ఓటీటీ ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్ | Epstein Files Controversy Resurfaces, Jeffrey Epstein Netflix Filthy Rich Documentary Sparks Social Media Buzz | Sakshi
Sakshi News home page

Jeffrey Epstein Web Series: ఆరేళ్ల క్రితం నాటి సిరీస్.. ఇప్పుడు ట్రెండింగ్

Feb 9 2026 11:12 PM | Updated on Feb 10 2026 11:28 AM

Jeffrey Epstein Web Series Filthy Rich OTT Trending

గత కొన్నిరోజులుగా ఎప్‌స్టీన్ అనే వ్యక్తి పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దానికి చాలానే కారణాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ఈయన.. అగ్రరాజ్యాన్ని కుదిపేసిన భారీ సెక్స్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి. 1980-90ల్లో పేద, మధ్య తరగతి బాలికలకు, అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి..ఫ్లోరిడా,న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణ. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి, మరో యువతిని ఆ బంగ్లాకు తీసుకొస్తే మరికొంత కమీషన్ ఇస్తానని ఆశ చూపేవాడు. ఇది అప్పట్లో బయటపడింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

2005లో ఎప్‌స్టీన్‌ని అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైలులో ఉంచారు. 2019లో మీటూ ఉద్యమం సమయంలో మరోసారి ఆరోపణలు వచ్చేసరికి అరెస్ట్ చేశారు. అదే ఏడాది ఆగస్టులో.. జైలులోనే అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అది ఆత్మహత్య అని పోలీసులు తేల్చినప్పటికీ.. ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. అయితే ఎప్‌స్టీన్‌ మరణించిన ఏడాది తర్వాత ఇతడి జీవితం ఆధారంగా 'జెఫ్రీ ఎప్‌స్టీన్ : ఫిల్తీ రిచ్' పేరుతో నెట్‌ఫ్లిక్స్‌‌లో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. 4 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌కి లిసా బ్రయంట్ దర్శకత్వం వహించారు.

తాజాగా ఎప్‌స్టీన్ ఫైల్స్ మరోసారి వైరల్ అవుతుండటంతో ఆరేళ్ల క్రితం రిలీజైన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో టీచర్ స్థాయి నుంచి ఫైనాన్షియర్‌గా ఎప్‌స్టీన్ ఎలా ఎదిగాడు? లైంగిక నేరాలకు ఎలా పాల్పడ్డాడు? నిందితుని చేతిలో మోసపోయిన వారి వ్యథలు ఏంటి? చివరకు జైలులోనే ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల ఏంటనేది చూపించారు.అయితే ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, ట్రంప్, బిల్ గేట్స్ తదితరుల పేర్లు ఉండటం పెద్ద చర్చకు దారి తీసింది.

(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీలో ట్విన్స్‌.. వీడియో పోస్ట్ చేసిన ఉపాసన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement