పెళ్లి వేడుక అనగా ఏ రైంజ్‌లో సందడిగా ఉంటుందో తెలిసిందే. అందులో పెళ్లి ఊరేగింపు అంటే..జనాలు రోడ్లపైకి వచ్చి మరి వరుడు ఎవరా? అని ఆసక్తిగా చూస్తుంటారు. కానీ ఈ వరుడు ఎవ్వరూ ఊహించని విధంగా దేనిపై వచ్చాడో తెలిస్తే కంగుతింటారు. అంతేగాదు ఆ వరుడి కుటుంబ సభ్యలు ఆలోచనకు ఫిదా అయ్యి మెచ్చుకోకుండా ఉండలేరు.
అతడే..మహారాష్ట్రలోని అకోలాకు చెందిన డాక్టర్ విరాజ్ అనే వరుడు. నవంబర్ 19న 'రైడ్ ఫర్ లవ్' అనే పేరుతో ప్రత్యేకమైన పెళ్లి ఊరేగింపు జరిగింది. అక్కడ అంతా సైకిళ్లను పూలతో అలకరించి పెళ్లి ఊరేగింపులో పాల్గొనడం విశేషం. ఆ వేడుకలో పాల్గొన్నవారంతా సందేశంతో కూడిన టీషర్ట్‌లను ధరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, పర్యావరణవేత్తలు, సైక్లింగ్ ఔత్సాహికులు, వివిధ సైక్లింగ్ క్లబ్‌ల సభ్యులు పాల్గొన్నారు.
ఆ ఊరేగింపును చూడటానికి జనాలు తరలిరావడమే కాదు..తమ మొబైల్‌ఫోన్‌లలో రికార్డు చేశారు కూడా. ఆ వరుడు తండ్రి డాక్టర్ రాజేంద్ర కుమార్ సోనోకి పర్యావరణ పరిరక్షణ పట్ల ఉన్న నిబద్ధత ఈ కార్యక్రమ స్ఫూర్తికి కారణం అట.
సైక్తింగ్‌ను ఆరోగ్యకరమైన పర్యావరణ అనుకూల రవాణా మార్గంగా ప్రోత్సహించేందుకు ఈ పెళ్లి వేడుకులను ఒక అవకాశం ఉపయోగించుకోవాలని ఆ కుటుంబం నిర్ణయించుకుందట. అయితే ఈ వేడుకలో వరుడి తండ్రి, వివాహ అతిథులు ఈ సైకిల్ యాత్రలో పాల్గొనడం విశేషం.
ఇదీ చదవండి: అత్యుత్తమ ‘గుడ్డు’ వంటకాలుగా మసాలా అమ్మెట్, ఎగ్ బుర్జీ..!


