IND Vs UAE: సూప‌ర్‌మేన్ త‌ర‌హాలో డైవ్‌.. క‌ళ్లు చెదిరే క్యాచ్‌ | Kumar Kushagra Stunning Catch-Viral Vs UAE-Rising Stars Asia Cup | Sakshi
Sakshi News home page

IND Vs UAE: సూప‌ర్‌మేన్ త‌ర‌హాలో డైవ్‌.. క‌ళ్లు చెదిరే క్యాచ్‌

Nov 24 2026 1:37 PM | Updated on Nov 24 2026 1:52 PM

Kumar Kushagra Stunning Catch-Viral Vs UAE-Rising Stars Asia Cup

Photo Credit: Twitter

ఏసీసీ మెన్స్ ఆసియా క‌ప్‌లో భాగంగా దోహా వేదిక‌గా యూఏఈతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ వికెట్ కీప‌ర్ కుమార్ కుషాగ్ర స్ట‌న్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లో హ‌ర్షిత్ రానా వేసిన నాలుగో బంతిని యూఏఈ ఓపెన‌ర్ ఆర్యాన్ష్ శ‌ర్మ ఎడ్జ్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌కు త‌గిలి కీప‌ర్‌కు దూరంగా వెళ్లింది. 

కానీ కుమార్ కుషాగ్ర మాత్రం అమాంతం సూప‌ర్‌మేన్‌లో డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ త‌ర్వాత హ‌ర్షిత్ రాణా మ‌రో వికెట్ కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. అర్ష‌ద్ ఖాన్ మ‌రో ఓపెన‌ర్ అన్ష్ టాండ‌న్‌ను పెవిలియన్ చేర్చ‌డంతో యూఏఈ మూడో వికెట్ కోల్పోయింది. 

ప్ర‌స్తుతం యూఏఈ జ‌ట్టు 26 ఓవ‌ర్లు ముగిసేస‌రికి మూడు వికెట్ల న‌ష్టానికి 114 ప‌రుగులు చేసింది. హ‌ర్‌ప్రీత్ (62), డిసౌజా (8) క్రీజులో ఉన్నారు. ఈ టోర్నీలో కుమార్ కుషాగ్ర మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. 

నేపాల్‌తో జరిగిన తొలి వన్డేలో 102 బంతుల్లో 117 పరుగులు చేసిన కుమార్ కుషాగ్ర శతకంతో ఆకట్టుకున్నాడు. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం కుషాగ్ర తేలిపోయాడు. రైజింగ్ స్టార్స్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా-ఎతో టెస్టు సిరీస్‌లో ఆడాడు. ఇక కుమార్ కుషాగ్రను గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2027 సీజన్ కోసం రిటైన్ చేసుకుంది.

ఇదీ చదవండి: కోహ్లి రికార్డు బద్దలుకొట్టిన పాక్ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement