యూఏఈతో మ్యాచ్‌.. మూడు మార్పులతో బరిలో దిగిన భారత్‌ | ACC Mens Asia Cup Rising Stars-UAE Won Toss Opt Batting Vs INDA | Sakshi
Sakshi News home page

యూఏఈతో మ్యాచ్‌.. మూడు మార్పులతో బరిలో దిగిన భారత్‌

Nov 24 2026 11:47 AM | Updated on Nov 24 2026 11:53 AM

ACC Mens Asia Cup Rising Stars-UAE Won Toss Opt Batting Vs INDA

Photo Credit: BCCI Twitter

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్‌ స్టార్స్ టోర్నీలో భాగంగా ఇండియా-ఏ జట్టు యూఏఈతో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. దోహా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిన భారత్ సెమీస్ చేరాలంటే యూఏఈపై కచ్చితంగా నెగ్గాల్సిందే. 

ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరిగిన ఆయుశ్ బదోని స్థానంలో ప్రబ్‌సిమ్రన్‌కు అవకాశమిచ్చారు. ఇక ఆల్‌రౌండర్‌ విప్రజ్ నిగమ్ స్థానంలో హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్ స్థానంలో అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ తిలక్ వర్మ పేర్కొన్నాడు.

Update: 4 ఓవర్లు ముగిసే సరికి యూఏఈ జట్టు వికెట్‌ నష్టానికి 19 పరుగులతో ఆడుతుంది. తొలి ఓవర్‌లోనే హర్షిత్‌ రాణా శుభారంభం చేశాడు. ఓపెనర్‌ ఆర్యన్ష్‌ శర్మ(2)ను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేర్చాడు.

యూఏఈ ప్లేయింగ్ XI: ఆర్యన్ష్ శర్మ, అన్ష్ టాండన్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, ముహమ్మద్ షహదాద్, ఎం అఫ్తాబ్ ఆలం(వికెట్‌కీప‌ర్‌), బాసిల్ హమీద్(కెప్టెన్‌), ఈతాన్ డిసౌజా, ఉద్దీష్ సూరి, ఇబ్రార్ అహ్మద్, సిమ్రంజీత్ సింగ్, జాహిద్ అలీ

ఇండియా-ఎ ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, తిలక్ వర్మ(కెప్టెన్‌), కుమార్ కుషాగ్రా(వికెట్‌కీప‌ర్‌), రింకు సింగ్, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, హర్ష్ దూబే, హర్షిత్ రాణా, అర్షద్ ఖాన్

ఇదీ చదవండి: SMAT 2026: చ‌రిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ ఓపెన‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement