అమెరికాలో తెలుగు యువకుడి మృతి | Nalgonda Youth Dies In Road Accident In USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Nov 21 2026 10:21 AM | Updated on Nov 21 2026 10:21 AM

Nalgonda Youth Dies In Road Accident In USA

సాక్షి, నల్లగొండ జిల్లా: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. మునుగోడుకు చెందిన ఎర్రమళ్ల ప్రసాద్‌, శ్రీకన్య దంపతుల కుమారుడు సాయి తేజగా మృతుడిని గుర్తించారు. యువకుడికి వారం రోజుల క్రితమే అమెరికాలో ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో కారులో విధులకు వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డుపైకి జింక అడ్డుగా వచ్చింది.

దీంతో అతడు ప్రయాణిస్తున్న కారు జింకను ఢీకొని రోడ్డుపై ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన వాహనాలు వరుసగా అతడి కారును ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాయి తేజ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మరో వైపు కుమారుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయి తేజ మృతదేహం ఆదివారం రాత్రికి భారత్‌కు చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: మేనరిక వివాహాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement