జీతం పెంచమని అడిగితే.. నన్ను పీకి పడేశారు: హీరోయిన్ | Sonarika Bhadoria About Her Serial Journey And Delivery Experience | Sakshi
Sakshi News home page

Sonarika Bhadoria: ప్రసవ సమయంలో చావు అంచుల వరకు వెళ్లొచ్చా

Nov 4 2026 9:26 PM | Updated on Nov 4 2026 9:26 PM

Sonarika Bhadoria About Her Serial Journey And Delivery Experience

సీరియల్ పార్వతి దేవిగా బోలెడంత పేరు తెచ్చుకున్న సోనారిక.. ఆపై సినిమా హీరోయిన్ అయింది. తెలుగులోనూ నటించింది. గతేడాది డిసెంబరులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొంతకాలం క్రితమే నటనకు గుడ్ బై చెప్పేసిన ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జీతం పెంచమన్నందుకు తనని సీరియల్ నుంచి తీసేసిన సందర్భం, ప్రసవ సమయంలో చావు అంచుల వరకు వెళ్లొచ్చిన అనుభవం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

'ఓ సీరియల్ కోసం దాదాపు ఏడాది పాటు పనిచేశాను. మా షో టీఆర్పీలు చాలా బాగున్నాయి. అందుకే ఛానెల్ మాకు పార్టీ ఇచ్చింది. అలాంటి సమయంలో మీరు ప్రశంసలు లేదా జీతం పెంచాలని కోరుకుంటారు కదా! కానీ నేను జీతం పెంచాలని అడిగితే.. ఏ ప్రాతిపదికన అడుగుతున్నావు? అని నన్నే ప్రశ్నించారు. నన్ను ఆ షో నుంచి తొలగించారు. నన్ను మార్చేస్తున్నారనే విషయం కూడా నాకు తెలియదు. అదే టైంలో నా సహనటుడు.. సీరియల్ వదిలి వెళ్లిపోతానని బెదిరించడంతో అతడికి మూడు రెట్లు రెమ్యునరేషన్ పెంచారు'

టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ పారితోషికం విషయంలో వ్యత్యాసాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన మగ నటులకు భారీగా రెమ్యునరేషన్స్ ఇస్తారు. ప్రేక్షకులు వారిని హీరోలుగా భావించడమే అందుకు కారణం. ‍అయితే హిందీ టెలివిజన్ రంగంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న నటీనటులకు కూడా తక్కువ పారితోషికాలే ఇస్తారు. సినిమా రంగం ఎక్కువగా హీరోల చుట్టూనే తిరుగుతుంది అని సోనారిక చెప్పుకొచ్చింది.

సోనారిక కెరీర్ విషయానికొస్తే.. 2011లో 'తుమ్ దేనా సాథ్ మేరా' సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది. మోహిత్ రైనా శివుడిగా నటించిన 'దేవోంకే దేవ్.. మహాదేవ్' సీరియల్‌లో పార్వతీ దేవి పాత్ర ఈమెకు చాలా గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత 'ఇష్క్ మే మార్జావాన్', 'పృథ్వీ వల్లభ్: ఇతిహాస్ భీ, రహస్య భీ', 'దాస్తాన్-ఎ-మొహబ్బత్: సలీం అనార్కలి' తదితర సీరియల్స్‌ చేసింది. 2015లో వచ్చిన తెలుగు సినిమా 'జాదూగాడు'తో హీరోయిన్ అయింది. తర్వాత 'స్పీడున్నోడు', 'ఈడో రకం ఆడో రకం' మూవీస్ చేసింది. తమిళంలో 'ఇంద్రజిత్', హిందీలో 'సాన్సేన్: ది లాస్ట్ బ్రీత్', 'హిందుత్వ' చిత్రాలు కూడా చేసింది.

(ఇదీ చదవండి: 'రామాయణ' ఫస్ట్ రివ్యూ ఇచ్చిన నిర్మాత)

ఇక సోనారిక వ్యక్తిగత విషయానికొస్తే.. నటనకు దూరమైన తర్వాత వ్యాపారవేత్త వికాస్ పరాశర్‌ను 2024లో పెళ్లి చేసుకుంది. 2025 డిసెంబరులో వీళ్లకు ఆడబిడ్డ పుట్టింది. అయితే ప్రసవం టైంలో చావు అంచుల వరకు వెళ్లొచ్చానని చెప్పుకొచ్చింది.

ప్రసవ సమయంలో చివరి పుష్ ఇచ్చే ముందు నేను కొద్దిసేపు స్పృహ కోల్పోయాను. ఆ క్షణంలో నిజంగానే చనిపోతున్నానేమో అనిపించింది. ఒకవేళ నా బిడ్డ పుట్టిన తర్వాత నేను లేకపోతే ఆ పాపని ఎవరు చూసుకుంటారో అని భయమేసింది. నా భర్తకు చివరిసారిగా వీడ్కోలు చెప్పే అవకాశం దొరుకుతుందా లేదా అని భయపడ్డాను. నా భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటాడా అనే ఆలోచన కూడా వచ్చింది. నేను ఎక్కువ చెప్పడం లేదు గానీ ఆ టైంలో అలాంటి ఆలోచనలే వచ్చాయని సోనారిక చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: త్వరలో ఓటీటీలోకి తెలుగు సై-ఫై థ్రిల్లర్ సినిమా 'కిల్లర్')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement