ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లండ్‌ | England Beat Australia by 7 Wickets to Take 2–1 T20I Series Lead | Sakshi
Sakshi News home page

ENG vs AUS: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

Nov 27 2026 7:48 PM | Updated on Nov 27 2026 7:52 PM

England Beat Australia by 7 Wickets to Take 2–1 T20I Series Lead

బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో(డీఎల్‌ఎస్ పద్దతి) ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి  16.5 ఓవర్లలో కేవలం 108 పరుగులకే ఆలౌటైంది.  

ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (11 బంతుల్లో 22), సామ్ హార్పర్ (14 బంతుల్లో 26) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

వర్షం అంతరాయం.. ఇంగ్లండ్‌ మెరుపు ఛేదన
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఓవర్లను కుదించి, డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని 93 పరుగులగా సవరించారు. ఆసీస్ బౌలర్ రిలే మెరెడిత్ ఆరంభంలో మూడు వికెట్లు తీసి ఆతిథ్య జట్టులో ఆశలు రేపినప్పటికీ.. ఇంగ్లండ్‌ యువ బ్యాటర్లు జోర్డాన్ కాక్స్ (14 బంతుల్లో 33 నాటౌట్), అనెరిన్ డొనాల్డ్ (13 బంతుల్లో 32) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరి మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ 8.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement