ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ షో రసవత్తరంగా కొనసాగుతోంది. గతవారంలో కామనర్ రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో 11 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా ఆరు వారాల పాటు ఈ షో కొనసాగనుంది. ఈ పదో వారంలో నిఖిల్, గౌరవ్, సంజనా, రీతూ, భరణి, దివ్య నామినేట్ అయినట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఇవాల్టి ఎపిసోడ్ ఫుల్ హాట్‌హాట్‌గా సాగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హౌస్‌లో కమాండర్స్, ప్రజలు అని కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. వీరిద్దరి మధ్య పోటీ పెట్టేందుకు బిగ్‌బాస్ సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే కమాండర్లకు ఓ చిన్న పరీక్ష పెట్టాడు. నలుగురు కమాండర్స్ మధ్య బాల్స్‌ను బుట్టలో వేసే గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో ఓడిపోయినవారు ప్రజలతో పోటీ పడాల్సి ఉంటోంది. ఎవరి బుట్టలో తక్కువ బాల్స్ ఉంటే వారు సేఫ్ అవుతారని ప్రకటించారు. ఈ గేమ్‌లో సంజనా, డిమాన్ పవన్, తనూజ, నిఖిల్ పోటీపడ్డారు.
ఈ గేమ్ సందర్భంగా రీతూ చౌదరి, సంజనా మధ్య మాటల యుద్ధం నడించింది. నీకు కావాల్సిన వాళ్లకు సపోర్ట్ చేస్తున్నావని సంజనా అనడంతో.. అందరూ నాకు కావాల్సిన వాళ్లే అంటూ రీతూ ఫైరయింది. నువ్వు గేమ్ సరిగ్గా ఆడలేదంటూ సంచాలక్ రీతూ మండిపడింది. దీనికి నా స్ట్రాటజీ నాది.. నా గేమ్ గురించి మాట్లాడానికి నువ్వెవరు అంటూ సంజనా అంతే రేంజ్‌లో ఇచ్చిపడేసింది. నా గేమ్ స్ట్రాటజీని ప్రశ్నించడానికి.. ఆఫ్ట్రాల్ నువ్వు ఎవరు? నీకేమి హక్కుంది అంటూ సంజనా శివంగిలా మాట్లాడింది. దీనికి రీతూ నేను ఆఫ్ట్రాల్ కాదు సంజనా గారు..ఐ యామ్ సంచాలక్ అంటూ రీతూ కూడా గట్టిగానే అరుస్తూ కౌంటరిచ్చింది. ఈ ప్రోమో చూస్తే ఈ రోజు ఎపిసోడ్ ఫుల్ హాట్‌గా సాగినట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ప్రోమో మీరు కూడా చూసేయండి.
House is filled with tough tasks! Get ready for a blast episode! 💥
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/51OXUDOn8s— JioHotstar Telugu (@JioHotstarTel_) November 11, 2025


