రణ్‌బీర్ కపూర్ రామాయణ ఈ గురువారమే థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. నితీశ్ తివారీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీలో సాయిపల్లవి సీతగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో కేజీఎఫ్ హీరో యశ్ రావణుడిగా కనిపించనున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో అభిమానులను మెప్పించనుంది.
ఈ మూవీ రిలీజ్ వేళ బాలీవుడ్‌లో క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు భారీ బడ్జెట్ కావడంతో అంచనాలు కూడా అదేస్థాయిలో నెలకొన్నాయి. ఈ సినిమా తొలిరోజు దురంధర్-2 వసూళ్లు రికార్డ్‌ను తిరగరాస్తుందా అని చర్చించుకుంటున్నారు. ధురంధర్ 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజే రూ.200 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. రామాయణ బుకింగ్స్ చూస్తుంటే దురంధర్-2 రికార్డ్ బ్రేక్ చేయడం కష్టమేనని అనిపిస్తోంది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ధురంధర్- 2 రికార్డ్ అందుకోవడం దాదాపు అసాధ్యమయ్యేలా కనిపిస్తోంది . కాగా.. ఈ సినిమాలో సన్నీ డియోల్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మించారు.


