‘ధురంధర్‌’ ని ఎగబడి చూస్తున్న పాక్ ప్రజలు.. అక్కడ నెం. 1 | In Pakistan, Dhurandhar is the most-watched on Netflix | Sakshi
Sakshi News home page

‘ధురంధర్‌’ ని ఎగబడి చూస్తున్న పాక్ ప్రజలు.. అక్కడ నెం. 1

Feb 9 2026 4:42 PM | Updated on Feb 9 2026 4:54 PM

In Pakistan, Dhurandhar is the most-watched on Netflix

ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన ‘ధురంధర్‌’..ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్‌ఫ్లిక్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్లోబల్‌ టాప్‌ 10 నాన్‌ ఇంగ్లీష్‌ చిత్రాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 7.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. భారతీయులు మాత్రమే కాదు పాకిస్తాన్‌ ప్రజలు కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్‌లో పాక్‌ ప్రజలు చూస్తున్న టాప్‌ 10 సినిమాల్లో దురంధర్‌ మొదటి స్థానంలో ఉంది.

గతేడాది డిసెంబర్‌ 5న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలైంది. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో భారీ కలెక్షన్స్‌ వచ్చాయి. మొత్తంగా రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. 

అయితే పాకిస్తాన్‌తో పాటు గల్ఫ్‌ దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. అయినా కూడా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ హీరోగా నటించగా.. విలన్‌గా అక్షయ్‌ ఖన్నా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆదిత్యధర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్‌ కూడా రాబోతుంది. ధురంధర్‌ 2 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement