'కభీ ఖుషీ కభీ గమ్' వచ్చే నెల డిసెంబర్ 14కి మూవీ థియేటర్లోకి వచ్చి 25 ఏళ్ల పూర్తి అవుతోంది. ఈ మూవీ రజతోత్సవాన్ని పురస్కరించుకుని దర్శకుడు కరణ్ జోహార్ పునర్నిర్మించిన రాయ్‌చంద్ ఇంట్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో కరీనా కపూర్ ఎలీ సాబ్ రూపొందించిన షిఫాన్ గౌనులో మెరిసింది.
ఆమె లుక్ అచ్చం ఆ మూవీలోని పూజా శర్మ పాత్రని తలపించేలా.. అందర్నీ కట్టిపడేసింది. 25 ఏళ్ల తర్వాత కూడా అంతే గ్లామర్, అదే గ్రేస్‌తో ఆకట్టుకుంటోంది కరీనా. అంతేగాదు ఆవేళ ఆ పాత్రకు ఎంచుకున్న కరణ్‌ని సైతం మెచ్చుకున్నారు అభిమానులు. ఆమె ధరించి లేత ఆకుపచ్చ గౌను అందర్నీ అమితంగా ఆకర్షించింది. మరి ఆ గౌను విశేషాలేంటో సవివరంగా తెలుసకుందామా.
స్టైలిస్ట్ లక్ష్మీ లెహర్, నవంబర్ 19న ముంబైలో జరిగిన కార్యక్రమంలో కరీనా కపూర్ ధరించిన దుస్తులను ఎలీ సాబ్ కలెక్షన్ నుంచి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆమె గౌను ధర వచ్చే సుమారు రూ. 6 లక్షలు పైనే పలుకుతుందట. భుజాల పట్టీలు లేని ఈ గౌను క్రాస్‌క్రాస్ ప్యాటర్న్‌తో అందంగా ఉంది. దాంతోపాటు జతగా వచ్చిన స్కార్ఫ్ ఆ గౌను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది.
నేలను తాకేలా ఉండి.. గౌను చూడటానికి చీరను చుట్టినట్లు అనిపించేలా డిజైన్ చేయడం విశేషం. అందుకు తగినట్లుగా చక్కటి హెయిర్‌స్టైల్, తేలికైన మేకప్‌తో మరింత హుందాగా కనిపించింది. ఈ గౌనుకి జస్ట్ ఒక జత చెవిపోగులు, రెండు ఉండరాలనే ధరించిందామె. కాగా, కరణ్‌జోహార్ పునః సృష్టించిన ఈ భవనంలోకి మీడియా సిబ్బందిని ఆహ్వానించారు.
ఇక్కడ గోడలపై హృతిక రోషన్ నటించిన రోహన్ పాత్ర, పూజగా నటించిన కరీనా ఫోటోలు గోడలపై వేలాడదీశారు. రాహుల్ పాత్రలో మెప్పించిన షారుఖ్ రోహన్‌ను తిరిగి కలిసిన ప్రవేశ ద్వారం తదితరాలన్నీ ఆ మూవీలోకి పరకాయ ప్రవేశం చేసేలా కళ్లముందే కదలాడాయి.
ఇదీ చదవండి: రాజసం ఉట్టిపడే పాల నురుగు డ్రెస్‌లో కరీనా బ్యూటీఫుల్ లుక్..! ఏకంగా రూ. 74 వేలు..


