రంజీ ట్రోఫీలో సెంచ‌రీ.. కంటతడి పెట్టిన బెంగాల్‌ బ్యాటర్‌ | Bengal Batter-Abishek-Porel-Unbeaten-Century-Break-Down-Tears-Ranji-Trophy | Sakshi
Sakshi News home page

రంజీ ట్రోఫీలో సెంచ‌రీ.. కంటతడి పెట్టిన బెంగాల్‌ బ్యాటర్‌

Oct 13 2026 7:59 AM | Updated on Oct 13 2026 8:12 AM

Bengal Batter-Abishek-Porel-Unbeaten-Century-Break-Down-Tears-Ranji-Trophy

రంజీ ట్రోఫీలో భాగంగా గ్రూప్‌-సిలో ఢిల్లీతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ వికెట్ కీప‌ర్ అభిషేక్ పోరెల్ జ‌ట్టు త‌ర‌ఫున అజేయ శ‌త‌కంతో మెరిశాడు. అయితే సెంచ‌రీ సాధించిన త‌ర్వాత అభిషేక్ మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యాడు. రెండో రోజు ముగిసిన అనంత‌రం కంట‌త‌డి పెట్ట‌డంపై స్పందించిన బెంగాల్ బ్యాట‌ర్ త‌నపై వ‌చ్చిన అత్యాచార ఆరోప‌ణ‌ల‌పై కూడా మౌనం వీడాడు. 

తాను ఏడ్వాల‌నుకోలేద‌ని, దుఃఖం దానంతట అదే వచ్చింద‌ని తెలిపాడు. త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు కేవలం ఆట‌తోనే స‌మాధానం చెప్పాల‌నుకున్నాన‌ని, ఆ ప‌ని చేయ‌డం వ‌ల్లే సెంచ‌రీ అనంత‌రం క‌న్నీళ్లు వ‌చ్చాయ‌ని పేర్కొన్నాడు.

"ఒక భిన్నమైన ప్రపంచంలో, ఒక భిన్నమైన విశ్వంలో ఎలా మనుగడ సాగించాలో నేను చూశాను. అక్కడి నుంచి నేను ఎన్నో సానుకూల విషయాలను గ్రహించాను. అవి నన్ను మానసికంగా మరింత దృఢంగా మార్చాయి. ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను నేను గడిపిన తీరు, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 'నేను నోటితో కాదు, నా బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాను' అని నాకు నిరంతరం గుర్తుచేస్తూనే ఉంది," అని అభిషేక్ పోరెల్ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు.

పోరెల్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లేంటి?
అభిషేక్ పోరెల్‌పై కర్ణాటకకు చెందిన ఓ వైద్య విద్యార్థిని ఇటీవల తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది. గత మూడేళ్ల కాలంగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విదేశాలకు కూడా వెళ్లినట్లు ఆరోపించిన బాధితురాలు.. వివాహం విషయానికి వచ్చేసరికి అతడు నిరాకరించారని పేర్కొన్నాడు. 

గతంలోనూ వీరి మధ్య గొడవలు జరగగా పోలీసుల జోక్యం చేసుకున్నట్లు సమాచారం. అయితే, పోలీసుల నుంచి స్పందన కరువైందంటూ బాధితురాలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు. పోరెల్ ఒకవైపు క్రికెట్ కెరీర్ దూసుకుపోతున్నప్పటికీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పరిణామాలు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

పట్టు బిగించిన‌ బెంగాల్‌..
ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 240 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. హృతిక్ షోకీన్ (56) అర్థ‌సెంచ‌రీ చేశాడు. బెంగాల్ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ నాలుగు వికెట్లతో చెల‌రేగాడు. అనంత‌రం ఇన్నింగ్స్ ఆరంభించిన బెంగాల్ రెండో రోజు ఆట ముగిసేస‌మయానికి 79 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 304 ప‌రుగులు చేసింది. 

సుదీప్ కుమార్ (122 నాటౌట్‌), అభిషేక్ పోరెల్ (114 నాటౌట్‌) అజేయ సెంచ‌రీల‌తో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్ద‌రు నాలుగో వికెట్‌కు అజేయంగా 199 ప‌రుగులు జోడించారు. ప్ర‌స్తుతం బెంగాల్ 64 ప‌రుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఇదీ చదవండి: స‌ఫారీల‌కు దేవుడే దిక్కు.. విజ‌యానికి 6 వికెట్ల దూరంలో ఆసీస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement