విజయ్‌తో పెళ్లి.. ముందే చెప్పిన రష్మిక.. వీడియో వైరల్..! | Rashmika Mandanna Revealed About Her Marriage With Vijay Deverakonda At Movie Event, Old Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Rashmika: విజయ్‌తో పెళ్లి.. ముందే హింట్ ఇచ్చిన రష్మిక....!

Feb 27 2026 5:55 PM | Updated on Feb 27 2026 6:32 PM

Rashmika Revealed about Her Marriage at Movie Event Video goes viral

టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విరోష్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందే అఫీషియల్‌గా ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్‌ కూడా అత్యంత  ప్రైవసీ పాటించిన ఈ జంట ఉదయ్‌పూర్‌లో జరిగిన గ్రాండ్‌ వెడ్డింగ్‌లో ఒక్కటయ్యారు. ఎక్కడా కూడా తమ రిలేషన్‌షిప్‌ బయట పడకుండా కొన్నేళ్ల పాటు కొనసాగించారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి దొరికిపోయినప్పటికీ ఎక్కడా కూడా అఫీషియల్‌గా ప్రకటించలేదు.

అలా కొన్నేళ్లుగా వీరిద్దరి డేటింగ్ రూమర్స్‌ వస్తున్నా వాటిని అస్సలు పట్టింకోలేదు విరోష్ జంట. కేవలం తమ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అలా అత్యంత సీక్రెట్‌గా విజయ్- రష్మిక తమ బంధాన్ని కొనసాగించారు. అయితే గతేడాది ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన రష్మిక.. తన పెళ్లి గురించి ముందుగానే చెప్పేసింది. కానీ మనకే ‍అర్థం కాలేదంటూ నెటిజన్స్ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ అదేంటో మనం కూడా తెలుసుకుందాం.

గతంలో ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన రష్మికను.. అనంద్ దేవరకొండ ఆట పట్టించాడు. దీనికి రష్మిక సమాధానమిస్తూ.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా.. ఇలా నన్ను స్పాట్‌లో పెట్టి అడిగితే ఎట్లా అంటూ అప్పుడే హింట్ ఇచ్చేసింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2024లోనే ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సిందని అంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement