. ఫాలో ఆన్‌లో కూడా హర్యానా ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ముంబై స్పిన్నర్ తనీష్ కొటియన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి హర్యానాను దెబ్బతీశాడు.దీంతో హర్యానా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 256 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ముందు హర్యాని కేవలం 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. ఈ లక్ష్యాన్ని ముంబై ఓపెనర్లు కేవలం 10.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఊదిపడేశారు.ఓపెనర్ ఆంగ్క్రిష్ రఘువంశీ హర్యానా బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అతను మొత్తంగా 39 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ దివ్యాన్ష్ సక్సేనా 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. -
ముషీర్ ఖాన్ సంచలనం
ముంబై ఆల్‌రౌండర్ ముషీర్ ఖాన్ సంచలనం సృష్టించాడు. రంజీ ట్రోఫీలో అరుదైన ఘనత సాధించాడు. హర్యానాతో జరుగుతున్న గ్రూప్-డి మ్యాచ్‌లో తొలుత సెంచరీతో సత్తా చాటిన ముషీర్, ఆ తర్వాత బంతితోనూ అదరగొట్టి ఐదు వికెట్లు పడగొట్టాడు.తద్వారా ఓ రంజీ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టిన ఆరో ముంబై ఆటగాడిగా నిలిచాడు. చివరిసారిగా 1990-91 సీజన్లో భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రి ముంబై తరఫున ఈ ఘనత సాధించాడు. 36 ఏళ్ల తర్వాత ముషీర్ ఈ ఫీట్‌ను పునరావృతం చేశాడు.ముంబై తరఫున ఒకే రంజీ మ్యాచ్‌లో సెంచరీ, ఐదు వికెట్ల ఘనత సాధించిన ఆటగాళ్లు - మదన్ రైజీ: మహారాష్ట్రపై, 1947-48- దత్తు ఫడ్కర్: మద్రాస్‌పై, 1948-49- వినూ మన్కడ్: మద్రాస్‌పై, 1953-54- పాలీ ఉమ్రిగర్: మహారాష్ట్రపై, 1957-58- రవిశాస్త్రి: మధ్యప్రదేశ్‌పై, 1990-91- ముషీర్ ఖాన్: హర్యానాపై, 2026-27మ్యాచ్ విషయానికొస్తే.. ముషీర్ (109)తో పాటు అంగ్కృష్ రఘువంశీ (114) సెంచరీలతో కదంతొక్కడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 430 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ముషీర్ బంతితోనూ (6-78) చెలరేగడంతో హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యేలా కనిపిస్తుంది. మూడో రోజు రెండో సెషన్ సమయానికి ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 168 పరుగులు వెనుకపడి ఉంది. ఇదీ చదవండి: విండీస్‌తో టెస్టు.. బంగ్లాదేశ్ బ్యాటర్ అరుదైన రికార్డు -
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ప్రియాన్షు.. 79 ఏళ్ల రికార్డు బద్దలు
రంజీ ట్రోఫీ 2026-27లో బరోడా యువ బ్యాటర్ ప్రియాన్షు మోలియా (21) చరిత్ర సృష్టించాడు. జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అజేయమైన ట్రిపుల్ సెంచరీ (321) చేయడంతో బరోడా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 79 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 1947లో గుల్ మహమ్మద్ చేసిన 319 పరుగుల నేటి వరకు బరోడా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. ఈ రికార్డును ప్రియాన్షు ఇవాళ అధిగమించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బరోడా తొలుత బ్యాటింగ్ చేయగా.. ప్రియాంన్షు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 492 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 321 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మహేశ్ పిథియాతో కలిసి ఏడో వికెట్‌కు 232 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పిథియా తన తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీ (102) సాధించాడు. ప్రియాంన్షు, పిథియా సత్తా చాటడంతో బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 616 పరుగులకు ఆలౌటైంది.21 ఏళ్ల 132 రోజుల వయసులో ట్రిపుల్ సెంచరీ చేసిన ప్రియాన్షు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఏడో అతి పిన్న భారత బ్యాటర్‌గా నిలిచాడు. అతి పిన్న వయసులో ట్రిపుల్ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా వసీం జాఫర్ (18 ఏళ్ల 262 రోజులు) చలామణి అవుతున్నాడు.బరోడా ఇన్నింగ్స్ పూర్తైన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూ కశ్మీర్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కమ్రాన్ ఇక్బాల్ (0), షుభమ్ ఖజూరియా (2) క్రీజ్‌లో ఉన్నారు. జమ్మూ కశ్మీర్ బరోడా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 610 పరుగులు వెనుకపడి ఉంది. ఇదీ చదవండి: రంజీ ట్రోఫీ.. డబుల్ సెంచరీలతో మోతెక్కించిన బ్యాటర్లు -
రంజీ ట్రోఫీ.. డబుల్ సెంచరీలతో మోతెక్కించిన బ్యాటర్లు
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2026-27లో ఆయా జట్ల బ్యాటర్లు డబుల్ సెంచరీలు, శతకాలతో హోరెత్తిస్తున్నారు. ఎలైట్ గ్రూప్-ఏలో జార్ఖండ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్ ఆయుశ్ బదోని డబుల్ సెంచరీతో చెలరేగగా, సుమిత్ మాథూర్ సెంచరీ సాధించాడు. తద్వారా ఢిల్లీ భారీ స్కోరు దిశగా సాగుతుంది. ప్రస్తుతం 126 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ జట్టు 5 వికెట్ల నష్టానికి 474 పరుగులు చేసింది. బదోని (201), సుమిత్ మాథూర్ (118) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా రికార్డు స్థాయిలో 293 పరుగులు జోడించడం విశేషం.నిహాల్ ద్విశతకంఎలైట్ గ్రూప్-డిలో హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చండీగఢ్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. 118 ఓవర్లు ముగిసేసరికి చండీగఢ్ 2 వికెట్ల నష్టానికి 528 పరుగులు చేసింది. ఓపెనర్ నిహాల్పజిని (324 బంతుల్లో 202 బ్యాటింగ్; 23 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా, అరస్లాన్ ఖాన్ (99) పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.ప్రియాన్షు డబుల్.. మహేశ్ సెంచరీఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా బ్యాటర్ ప్రియాన్షు మోలియా ద్విశతకం మార్క్ సాధించాడు. 354 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన ప్రియాన్షు ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ప్రస్తుతం బరోడా 128 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసింది. మహేశ్ పితియా కూడా 210 బంతుల్లో శతకం మార్క్ అందుకున్నాడు. ఏడో వికెట్‌కు ఈ జోడి అజేయంగా 233 పరుగులు జోడించింది.పటీదార్ శతకం..ఇక ఎలైట్ గ్రూప్-ఏలో బీహార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పటీదార్ శతకం సాధించాడు. 133 బంతుల్లో 109 పరుగులు చేసిన పటీదార్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. అంతకముందు వికెట్ కీపర్ సాక్షమ్ పురోహిత్ (132) కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 407 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బీహార్ 99 పరుగులకే కుప్పకూలడంతో, మధ్యప్రదేశ్ 308 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.పంజాబ్ 431 ఆలౌట్ఎలైట్ గ్రూప్-బిలో హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 431 పరుగులకు ఆలౌటైంది. సలీల్ అరోరా (151) భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, చివర్లో రమన్‌దీప్ సింగ్ (52) అర్థసెంచరీ సాధించాడు. చివర్లో ఉమేశ్ యాదవ్ (37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ నాలుగు వికెట్లతో చెలరేగగా, రక్షణ్ మూడు వికెట్లు, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డిలు ఒక్కో వికెట్ పడగొట్టారు.ఇదీ చదవండి: పరుగు తేడాతో ఓటమి.. బీసీసీఐకి ఫిర్యాదుఇషాన్కు గాయం నిజమేనా? అడ్డంగా దొరికిన బీసీసీఐ! -
వరుస సెంచరీల తర్వాత.. రింకూ సింగ్ దారుణ వైఫల్యం!
రంజీ ట్రోఫీ 2026-27 తాజా మ్యాచ్‌లలో ఉత్తరప్రదేశ్ స్టార్ రింకూ సింగ్, మహారాష్ట్ర కెప్టెన్ పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యారు. ఇద్దరూ డకౌట్ అయి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. తాజా రంజీ ఎడిషన్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్ తొలి మ్యాచ్‌లో బిహార్‌తో తలపడింది.వరుస సెంచరీలతో చెలరేగిన రింకూఈ మ్యాచ్‌లో టీమిండియా ఫినిషర్ రింకూ సింగ్ శతకం (112)తో రాణించి.. యూపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో యూపీ బిహార్‌పై ఇన్నింగ్స్, 267 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అనంతరం గోవాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ రింకూ శతక్కొట్టాడు. అజేయ సెంచరీ (118)తో జట్టును గెలిపించాడు.తాజాగా డకౌట్అయితే, తాజాగా సోమవారం పుదుచ్చేరితో మొదలైన మూడో రంజీ మ్యాచ్‌లో మాత్రం రింకూ సింగ్ తుస్సుమనిపించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ లెప్టాండర్ బ్యాటర్.. రెండు బంతులు ఎదుర్కొని.. పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఆతిథ్య జట్టు బౌలర్లు అంకిత్ శర్మ బౌలింగ్‌లో మోహిత్ కాలేకు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి ఉత్తరప్రదేశ్ నాలుగు వికెట్ల నష్టానికి 67 పరుగులే చేయగలిగింది.అదే బాటలో పృథ్వీ షామరోవైపు.. రుతురాజ్ గైక్వాడ్ గైర్హాజరీలో మహారాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పృథ్వీ షా కూడా విఫలమయ్యాడు. పుణె వేదికగా గుజరాత్‌తో మ్యాచ్‌లో పృథ్వీ షా రెండు బంతులు ఎదుర్కొని.. చింతన్ గజా బౌలింగ్‌లో ఉర్విల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక మహారాష్ట్ర సోమవారం ఆట పూర్తయ్యేసరికి.. వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది.కాగా తాజా సీజన్లో మహారాష్ట్ర తొలి మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టుతో తలపడగా.. పృథ్వీ షా 70, 7 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర ఘన విజయం సాధించింది. ఇక జార్ఖండ్‌తో మ్యాచ్‌లో పృథ్వీ షా 21 పరుగులకే పరిమితం కాగా.. మ్యాచ్ డ్రా అయింది.చదవండి: టీమిండియాకు శుభవార్త.. ఆ ఇద్దరు వచ్చేస్తున్నారు! -
టాప్ లేపిన భారత స్పిన్నర్.. 99 పరుగులకే ఆలౌట్
రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్-ఏలో బీహార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ బౌలర్ సారాన్ష్ జైన్ ఏడు వికెట్లతో చెలరేగాడు. సారాంశ్ ధాటికి బీహార్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బీహార్‌కు మధ్యప్రదేశ్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపారు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఓపెనర్ నమన్ గౌరవ్‌తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన స్రమన్ నిగ్రోధ్ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్ సారాన్ష్ వరుస ఓవర్లలో వికెట్లు తీసి బీహార్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ దశలో ఓపెనర్ మంగల్ మహ్రౌర్ (42) ఒంటరిపోరాటం చేశాడు. మిడిలార్డర్లో ఆయుశ్ లోహారుకా (1), కెప్టెన్ సకిబుల్ గని (2), ఆకాశ్ రాజ్ (0) దారుణంగా విఫలమయ్యారు.లోయర్ ఆర్డర్లో సూరజ్ కశ్యప్ (15) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే మరోదఫా బౌలింగ్‌కు వచ్చిన సారాన్ష్ బీహార్‌ను దెబ్బకొట్టాడు. ఇక చివరి వికెట్‌గా మంగల్ వెనుదిరగడంతో బీహార్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మధ్యప్రదేశ్ బౌలర్లలో సారాన్ష్ జైన్ (13-1-40-7) అద్భుత ప్రదర్శన చేయగా, ఆవేశ్‌ఖాన్ రెండు, కుమార్ కార్తికేయ ఒక వికెట్ తీశారు. కాగా ఈ సీజన్లో మధ్యప్రదేశ్ తాము ఆడిన రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకొని ఆరు పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, ఆడిన రెండు మ్యాచ్‌లోనూ పరాజయం చవిచూసిన బీహార్ ఏడో స్థానంలో ఉంది. ఇక 33 ఏళ్ల సారాన్ష్ జైన్ శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆడిన సారాన్ష్ జైన్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మూడు వికెట్లు తీశాడు. లంక బ్యాటర్ల వీరోచిత పోరాటంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. టెస్టు సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.ఇదీ చదవండి: ఫిఫ్టీ బాదిన సుందర్.. 284 పరుగుల ఆధిక్యంలో భారత్గంభీర్ కీలక నిర్ణయం.. సంజూకు డిమోషన్! వైభవ్‌కు ప్రమోషన్? -
తనయ్ విజృంభణ.. ఆంధ్రపై హైదరాబాద్ ఘన విజయం
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ఆంధ్రపై 267 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. తనయ్ త్యాగరాజన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన తనయ్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో ఆంధ్ర పతనాన్ని శాసించాడు. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర 130 పరుగులకే కుప్పకూలింది. తనయ్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం కూడా సాధించాడు.మిగతా మ్యాచ్ విషయానికొస్తే.. కేరళ జట్టు ఒడిశాపై ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో గెలిచింది. జలజ్ సక్సేనా ఐదు వికెట్లతో సత్తాచాటాడు. ముంబై జట్టు హిమాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ ఏడు వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్‌ను ఓడించింది. మేఘాలయ మూడు పరుగుల తేడాతో మణిపూర్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.మహారాష్ట్ర-జార్ఖండ్, ఢిల్లీ-గుజరాత్, రైల్వేస్-రాజస్థాన్, కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మహారాష్ట్ర, ఢిల్లీ, సౌరాష్ట్ర పైచేయి సాధించాయి. మిజోరం నిర్దేశించిన 581/9 స్కోరుకు బదులుగా నాగాలాండ్ 516 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడింది. మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ 400 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇదీ చదవండి: ముంబై డబుల్ బోనస్ -
పాటిదార్ మెరుపు శతకం
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌ను మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ ఘనంగా ప్రారంభించాడు. పుదుచ్చేరితో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ మ్యాచ్‌లో మెరుపు శతకంతో ఆకట్టుకున్నాడు. 116 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. మొత్తంగా 118 బంతులు ఎదుర్కొని 13 ఫోర్ల సాయంతో 107 పరుగులతో అజేయంగా ఉన్నాడు. పాటిదార్ సెంచరీతో కదంతొక్కడంతో మధ్యప్రదేశ్ పటిష్ట స్థితిలో ఉంది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసి, కీలకమైన 125 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. పాటిదార్‌కు జతగా అథర్వ్ మహాజన్ (32) క్రీజ్‌లో ఉన్నాడు. వారి ఇన్నింగ్స్‌లో చంచల్ రాథోడ్ (78), శుభమ్ శర్మ (78) అర్ద సెంచరీలతో రాణించగా.. హర్ష్ గావ్లి (10), యశ్ దూబే (4), కుమార్ కార్తికేయ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పుదుచ్చేరి బౌలర్లలో గౌరవ్ యాదవ్ 3 వికెట్లతో రాణించగా.. సాగర్ ఉదేశి, అంకిత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు పుదుచ్చేరి 177 పరుగులకే ఆలౌటైంది. మధ్యప్రదేశ్ బౌలర్లు తలో చేయి వేసి పుదుచ్చేరి ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. రవి కిరణ్ 3, ఆర్యన్ పాండే, కుమార్ కార్తికేయ, సరాన్ష్ జైన్ తలో 2, అర్షద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు. పుదుచ్చేరి ఇన్నింగ్స్‌లో రితేశ్ గుడ్జ్ (53) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ప్లేయర్లలో కనీసం ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును తాకలేకపోయారు. ఇదీ చదవండి: సెంచరీతో కదంతొక్కిన సర్ఫరాజ్ ఖాన్ -
సెంచరీతో కదంతొక్కిన సర్ఫరాజ్ ఖాన్
రంజీ ట్రోఫీ 2026-27లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో కదంతొక్కాడు. 213 బంతుల్లో 18 ఫోర్ల సాయంతో 139 పరుగులతో అజేయంగా నిలిచాడు. సర్ఫరాజ్ సెంచరీతో సత్తా చాటడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసి, 258 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. సర్ఫరాజ్‌కు జతగా ఆకాశ్ ఆనంద్ (58) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు కెప్టెన్ సిద్దేశ్ లాడ్ (87) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ (57) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. ఓపెనర్లు అంగ్కృస్ రఘువంశీ 20, దివ్యాంశ్ సక్సేనా 9 పరుగులు చేసి ఔటయ్యారు. హిమాచల్ బౌలర్లలో అభిషేక్ కుమార్, జితేందర్ రానా తలో 2 వికెట్ల తీశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హిమాచల్ ప్రదేశ్, తుషార్ దేశ్‌పాండే (4-46), సిల్వెస్టర్ డిసౌజా (2-43), మోహిత్ అవస్తి (1-37), తనుశ్ కోటియన్ (1-11) ధాటికి 140 పరుగులకే కుప్పకూలింది. వారి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ పుక్రాజ్ మన్ (35), వైభవ్ కల్టా (33), ఆకాశ్ వశిష్ట్ (39), ఇన్నేశ్ మహాజన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ముగ్గురు డకౌట్లు కాగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాకపోయినా..!న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టులో చోటు దక్కని సర్ఫరాజ్, రంజీ ట్రోఫీలో శతకంతో సత్తా చాటాడు. ఈ సెంచరీతో అతడు భారత సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. సర్ఫరాజ్ గతకొంతకాలంగా అద్బుతంగా రాణిస్తున్నా, టీమిండియా సమీరణల కారణంగా అతడికి జట్టులో చోటు దక్కడం లేదు. సర్ఫరాజ్‌కు 65 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఇది 18వ శతకం. ఇదీ చదవండి: రంజీ ట్రోఫీలో సంచలనం.. 400 పరుగులు చేసిన అనామక ప్లేయర్ -
రంజీ ట్రోఫీలో సంచలనం.. 400 పరుగులు చేసిన అనామక ప్లేయర్
రంజీ ట్రోఫీ 2026-27లో సంచలనం నమోదైంది. ఓ అనామక బ్యాటర్ ఏకంగా క్వాడ్రుపుల్ సెంచరీ (510 బంతుల్లో 46 ఫోర్లు, 7 సిక్సర్లతో 400 నాటౌట్) బాదాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ ఈ ఘనత సాధించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఓ బ్యాటర్ 400 పరుగుల మార్కును తాకడం ఇది రెండోసారి మాత్రమే. 1948లో మహారాష్ట్ర తరఫున బిబి నింబాల్కర్ (443 నాటౌట్) తొలిసారి క్వాడ్రుపుల్ సెంచరీ సాధించాడు. 78 ఏళ్ల తర్వాత చిన్మయ్ సుతార్ తిరిగి ఈ ఘనత సాధించాడు. రంజీ చరిత్రలో నింబాల్కర్, సుతార్ మినహా ఎవ్వరూ క్వాడ్రుపుల్ సెంచరీ సాధించలేదు. ఈ చారిత్రక స్కోర్ సాధించే క్రమంలో సుతార్ టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రికార్డును అధిగమించాడు. షా 2022లో అసోంపై 379 పరుగులు చేశాడు.రంజీ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:- 443* – భాసాహెబ్ నింబాల్కర్- 400* – చిన్మయ్ సుతార్- 379 – పృథ్వీ షా- 377 – సంజయ్ మంజ్రేకర్- 366 – ఎం.వి. శ్రీధర్- 366 – తన్మయ్ అగర్వాల్లారా, బ్రాడ్‌మన్ సరసన సుతార్తాజా ప్రదర్శనతో సుతార్ దిగ్గజ బ్యాటర్లు డాన్ బ్రాడ్‌మన్, బ్రియాన్ లారా సరసన చేరాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వీరితో పాటు మరో ఆరుగురు మాత్రమే క్వాడ్రుపుల్ సెంచరీలు చేశారు. లారా,పోన్స్ఫర్ట్ తలో రెండు సార్లు ఈ ఘనత సాధించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ బ్రియాన్ లారా పేరిటే ఉంది.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:- 501* - లారా- 499 - హనీప్ మొహమ్మద్- 452* - బ్రాడ్‌మన్- 443* - నింబాల్కర్- 437 - పోన్స్ఫర్డ్- 429 - పోన్స్ఫర్డ్- 428 - ఆఫ్తాబ్ బలోచ్- 424 - మెక్లారెన్- 410* -నార్త్ఈస్ట్- 405* - గ్రేమ్ హిక్- 400* - లారా- 400* - చిన్మయ్ సుతార్ఇదీ చదవండి: టీమిండియా బౌలర్ వరల్డ్ రికార్డు -
రంజీ చరిత్రలో అద్భుత ఘట్టం.. తొమ్మిదో స్థానంలో వచ్చి శతకం
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ ఎలైట్ గ్రూప్-బిలో సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటయ్యింది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మన్వంత్ కుమార్ (214 బంతుల్లో 135; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో కర్నాటక ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 194 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కర్నాటకను మన్వంత్ కుమార్ గట్టెక్కించాడు. తొమ్మిదో వికెట్‌కు అభిలాష్ షెట్టి (14)తో కలిసి రికార్డు స్థాయిలో 146 పరుగులు జోడించడం విశేషం. ఇందులో మన్వంత్ కుమార్ ఒక్కడే 128 పరుగులు సాధించాడు. ఒక ఎండ్‌లో అభిలాష్‌ను నిలబెట్టి స్ట్రైక్ మొత్తం తానే తీసుకున్న మన్వంత్ రంజీ చరిత్రలోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడనంలో సందేహం లేదు. కాగా 22 ఏళ్ల మన్వంత్కు ఇదే తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీ కావడం విశేషం.సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భుట్ ఐదు వికెట్లతో చెలరేగగా, కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ మూడు, చేతన్ సకారియా రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఓపెనర్లు హార్విక్ దేశాయ్ (41), హెత్విక్ కొటక్ (16) క్రీజులో ఉన్నారు. సౌరాష్ట్ర ఇంకా 285 పరుగులు వెనుకబడి ఉంది.- Ranji Trophy - Karnataka 194/8 - Coming to bat at Number 9 - 22 years old, 2nd match in FC Manvanth Kumar smashed an iconic 135 runs, A fast bowling all rounder from Karnataka to look forward to the future. 🇮🇳 IPL teams can look for him in the upcoming auction. https://t.co/5k25xeMQFU— Johns. (@CricCrazyJohns) October 19, 2026 Manvanth Kumar’s six-hitting masterclass! 🔥 Came in at No. 8 and smashed an unbeaten 86 with 5 sixes, crucial 87-run partnership for the 9th wicket. And that SIX off Undakat… ABSOLUTELY CRAZY #KARvSAU #ManvanthKumar @Vinay_Kumar_R https://t.co/LqB7hocutp— KA 36 (@KA36_P001) October 18, 2026ఇదీ చదవండి: డబుల్ సెంచరీతో చెలరేగిన బదోని.. భారీ స్కోరు దిశగా ఢిల్లీన్యూజిలాండ్ బయల్దేరిన టీమిండియా టీ20 జట్టు -
డబుల్ సెంచరీతో చెలరేగిన బదోని.. భారీ స్కోరు దిశగా ఢిల్లీ
రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్-సిలో గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని డబుల్ సెంచరీతో చెలరేగాడు. 246 బంతుల్లో 217 పరుగులు చేసిన బదోని ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (199) పరుగు తేడాతో ద్విశతకం చేజార్చుకున్నాడు. ఫలితంగా ఢిల్లీ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ 122 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 553 పరుగులు చేసింది. సుమిత్ మాథుర్ (55 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా, అనూజ్ రావత్ (6) అతడికి సహకరిస్తున్నాడు. ప్రియాన్ష్ ఆర్య, ఆయుష్ బదోనిలు నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 234 పరుగులు జోడించారు. అనంతరం బదోని, సుమిత్ మాథుర్‌లు ఐదో వికెట్‌కు 167 పరుగులు జోడించి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను 500 మార్క్‌ను దాటించారు. గుజరాత్ బౌలర్లలో హర్షల్‌పటేల్ రెండు వికెట్లు తీయగా, జయ్‌మీత్ పటేల్, మనన్ హింగ్రాజియా చెరొక వికెట్ పడగొట్టారు.ఇదీ చదవండి:రంజీ చరిత్రలో అద్భుత ఘట్టం.. తొమ్మిదో స్థానంలో వచ్చి శతకంన్యూజిలాండ్ బయల్దేరిన టీమిండియా టీ20 జట్టు -
తీవ్రంగా నిరాశపరిచిన శుబ్‌మన్ గిల్
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ అనంతరం రంజీ ట్రోఫీ 2026-27లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ ఐదు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి అజయ్ మండల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ ఆది నుంచే ఇబ్బందిగా కనిపించాడు. స్పిన్నర్ మండల్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా, అది మిస్సయ్యి గిల్ ప్యాడ్స్ సందుల్లో నుంచి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.ఇటీవలి కాలంలో స్పిన్ బౌలింగ్ ఆడడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న గిల్ తాజాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ దానిని రిపీట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఔటైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అవకాశమొస్తే మాత్రం రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. విండీస్‌తో సిరీస్ అనంతరం న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది.అయితే మొదట టీ20 సిరీస్ ఆడనుండడంతో వన్డే, టెస్టుల్లో మాత్రమే ఆడుతున్న గిల్‌కు కివీస్‌కు వెళ్లేందుకు సమయం ఉండడంతో మరో మ్యాచ్ ఆడే అవకాశముంది. ఇక వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో గిల్ బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. మూడు వన్డేలాడిన గిల్ 334 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మరో డబుల్ సెంచరీ ఉంది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 40 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. కెప్టెన్ ఉదయ్ సహరన్ (36), ప్రబ్‌సిమ్రన్ సింగ్ (10) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ విహాన్ మల్హోత్రా (40) రాణించాడు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో అజయ్ మండల్ రెండు వికెట్లు తీయగా, ధర్మేందర సిన్హా జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.In the Ranji Trophy, Shubman Gill was bowled after scoring 1 run. https://t.co/f9JgFnW2W5— Mamta Jaipal (@ImMD45) October 18, 2026ఇదీ చదవండి: ‘అతడి కోసం త్యాగం తప్ప నాకు మరో మార్గం లేదు’'సంజూను కాపాడుతున్నది వాళ్లే.. ఇది కరెక్ట్ కాదు' -
శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం!
టీమిండియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన సొంతజట్టు పంజాబ్ తరఫున అతడు రంజీ ట్రోఫీ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నీ రంజీ ట్రోఫీ 2026- 2027 సీజన్ అక్టోబరు 11న మొదలైంది.తొలి మ్యాచ్ డ్రాఎలైట్ గ్రూప్-‘బి’లో భాగంగా పంజాబ్ తొలుత అసోంతో తలపడింది. ఉదయ్ సహారన్ సారథ్యంలో ఆడిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసి.. అసోం జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌట్ చేసింది.అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టి తమ మొదటి ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్ల నష్టానికి 478 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలగా నిలబడగా.. ఫలితం తేలకుండానే మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. ఇక తమ రెండో మ్యాచ్‌లో పంజాబ్ ఛత్తీస్గడ్ జట్టుతో తలపడనుంది.రెండో మ్యాచ్ ఆడనున్న గిల్న్యూ చండీగడ్ వేదికగా ఆదివారం నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఫజిల్కా స్టార్ శుబ్‌మన్ గిల్ జట్టుతో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రంజీ మ్యాచ్ ఆడటంద్వారా ప్రాక్టీస్ పొందవచ్చన గిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 22- డిసెంబరు 1 మధ్య ఇరుజట్ల మధ్య మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఈ టూర్లో తొలి మూడు వన్డేలకు, రెండు టెస్టులకు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహిస్తాడు. నాలుగు, ఐదో వన్డేల్లో టీ20 సారథి శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుకు నడిపిస్తాడు.ఇదీ చదవండి: IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై -
పృథ్వీ షాకు మంచి రోజులు
రంజీ ట్రోఫీ 2026-27 ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా ఢిల్లీ వేదికగా సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు 127 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 66/5తో బుధవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మహారాష్ట్ర చివరకు 56 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. అంకిత్ బావ్నే (48; 3 ఫోర్లు), రాజ్వర్ధన్ హంగార్గేకర్ (43; 5 సిక్స్‌లు)రాణించారు. విక్కీ మాయాజాలంసర్వీసెస్ బౌలర్లలో అర్జున్ శర్మ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 248 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్వీసెస్ 63.3 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. నకుల్ శర్మ (36) టాప్ స్కోరర్. మహారాష్ట్ర స్పిన్నర్ విక్కీ ఓస్త్వాల్ 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేయగా... సర్వీసెస్ 227 పరుగులు చేసింది. మహారాష్ట్ర ప్లేయర్ అంకిత్ బావ్నేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.పృథ్వీ షాకు మంచి రోజులుక్రమశిక్షణారాహిత్యం వల్ల సొంత జట్టు ముంబైకి దూరమైన పృథ్వీ షా.. మహారాష్ట్ర టీమ్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇక మహారాష్ట్ర రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. ఆస్ట్రేలియాతో అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’కు సారథిగా వ్యవహరించిన కారణంగా సర్వీసెస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలి మ్యాచ్‌లోనే సారథిగా ఘన విజయం అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. సర్వీసెస్‌తో మ్యాచ్ మధ్యలోనే పృథ్వీ షాకు వ్యక్తిగతంగానూ శుభవార్త అందింది.మా బంధం కొనసాగుతుందిపృథ్వీ షాతో తన నిశ్చితార్థాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మోడల్, నటి ఆకృతి అగర్వాల్.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. చెప్పుడు మాటలు విని పృథ్వీని తప్పుగా అర్థం చేసుకున్నానని.. తమ బంధాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇందుకు సమ్మతిస్తూ పృథ్వీ షా ఆమె సోషల్ మీడియా పోస్టును రీషేర్ చేశాడు. ఈ నేపథ్యంలో ఈ మహారాష్ట్ర ఆటగాడికి మంచి రోజులు వచ్చాయంటూ అభిమానులు ఉద్వేగానికి లోనవుతున్నారు. కాగా సర్వీసెస్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం (70) బాదిన పృథ్వీ షా.. రెండో ఇన్నింగ్స్ (7)లో మాత్రం విఫలమయ్యాడు.చదవండి: IND vs WI: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు భారీ షాక్! -
ఇన్నింగ్స్ తేడాతో త్రిపుర ఓటమి.. రంజీ ట్రోఫీలో హైదరాబాద్ బోణీ
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఏడు వికెట్లు కోల్పోయి 99 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన త్రిపుర మరో 21 పరుగులు జతచేసి 120 స్కోరు వద్ద ఆలౌటైంది. వికెట్ కీపర్ సెంతూ సర్కార్ (27) టాప్ స్కోరర్‌గా నిలవగా, శ్రీదమ్ పాల్ (25) పర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ ఆరు వికెట్లతో త్రిపుర పతాన్ని శాసించగా, కెప్టెన్ సిరాజ్ 2 వికెట్లు తీయగా, రుతిక్ యాదవ్, అభిరథ్ రెడ్డిలు ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకముందు హైదరాబాద్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా 160 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (122 బంతుల్లో 54; 2 ఫోర్లు)... ఈ మ్యాచ్‌తో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన మహబూబ్‌నగర్ జిల్లా ప్లేయర్ మెండె రుతిక్ యాదవ్ (150 బంతుల్లో 61; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. రాహుల్ రాదేశ్ (119 బంతుల్లో 40; 1 ఫోర్)తో కలిసి రుతిక్ యాదవ్ ఆరో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో చామా మిలింద్ (55 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. త్రిపుర కెప్టెన్ మణిశంకర్ మూరా సింగ్ ఏకంగా తొమ్మిది మందితో బౌలింగ్ వేయించగా... ఆఫ్ స్పిన్నర్ సందీప్ సర్కార్ 96 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఇక త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ బిక్రమ్‌కుమార్ (50) అర్థసెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 5 వికెట్లు తీయగా, తనయ్ త్యాగరాజన్ మూడు వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టిన తనయ్ త్యాగరాజన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. హైదరాబాద్ తమ తర్వాతి మ్యాచ్‌ను అక్టోబర్ 18 నుంచి ఆంధ్ర జట్టుతో ఆడనుంది.ఇదీ చదవండి: ఐపీఎల్ స్టార్‌కు సర్జరీ.. సుదీర్ఘకాలం క్రికెట్‌కు దూరం..!న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టు ఎంపికపై కీలక అప్డేట్! -
రంజీ ట్రోఫీలో సెంచరీ.. కంటతడి పెట్టిన బెంగాల్ బ్యాటర్
రంజీ ట్రోఫీలో భాగంగా గ్రూప్-సిలో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ జట్టు తరఫున అజేయ శతకంతో మెరిశాడు. అయితే సెంచరీ సాధించిన తర్వాత అభిషేక్ మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యాడు. రెండో రోజు ముగిసిన అనంతరం కంటతడి పెట్టడంపై స్పందించిన బెంగాల్ బ్యాటర్ తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలపై కూడా మౌనం వీడాడు. తాను ఏడ్వాలనుకోలేదని, దుఃఖం దానంతట అదే వచ్చిందని తెలిపాడు. తనపై వచ్చిన విమర్శలకు కేవలం ఆటతోనే సమాధానం చెప్పాలనుకున్నానని, ఆ పని చేయడం వల్లే సెంచరీ అనంతరం కన్నీళ్లు వచ్చాయని పేర్కొన్నాడు."ఒక భిన్నమైన ప్రపంచంలో, ఒక భిన్నమైన విశ్వంలో ఎలా మనుగడ సాగించాలో నేను చూశాను. అక్కడి నుంచి నేను ఎన్నో సానుకూల విషయాలను గ్రహించాను. అవి నన్ను మానసికంగా మరింత దృఢంగా మార్చాయి. ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను నేను గడిపిన తీరు, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 'నేను నోటితో కాదు, నా బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాను' అని నాకు నిరంతరం గుర్తుచేస్తూనే ఉంది," అని అభిషేక్ పోరెల్ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు.పోరెల్‌పై వచ్చిన ఆరోపణలేంటి?అభిషేక్ పోరెల్‌పై కర్ణాటకకు చెందిన ఓ వైద్య విద్యార్థిని ఇటీవల తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది. గత మూడేళ్ల కాలంగా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విదేశాలకు కూడా వెళ్లినట్లు ఆరోపించిన బాధితురాలు.. వివాహం విషయానికి వచ్చేసరికి అతడు నిరాకరించారని పేర్కొన్నాడు. గతంలోనూ వీరి మధ్య గొడవలు జరగగా పోలీసుల జోక్యం చేసుకున్నట్లు సమాచారం. అయితే, పోలీసుల నుంచి స్పందన కరువైందంటూ బాధితురాలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు. పోరెల్ ఒకవైపు క్రికెట్ కెరీర్ దూసుకుపోతున్నప్పటికీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పరిణామాలు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.పట్టు బిగించిన బెంగాల్..ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌట్ అయింది. హృతిక్ షోకీన్ (56) అర్థసెంచరీ చేశాడు. బెంగాల్ బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన బెంగాల్ రెండో రోజు ఆట ముగిసేసమయానికి 79 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. సుదీప్ కుమార్ (122 నాటౌట్), అభిషేక్ పోరెల్ (114 నాటౌట్) అజేయ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 199 పరుగులు జోడించారు. ప్రస్తుతం బెంగాల్ 64 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.ఇదీ చదవండి: సఫారీలకు దేవుడే దిక్కు.. విజయానికి 6 వికెట్ల దూరంలో ఆసీస్ -
జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ విఫలమైనా.. ముంబై భారీ స్కోరు!
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో టీమిండియా స్టార్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ శుభారంభం అందుకోలేకపోయారు. ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరు.. చండీగఢ్‌తో మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. అయితే, యువ ఆటగాళ్లతో పాటు కెప్టెన్ సిద్దేశ్ లాడ్ రాణించడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించగలిగింది.యశస్వి జైస్వాల్ డకౌట్రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్- ‘డి’లో భాగంగా ముంబై తమ తొలి మ్యాచ్‌లో చండీగఢ్‌తో తలపడుతోంది. వాంఖడే స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చండీగఢ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. ఆయుశ్ మాత్రే (48) మెరుగ్గా రాణించాడు.ముషీర్, సిద్దేశ్, తనుశ్, మోహిత్ హాఫ్ సెంచరీలువన్డౌన్లో వచ్చిన ముషీర్ ఖాన్ అర్ధ శతకం (65)తో ఆకట్టుకోగా.. కెప్టెన్ సిద్దేశ్ లాడ్ (86) సెంచరీ మిస్సయ్యాడు. అయితే, మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం విఫలమైపోయాడు. ఆరు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు.మిగిలిన వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ ఆకాశ్ ఆనంద్ (22), షమ్స్ ములాని (39) ఫర్వాలేదనిపించగా.. తనుశ్ కొటియాన్ (58), మోహిత్ అవస్థి (119 బంతుల్లో 56 నాటౌట్) హాఫ్ సెంచరీలు సాధించారు. తుషార్ దేశ్‌పాండే 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా సోమవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా.. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులు చేసి ఆలౌట్ అయింది. చండీగఢ్ బౌలర్లలో రోహిత్ ధండా, రాజ్ బవా చెరో నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జగ్జీత్ సింగ్, నిశాంక్ బిర్లా చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: ‘హైదరాబాద్‌లో ఖేల్ ఖతం.. ఆఖరి మ్యాచ్‌లో అతడిని ఆడించండి’ -
సెంచరీతో చెలరేగిన జడేజా.. సౌరాష్ట్ర భారీ స్కోరు
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీ ట్రోఫీలో సెంచరీతో మెరిశాడు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శతకం సాధించాడు. 205 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న జడేజా 102 పరుగుల వద్ద ధర్మేంద్ర సిన్హా జడేజా బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. జడ్డూ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు ఉన్నాయి. కాగా జడేజా కెరీర్లో ఇది 16వ ఫస్ట్‌క్లాస్ సెంచరీ. జడేజాకు తోడు మిడిలార్డర్ బ్యాటర్ ప్రేరక్ మన్కడ్ (150 బంతుల్లో 129) కూడా సెంచరీ చేయడంతో సౌరాష్ట్ర 392 పరుగులు చేసింది. అంతకముందు ఓపెనర్ చిరాగ్ జాని (83) అర్థసెంచరీతో రాణించాడు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో దేవ్ ఆదిత్య సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా, ధర్మేంద్ర సిన్హా జడేజా, రుద్రప్రతాప్ దెహారి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఛత్తీస్‌గఢ్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది.ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడిన జడేజా రెండు మ్యాచ్‌లాడి రెండు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో మాత్రం అవకాశం రాలేదు. ఈ నెల చివరి వారంలో న్యూజిలాండ్ పర్యటన నేపథ్యంలో జడేజా రంజీల్లో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్నాడు. వన్డే, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్న జడేజా ముఖ్యంగా రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించాడు. అందుకే రంజీల్లో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న జడ్డూ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరిసి కివీస్‌తో సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌గా ఉపయోగించుకుంటున్నాడు.ఇదీ చదవండి: యువీ డకౌట్.. బంగ్లాదేశ్ చేతిలో ఇండియా చాంపియన్స్ ఓటమి'డైలాగులు చెప్పడం కాదు గురూ.. బాధ్యత తీసుకుంటావా?' -
సెంచరీతో కదంతొక్కిన రింకూ సింగ్
రంజీ ట్రోఫీ 2026-27లో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ సెంచరీతో కదంతొక్కాడు. బిహార్‌తో ఇవాళ మొదలైన ఎలైట్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్ తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. రింకూ తొలి రోజే మూడంకెల మార్కును తాకాడు. 164 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో యూపీ ఆటగాడు మాధవ్ కౌశిక్ (124 నాటౌట్) అజేయ సెంచరీతో రింకూకు జతగా క్రీజ్‌లో ఉన్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి యూపీ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 287గా ఉంది. అభిషేక్ గోస్వామి (13), కెప్టెన్ ఆర్మన్ జుయల్ (13), కరణ్ శర్మ (13) ఔటయ్యారు. బిహార్ బౌలర్లలో సూరజ్ కశ్యప్ 2, అమోద్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, రింకూ ప్రస్తుతం ఏ ఫార్మాట్లోనూ భారత జట్టులో లేడు. కొద్ది రోజుల కిందట టీ20 జట్టులో స్థానం కోల్పోయిన అతడు రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యలో దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రింకూ చాపకింద నీరులా ప్రవహిస్తున్నాడు. ఈ ఫార్మాట్లో అతడు 77 ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు బాదాడు. తాజా ప్రదర్శనలతో రింకూ మరోసారి భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. రింకూ ప్రస్తుతం భారత-ఏ జట్టులోనూ స్థానానికి నోచుకోలేదు. త్వరలో న్యూజిలాండ్‌లో పర్యటించబోయే ఏ జట్టులో కూడా రింకూకు చోటు దక్కలేదు. ఇదీ చదవండి: రీఎంట్రీలో సూర్యకుమార్ అట్టర్ ప్లాప్ -
కెప్టెన్‌గా సిరాజ్.. ప్రత్యర్థి 134 పరుగులకే ఆలౌట్
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. దేశీ రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. తాజా సీజన్లో తొలి మ్యాచ్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ వేదికగా సిరాజ్ సేన.. త్రిపురతో మ్యాచ్ మొదలుపెట్టింది.బిక్రమ్‌కుమార్ దాస్ అర్ధ శతకంటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న త్రిపుర శుభారంభం అందుకుంది. ఓపెనర్లలో బిక్రమ్‌కుమార్ దాస్ అర్ధ శతకం (107 బంతుల్లో 50) బాదగా.. హ్రితురాజ్ రాయ్ (70 బంతుల్లో 33) ఫర్వాలేదనిపించాడు. అయితే, వీళ్లిద్దరు అవుటైన తర్వాత త్రిపుర బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది.126-3 టు 134-10 హైదరాబాద్ బౌలర్ల ధాటికి తాళలేక 134 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో 126 పరుగులకు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన త్రిపుర.. మరో ఎనిమిది పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేయడం గమనార్హం. శ్రీదం పాల్, హనుమ విహారి, సెంతు సర్కార్, సందీప్ సర్కార్, పర్వేజ్ సుల్తాన్ డకౌట్ కాగా.. కెప్టెన్ మణిశంకర్ మురాసింగ్, రజత్ డే, అభిజిత్ కె సర్కార్ ఒక్కో పరుగు చేశారు. మందీప్ సింగ్ 24 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.హైదరాబాద్ బౌలర్లలో స్పిన్నర్లు అనికేత్ రెడ్డి ఐదు వికెట్లతో అద్భుతం చేయగా.. తనయ్ త్యాగరాజన్ మూడు వికెట్లతో మెరిశాడు. రుతిక్ యాదవ్ మెండేకు ఒక వికెట్ దక్కింది. కెప్టెన్ సిరాజ్ తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో 25 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.చదవండి: సౌతాఫ్రికాతో టెస్టు.. ఆసీస్ బౌలర్ ప్రపంచ రికార్డు -
‘త్వరలోనే టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేస్తా’
స్వదేశంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగించుకున్న తర్వాత టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ గడ్డ మీద అక్టోబరు 22- డిసెంబరు 1 మధ్య ఐదు టీ20లు, రెండు టెస్టులు, ఐదు వన్డేలు ఆడనుంది.త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రంఈ నేపథ్యంలో టీమిండియా యువ క్రికెటర్ హర్ష్ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే తాను భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల హర్ష్ దూబే బౌలింగ్ ఆల్‌రౌండర్. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అతడు.. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటాడు.ఏకంగా 69 వికెట్లుఇక 2024-25 రంజీ సీజన్లో హర్ష్ దూబే పది మ్యాచ్‌లు ఆడి ఏకంగా 69 వికెట్లు పడగొట్టాడు. తద్వారా సీజన్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఊహించని విధంగా ఈ ఏడాది జూన్‌లో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా వన్డే క్యాప్ అందుకున్న హర్ష్ దూబే.. రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.ఈ నేపథ్యంలో కివీస్ పర్యటన నేపథ్యంలో హర్ష్ దూబే టెస్టుల్లోనూ తాను త్వరలోనే అరంగేట్రం చేస్తానని వ్యాఖ్యానించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘త్వరలోనే నేను టీమిండియా తరఫున టెస్టుల్లోనూ అడుగుపెడతాను. దీనిని నా ఊహ అనుకుంటారో.. లేదంటే నా గట్టినమ్మకం అనుకుంటారో.. దానికి ఏ పేరు పెట్టినా మీ ఇష్టం.కచ్చితంగా అరంగేట్రం చేస్తానునేను మాత్రం కచ్చితంగా అరంగేట్రం చేస్తాను. అయితే, ఇది జరిగేంత వరకు మనం ఏదీ బయటకు చెప్పకూడదు. ఒక్కోసారి జీవితంలో అన్నీ అకస్మాత్తుగానే జరిగిపోతాయి. నాకు టెస్టుల్లో ఎప్పుడు అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాను’’ అని హర్ష్ దూబే చెప్పుకొచ్చాడు. కాగా విదర్భ ఆల్‌రౌండర్ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌తో బిజీగా ఉన్నాడు.చదవండి: నా కెరీర్లో అత్యంత కఠిన దశ అదే: రోహిత్ శర్మ -
అర్ధ శతకంతో మెరిసిన పృథ్వీ షా
సర్వీసెస్‌తో రంజీ మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్ పృథ్వీ షా మెరుపు అర్ధ శతకం సాధించాడు. నలభై తొమ్మిది బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా రంజీ ట్రోఫీ ఎలైట్ 2026-27 సీజన్లో భాగంగా మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టుతో తలపడుతోంది.రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భారత్-‘ఎ’ వన్డే జట్టు సారథిగా విధుల్లో ఉండగా.. మహారాష్ట్ర తాత్కాలిక కెప్టెన్‌గా పృథ్వీ షా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఢిల్లీలోని పాలెం ‘ఎ’ స్టేడియంలో మహారాష్ట్ర- సర్వీసెస్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ మొదలైంది.ఆదిలోనే ఎదురుదెబ్బలుటాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ సచిన్ దాస్ (34 బంతుల్లో 14)ను ఏపీ శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. వన్‌డౌన్‌లో వచ్చిన దిగ్విజయ్ పాటిల్ (13 బంతుల్లో 5)ను రాజ్ బహదూర్ బౌల్డ్ చేశాడు. వీరిద్దరు విఫలమైనప్పటికీ మరో ఓపెనర్, కెప్టెన్ పృథ్వీ షా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.49 బంతుల్లోనే అర్ధ శతకంకేవలం 49 బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన పృథ్వీ షా.. మొత్తంగా 73 బంతులు ఎదుర్కొని 70 పరుగులు చేసి ఏపీ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. పృథ్వీ షా నిలకడైన ప్రదర్శన కారణంగా మహారాష్ట్ర 30 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి వంద పరుగుల స్కోరు దాటగలిగింది.చేదు అనుభవం తర్వాతకాగా ఇటీవలే పృథ్వీ షాకు వ్యక్తిగత జీవితంలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. మోడల్, నటి ఆకృతి అగర్వాల్ పృథ్వీ షాతో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే, అతడు మాత్రం ఇంత వరకు ఈ విషయంపై నేరుగా స్పందించలేదు. ఆట మీద పూర్తి శ్రద్ధ పెట్టిన పృథ్వీ.. తాజా రంజీ ఎడిషన్‌లో శుభారంభం అందుకున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌలర్ -
Ranji Trophy: జైస్వాల్ డకౌట్.. కేఎల్ రాహుల్ ఫ్లాఫ్ షో
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2026-27 92వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమయ్యింది. తొలి రోజే వివిధ జట్ల మధ్యన 19 మ్యాచ్‌లు మొదలయ్యాయి. నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు తమ రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగారు. కీలక టోర్నీకి ముందు వీరందరికీ మంచి ప్రాక్టీస్ లభించనుంది. కాగా టెస్టుల్లో భారత్‌కు కీలకమైన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తాజాగా తమ తొలి మ్యాచ్‌ల్లో పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంకా జట్టును ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు ఒకేసారి విఫలమవ్వడం ఆందోళన కలిగించే విషయం. అయితే కివీస్ టూర్‌కు ముందు ఇండియా-ఎ జట్టు తరఫున కూడా అనధికారిక టెస్టు సిరీస్‌లో ఈ ఇద్దరు పాల్గొనే అవకాశముంది. దీంతో రాబోయే మ్యాచ్‌ల్లో వీరిద్దరు రాణిస్తారని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది.జైస్వాల్ డకౌట్..ముంబై తరఫున ఆడుతున్న జైస్వాల్.. ఎలైట్ గ్రూప్-డిలో చండీగఢ్‌తో మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ సిద్దేశ్ లాడ్ బ్యాటింగ్‌కు మొగ్గు చూపాడు. దీంతో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైస్వాల్ 13 బంతులాడి పరుగులేమి చేయకుండానే ఔటయ్యాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఇబ్బందిగా కనిపించిన జగ్జీత్సింగ్ బౌలింగ్‌లో పేలవ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు.కష్టాల్లో కర్ణాటక..ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అజేయ సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్ రంజీల్లో కర్ణాటక తరఫున బరిలోకి దిగాడు. ఎలైట్ గ్రూప్-బిలో ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ కర్ణాటక ఓపెనర్ 4 పరుగులు మాత్రమే చేసి శశికాంత్ బౌలింగ్‌లో క్యాచ్ఔట్గా వెనుదిరిగాడు.19 ఓవర్లు ముగిసేసరికి కర్ణాటక 77 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిగిలిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. జడేజా ప్రాతినిధ్యం వహిస్తున్న సౌరాష్ట్ర జట్టు చత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, సుందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడుతో రాజస్తాన్ మ్యాచ్ ఆడుతోంది.ఇదీ చదవండి: ఆసీస్‌తో మూడో వన్డే.. పాపం ప్రియాన్ష్ పరుగు తేడాతో!భారత్‌తో వన్డే సిరీస్.. రెండు జట్లు ప్రకటించిన న్యూజిలాండ్ -
తొలి మ్యాచ్‌కు గిల్ దూరం.. పంజాబ్ కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దేశవాళీలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్ అస్సాంతో జరగనున్న మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముగియడంతో కెప్టెన్ గిల్‌తో పాటు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ సహా ఇతర ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమయ్యారు. నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత ఆటగాళ్లకు రంజీ మ్యాచ్‌లు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలోనే కేఎల్ రాహుల్, జడేజాలు వారి రాష్ట్ర జట్ల తరఫున ఇవాళ బరిలోకి దిగనున్నారు. కాగా గిల్ గైర్హాజరీకి గల స్పష్టమైన కారణాలను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించలేదు. గిల్ అందుబాటులో లేకపోవవడంతో భారత అండర్-19 మాజీ కెప్టెన్ ఉదయ్ సహారన్ ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నారు. అయితే అక్టోబర్ 18 నుంచి ఛత్తీస్‌గఢ్, పంజాబ్ మధ్య జరగబోయే రెండో రంజీ మ్యాచ్‌లో మాత్రం గిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక అంతర్జాతీయ షెడ్యూల్లో విరామం దొరికిన ఆటగాళ్లు కనీసం ఒక రంజీ మ్యాచ్‌కైనా ప్రాతినిధ్యం వహించాలని జాతీయ సెలక్షన్ కమిటీ ఆదేశించిన సంగతి తెలిసిందే.తొలి రోజే 19 మ్యాచ్‌లు ప్రారంభం..ఇక దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి రోజు అన్నీ జట్లూ బరిలోకి దిగుతుండటంతో మొత్తం 19 మ్యాచ్‌లు ప్రారంభం కానుండటం విశేషం. 32 ఎలీట్ జట్లను నాలుగు గ్రూప్‌లు ఎ, బి, సి, డి లుగా విభజించగా... మరో 6 టీమ్‌లు ప్లేట్ గ్రూప్‌లో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా మైదానంలోకి అడుగు పెట్టనున్న జమ్మూ కశ్మీర్ తమ మొదటి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో తలపడనుంది. భారత టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యులైన కేఎల్ రాహుల్ (కర్ణాటక), యశస్వి జైస్వాల్ (ముంబై), వాషింగ్టన్ సుందర్ (తమిళనాడు), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) టోర్నీ తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగుతూ తమ ఆటకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సత్తా చాటిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (రాజస్థాన్), హర్ష్ దూబే (విదర్భ)లాంటి ఆటగాళ్లకు కూడా ఈ పోరు కీలకం కానుంది. టెస్టు తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ మరోసారి ముంబై తరఫున భారీగా పరుగులు సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. ఇదీ చదవండి: 'అతడిని చూస్తే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లుంది'ఊతప్ప మెరుపులు వృథా.. సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి -
జట్టు ప్రకటన.. రవీంద్ర జడేజాకు చోటు
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌కు సంబంధించి సౌరాష్ట్ర తమ జట్టును ప్రకటించింది. వెటరన్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కట్‌ను మరోసారి కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇక సౌరాష్ట్ర జట్టులో టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా చోటు దక్కింది.గ్రూప్ దశకే పరిమితంకాగా రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా సౌరాష్ట్ర తమ తొలి మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ జట్టుతో తలపడనుంది. అక్టోబరు 11న ఈ మ్యాచ్ మొదలుకానుంది. గత వైఫల్యాలను అధిగమించి ఈసారి మెరుగ్గా రాణించాలని పట్టుదలతో ఉన్న సౌరాష్ట్రకు జడ్డూ రాక సానుకూల అంశంగా పరిణమించింది. గత సీజన్లో సౌరాష్ట్ర గ్రూప్ దశకే పరిమితమైంది.న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందుఇదిలా ఉంటే.. 2019-20, 2022-23 సీజన్లలో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీలు గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు సందర్భాల్లోనూ ఉనాద్కటే కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఇక రంజీ ట్రోఫీ ఆడటం ద్వారా జడ్డూకు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు మంచి ప్రాక్టీస్ లభించనుంది.కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో నవంబరు 19- డిసెంబరు 1 మధ్య రెండు మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఇక జడ్డూ చివరగా ఇటీవల వెస్టిండీస్‌తో స్వదేశంలో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు.కొత్తగా ఇద్దరుఇదిలా ఉంటే.. గత రంజీ సీజన్లో సౌరాష్ట్ర తరఫున మూడు ఇన్నింగ్స్ ఆడిన జడ్డూ మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఇక సౌరాష్ట్ర జట్టు విషయానికొస్తే.. గత సీజన్లో ఆడిన 14 మంది ఆటగాళ్లు ఈసారి కూడా రంజీ జట్టులో చోటు పదిలం చేసుకున్నారు. కొత్తగా పేసర్ నీల్ పాండ్యా, ఆల్‌రౌండర్ అర్థ్ యాదవ్ జట్టులోకి వచ్చారు.కాగా సౌరాష్ట్ర జట్టు రంజీ 2026-27 సీజన్లో ఎలైట్ గ్రూప్-‘బి’లో భాగంగా ఆంధ్ర, అసోం, ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, కర్ణాటక, పంజాబ్, త్రిపుర జట్లతో పోటీపడనుంది.రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌కు సౌరాష్ట్ర జట్టుజయదేవ్ ఉనాద్కట్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), అర్పిత్ వసవాడ, చిరాగ్ జనీ, ప్రేరక్ మన్కడ్, జై గోహిల్, చేతన్ సకారియా, అంకుర్ పన్వార్, సమర్ గజ్జార్, పార్థ్ భూట్, విశ్వరాజ్ సిన్హ జడేజా, హేత్విక్ కొటక్, నీల్ పాండ్యా, అర్థ్ యాదవ్, తరంగ్ గోహెల్.చదవండి: సెలక్టర్లతో మాట్లాడాను.. టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమే -
జట్టు ప్రకటన.. శాంసన్ సోదరులకు దక్కని చోటు!
రంజీ ట్రోఫీ 2026-2027 ఎడిషన్‌లో తొలి మ్యాచ్‌కు సంబంధించి కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) తమ జట్టును ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భాగంగా కేరళ తొలుత జార్ఖండ్‌తో తలపడనుంది. జంషెడ్పూర్ వేదికగా అక్టోబరు 11-14 మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది.ఈ నేపథ్యంలో జార్ఖండ్‌తో మ్యాచ్‌కు కేసీఏ పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో శాంసన్ సోదరులకు మాత్రం చోటు దక్కలేదు. ఈ జట్టుకు కేరళ విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.కాగా రంజీ ఎడిషన్‌లో మహ్మద్ అజారుద్దీన్ గైర్హాజరీలోనూ విష్ణు వినోద్ కేరళ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక ఈ జట్టులో సచిన్ బేబీ, జలజ్ సక్సేనా వంటి సీనియర్లకు కూడా చోటు దక్కింది.అందుకే నో ఛాన్స్?టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్, అతడి అన్న సలీ శాంసన్‌కు ఈ రంజీ జట్టులో చోటు దక్కలేదు. సంజూ ప్రస్తుతం వెస్టిండీస్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న కారణంగా.. జార్ఖండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అయితే, సీజన్లో తదుపరి మ్యాచ్‌లో సంజూ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.మరోవైపు.. సలీ శాంసన్ ఇంత వరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేయనేలేదు. ఈ 35 ఏళ్ల ఆటగాడు కేరళ తరఫున ఇప్పటికి కేవలం రెండు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-2026 సీజన్లో కేరళ తరఫున బరిలోకి దిగాడు.జార్ఖండ్‌తో రంజీ మ్యాచ్‌కు కేరళ జట్టువిష్ణు వినోద్ (కెప్టెన్), రోహన్ కణ్ణుమ్మల్, అభిషేక్ జె. నాయర్, అభిషేక్ పి. నాయర్, సచిన్ బేబీ, అహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ అజారుద్దీన్ (వికెట్ కీపర్), సల్మాన్ నిజార్, వరుణ్ నాయనర్ (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, వైశాఖ్ చంద్రన్, ఆదిత్య ఆనంద్ సర్వాటే, అనురాజ్ జేఎస్, అభిజిత్ ప్రవీణ్ వి, నిధీశ్ ఎండీ, ఏడెన్ ఆపిల్ టామ్, పవన్ రాజ్, బాసిల్ ఎన్పీ. చదవండి: హర్మన్‌తో విభేదాలు!.. స్పందించిన స్మృతి మంధాన


