హాంకాంగ్‌లో ఘనంగా సాముహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు | Samuhika Satyanarayana Vratam In Hong KongHong Kong | Sakshi
Sakshi News home page

హాంకాంగ్‌లో ఘనంగా సాముహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

Nov 22 2026 5:41 PM | Updated on Nov 22 2026 5:41 PM

Samuhika Satyanarayana Vratam In Hong KongHong Kong

ది హాం​కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) ఆధ్వర్యంలో వార్షిక సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత్రాలు హ్యాపీ వ్యాలీ హిందూ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. గత దశాబ్దానికి పైగా ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలో దంపతులు సామూహికంగా పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామిని పూజించి ఆరాధించారు.

కార్తీక మాసంలోని ఈ పవిత్ర దినాన సభ్యులందరిలో భక్తి భావంతో కూడిన ఉత్సాహం వెల్లివిరిసింది. పూల అలంకరణలు, దీపాల వెలుగులు, వేదమంత్రాల నినాదం, భక్తిగీతాలు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి. సత్సంగ వాతావరణంలో భక్తి, ఐక్యత, తెలుగు సంప్రదాయాల పరిరక్షణకు ఈ కార్యక్రమం మరోసారి వేదికగా నిలిచింది.

సాధారణంగా సమాఖ్య సభ్యుల్లో ఒకరు స్వయంగా తెలుగులో వ్రతకథను వివరించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది సంబంధిత సభ్యులు ఉద్యోగరీత్యా విదేశీ పర్యటనల్లో ఉండటంతో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జూమ్ (Zoom) ద్వారా వ్రతకథా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. సాంకేతికతను వినియోగించుకుంటూ సంప్రదాయాలను కొనసాగించడం విదేశాల్లోని తెలుగువారికి ఆదర్శంగా నిలిచింది.

సనాతన ధర్మం పూజలు, వ్రతాలకు మాత్రమే పరిమితం కాకుండా ధర్మం, సత్యం, సేవ, కుటుంబ బాంధవ్యాలు, సమాజ శ్రేయస్సు వంటి ఉన్నత విలువలను ప్రతిబింబిస్తుంది. వ్రతానంతరం సభ్యులు ప్రసాదం స్వీకరించి, భోజనాలు చేసి పరస్పరం ఆత్మీయంగా కలుసుకున్నారు. కొత్త సభ్యులతో పరిచయాలు పెంచుకుంటూ, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు. అనంతరం నిర్వహించిన గ్రూప్ ఫోటోలు కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని జోడించాయి.

ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత, రచయిత్రి రాధికా మంగిపూడి పాల్గొనడం విశేషః. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి స్పందిస్తూ, “సభ్యుల చురుకైన భాగస్వామ్యం, అలాగే కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ మన్నే, హరీన్ తుమ్మల, రాధాదేవి సారంగ అందించిన నిరంతర సహకారమే ఈ కార్యక్రమ విజయానికి ప్రధాన కారణం అని అన్నారు.

ఇదీ చదవండి: నెదర్లాండ్స్‌లో ఘనంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement