కొన్ని కథలు మనసుని మెలిపెడతాయి. ఇంతటి స్థితిలో వాళ్లకున్న ఇష్టాలు ఏ మాత్రం తగ్గవు అని చెప్పే స్టోరీ. కొన్నిసార్లు గెలిచేందుకు పోరాడుతున్న విధిదే పై చేయి అవుతుంటుంది. ఒక్కోసారి దీని మందు మనం గెలిచే ఛాన్సే ఉండనివ్వదు. కానీ గొప్ప జ్ఞాపకాన్ని, మర్చిపోలేని పాఠాన్ని తప్పక నేర్పిస్తుంది. ఇదంతా ఎందుకుంటే ఆ కరుడగట్టి విధి ఓ అమ్మాయి జీవితంపై ఆడుకునే ప్రయత్నం చేసి..చివరికి దాని పంతమే నెగ్గించుకున్నా..ఆమె ఇష్టాన్ని దూరం చేయడంలో విఫలమవ్వడమే కాదు ఓడిపోయింది.
అసలేం జరిగిందంటే..చైనాకు చెంది బీబీ అనే ఆవో యింగ్ బీ అనే చిన్నారికి అనారోగ్యం కారణంగా పదే పదే ఆమె చదువుకి అంతరాయం కలుగుతుండేది. ఆమె తొమ్మిదితరగతిలో ఉండతా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. అయినప్పటికీ ఆమెకు చదువుపై ఆసక్తి తగ్గేది కాదు. నిజానికి ఆమెకు ఐదేళ్ల క్రితమే లుకేమియా ఉన్నట్లు నిర్థారణ అయింది. ఆమె తల్లిదండ్రులు కుమార్తెను రక్షించుకోవడం కోసం బొడ్డు తాడు రక్తం ఉపయోగపడుతుందేమోనని..మరో బిడ్డకు జన్మనిచ్చారు కూడా.
అయితే బీబీకి ఈ లుకేమియా చికిత్స ప్రారంభంలో పరిస్థితి చక్కగానే మెరుగుపడింది. అలా ఆరోగ్యం సహకరించినప్పుడల్లా పాఠశాలకు వెళ్తుండేది. అయితే మూడు నెలల క్రితం ఆ వ్యాధి కాస్తా తిరగబెట్టి మళ్లీ ఆస్పత్రిపాలు చేసింది. కానీ ఆమె తల్లిదండ్రలు మరో అవకాశం కోసం పలు ఆస్పత్రులు చుట్టూ తిరిగారు. చివరకు కోలుకునే అవకాశాలు సన్నగిల్లడంతో వాళ్లు తమ ఊరి ఆస్పత్రికి తీసుకొచ్చేసి..అక్కడే ఆమెను పర్యవేక్షించుకుంటున్నారు పేరెంట్స్. అయితే తన తల్లిదండ్రలతో ఒక్కసారి తన స్నేహితులతో కలిసి క్లాస్ పాఠాలు వినాలని ఉంది అని అడిగింది.
ఆమె కోరికనే తన ఉపాధ్యాయురాలితో కూడా పంచుకుంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి పాఠాలు వినడం ఎంతగానో మిస్ అవుతున్నానంటూ కన్నళ్లు పెట్టుకుంది. దాంతో ప్రదానోపాధ్యాయుడు, మిగతా ఉపాధ్యాయులు ఆమె కోరికను నెరవేర్చడం కోసం ఆస్పత్రి గదినే పాఠశాల గదిగా మార్చేశారు. ఆ గదిని మొత్తం బెలూన్లు, టెడ్డీ బేర్లతో అలంకరించారు. అలాగే పలువురు సహ విద్యార్థులను ఆస్పత్రికి తీసుకువచ్చి ప్రత్యేక ఆంగ్ల పాఠాన్ని బోధించేలా ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్ టీచర్ పురావస్తు శాస్త్రం, సాన్‌క్సింగ్‌డూయ్ మ్యూజియంగా గురించి పాఠం చెప్పారు.
విద్యార్థులు సాధారణ రోజుల్లో ఎలా ప్రవర్తిస్తారో..సరిగ్గా అలానే ప్రవర్తించమని ముందుగానే చెప్పారు ఉపాధ్యాయులు కూడా. ఇంత కష్టపడి ఆమె ఇన్ని ఏర్పాట్లు చేస్తే..బీబీకి ముక్కు నుంచి అధిక రక్తశ్రావం, తీవ్రమైన ఎముకల నొప్పి, అధిక జ్వరంతో చాలా బాధపడింది. అయినప్పటికీ..పాఠం వినాలనీ శ్రద్ధగా వినేందుకు శతవిధాల ప్రయత్నించి మరీ వినడం విశేషం. అలా ఆ అమ్మాయి కోరికను తీర్చగలిగారు గానీ మృత్యువు ఒడి నుంచి బయటకు తీసుకురాలేకపోయారు.
ఆ పాఠం విన్న రెండు రోజుల తర్వాతే నవంబర్ 07నే ఆ అమ్మాయి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఒక ఉపాధ్యాయురాలు ఆ అమ్మాయి చివరి పాఠంకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. బీబీ చివరి నిమిషం వరకు చదువుకోవాలనే ఆశను వదులుకోకపోవడం అందర్నీ కదిలించింది. పైగా నెట్టింట ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అంతేగాదు నెటిజన్లు ఆ ఆస్పత్రి గదిలో బీబీ చివరి ఫాఠం వినగా..ఆమె ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి వీడ్కోలు పలుకుతూ జీవితంలో తొలి పాఠం నేర్చుకున్నారు అంటూ పోస్టులు పెట్టారు.
ఇదీ చదవండి: సందేశాత్మకంగా పెళ్లి ఊరేగింపు..! వరుడి తండ్రిపై ప్రశంసల జల్లు


