ట్రంప్‌ వ్యూహం.. వార్నర్ బ్రదర్స్‌, నెట్‌ఫ్లిక్స్‌ బిగ్‌ డీల్‌కు బ్రేక్‌.. | Netflix drops bid for Warner Bros, Why? | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ వ్యూహం.. వార్నర్ బ్రదర్స్‌, నెట్‌ఫ్లిక్స్‌ బిగ్‌ డీల్‌కు బ్రేక్‌..

Feb 27 2026 10:38 AM | Updated on Feb 27 2026 10:45 AM

Netflix drops bid for Warner Bros, Why?

వార్నర్ బ్రదర్స్‌, నెట్‌ఫ్లిక్స్‌ మధ్య కుదిరిన  భారీ డీల్‌కు బ్రేక్‌ పడింది. వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీకి చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్‌ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు కొద్దిరోజుల క్రితం ఆసక్తి చూపిన నెట్‌ఫ్లిక్స్‌ (Netflix).. ఇప్పుడు వెనక్కు తగ్గింది. ఈ నిర్ణయంతో మీడియా దిగ్గజంగా ఎదగాలనుకున్న నెట్‌ఫ్లిక్స్ ఆశలకు గండి పడింది.

నెట్‌ఫ్లిక్స్‌- వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ మధ్య కుదిరిన డీల్‌కు అంతరాయం కలిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్‌ వ్యూహం రచించారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  ట్రంప్‌ ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న పారామౌంట్‌ స్కైడ్యాన్స్‌ రంగంలోకి రానుందని వార్తలు వస్తున్నాయి. వార్నర్ బ్రదర్స్‌ను చేజిక్కించుకునేందుకు 108.4 బిలియన్‌ డాలర్ల బిడ్‌ను పారామౌంట్‌ వేసింది. ఈ బిడ్ వెనక ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ ఉన్నట్లు అక్కడి మీడియా కథనం రాసింది.

వార్నర్ బ్రదర్స్‌ సంస్థతో నెట్‌ఫ్లిక్స్‌ కుదుర్చుకున్న 72 బిలియన్‌ డాలర్ల ( రూ.6.48 లక్షల కోట్లు)  ఒప్పందాన్ని   పరిశీలించాల్సి ఉందంటూ ట్రంప్ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన హ్యూహం వల్లే ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన డీల్‌ బ్రేక్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో వార్నర్ బ్రదర్స్‌ను సులువుగా పారామౌంట్‌ స్కైడ్యాన్స్‌ సంస్థ దక్కించుకునే ఛాన్స్‌ ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement