మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ కాబోయే వధూవరులు ఇద్దరూ జంటగా కనిపించారు. కలిసి క్రిస్మస్ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేశ్ బాబు 'వన్-నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. తర్వాత తెలుగులో మరో మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో హిందీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది. అడపాదడపా హిట్స్ అందుకుని గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె కంటే ముందు చెల్లి నుపుర్ సనన్‌కి పెళ్లి కానుంది. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది.
(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)
కృతిసనన్ ఫ్యామిలీ క్రిస్మస్‌ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలో సింగర్ స్టెబిన్ బిన్ కూడా కనిపించాడు. కృతి చెల్లి నుపుర్‌కి కాబోయే భర్త ఇతడే. గాయకుడిగా స్టెబిన్ బాగానే ఫేమ్ ఉంది. నుపుర్ కూడా హీరోయిన్‌గా తెలుగులోనే 'టైగర్ నాగేశ్వరరావు' అనే మూవీతో పరిచయమైంది. ఇది ఘోరమైన ఫ్లాప్ కావడంతో యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఇప్పుడు ఓ ఇంటిది కాబోతుంది.
కొత్త ఏడాదిలో జరిగే సెలబ్రిటీ పెళ్లిలో నుపుర్‌దే మొదటిది అని చెప్పొచ్చు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా జనవరి 11న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు.
(ఇదీ చదవండి: ఇక నీకు సైడ్ క్యారెక్టర్లే గతి అన్నారు: రాజాసాబ్ హీరోయిన్)



