మరికొన్ని గంటల్లో 'రామాయణ' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. గురువారం(నవంబర్ 05) నుంచి ప్రపంచవ్యాప్తంగా షోలు పడనున్నాయి. అయితే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాత దిల్ రాజు.. మూవీ చూసి తొలి రివ్యూ ఇచ్చేశారు. ఈ మేరకు ఈయన నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
'రామాయణ ఇతిహాసాన్ని సినిమాగా మన తెలుగు ప్రేక్షకులకు అందించే భాగ్యం మాకు కలగడం ఓ ఆశీర్వాదంగా భావిస్తున్నాం. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి అద్భుతంగా నటించారు. రావణుడిగా యష్ అబ్బురపరిచారు. అద్భుతమైన విజువల్స్, ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ అందించిన సంగీతం, మనసకు హత్తుకునే కథనం.. ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించబోతున్నాయి. మనదైన చిరస్మరణీయమైన పురాణ కావ్యాన్ని ఇంతటి స్థాయిలో తెరకెక్కించిన నమిత్ జీ, నితీష్ జీకి మా హృదయపూర్వక అభినందనలు' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ ప్రధాన పాత్రలు చేశారు. నితీశ్ తివారీ దర్శకుడు. నమిత మల్హోత్రా రూ.4000 కోట్లు పెట్టి నిర్మించానని చెప్పుకొన్నారు. ఇవన్నీ పక్కనబెడితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రంపై అంచనాలు పెద్దగా లేవు. కంటెంట్ పరంగా మెప్పిస్తే మాత్రం ఈ దీపావళికి ప్రేక్షకులకు ఇది నచ్చేయొచ్చు.
(ఇదీ చదవండి: అదిరిపోయిన 'ఇట్లు అర్జున' ట్రైలర్.. తొలి సినిమాకే మూగవాడిలా)
#Ramayana is a visual treat. #RanbirKapoor and @Sai_Pallavi92 are phenomenal as Lord Rama and Sita, while Rocking Star @TheNameIsYash takes it to another level with his outstanding portrayal of Ravana. Breathtaking visuals, soulful music by @arrahman and @HansZimmer, and compelling storytelling make this an unforgettable cinematic experience. Heartiest congratulations to @malhotra_namit Ji and @niteshtiwari22 Ji for bringing our timeless epic to life on such a grand scale. Experience our Truth, Our History on big screens from Tomorrow.
— Sri Venkateswara Creations (@SVC_official) November 4, 2026


