తెలుగు పరిశ్రమపై తాప్సీ ప్రశంసలు | Taapsee Pannu Appreciate Comments On Tollywood Film Industry | Sakshi
Sakshi News home page

తెలుగు పరిశ్రమపై తాప్సీ ప్రశంసలు

Feb 27 2026 11:04 AM | Updated on Feb 27 2026 11:12 AM

Taapsee Pannu Appreciate Comments On Tollywood Film Industry

హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధానపాత్రలో నటించిన  అస్సీ మూవీ తాజాగా విడుదలైంది. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తెలుగులో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ కొంత కాలంగా టాలీవుడ్‌ పరిశ్రమ పట్ల చేస్తున్న విమర్శలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. సౌత్‌ఇండస్ట్రీలో హీరోయిన్లు మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించాలని ఇక్కడి‌ ఫిల్మ్‌మేకర్స్‌ తనపై ఒత్తిడి తెచ్చేవారని ఆరోపించింది. అయితే, ఆమె ఇ‍ప్పుడు యూటర్న్‌ తీసుకొని తెలుగు పరిశ్రమపై ప్రశంసలు కురింపించింది.

తెలుగు, తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన తాప్సీ.. 'చష్మే బద్దూర్' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పింక్, థప్పడ్ వంటి సినిమాలతో తనకంటూ స్టార్‌ ఇమేజ్‌ని అక్కడ క్రియేట్‌ చేసుకుంది. తాజాగా బాలీవుడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు పరిశ్రమపై మక్కువను చాటుకుంది. తెలుగు సినిమాలో నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే పాత్రలు ఉంటాయని  ఆమె గుర్తు చేసుకుంది. 

అయితే, తెలుగులో మాదిరి తమిళ పరిశ్రమలో అలాంటివి తక్కువగా కనిపిస్తాయని ఆమె పేర్కొంది. టాలీవుడ్‌ నుంచి తనకు మంచి పాత్రలే దక్కడంతో తెలుగు వారు తనను బాగా అభిమానిస్తారని చెప్పింది. తన విలువను పెంచిన సినిమాలన్నీ కూడా తెలుగు నుంచే ఉన్నాయని తెలిపింది. తన కెరీర్‌కు టాలీవుడ్‌ పరిశ్రమ ఎంతగానో ఉపయోగపడిందని తాప్సీ గుర్తు చేసుకుంది. ఝుమ్మంది నాదం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 2022లో చివరిగా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’లో మెరిసింది.  

Advertisement
 
Advertisement
Advertisement