రికార్డ్‌ క్రియేట్‌ చేసిన విజయ్, రష్మిక పెళ్లి ఫోటో.. | Vijay devarakonda and rashmika wedding photo record create | Sakshi
Sakshi News home page

రికార్డ్‌ క్రియేట్‌ చేసిన విజయ్, రష్మిక పెళ్లి ఫోటో..

Feb 27 2026 1:39 PM | Updated on Feb 27 2026 2:23 PM

Vijay devarakonda and rashmika wedding photo record create

ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్నారు.   రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్‌ ప్యాలెస్‌లో అతికొద్దిమంది సమక్షంలో ఒక్కటయ్యారు. విరోష్‌ పేరుతో తమ ఫ్యాన్స్‌ కోసం వారు కొన్ని ఫోటోలు షేర్‌ చేశారు. అయితే, తమ అభిమానులు ఈ జంటపై ప్రేమతో పాటు శుభాకాంక్షలు కురిపించారు. పెళ్లి ఫోటోలు సోషల్‌మీడియాలో సంచలనంగా మారాయి. మిలియన్ల కొద్ది లైక్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేశాయి. పాన్‌ ఇండియా రేంజ్‌లో వీరి పెళ్లి ఫోటోకు అత్యధికంగా లైక్స్‌ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డ్‌ అంటూ ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.

సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వివాహబంధంలోకి అడుగుపెట్టారు.  ఆ సందర్భంగా గతంలో వారు కూడా ఫోటోలు పంచుకున్నారు. బాలీవుడ్‌ నటి  కియారా అద్వానీ తమ పెళ్లి సమయంలో ఫోటోలు షేర్‌ చేస్తే 15.8 మిలియన్ల లైక్స్‌ వచ్చాయి. ఇప్పటివరకు ఇదే రికార్డ్‌. కానీ, తాజాగా విరోష్‌ జోడీ 18.5 మిలియన్ల లైక్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. విజయ్ దేవరకొండ కూడా అవే ఫోటోలను షేర్‌ చేశారు. అక్కడ కూడా 15.2 మిలియన్ల లైక్స్‌ రావడం విశేషం. మరోసారి విజయ్‌- రష్మిక జోడీ తమ ఇమేజ్‌ను చిత్రపరిశ్రమకు చూపారని ఫ్యాన్స్‌ అంటున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రణబాలి సినిమాలో నటిస్తున్నారు. టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.  పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్నారు. ‘టాక్సీవాలా’ విజయం తర్వాత మరోసారి విజయ్‌తో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే ఏడాది సెప్టెంబర్‌ 11న ఈ మూవీ విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement