అదో చెత్త మూవీ.. ఇంత అపహాస్యం చేస్తారా?: నటుడు | Kalidas Jayaram Says Param Sundari is a Worst Movie | Sakshi
Sakshi News home page

నేను చూసిన చెత్త మూవీ అదే: స్టార్‌ యాక్టర్‌ కుమారుడు

Feb 27 2026 1:44 PM | Updated on Feb 27 2026 1:50 PM

Kalidas Jayaram Says Param Sundari is a Worst Movie

ప్రముఖ మలయాళ స్టార్‌ జయరామ్‌ కుమారుడు, నటుడు కాళిదాస్‌ జయరామ్‌ ఓ బాలీవుడ్‌ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. కేరళ సాంప్రదాయాన్ని ఖూనీ చేశారంటూ 'పరమ్‌ సుందరి'ని చెత్త సినిమాగా అభివర్ణించాడు. అతడు‌ ప్రధాన పాత్రలో నటించిన ఆశాకల్‌ ఆయిరం అనే మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు.

చెత్త మూవీ
ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో నేను చూసిన చెత్త సినిమా పరమ్‌ సుందరి. ఈ మాట చెప్పడానికి కూడా నేను ఏమాత్రం సంకోచించడం లేదు. ఈ మూవీలో కేరళను చాలా చెత్తగా చిత్రీకరించారు. మన సంస్కృతిని అపహాస్యం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సినిమా చూసి చాలా అసంతృప్తికి లోనయ్యాను. పరమ్‌ సుందరి ఒక చెడ్డ అనుభవాన్ని ఇచ్చింది అని పేర్కొన్నాడు.

సినిమా
పరమ్‌ సుందరి విషయానికి వస్తే.. సిద్దార్థ్‌ మల్హోత్రా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌ జాన్వీ కపూర్‌  కేరళ కుట్టిగా యాక్ట్‌ చేసింది. తుషార్‌ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2025 ఆగస్టు 29న విడుదలైంది. రిలీజైన నాటి నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం వసూళ్లు మాత్రం పర్వాలేదనిపించింది.

చదవండి: విరోష్‌ పెళ్లి.. ఇది చూడటం నా అదృష్టం: కల్యాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement