పెళ్లి వేడుక కాస్తా ఫిట్‌నెస్‌ ఈవెంట్‌గా..! | Viral Video: Bride Deadlifts 100 Kg Does Pull-Ups In Lehenga At Wedding | Sakshi
Sakshi News home page

పెళ్లి లెహంగాలోనే నవవధువు పుల్-అప్స్..! ఏకంగా వంద కేజీల..

Nov 23 2026 3:41 PM | Updated on Nov 23 2026 3:43 PM

Viral Video: Bride Deadlifts 100 Kg Does Pull-Ups In Lehenga At Wedding

పెళ్లి వేడుక అనగా సంప్రదాయ కార్యక్రమాలు, ఆచారాలు తదితర తంతులు నిర్వహిస్తుంటారు. కానీ ఇక్కడ జరుగుతున్న వివాహ వేడుక ఫిట్‌నెస్‌ ఈవెంట్‌లా మారింది. ఇది పెళ్లి వేడుక లేక కసరత్తులు చేసే వ్యాయమాశాల అన్న సందిగ్ధం ఎదురైంది అతిధులకు. ఇదంత ఎక్కడ అంటే..

నెట్టింట ఒక వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ఒక వధువు చక్కగా రెడీ అయ్యి పుల్‌ అప్స్‌ చేస్తూ కనిపించింది. అది కూడా ఏకంగా 100 కేజీల డెడ్‌లిఫ్ట్‌ని సునాయాసంగా ఎత్తేసింది. బరువైన పెళ్లి లెహంగాలో నవ వధువు ఇలా చేయడం అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. 

ఈ అసాధారణ బల ప్రదర్శనను చూసి చాలామంది  దీన్ని ప్రపంచంలో తొలి ఫిట్‌నెస్‌ వెడ్డింగ్‌ కాబోలు అని కామెంట్‌ చేశారు. నెటిజన్లు సైతం ఆ వధువు ఫిట్‌నెస్‌కి సెల్యూట్‌ అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

 

ఇదీ చదవండి: అచ్చం పోస్ట్‌కార్డులో ఉన్నట్లుగా..బంతిపూల గ్రామం! ఎక్కడుందంటే..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement