టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తాను లండన్‌లో ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన షాపింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో పవన్ కల్యాణ్, షారూఖ్ ఖాన్ లండన్‌లో ఓకే చోట షాపింగ్ చేసేవారని తెలిపింది. అయితే షారూఖ్ ఖాన్ కోసం నిర్మాత కరణ్ జోహార్ కూడా షాపింగ్‌కు వచ్చేవారని రేణు దేశాయ్ వెల్లడించింది. అప్పట్లో పవన్, షారుఖ్ స్టైలింగ్‌పై కూడా ఆసక్తికర చర్చ జరిగేదని పేర్కొంది. తాజాగా ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఆమె సినిమాల విషయానికొస్తే పెద్దగా మూవీస్‌లో కనిపించడం లేదు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కనిపించింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్‌లోనే ఉంటోంది. ఎక్కువగా ఆధ్యాత్మిక సేవలోనే కనిపిస్తోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది. అంతేకాకుండా మూగజీవాల కోసం తన వంతు పోరాటం చేస్తున్నారు.
Renu Desai - 26 years ago in London… I was buying clothes for @PawanKalyan 🔥 Karan Johar was buying for Shah Rukh Khan in same mall. Power Star was always fashion-forward. No designer needed. Just pure style. 😎💥 #OG #PawanKalyan #RenuDesai https://t.co/dRxhpFHehy
— Ustaad Veera Gambhira 🚩 (@PKYtrishira) November 4, 2026


