రొమాంటిక్‌ సీన్స్‌ చిరాకు తెప్పిస్తాయి: భాగ్యశ్రీ | Bhagyashree Opens Up About Her Return To Acting After Marriage, Says Intimacy Makes You Squirm In Modern Films, Calls It Unnecessary | Sakshi
Sakshi News home page

కథ బోల్డ్‌ అయినా పర్లేదు, రొమాంటిక్‌ సీన్స్‌ చిరాకు పుట్టించేలా..

Feb 27 2026 3:11 PM | Updated on Feb 27 2026 3:22 PM

Bhagyashree Says Intimacy Makes you Squirm in Modern films, calls it Unnecessary

కెరీర్‌ ఎంత స్పీడులో ఉన్నా సరే పెళ్లవగానే సినిమాలు తగ్గించేస్తుంటారు హీరోయిన్స్‌. కానీ కథానాయిక భాగ్యశ్రీ మాత్రం పెళ్లయ్యాకే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్‌ ఖాన్‌ మైనే ప్యార్‌ కియా చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. తక్కువకాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. ప్రస్తుతం సహాయక పాత్రలు పోషిస్తోంది.

కాలక్షేపం కోసం..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భాగ్యశ్రీ మాట్లాడుతూ... సమాజాన్ని ప్రతిబింబించేవే సినిమాలు. 90'sలో జనాలకు వినోదం అంటే సినిమానే గుర్తొచ్చేది. కుటుంబంతో కలిసి సమయం కేటాయించడానికి, కాలక్షేపం చేయడానికి సినిమాకు వెళ్లేవారు. ఇప్పుడన్నీ మారిపోయాయి. చిన్న కుటుంబాలే ఎక్కువయ్యాయి. వినోదం కోసం అనేక మాధ్యమాలు వచ్చాయి. జనాలకు ఆప్షన్స్‌ ఎక్కువయ్యాయి.

బలవంతంగా ఇరికించొద్దు
అదే సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం అసాధ్యంగా మారింది. సినిమాల్లోనూ జానర్స్‌ వచ్చాయి. వాస్తవికతకు పెద్ద పీట వేశారు. అయితే మోడ్రన్‌ సినిమాల్లో సహజత్వం కోసం రొమాంటిక్‌ సన్నివేశాలను బలవంతంగా చొప్పించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు లేదా పిల్లలతో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు అలాంటి క్లోజప్‌ సీన్స్‌ చిరాకు తెప్పిస్తాయి అని చెప్పుకొచ్చింది.

సినిమా
ఒకప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేసిన భాగ్యశ్రీ.. ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌'లోనూ కీలక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మూడు, నాలుగు హిందీ సినిమాల్లో నటించి వెండితెరపై చిన్న బ్రేక్‌ తీసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత రాజా శివాజీ అనే చిత్రం చేస్తోంది. ఈ మూవీ మే1న విడుదల కానుంది.

చదవండి: అదో చెత్త సినిమా.. ఇంత వెక్కిరించాలా?: నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement