పాజిటివో నెగటివో గానీ బిగ్‌బాస్ షో అయితే ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. శనివారం నాటి ఎపిసోడ్‌లో రోహిత్-వర్షిణి-ముకేశ్ చేసిన కామెంట్స్ షో పరువునే దిగజార్చాయి. ఇదే ఎపిసోడ్‌లో భాగంగా రైతుబిడ్డ ఝాన్సీ ఎలిమినేట్ కావడం షాకింగ్ అనిపించింది. ఇంతకీ ఈమె ఎందుకు ఎలిమినేట్ అయింది? రెమ్యునరేషన్ ఎంత సంపాదించింది?
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావ్.. ఝాన్సీ ఎమోషనల్ ఎలిమినేషన్)
ఈసారి అగ్నిపరీక్షలో అందరి దృష్టిని ఆకర్షించిన వాళ్లలో ఫోక్ సింగర్ ఝాన్సీ ఒకరు. అలా జడ్జిలని మెప్పించి బిగ్‌బాస్ 10లో అడుగుపెట్టింది. తొలి రెండు వారాలు బాగానే ఆడుతూ షోలో కనిపించింది. కానీ తర్వాత వారాల్లో గేమ్ పరంగా ఆకట్టుకోలేక వెనకబడిపోయింది. ఈ వారం, గతవారం రోజులుగా జరుగుతున్న అల్టిమేట్ గోట్ టాస్క్‌లోనూ చాలా వెనకబడిపోయి రెడ్ లెవల్లోనే ఉండిపోయింది.
లెక్క ప్రకారం ఈసారి సుధీర్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ తన పవర్ ఉపయోగించి అతడిని కాపాడాన ఝాన్సీ.. తనని తాను కాపాడుకోలేక ఎలిమినేట్ అయింది. శనివారం ఎపిసోడ్ అంతా ఈమె ఎలిమినేషన్ గురించి ఎమోషనల్‌గా సాగింది. హౌసులో 8 వారాల పాటు ఉన్న ఈమె.. ఒక్కో వారానికి రూ.70,000 నుండి రూ.75,000 వరకు పారితోషికం అందుకుంది. మొత్తంగా దాదాపు రూ.5.60 నుండి 6 లక్షల వరకు రెమ్యునరేషన్ ఈమెకు లభించింది.
(ఇదీ చదవండి: రోహిత్ 'సైకో' ప్రవర్తన.. నాగ్ ఎందుకు మాట్లాడలేదు?)


