యూఏఈతో మ్యాచ్‌.. గెలిస్తేనే సెమీస్‌కు తిల‌క్ సేన‌ | IndiaA-Face-UAE-Must-Win-Match-Semifinal Spot-Rising Stars-Asia Cup | Sakshi
Sakshi News home page

IND Vs UAE: యూఏఈతో మ్యాచ్‌.. గెలిస్తేనే సెమీస్‌కు తిల‌క్ సేన‌

Nov 24 2026 8:48 AM | Updated on Nov 24 2026 8:52 AM

IndiaA-Face-UAE-Must-Win-Match-Semifinal Spot-Rising Stars-Asia Cup

Photo Credit: BCCI Twitter

ఏసీసీ మెన్స్ ఆసియా క‌ప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇవాళ ఇండియా-ఎ జ‌ట్టు కీల‌క మ్యాచ్ ఆడ‌నుంది. ర‌న్‌రేట్‌తో సంబంధం లేకుండా సెమీస్‌లో అడుగుపెట్టాలంటే యూఏఈతో మ్యాచ్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సి ఉంటుంది. భార‌త బ్యాటింగ్ లైన‌ప్ దృష్ట్యా పెద్ద క‌ష్టం కాక‌పోయిన‌ప్ప‌టికీ, యూఏఈని త‌క్కువ అంచ‌నా వేస్తే మొద‌టికే మోసం వ‌స్తోంది. 

మ‌రో పోరులో ఇప్ప‌టికే సెమీస్‌కు అర్హ‌త సాధించిన పాకిస్తాన్ జ‌ట్టుతో నేపాల్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక భార‌త్ విష‌యానికొస్తే, ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజ‌యం, మ‌రో ఓట‌మితో రెండో స్థానంలో ఉంది. పాయింట్ల ప‌రంగా నేపాల్‌తో స‌మానంగా ఉన్నప్పటికీ, భార‌త్ ర‌న్‌రేట్ (+2.580) మెరుగ్గా ఉంది. ఒక‌వేళ పాకిస్తాన్‌పై నేపాల్ గెలిచి, యూఏఈ చేతిలో భార‌త్ ప‌రాజ‌యం చ‌విచూస్తే, అప్పుడు నేపాల్ సెమీస్‌కు, భారత్ ఇంటిబాట ప‌ట్ట‌నున్నాయి.

ఇక ఇండియా-ఏ జ‌ట్టు విష‌యానికొస్తే, టాపార్డ‌ర్ బ‌లంగా క‌నిపిస్తోంది. వైభ‌వ్ సూర్య‌వంశీ, ఆయుశ్ బ‌దోనిలు భారీ ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నారు. ఇక మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌తో పాటు కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ భీక‌ర ఫామ్‌లో ఉన్నారు. పాక్‌తో మ్యాచ్‌లో అర్థ‌సెంచ‌రీతో అభిషేక్ ఫామ్‌లోకి రాగా, రెండు వ‌రుస సెంచ‌రీల‌తో తిల‌క్ వ‌ర్మ దూకుడు మీద ఉన్నాడు. 

కుమార్ కుషాగ్ర‌, షాబాజ్ అహ్మ‌ద్‌లు ఫామ్‌లో ఉండ‌డం సానుకూలాంశం. రింకూ సింగ్ ఆశించినంత మేర రాణించ‌లేక‌పోతున్నాడు. అతడు కూడా రాణిస్తే భార‌త్‌కు తిరుగుండ‌దు. ఇక బౌలింగ్‌లో హ‌ర్షిత్ రాణా, ప్రిన్స్ యాద‌వ్‌లు పేస్ బౌలింగ్‌లో హ‌డ‌లెత్తిస్తుండ‌గా, సూర్యాన్ష్ షెడ్గే, విప్ర‌జ్ నిగ‌మ్ త‌మ వంతు పాత్ర‌ పోషిస్తున్నారు. 

ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భార‌త్ ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ, భావోద్వేగాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒక‌వేళ భార‌త్ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌లో అడుగుపెడితే మాత్రం ఫైన‌ల్ పోరులో పాక్‌, భార‌త్ మ్యాచ్ మ‌రోసారి చూసే అవ‌కాశ‌ముంటుంది. ఇక గ్రూప్‌-ఎ నుంచి ఇప్ప‌టికే బంగ్లాదేశ్‌-ఎ, శ్రీలంక‌-ఎ సెమీస్‌లో అడుగుపెట్టాయి.

ఇదీ చదవండి: చ‌రిత్ర సృష్టించిన సౌతాఫ్రికా పేస‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement