రేపు భారత్‌కు నేపాల్‌ ప్రధాని | Balen Shah India Visit Modi Meeting | Sakshi
Sakshi News home page

రేపు భారత్‌కు నేపాల్‌ ప్రధాని

Nov 21 2026 5:54 AM | Updated on Nov 21 2026 5:54 AM

Balen Shah India Visit Modi Meeting

కఠ్మాండు: నేపాల్‌ ప్రధానమంత్రి బాలేన్‌ షా ఈ నెల 22వ తేదీ నుంచి రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. భారత ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారని నేపాల్‌ విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. మార్చిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలేన్‌ షా మొట్టమొదటి అధికారిక పర్యటన ఇదే కావడం గమనార్హం.

బాలేన్‌ వెంట ఆర్థిక మంత్రి స్వర్ణిమ్‌ వాగ్లే, విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనల్‌ తదితరులతో కూడిన 34 మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఉంటుంది. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీతో బాలేన్‌ షా సమావేశమవుతారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఇరు దేశాల మధ్య అనుసంధానత పెంపు, ఇంధన సహకారానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చలు జరుపుతారు.

విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, అంతరిక్షం, విపత్తు నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాలపై పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశముందని నేపాల్‌ విదేశాంగ శాఖ తెలిపింది. గతేడాది సెపె్టంబర్‌లో జెన్‌ జీ నిరసనలు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కూలదోయగా ఆరు నెలల అనంతరం మార్చిలో జరిగిన ఎన్నికల్లో రాష్రీ్టయ స్వతంత్ర పార్టీ అఖండ విజయం సాధించడం, బాలేన్‌ షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం తెలిసిందే.

ఇదీ చదవం‍డి: ఈయూకు చేరువగా యూకే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement