అది విని చాలా ఎమోషనల్ అయ్యా: అనిల్ రావిపూడి | Anil Ravipudi Comments On Writer Sai Krishna at high movie event | Sakshi
Sakshi News home page

Anil Ravipudi: అలా చూడాలనేదే వాళ్ల నాన్న కోరిక: అనిల్ రావిపూడి

Feb 9 2026 6:33 PM | Updated on Feb 9 2026 7:15 PM

Anil Ravipudi Comments On Writer Sai Krishna at high movie event

అది విని చాలా ఎమోషనల్ అయ్యా: అనిల్ రావిపూడిటాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేశారు. మెగాస్టార్‌తో తీసిన మనశంకర వరప్రసాద్‌గారు బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన అనిల్.. మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేశారు.

తాజాగా హై టీజర్‌కు ఈవెంట్‌కు హాజరైన అనిల్ రావిపూడి.. తనతో కలిసి పని చేసిన సాయికృష్ణపై ప్రశంసలు కురిపించారు. సాయి ఆర్టిస్ట్ అవ్వాలనేది వాళ్ల నాన్న డ్రీమ్ అని తెలిపారు. కానీ ఆ కల నేరవేరకుండానే ఆయన వెళ్లిపోయారని గుర్తు చేసుకున్నారు. ఈ మాటలు విన్నప్పుడు నేను చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యానని అనిల్ రావిపూడి అన్నారు. సాయి బాగా చేస్తాడని తెలుసు.. కానీ ఇంత బాగా చేస్తాడనుకోలేదని కొనియాడారు. ఈ సినిమాలో చాలా ప్రొఫెషనల్‌ ఆర్టిస్ట్‌గా చేశాడని అనిల్ ప్రశంసించారు. 

కాగా.. సాయి కృష్ణ, అనన్య శర్మ,ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హై. ఈ సినిమాకు సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ టీజర్‌ను విడుదల చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement