source: X
చాలాకాలం తర్వాత న్యూజిలాండ్ పర్యటనతో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి, టీ20 సిరీస్‌లో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయిన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మూడు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు.
తొలుత చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన అతడు.. తాజాగా ఝార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 39 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో భువీ జట్టు ఉత్తరప్రదేశ్ విజయాలు సాధించింది. ఈ విజయాల్లో భువీ కీలకపాత్ర పోషించాడు.
కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భువీ 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక వికెట్ తీసి తీవ్రంగా నిరాశపరిచాడు. వికెట్లు తీయలేకపోవడమే కాకుండా ధారాళంగా పరుగులు సమర్పించుకుని (96 బంతుల్లో 180 పరుగులు) ఘోరమైన ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్‌తోనే భువీ దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
ఇటీవలికాలంలో అతడి దేశవాలీ, ఐపీఎల్ ప్రదర్శనలు టీమిండియా రీఎంట్రీకి దోహదపడ్డాయి. అయితే అందివచ్చిన అవకాశాన్ని భువీ సరైన రీతిలో వినియోగించుకోలేకపోయాడు. అతడికి భారత సెలెక్టర్లు మరో అవకాశమిస్తారో లేదో చూడాలి.
ఇదీ చదవండి: భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లు.. నవ్‌జోత్ సింగ్ సిద్దూ కీలక వ్యాఖ్యలు


