ఇంగ్లండ్‌ ఓపెనర్ల వీరంగం.. చిత్తుగా ‍ఓడిన ఆస్ట్రేలియా | AUS vs ENG 2nd T20I: England beat Australia by 8 Wickets | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ ఓపెనర్ల వీరంగం.. చిత్తుగా ‍ఓడిన ఆస్ట్రేలియా

Nov 24 2026 5:02 PM | Updated on Nov 24 2026 5:02 PM

AUS vs ENG 2nd T20I: England beat Australia by 8 Wickets

source: X

క్వీన్స్‌ల్యాండ్‌లోని కర్రారా ఓవల్‌ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-1తో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌ 13.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఓపెనర్లు అనెరిన్‌ డొనాల్డ్‌ (32 బంతుల్లో 85; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), ఫిల్‌ సాల్ట్‌ (30 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీలతో ఇంగ్లండ్‌ గెలుపుకు పటిష్టమైన పునాది వేశారు. టామ్‌ బాంటన్‌ (8 బంతుల్లో 26 నాటౌట్‌), కెప్టెన్‌ బ్రూక్‌ (10 నాటౌట్‌) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. మూడో టీ20 బ్రిస్బేన్‌ వేదికగా నవంబర్‌ 27న జరుగనుంది.

అంతకుముందు ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ పెద్ద స్కోర్లు చేయకపోయినా, అందరు బ్యాటర్లు తలో చేయి వేయడంతో ఆ స్కోర్‌ వచ్చింది. నిఖిల్‌ చౌదరి (45), జోయల్‌ డేవిస్‌ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ (27), మిచెల్‌ మార్ష్‌ (15), జాక్‌ ఎడ్వర్డ్స్‌ (18), డ్వార్షుయిస్‌ (18 నాటౌట్‌), లాచియన్‌ షా (10) రెండంకెల స్కోర్లు చేశారు. సామ్‌ హార్పర్‌ (3), టిమ్‌ డేవిడ్‌ (6) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో హెన్రీ క్రొకోంబ్‌, సామ్‌ కర్రన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఇదీ చదవండి: AUS VS ENG 2nd T20I: భారత్‌ రికార్డును బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement