రామాయణ మూవీ.. ఆ ఒక్క విషయంలో ఫ్యాన్స్‌లో తీవ్ర నిరాశ..! | Ranbir Kapoor Ramayana Movie screes Format disappoints Fans | Sakshi
Sakshi News home page

Ramayana Movie: రామాయణ మూవీ.. ఆ ఒక్క విషయంలో ఫ్యాన్స్‌లో తీవ్ర నిరాశ..!

Nov 1 2026 6:56 PM | Updated on Nov 1 2026 6:56 PM

Ranbir Kapoor Ramayana Movie screes Format disappoints Fans

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా వస్తోన్న మూవీ రామాయణ. ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 5న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్.

ఈ నేపథ్యంలోనే రామాయణకు సంబంధించిన ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ కోసం ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ చిత్రాన్ని ఐమాక్స్‌తో పాటు అన్ని ఫార్మాట్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. దీంతో రామాయణ సినిమాని బిగ్‌ స్క్రీన్‌పై ఎంజాయ్ చేసేందుకు ఆడియన్స్ రెడీ అవుతున్నారు.

అదొక్కటే నిరాశ..

ఈ రామాయణ మూవీని బిగ్ స్క్రీన్‌పై ఎంజాయ్ చేద్దామనుకున్న ప్రేక్షకులు ఇప్పుడు నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా కేవలం ఐమాక్స్ వర్షన్ మినహా.. మిగతా వర్షన్స్ ప్రీమియం ఫార్మాట్‌లో ఫ్లాట్ కంటెంట్‌తో రావడం లేదని తెలుస్తోంది. అంటే ఒకవేళ కొన్ని బిగ్ స్క్రీన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా తీరా స్క్రీన్‌ నిండా పడకుండా కేవలం స్కోప్‌లా కనపడుతుందని సమాచారం. దీంతో ఇలాంటి ప్రతిష్టాత్మక మూవీని గ్రాండ్‌గా ఎక్స్ పీరియన్స్ చేద్దామనుకున్న ఫ్యాన్స్‌ ఫీలవుతున్నారు. అన్ని ఫార్మాట్లలో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవం అందించేలా ప్లాన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement