మరో వివాదంలో ఆదర్శ కుటుంబం.. మీరలా చూపించారేంటి త్రివిక్రమ్ సార్? | Netizen Raises Objection To Trivikram Aadarsha Kutumbham Movie Scene Portraying Gulf Wives Negatively, Watch Video Inside | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో ఆదర్శ కుటుంబం.. ‍అలా చూపించడంపై నెటిజన్ ఆగ్రహం..!

Nov 1 2026 2:16 PM | Updated on Nov 1 2026 4:03 PM

Netizen Objection on Trivikram Aadasha Kutumbham Movie Scene

'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి సూపర్ హిట్ తర్వాత వెంకీమామ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ 'ఆదర్శ కుటుంబం-ఏకే47'.  ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిచారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు అక్టోబర్ 30న థియేటర్లలో రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద  సందడి చేస్తోంది.

అయితే ఈ మూవీ రిలీజ్‌ అయ్యాక వివాదం మొదలైంది. ఈ సినిమాలో జిమ్ జిమ్ తార సాంగ్ వాడారంటూ నిర్మాత మంచి వెంకట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హీరో వెంకటేశ్‌కి సంబంధించిన ఓ సన్నివేశంలో తమ సినిమా పాటని వినియోగించడం అన్యాయమని పేర్కొన్నారు. చిన్న సినిమాను బ‌తికించండని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తాజాగా ఈ సినిమా మరో వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలో గల్ఫ్ దేశాల్లో నివసించే వారి భార్యలను నెగెటివ్‌గా చూపించడంపై ఓ నెటిజన్ అ‍భ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మూవీలో హీరోయిన్ నివేదా పేతురాజ్‌ క్యారెక్టర్ అలా నెగెటివ్ కోణంలో చూపించడంపై ఫైరయ్యారు. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ ఇలా చూపిస్తారనుకోలేదని అన్నారు. త్రివిక్రమ్‌పై అభిమానంతో సినిమాకు వెళ్తే ఈ సీన్ చూశాక నా గుండె పగిలినంత పనైందని నెటిజన్‌ మండిపడ్డారు. భర్తలు దుబాయ్ గల్ఫ్ దేశాల్లో దూరంగా ఉంటే భార్యలు తప్పు చేస్తారా సార్ అని త్రివిక్రమ్‌ను ప్రశ్నించారు. అయితే.. గతంలో చాలా సినిమాల్లో ఇలానే చూపించడం మనం చూస్తుంటాం.. కానీ త్రివిక్రమ్ సినిమాలో ఇలా చూపడంతో నెటిజన్ ‍ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement