రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న సఫారీలు ఆది నుంచే బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 6 పరుగులకే తొలి వికెట్ (తంజిద్ హసన్ (3)) కోల్పోయిన బంగ్లా జట్టు.. ఆతర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
40 పరుగుల వద్ద మహ్ఫిజుల్ ఇస్లాం (23), 44 పరుగుల వద్ద కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (4), 60 పరుగుల వద్ద మొమినుల్ హక్ (18), 73 పరుగుల వద్ద లిట్టన్ దాస్ (8), 85 పరుగుల వద్ద ఇన్ ఫామ్ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ (19) వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, అన్రిచ్ నోర్జే తలో 2 వికెట్లు తీయగా.. ముల్దర్, హార్మర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
తొలి రోజు టీ సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 85-6గాఉంది. జాకిర్ అలీ (0) క్రీజ్‌లో ఉన్నాడు.
కాగా, ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రబాడ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (72, 5-70, 3-48) చెలరేగి సౌతాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా తరఫున హృదోయ్ (137), లిట్టన్ దాస్ (120) సెంచరీలు చేయగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఆకెర్‌మన్ (157), రికెల్టన్ (102) సెంచరీలు చేశారు.
ఇదీ చదవండి: కివీస్‌తో రెండో టెస్టు.. టీమిండియా కీలక నిర్ణయం


