విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎట్టకేలకు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో అత్యంత సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 26న ఉదయం పదిగంటల పది నిమిషాలకు విజయ్ దేవరకొండ.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విరోష్ జంట.
ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్స్ వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి పెళ్లిలో వీరిద్దరు ధరించిన నగలపై పడింది. రాయల్ లుక్‌లో కనిపించిన ఈ నగలే వీరు షేర్ చేసిన ఫోటోలు హైలెట్‌గా నిలిచాయి. దీంతో నెట్టింట వాటి గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో విరోష్ జంట ధరించిన నగలు హైలెట్‌గా నిలిచాయి. రష్మిక నక్షీ వర్క్ నగలు రాజసం ఉట్టిపడేలా కనిపించాయి. విజయ్ దేవరకొండ ధరించిన క్లాసిక్ గోల్డ్ జ్యూవెలరీ కూడా అచ్చం రాజులు ధరించినట్లుగా మెరిసిపోయింది. అలా గ్రాండ్ రాయల్ లుక్‌తో వీరిద్దరు తమ వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు.


