source: X
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భాగంగా భారత్-ఎ, యూఏఈ జట్లు ఇవాళ దోహా వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.
వన్ డౌన్ బ్యాటర్ హర్ప్రీత్ సింగ్ భాటియా (144 బంతుల్లో 130; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కినా, మిగతా ప్లేయర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో కెప్టెన్ బాసిల్ హమీద్ (36 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడటంతో యూఏఈ 250 పరుగుల మార్కు వరకు వచ్చింది. మిగతా ప్లేయర్లలో ముహమ్మద్ షాదాద్ (28), ఈథన్ డిసౌజా (25) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, సూర్యాంశ్ షేడ్గే, హర్ష్ దూబే, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
కాగా, ఈ టోర్నీలో భారత్ సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. గ్రూప్-బి నుంచి పాకిస్తాన్-ఎ మొదటి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్ కోసం భారత్ పోటీపడుతుంద. మరోవైపు గ్రూప్-ఎ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్-ఎ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి.
ఇదీ చదవండి: ఐపీఎల్ కంటే ఎక్కువ పారితోషికంతో పీఎస్‌ఎల్‌లో చేరిన మ్యాట్ హెన్రీ


