హైదరాబాద్‌లో అడుగుపెట్టిన విరోష్ జంట.. వీడియో వైరల్ | Vijay And rashmika landed In Hyderabad after Grand wedding at udaypur | Sakshi
Sakshi News home page

Vijay-rashmika: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన విరోష్ జంట.. వీడియో వైరల్

Feb 27 2026 7:20 PM | Updated on Feb 27 2026 8:01 PM

Vijay And rashmika landed In Hyderabad after Grand wedding at udaypur

టాలీవుడ్ కొత్త జంట విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్‌ చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత భాగ్యనగరంలో అడుగుపెట్టారు. ఫ్యామిలీతో కలిసి శంషాబాద్‌ చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వివాహ వేడుక గ్రాండ్‌గా  జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు.  పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట.

అంతకుముందు ఇవాళ ఉదయం ఈ జంట ఉదయ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ కొత్త ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో విజయ్‌, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు.  అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement