breaking news
Bigg Boss Telugu
-
బిగ్‌బాస్ గౌతమ్.. బాబాయిగా ప్రమోషన్
త్వరలో బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి ఎవరొస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు గత సీజన్లలో పాల్గొన్న వాళ్లు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. అలా గత రెండు సీజన్లలోనూ పాల్గొన్న గౌతమ్ కృష్ణ.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ మోడ్‌లో ఉన్నాడు. తమ కుటుంబంలోకి లిటిల్ ఏంజెల్ వచ్చిందని పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: కదల్లేని స్థితిలో 'వెంకీ' కమెడియన్.. పక్షవాతం రావడంతో)తెలంగాణకు చెందిన గౌతమ్ స్వతహాగా డాక్టర్. కానీ నటనపై ఆసక్తితో ఒకటి రెండు సినిమాలు చేశాడు. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం రావడంతో కాస్త ఫేమ్ వచ్చింది. 7వ సీజన్లో అశ్వద్ధామ అంటూ సందడి చేసిన గౌతమ్.. మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయాడు. గత సీజన్లో వైల్డ్ కార్డ్‌గా పాల్గొన్నాడు. రన్నరప్‌గా నిలిచాడు.కొన్నాళ్ల క్రితమే 'సోలో బాయ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రీసెంట్‌గానే వీరజవాన్ మురళినాయక్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించాడు. వీటి సంగతి పక్కనబెడితే తాను బాబాయిగా ప్రమోషన్ పొందినట్లు గౌతమ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. తన అన్నకు కూతురు పుట్టిందని ఈ మేరకు ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి సేవలో నాగచైతన్య దంపతులు) View this post on Instagram A post shared by D GAUTHAM KRISHNA (@actorgauthamkrishna) -
బిగ్‌బాస్ నుంచి మరో హీరో.. పోస్టర్ లాంచ్
బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ రోహిత్ సాహ్ని, అబిద్ భూషణ్ (నాగభూషణం మనవడు), రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా, శివాని నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. 'మిస్టీరియస్'లో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా తీశాం. షాకింగ్ ట్విస్ట్‌లు.. యాక్షన్స్, థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ.. పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: కూతురి పెళ్లి.. డ్యాన్స్ ఇరగదీసిన డైరెక్టర్ మురగదాస్) -
ఫుడ్ బిజినెస్ లోకి బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీ (ఫొటోలు)
-
రెడ్ డ్రెస్‌లో అరియానా.. అందాల ఆరబోతలో తగ్గేదే లే (ఫొటోలు)
-
శోభా శెట్టి బర్త్‌డే.. దగ్గరుండి కేక్ కట్ చేయించిన బిగ్‌బాస్ ఫ్రెండ్స్ (ఫోటోలు)
-
కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ (ఫోటోలు)
-
ముసలమ్మలా మారిపోయిన హాట్ బ్యూటీ అషూరెడ్డి (ఫొటోలు)
-
బిగ్‌బాస్ బ్యూటీ చీర సింగారం (ఫోటోలు)