Photo Credit: Twitter
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన తొలి టెస్టులో కేఎల్ రాహుల్‌కు సంబంధించిన ఒక విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదోరోజు ఆట మధ్యలో న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వద్దకు కివీస్ ప్లేయర్ వచ్చాడు. ఫిలిప్స్‌కు లిప్ బామ్ అందించాడు.
ఫిలిప్స్ దానిని రాసుకున్న తర్వాత సదరు కివీస్ ప్లేయర్ వెళ్లిపోతుండగా, కేఎల్ రాహుల్ అక్కడికి వచ్చాడు. ''హే బ్రో నాకు కొంచెం లిప్ బామ్ ఇవ్వవా'' అని అడిగాడు. వెంటనే కివీస్ ఆటగాడు లిప్ బామ్ ఇవ్వగానే రాహుల్ తన పెదాలకు రాసుకున్నాడు.
ఇది గమనించిన పంత్.. 'బాగుందా' అంటూ టీజ్ చేయడం కెమెరాలకు చిక్కింది. సరదాగా ఉన్నప్పటికీ, ఈ వీడియోలో పంత్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.
ఫలితం రాదని తేలడంతో 15 ఓవర్ల ముందుగానే ఇరుజట్లు డ్రాకు అంగీకరించాయి. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కలిసి 258 బంతులెదుర్కొని టీమిండియాకు గెలుపును దూరం చేశారు. 175 పరుగులు చేసిన హెన్రీ నికోల్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు నవంబర్ 27 (శుక్రవారం) నుంచి జరగనుంది.
Bro went to nz player's for lip balm 😝❤️ https://t.co/WsaneVtIgI
— ZARISH (@zarishyy) November 23, 2026
ఇదీ చదవండి: బంగ్లాదేశ్ చెత్త రికార్డు


