పెళ్లంటేనే భయమేస్తోంది.. ఎగ్స్‌ భద్రపర్చుకున్నా! | Daisy Shah Freeze Eggs, She Plans Motherhood whenever she is Ready | Sakshi
Sakshi News home page

Daisy Shah: తల్లవాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు

Feb 27 2026 4:13 PM | Updated on Feb 27 2026 6:14 PM

Daisy Shah Freeze Eggs, She Plans Motherhood whenever she is Ready

ప్రస్తుత సమాజంలో చాలామంది పెళ్లంటేనే భయపడుతున్నారు. హీరోయిన్‌ డైసీ షా కూడా పెళ్లంటే వెనకడుగు వేస్తోంది. 41 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గా ఉన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ, డబ్బు.. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటారు? అన్న ప్రశ్నకు తెలివిగా రెండూ అని బదులిచ్చింది. 

రోజుకో వార్త..
పెళ్లి గురించి మాట్లాడుతూ.. ప్రేమలు, పెళ్లిళ్ల గురించి రోజుకో రకమైన వార్తలు వింటూనే ఉన్నాం. బ్లూ డ్రమ్‌ కేస్‌, బ్రేకప్‌ కేసులు ఎక్కువైపోతున్నాయి. అవన్నీ చూస్తుంటే భయమేస్తోంది. అయితే పిల్లలు కనేందుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇప్పటికే నేను నా అండాలను భద్రపరుచుకున్నాను. నేనెప్పుడు ఓకే అనుకుంటే అప్పుడు పిల్లల్ని కంటాను అని చెప్పుకొచ్చింది.

సినిమా
డైసీ షా.. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్యకు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. భద్ర అనే కన్నడ మూవీతో హీరోయిన్‌గా మారా జైహో అనే హిందీ చిత్రంతో పేరు తెచ్చుకుంది. చివరగా రెడ్‌ రూమ్‌ వెబ్‌ సిరీస్‌తో అలరించింది. ప్రస్తుతం పలాష్‌ ముచ్చల్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement