Peru: 6.9 తీవ్రతతో భూకంపం.. వీధుల్లోకి జనం పరుగులు! | Peru Earthquake 69 Magnitude Tremors felt in Andes Lima | Sakshi
Sakshi News home page

Peru: 6.9 తీవ్రతతో భూకంపం.. వీధుల్లోకి జనం పరుగులు!

Nov 21 2026 7:52 AM | Updated on Nov 21 2026 7:52 AM

Peru Earthquake 69 Magnitude Tremors felt in Andes Lima

లిమా: పెరూలోని ఆండీస్ పర్వత ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం (స్థానిక కాలమానం) 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప ప్రభావం రాజధాని లిమా వరకు కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురై, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ (యూఎస్‌జీఎస్) ప్రకారం.. జునిన్‌కు 34 కిలోమీటర్ల ఉత్తరాన భూకంప కేంద్రం నమోదైంది. భూమికి 108 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని పెరూ జియోఫిజికల్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. భూకంపాలు ఎక్కువగా సంభవించే పసిఫిక్ మహాసముద్ర పరిధిలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో పెరూ ఉంది. ఈ ఏడాది ఆగస్టులో పెరూవియన్ ఆండీస్‌లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించి ఇద్దరు గాయపడ్డారు. పలు ఇళ్లు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. జూలైలో జునిన్ ప్రాంతంలో 5.5 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆరుగురి ప్రాణాలు తీసింది. మరో 30 మంది గాయపడ్డారు.

ఇదీ చదవండి: Manipur: కల్తీ మద్యం కలకలం.. 12 మంది మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement