ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Konkona Sensharma and Pratibha Rannta accused streaming date fixed | Sakshi
Sakshi News home page

Accused Ott Date: ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Feb 9 2026 8:31 PM | Updated on Feb 9 2026 8:31 PM

Konkona Sensharma and Pratibha Rannta accused streaming date fixed

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన అక్యూజ్‌డ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సినిమాకి అనుభూతి కశ్యప్‌ దర్శకత్వం వహించారు. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ చిత్రంలో కొంకణాసేన్‌ శర్మ కీలక పాత్రలో నటించారు. గతంలో ఆమె లైఫ్‌ ఇన్‌ ఏ మెట్రో, వేకప్‌ సిద్, ‘మెట్రో ఇన్‌ దినో’ లాంటి సినిమాల్లో నటించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement