తెలుగు నటుడు, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే భుజానికి గాయమైంది. హీరోగా చేస్తున్న కొత్త సినిమా షూటింగ్‌లో భాగంగా కుడి భుజానికి గాయమవడంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఇతడికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
ప్రస్తుతం నితిన్ నార్నే కోలుకుంటున్నారు, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులకు గోప్యత కల్పించాలని, ఎటువంటి వదంతులు నమ్మవద్దని, ఆసుపత్రికి రావొద్దని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు కోరాయి. నార్నే నితిన్.. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్ తదితర సినిమాలు చేశాడు.
(ఇదీ చదవండి: 'రామాయణ' ఫస్ట్ రివ్యూ ఇచ్చిన నిర్మాత)


