breaking news
Netflix
-
రవితేజ ఇరుముడి OTTలోకి వచ్చేస్తుందా?
-
ఓటీటీకి ఇరుముడి.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!
ఇప్పుడంతా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి కనిపిస్తోంది. అందరు గణనాథుని పూజలతో బిజీగా ఉన్నారు. పండుగ సీజన్ వేళ సినీ ప్రియులను అలరించేందుకు తెలుగు సినిమాలు రెడీ అయిపోయాయి. ప్రశాంత్ నీల్ నిర్మించిన హారర్ సినిమా '418', కాగతం పడవలు, పిఠాపురంలో అలా మొదలైంది, మిస్సింగ్ మేఘన లాంటి చిత్రాలు ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఇక వీకెండ్ రాగానే ఓటీటీలపైనే సినీ ప్రియుల చూపు ఎప్పుడు ఉంటుంది. వారి కోసం బోలెడు చిత్రాలు సిద్ధమైపోయాయి. వీటిలో టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఇరుముడి ఓటీటీ ప్రియులను ఊరిస్తోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు మొదరాత్రి, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3 లాంటి డబ్బింగ్ మూవీస్ చాలానే ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం ఓటీటీ రిలీజెస్..నెట్‌ఫ్లిక్స్ ఇరుముడి (తెలుగు సినిమా) - సెప్టెంబరు 18 లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 18 బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 18 మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ చిత్రం) - సెప్టెంబరు 18 ద స్కాండల్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 18 జాకీర్ ఖాన్: పాప యార్ (హిందీ స్టాండప్ కామెడీ షో) - సెప్టెంబరు 18 సిన్నర్స్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 18 స్ట్రేంజర్ థింగ్స్- టేల్స్ ఫ్రమ్ 85-సీజన్ 2(హాలీవుడ్ సిరీస్)- సెప్టెంబర్ 18 మాన్స్టర్- ది లిజి బార్డన్ స్టోరీ(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 18 ఫ్లాయిడ్ మేవెదర్ vs మేనీ పక్వివో (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 19 స్టాప్! దట్! ట్రైన్! (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 20 అమెజాన్ ప్రైమ్ రామ్ అండ్ లీలా (తమిళ సినిమా) - సెప్టెంబరు 18 యూ ప్లస్ మీ: ఎగైనిస్ట్ ద వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 18జియో హాట్‌స్టార్ తుడక్కం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 18 మాబ్ ల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 19సన్ నెక్స్ట్ అంగీకారం (తమిళ మూవీ) - సెప్టెంబరు 18 -
ఓటీటీలో 'లస్ట్ స్టోరీస్ 3' స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన
ఓటీటీల్లో చాలామంది సినిమాలు చూస్తుంటారు. అదే టైంలో కొన్ని సిరీస్‌లు కూడా ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఆశ్చర్యపరుస్తాయి. అలా దాదాపు ఎనిమిదేళ్ల క్రితం రిలీజై సెన్సేషన్ సృష్టించిన సిరీస్ 'లస్ట్ స్టోరీస్'. తర్వాత కాలంలో దీనికి రెండో పార్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు మూడో సీజన్ కూడా సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసి ఓ వీడియోని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)నెట్‌ఫ్లిక్స్ పాపులర్ ఆంథాలజీ ఫ్రాంచైజీ 'లస్ట్ స్టోరీస్' మూడో భాగాన్ని ఈనె 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సీజన్లో ఉండే నాలుగు కథలకు విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ప్రేమ, ఆకర్షణ, సంబంధాలు, అణచివేసిన కోరికలు అనే అంశాల ఆధారంగా వీటిని తెరకెక్కించారు. ఈ సీజన్లో రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అదితి రావు హైదరీ, రాధికా మదన్, సనా థంపి, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, సిద్ధార్థ్, అలీ ఫజల్, గుర్ఫతేహ్ పిర్జాదా తదితరులు ప్రధాన పాత్రలు చేశారు.‘లస్ట్ స్టోరీస్’ ఫ్రాంచైజీ 2018లో ప్రారంభమైంది. తొలి భాగంలోని స్టోరీలకు అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఈ ఆంథాలజీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌కు నామినేట్ అయింది. 2023లో ‘లస్ట్ స్టోరీస్ 2’ విడుదలైంది. ఇప్పుడు మూడో సీజన్ రానుంది.మరి ఇదెలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)I won’t tell this to y’all but I am too excitedddd 🤭❤️🔥 pic.twitter.com/7jQlq9MAXw— Netflix India (@NetflixIndia) September 5, 2026 -
ది డికాయ్ ప్లేన్ రివ్యూ: ట్రంప్ ‘ఎస్కేప్’.. థ్రిల్ చేసిందా?
ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతను పొందే నేత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అలాంటి వ్యక్తి ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లేటప్పుడు అందరి కళ్లముందే కనిపించకుండా పోతే? అందులోనూ అధికారిక విమానం నుంచి మరో విమానంలో రహస్యంగా ప్రయాణించాల్సి వస్తే? వినడానికి హాలీవుడ్ థ్రిల్లర్‌లా అనిపించే ఈ ఘటన నిజంగానే జరిగింది. ఇప్పుడు అదే ఆసక్తికర ఉదంతాన్ని ‘ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా అందించింది. ఇంతకీ ఇది ఎలా ఉంది? థ్రిల్ పంచిందా?..స్టోరీ ఏంటంటే.. టర్కీలో జరిగిన నాటో సదస్సు అనంతరం డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు తిరిగి బయలుదేరిన సమయంలో అసలు కథ మొదలవుతుంది. అందరూ ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లోనే ఉన్నారని భావించారు. కానీ భద్రతా కారణాలతో ఆయనను క్యాటరింగ్ ట్రక్ ద్వారా విమానం నుంచి బయటకు తీసుకొచ్చి.. చిన్నదైన మరో మిలిటరీ విమానంలో తరలించారు. అసలు విమానం మాత్రం ట్రంప్ అందులోనే ఉన్నట్టుగా నమ్మించే ‘డికాయ్’గా కొనసాగింది. అప్పట్లో విమానంలో ఉన్న జర్నలిస్టులు, కొందరు ఉన్నతాధికారులకు కూడా అసలు విషయం తెలియకపోవడం ఈ ఘటనను మరింత సంచలనంగా మార్చింది.ఫ్లస్ పాయింట్లు.. ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్(Instadocs: The Decoy Plane) డాక్యుమెంటరీకి ప్రధాన బలం ఆ సమయంలో ప్రత్యక్షంగా ఉన్నవారి మాటలే. రాయిటర్స్ వైట్‌హౌస్ రిపోర్టర్ గ్రామ్ స్లాటరీ, ఏపీ ఫొటోగ్రాఫర్ అలెక్స్ బ్రాండన్, వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ డాన్ లామోత్తో పాటు మాజీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ రాబర్ట్ మెక్‌డొనాల్డ్, మాజీ ఎయిర్‌ఫోర్స్ వన్ సిబ్బంది వాండా జోయెల్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ సమయంలో విమానంలో ఉన్నవారికి ఎలా అనిపించిందో ప్రేక్షకుడు అర్థం చేసుకునేలా తెరకెక్కించారు.అయితే చిన్న నిడివి ఇక్కడ మైనస్ కాకుండా ప్లస్‌గా మారింది (Instadocs: The Decoy Plane Review). అనవసరమైన ఉపకథలు (Side Track) లేకుండా నేరుగా అసలు విషయానికే వెళ్లడం వల్ల ఆసక్తి నిలుస్తుంది. ముఖ్యంగా క్యాటరింగ్ ట్రక్, మూసిన కిటికీలు, అనుమానాస్పద కదలికలు.. ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన అసలు విషయం.. ఇవన్నీ ఒక మిస్టరీని ఛేదిస్తున్న అనుభూతిని కలిగిస్తాయి.నెగెటివ్ ఏంటంటే.. అయితే ఇది(Trump The Decoy Plane Doc) పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ అనుకోవద్దు. కేవలం అరగంటలో ఒకే ఘటనను చెప్పేయాలన్న ఉద్దేశంతో రూపొందించిన డాక్యుమెంటరీ కావడంతో.. లోతైన రాజకీయ విశ్లేషణకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. ఇరాన్ థ్రెట్.. ఇజ్రాయెల్ వార్నింగ్.. కనీసం వెరిఫై చేసుకోకుండా ట్రంప్ భద్రతా బలగాలు చేసిన పని.. ఇలా ఏవీ ఇందులో కనిపించవు. ట్రంప్ చుట్టూ ఉన్న రాజకీయ వివాదాల కంటే.. భద్రతా వ్యవస్థ ఎలా పనిచేసింది? మీడియాను ఎందుకు చీకట్లో ఉంచారు? అనే అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.ఓవరాల్‌గా.. రాజకీయాలు, అమెరికా అధ్యక్షుడి భద్రత, వైట్‌హౌస్ వ్యవహారాలు, నిజ జీవితంలోని విచిత్రమైన ఘటనలు ఆసక్తిగా చూసేవారికి ‘ది డికాయ్ ప్లేన్’ ఒక మంచి షార్ట్ వాచ్. పెద్ద సినిమా స్థాయి డ్రామా కోసం కాకుండా.. ‘అసలు ఆ రోజు ఏం జరిగింది?’ అనే కుతూహలంతో చూస్తే మాత్రం నిరాశపరచదు. -
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 12 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం తెలుగులో నరేశ్ హీరోగా వస్తోన్న రంభ ఊర్వశి మేనక, ఐ యామ్ గేమ్, బెత్లెహోమ్ కుటుంబ యూనిట్, మీర్జాపూర్, మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం, సహ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో నరేశ్ మూవీపై ఆడియన్స్‌లో బజ్ నెలకొంది.ఇక ఓటీటీల విషయానికొస్తే వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ లాంటి ఆసక్తి పెంచేస్తున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. జగమే సంగీతం అనే తెలుగు వెబ్ సిరీస్ సైతం మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్..నెట్‌ఫ్లిక్స్ ధమాల్ 4 (హిందీ మూవీ) - సెప్టెంబరు 04 కొరియన్ కనకరాజు (తెలుగు సినిమా) - సెప్టెంబరు 04 ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 04 టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 04జీడీఎన్(తమిళ సినిమా)- సెప్టెంబరు 04 అమినే క్రాఫ్ట్ మూవీ(హాలీవుడ్)- సెప్టెంబరు 04 ది బ్రెడ్ విన్నర్(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 06సన్ నెక్స్ట్ డిసి (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 04అమెజాన్ ప్రైమ్ జగమే సంగీతం (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 04జియో హాట్‌స్టార్ ద కోర్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 04జీ5వీరభద్రుని రహస్యం సీజన్-1 పార్ట్-2(తెలుగు సిరీస్)- సెప్టెంబర్ 04సోనీ లివ్ ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 04ఆపిల్ టీవీ ప్లస్ మే డే (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 04 -
ఓటీటీలో మాధవన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ వారం ఇప్పటికే 'పళ్లబురుసు' అనే తెలుగు మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. వీకెండ్లో కొరియన్ కనకరాజు, డిసి, ఉన్మాదం, గాంధారి, జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇవలా ఉండగానే మరొకటి కూడా రాబోతుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: డైరెక్టర్ లేకుండానే సినిమా.. శ్రీకృష్ణ దేవరాయలుగా సుదీప్)మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జీడీఎన్'. గోపాలస్వామి దొరైస్వామి నాయుడు అలియాస్ జీడీ నాయుడు అంటే తమిళనాడులో తెలియనివాళ్లు లేరు. వందేళ్ల క్రితం దక్షిణ భారతదేశంలో వాణిజ్య, సాంకేతిక విప్లవానికి ఈయన ఆద్యుడు. ఇండియన్ ఎడిసన్‌గా పేరుగాంచాడు. తెలుగు మూలాలు ఉన్న నాయుడి జీవితాన్ని 'జీడీఎన్' పేరుతో గత నెల 7న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు నెలలోపే అంటే ఈ శుక్రవారమే (సెప్టెంబరు 04) నెట్‌ఫ్లిక్స్‌లోకి తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అందుబాటులోకి రానుంది.'జీడీఎన్' విషయానికొస్తే.. కోయంబత్తూరులోని ఓ రైతు కుటుంబంలో పుట్టిన నాయుడు(మాధవన్) పెద్దగా చదువుకోలేదు. డిగ్రీల కంటే అనుభవం , జ్ఞానం ముఖ్యమని ఆయన నమ్మకం. ఒక బ్రిటీషర్ దగ్గర రూ.250తో మోటర్ సైకిల్ కొనాలని అనుకుంటాడు. కానీ ఆ డబ్బుని రైతు కూలీలకి ఇచ్చేస్తాడు. తనతో పాటు నలుగురూ బావుండాలనే తపన. తర్వాత ఒక హోటల్లో పనిచేసి డబ్బు సంపాదించి మోటర్ సైకిల్ కొని, అది ఎలా పని చేస్తుందో తెలుసుకుంటాడు. కొత్త వస్తువులు కనిపెట్టడం దగ్రి నుంచి ఒక బస్సుల కంపెనీ యజమాని వరకూ ఎదుగుతాడు.జర్మనీ వెళ్లి హిట్లర్‌తో ప్రశంసలు పొందుతాడు. ఈ క్రమంలో బ్రిటీష్ వాళ్లు ఒక ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారి సాయంతో నాయుడు మీద కుట్రలు చేస్తారు. దేశద్రోహిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆయన్ని వేధించి, ఆస్తుల జప్తు వరకు తీసుకొస్తారు. ఇవన్నీ జీడీఎన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)Oru manushan oda vaazhkai indha naatu oda varalaaru 🙌🏼🔥 pic.twitter.com/Ga29ziMp1q— Netflix India South (@Netflix_INSouth) September 2, 2026SSS -
ఓటీటీలోకి వచ్చేస్తున్న ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’
తన ప్రాణాలకు ముప్పు లేదని తరచూ చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భద్రత విషయంలో మాత్రం ఏమాత్రం రాజీపడరు. అలాంటిది ప్రాణభయంతో ప్రయాణిస్తున్న విమానాన్ని రహస్యంగా మార్చడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఆ విషయాలు ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో సదస్సు కోసం జూలై 8న టర్కీలోని అంకారాకు వెళ్లారు. సదస్సు ముగించుకుని అమెరికాకు తిరుగు ప్రయాణంలో.. భద్రతా కారణాలతో ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి రహస్యంగా మరో సైనిక విమానంలోకి మార్చారు. ఆ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనను.. ‘ఇన్‌స్టాడాక్స్: ది డీకాయ్ ప్లేన్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ రూపొందించింది. ఈ ప్రత్యేక డాక్యుమెంటరీ సెప్టెంబర్ 4(ఎల్లుండి) నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఇందులో ఏం చూపించబోతున్నారు? ఇది ఎన్ని వివాదాలు.. అభ్యంతరాలకు దారి తీస్తుందో ? అనే ఆసక్తి నెలకొంది.డీకాయ్ ప్లేన్ అంటే.. ట్రంప్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’లోనే ప్రయాణిస్తున్నారని బయటకు కనిపించేలా చేస్తూనే.. వాస్తవంగా ఆయనను మరో సైనిక విమానంలోకి తరలించడమే డీకాయ్ ప్లేన్. అసలు ట్రంప్ ఏ విమానంలో ఉన్నారో గుర్తించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఇరాన్ నుంచి ముప్పు ఉందని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలోనే అమెరికా భద్రతా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ ముప్పును నిర్ధారించుకోకుండానే అమెరికా బలగాలు ఈ సీక్రెట్ జర్నీ ఆపరేషన్ నిర్వహించినట్లు తర్వాత తేలింది.క్యాటరింగ్ ట్రక్కులో..ఈ రహస్య ఆపరేషన్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ట్రంప్ విమానం మారిన విధానం. ఒక విమానం నుంచి మరో సైనిక విమానానికి ఆయనను సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహారం, పానీయాలు తరలించే క్యాటరింగ్ ట్రక్కులో తీసుకెళ్లినట్లు రిపోర్టులు వెల్లడించాయి. ఈ రహస్య బదిలీ గురించి ట్రంప్ వెంట ఉన్న మీడియా ప్రతినిధుల్లో చాలామందికి కూడా సమాచారం లేదని కథనాలు పేర్కొన్నాయి.కొందరు మాత్రమే వెంట..ట్రంప్‌తో పాటు ఈ రహస్య బదిలీలో కొద్దిమంది మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. వైట్‌హౌస్ సిబ్బంది, అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ తదితరులు ఆయనతో వెళ్లినట్లు కథనాలు తెలిపాయి. మరోవైపు అప్పటి విదేశాంగ మంత్రి మార్కో రూబియో, స్టీఫెన్ మిల్లర్, అప్పటి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తదితరులు డీకాయ్‌గా ఉన్న విమానంలోనే కొనసాగారు.బ్రిటన్‌లో మళ్లీ విమానం మార్పు?టర్కీ నుంచి ట్రంప్ ప్రయాణించిన సైనిక విమానం బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ మిల్డెన్‌హాల్ స్థావరానికి చేరినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అక్కడ ఆయన మరోసారి విమానం మార్చి.. ఖతార్ నుంచి అందిన బోయింగ్ 747లో అమెరికాకు బయలుదేరినట్లు సమాచారం.ట్రంప్ ఏమన్నారు?ఈ వ్యవహారం బయటకు రావడంతో ట్రంప్ విమానం ఎందుకు మార్చారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలో మీమ్స్, ఊహాగానాలు వెల్లువెత్తాయి. అనంతరం ట్రంప్ దీనిపై స్పందిస్తూ.. తనకు ఇలాంటి ముప్పు పొంచి ఉండడం సహజమేనని, భయపడే రకం తాను కాదని.. అయితే సీక్రెట్ సర్వీస్, మిలిటరీ అధికారులు సురక్షితమైన మార్గమని సూచించడంతో తాను వారి ఆదేశాలను పాటించినట్లు చెప్పారు. ట్రంప్ మాత్రమే కాదు గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు, ఆ మాటకొస్తే పలువురు ప్రపంచ అధినేతల కోసం ఇలాంటి సీక్రెట్ జర్నీలు ఏర్పాటు చేశారు.ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కథనం..ఇప్పటివరకు వార్తలు, ఊహాగానాలకే పరిమితమైన ఈ రహస్య ప్రయాణం వెనుక కథను Instadocs: The Decoy Plane పేరిట నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఘటనను తొలిసారి రిపోర్ట్ చేసిన జర్నలిస్టులతో పాటు వైట్‌హౌస్, విమానయాన రంగానికి చెందినవారు, మాజీ సీక్రెట్ సర్వీస్ సిబ్బందితో చేసిన ఇంటర్వ్యూలను ఇందులో చూపించనున్నారు. సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో.. ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’ మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: అమెరికా సైనికులొస్తున్నారు.. అలర్ట్This July, while flying back from a NATO summit in Turkey, President Trump slipped off Air Force One in a catering truck and secretly boarded a different aircraft — leaving traveling reporters to fly on, unaware the president was no longer with them.Instadocs: The Decoy Plane,… pic.twitter.com/iuADnXxMoV— Netflix (@netflix) September 1, 2026 -
ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?
రెండో వారాంతం పూర్తయినప్పటికీ 'ఇరుముడి' సినిమా థియేటర్లలో తెగ ఆడేస్తోంది. ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి. దీంతో ట్రేడ్ సైతం ఆశ్చర్యపోతోంది. హీరో, దర్శకనిర్మాతల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ఎవరూ ఊహించని విజయం ఇదని చెప్పొచ్చు. ఇప్పటికీ జనాలు థియేటర్లకు వెళ్లి ఈ మూవీ చూస్తున్నారు. అదే టైంలో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో ఓ తేదీ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'టాక్సిక్' సినిమాకు నెగిటివ్ టాక్.. యష్ తల్లి ఆవేశం)రవితేజకు గత కొన్నాళ్ల నుంచి సరైన సక్సెస్ అనేది లేదు. దీంతో 'ఇరుముడి'పై కూడా హైప్ ఓ మాదిరిగానే ఉండేది. అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యం కావడంతో సెట్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రం ఇది కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మారు. వాళ్లకు నమ్మకాన్ని నిజం చేస్తూ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం రూ.150 కోట్లకు పైనే వసూళ్లు దక్కించుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.ఇకపోతే ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. దీనిబట్టి చూస్తే సెప్టెంబరు 18 నుంచే ఓటీటీ రిలీజ్ కావొచ్చు. లేదంటే నిర్మాతలు.. ఓటీటీ సంస్థతో ఏమైనా మాట్లాడి ఇంకొన్ని వారాల స్ట్రీమింగ్ వాయిదా వేసేలా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. పరిస్థితులు చూస్తుంటే థియేటర్లలో మూవీ ఉన్నప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేస్తుందా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'ఇరుముడి'లో అయ్యప్ప పాట.. ఫుల్ వీడియో రిలీజ్)(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా) -
శుక్రవారం ఓటీటీల్లో సందడి.. ఒక్కరోజే 17 సినిమాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో టాక్సిక్ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక ఈ ఫ్రైడే టాలీవుడ్లో కికు చిరంజీవి అనే మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై పెద్దగా బజ్ అయితే లేదు. దీంతో పాటు మరికొన్ని డబ్బింగ్ సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆలియా భట్ ఆల్ఫా మూవీతో పాటు తెలుగు వెబ్ సిరీస్ ఆకలిరాజ్యం -2026 ఓటీటీల్లో సందడి చేయనుంది. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28 న్యూటన్స్ థర్డ్ లా(తెలుగు సినిమా)- ఆగస్టు 28 చుంబక్ (హిందీ సిరీస్) - ఆగస్టు 28 గ్రేవ్ యార్డ్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - ఆగస్టు 28 ద విస్పర్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28 ఆల్ఫా (హిందీ మూవీ) - ఆగస్టు 28 గ్రాండ్ థెఫ్ట్ ఆటో యాన్ ఎక్సెండెడ్ లుక్(హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 28 మౌస్ ట్రాప్(కొరియన్ సిరీస్)- ఆగస్టు 28 సీక్రెట్ ఉమెన్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 28 ఫోర్ హ్యాండ్స్- టు సోనాటాస్(హాలీవుడ్ సిరీస్)- ఆగస్టు 29జియో హాట్‌స్టార్.. పార్ట్ టైమర్స్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 28 మైఖేల్ (హిందీ డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 29అమెజాన్ ప్రైమ్బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 28 బెట్టి లా ఫియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28సోనీ లివ్ అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఆగస్టు 28జీ5 బందర్ (హిందీ మూవీ) - ఆగస్టు 28ఆహా ఆకలిరాజ్యం 2026 (తెలుగు సిరీస్) - ఆగస్టు 28ఆపిల్ టీవీ ప్లస్ డార్క్ మేటర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28లయన్స్ గేట్ ప్లే హంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28 -
డేరింగ్ ప్రపోజల్ చేసిన నెట్‌ఫ్లిక్స్ జంటపై క్రిమినల్ కేసులు!
న్యూయార్క్: ప్రముఖ ల్యాండ్‌మార్క్ ఎంపైర్ స్టేట్ భవనాన్ని ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా అక్రమంగా ఎక్కిన కేసులో నెట్‌ఫ్లిక్స్ తారలు ఇవాన్ కుజ్నెత్సోవ్ (32), ఏంజెలీనా నికోలావ్ (33) న్యూయార్క్ నగర కోర్టులో హాజరయ్యారు. న్యూజెర్సీకి చెందిన ఈ జంటపై బర్గరీ (అనధికార ప్రవేశం/చొరబాటు), నిర్లక్ష్యంతో ప్రాణాలకు ముప్పు కలిగించడం, క్రిమినల్ మిస్చీఫ్ తదితర అభియోగాలను నమోదు చేశారు.గత జూలై 1న జరిగిన ఈ ఘటనలో, న్యూయార్క్ నగరానికి దాదాపు 1,500 అడుగుల ఎత్తున నికోలావ్కు కుజ్నెత్సోవ్ వివాహ ప్రతిపాదన చేశారు. అనంతరం ఆమె తన నిశ్చితార్థపు ఉంగరాన్ని ప్రదర్శించారు. ఆ సమయంలో వారిద్దరూ ముసుగులు ధరించి, చేతిలో ప్లకార్డు పట్టుకుని భవనం పైభాగంలో కనిపించారని, అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఎన్‌వైపీడీ బాడీక్యామ్ దృశ్యాల్లో పోలీసులు భవనం పైకి వెళ్లగా, రక్షణ పట్టీలు (హార్నెస్‌లు) లేకుండా ఉన్న ఈ జంట వారికి ఎదురయ్యారు. ఈ సాహసం తర్వాత వారిని పోలీసులు అరెస్టు చేశారు. The daredevil couple who went viral for their engagement stunt on top of the Empire State Building appeared in court on Monday.The pair face multiple charges, including reckless endangerment, burglary and criminal mischief. pic.twitter.com/jD02e4ES5k— ABC News (@ABC) August 24, 2026సోమవారం కోర్టు విచారణ అనంతరం బయటకు వస్తూ ఈ జంట కెమెరాల ఎదుట ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఈ విచారణకు రెండు రోజుల ముందు నికోలావ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. హద్దులను సవాలు చేసే వ్యక్తులే మానవాళి ప్రగతికి దోహదపడతారని తాము నమ్ముతున్నామని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియను గౌరవిస్తామని, తమ నిర్ణయాల పర్యవసానాలను స్వీకరిస్తామని ఆమె తెలిపారు. ఈ కేసు విచారణను న్యాయస్థానం సెప్టెంబరుకు వాయిదా వేసింది.ఇది కూడా చదవండి: షాకింగ్ రిపోర్ట్: పాముకాటు కేసుల్లో టాప్‌లో భారత్! -
రవితేజ ఇరుముడి.. ఏ ఓటీటీకి రానుందంటే?
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తండ్రీ కూతుళ్ల కాన్సెప్ట్ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ జోరు చూస్తుంటే ఇరుముడి వందకోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ న్యూస్ వైరల్‌గా మారింది. థియేటర్లలో అదరగొడుతున్న ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఏదనే విషయంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరుముడి ఓటీటీ పార్ట్నర్ ఎవరనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత బుల్లితెరపై సందడి చేయనుంది. త్వరలోనే స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయంపై ప్రకటన రానుంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
నెల రోజుల పాటు ప్రతిరోజూ 3 పూటలా ఫ్రైడ్ చికెన్ తిని..
బ్రిటిష్ హాస్యనటుడు మో గిల్లిగన్ కొత్త నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘‘బిగ్ చికెన్: ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పిరసీ’’ కోసం 28 రోజుల పాటు రోజుకు మూడు పూటలా ఫ్రైడ్ చికెన్ తిన్నాడు. ఆ తర్వాత ఎదురైన ఆందోళనకర పరిణామాలను మో గిల్లిగన్ వివరించాడు. గిల్లిగన్ 2004లో విడుదలైన సూపర్‌హిట్ డాక్యుమెంటరీ ‘సూపర్ సైజ్ మీ’ నుంచి స్ఫూర్తి పొంది 28 రోజుల పాటు రోజుకు 3 పూటలా ఫాస్ట్‌ఫుడ్ చికెన్ తినేందుకు అంగీకరించాడు. ఆ డాక్యుమెంటరీలో చిత్రనిర్మాత మోర్గాన్ స్పర్లాక్ నెల రోజుల పాటు మెక్‌డొనాల్డ్స్ ఆహారం మాత్రమే తిని, దాని ప్రభావాలను నమోదు చేశాడు.గిల్లిగన్ ఏం చెప్పాడు? “నెట్‌ఫ్లిక్స్ నాకు చికెన్ తినడానికి డబ్బులు ఇస్తోందా? ఇది పిచ్చిగా ఉంది కదా అని అనుకున్నాను. వాళ్లు రూపొందించాలనుకున్న సినిమా వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. మొదటి కొన్ని నిమిషాల్లో ఇదంతా అద్భుతంగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే, ఇది కలల ఉద్యోగంలా అనిపించింది” అని గిల్లిగన్ ‘ఆబ్సెస్డ్: ది పాడ్‌కాస్ట్’ తాజా ఎపిసోడ్లో మ్యాట్ విల్స్టీన్తో చెప్పాడు.దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని తనకు తెలుసని గిల్లిగన్ చెప్పాడు. అయితే తన ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందనే ఆలోచన తన నిద్రను దూరం చేసేంతగా ఆందోళన కలిగించలేదని తెలిపాడు. అయితే, ఈ సవాలు సగానికి చేరుకునే సమయానికి అతడిలో అనేక మార్పులు మొదలయ్యాయి. అవి నిజంగా శారీరకంగా వచ్చిన మార్పులా, లేక తన ఊహ మాత్రమేనా అనేది కూడా అతడికి అర్థం కాలేదు.ఆరోగ్యం క్షీణించింది.. గిల్లిగన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. వారం రోజుల తర్వాత తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పాడు. మరో వారం తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని తెలిపాడు. బరువు పెరిగిందని, నియంత్రణ లేకుండా చెమటలు పట్టడం మొదలైందని, మానసిక స్థితిలో మార్పులు వచ్చాయని చెప్పాడు. అలాగే అతిగా కునుకులు తీసే అలవాటు ఏర్పడిందని, అవి చాలా లోతైన, తీవ్రమైన నిద్రలా అనిపించేవని వివరించాడు.“నేను కాఫీతో పాటు చికెన్ తింటున్న దృశ్యం చూస్తే ఇదంతా నిజమా అనిపించింది. నాకు అల్పాహారంగా ఇలా చికెన్ తినాలని లేదు. కాఫీతో కలిసి అస్సలు తినాలని లేదు. సగం దశ బహుశా అన్నింటికంటే కష్టమైనది. ఆహారం తింటున్నప్పుడు దాని రుచి ఇక బాగుండదని అనుకున్నాను. కానీ అది చాలా రుచిగానే ఉంది” అని గిల్లిగన్ చెప్పాడు.గిల్లిగన్ ఎదుర్కొన్న అనుభవంతో పాటు ఈ డాక్యుమెంటరీ చికెన్ పరిశ్రమను కూడా పరిశీలిస్తుంది. ఫ్రైడ్ చికెన్ చుట్టూ ఉన్న జాతిపరమైన మూసధోరణులు, బ్రిటన్ ఫాస్ట్‌ఫుడ్ రంగానికి సంబంధించిన సమస్యలపై కూడా దృష్టి సారిస్తుంది. “ఫ్రైడ్ చికెన్‌కు సంబంధించిన చాలా అంశాలను ఇందులో చూపించడానికి ప్రయత్నించాం. అలాగే పెద్ద చికెన్ పరిశ్రమను కూడా పరిశీలించాం. అక్కడి నుంచే ఈ చిత్రం మరో దిశలోకి మారుతుంది” అని గిల్లిగన్ చెప్పాడు.“వీలైనన్ని అంశాలను ఇందులో చూపించడానికి మేము నిజంగా ప్రయత్నించాం. ‘అతడి ప్రయాణాన్ని చూస్తాను, అతడికి ఏమి జరుగుతుందో నాకు తెలుస్తుంది’ అనే విధంగా మాత్రమే ఈ చిత్రం ఉండకూడదని భావించాం. ఇంతకుముందు ఎవరో చేసినదాన్ని అనుకరించకుండా, మా చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేందుకు మేము ప్రయత్నించిన విధానం ఇదేనని అనుకుంటున్నాను” అని అతడు చెప్పాడు. -
ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ
అప్పుడప్పుడు ఓటీటీలో నేరుగా కొన్ని సినిమాల్ని రిలీజ్ చేస్తుంటారు. అలా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లోకి 'ప్యార్ ప్రేమ కళ్యాణం' వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కథతో తీశారు. తమిళ కుర్రాడు ఎలన్ హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్గా చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?దుబాయిలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేసే ఎలన్(ఎలన్) ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి తనకు తానుగానే ఉద్యోగం మానేసి ఇంటికొచ్చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ పవిత్ర అలియాస్ పర్పుల్ పవి(శాన్వి మేఘన)తో ప్రేమలో పడతాడు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ పవి సొంతింటిని వదిలేసి రానని పట్టుబడుతుంది. దీంతో ఎలన్.. ఇల్లరికపు అల్లుడిగా అత్తారింట్లో అడుగుపెడతాడు. తర్వాత ఇతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'ప్యార్ ప్రేమ కళ్యాణం'.. టైటిల్‌కి తగ్గట్లే ప్రేమ, పెళ్లి బంధంలోని ప్లస్ మైనస్సుల గురించి ఇందులో చూపించారు. మరి సినిమా ఎలా ఉంది అని అడిగితే ఓకే అంతే. చెబుదామనుకున్న పాయింట్ బాగున్నప్పటికీ విపరీతమైన తమిళ అతి ప్రతి సీన్లోనూ కనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ పాత్ర తప్పితే ప్రతి ఒక్కరూ చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తుంటారు. ఇదంతా కామెడీ అనుకుని దర్శకుడు అనుకున్నాడు. కానీ కుదరలేదు. తమిళ ప్రేక్షకులకు నచ్చొచ్చేమో గానీ నాకైతే పెద్దగా నవ్వు రాలేదు.సంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత అమ్మాయిలు అత్తారింటికి వెళ్తారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం అల్లుడు, అత్తారింటికి(ఇల్లరికం) వస్తాడు. ఈ సినిమాలో అలానే ఉద్యోగం లేని హీరో.. ఇల్లరికపు అల్లుడిలా వెళ్తాడు. ప్రారంభంలో మర్యాదలు ఓ రేంజులో ఉంటాయి. కానీ రానురాను మురిపెం తగ్గిపోయి అత్త అసలు రంగు బయటపడుతుంది. అప్పటినుంచి అల్లుడికి బ్యాండ్ బాజా బరాత్ మొదలవుతుంది. దీంతో కష్టాలు పడతాడు. ఈ పార్ట్ అంతా కూడా ఓకే ఓకే అనేలా ఉంటుంది. టైమ్ పాస్ అయిపోతుంది.చాలామంది గృహిణులు.. భర్త బయటకెళ్లి ఉద్యోగం చేస్తూంటే ఇంటిని చూసుకుంటూ ఉంటారు. ఈ సినిమా ఇదే రివర్స్‌లో జరుగుతుంది. ఓ సందర్భంలో హీరోకి జాబ్ వస్తే ఆ సంగతి హీరోయిన్‌కి చెబుతాడు. ఆమె ఏమో.. నువ్వు బయటకెళ్లి పనిచేయడం ఎందుకు, ఇంట్లో కంఫర్ట్‌బుల్‌గానే ఉన్నావ్‌గా, పైగా జీతం కూడా తక్కువే అని అతడిని నిరుత్సాహపరుస్తుంది. ఈ సీన్ చూస్తున్నప్పుడు ఏళ్లకేళ్లుగా చాలామంది భర్తలు.. ఉద్యోగం చేయాలనుకునే భార్యలకు ఇలానే చెబుతుంటారు కదా అనిపించింది. చాలామంది గృహిణులు ఇలా భర్తలు చెప్పే మాటల వల్ల ఎంతలా నిరుత్సాహపడుతున్నారనేది బాగా చూపించారు.అలానే ఫెమినిస్ట్ అని చెప్పుకొనే హీరోయిన్.. తాను సొంతింటిని, తల్లిదండ్రులని వదిలిరానని చెప్పి భర్తని తన ఇంటికి ఇల్లరికం రప్పించుకుంటుంది. తర్వాత ఈ విషయంలో ఆమె రియలైజ్ అయ్యే సీన్ ఉంటుంది. దీనిని బాగానే తీశారు. ఫస్టాప్‌లో హీరో, అతడి అత్త, భార్య మధ్యలో వచ్చే హంగామా, సెకండాఫ్‌లో హీరో తల్లి చేసే దొంగపనులు వల్ల హీరోయిన్ జాబ్ కోల్పోవడం లాంటివి పర్లేదనిపించాయి. క్లైమాక్స్ అయితే నిజంగా ఎక్కడైనా అలా జరుగుతుందా అని డౌట్ వస్తుంది. అదంతా సినిమాటిక్‌గా అనిపిస్తుంది.యాక్టింగ్ విషయానికొస్తే.. పవిత్రగా శాన్వి మేఘన పాత్రకు తగ్గట్లు చేసింది. హీరో కమ్ దర్శకుడు ఎలన్ కూడా బాగానే చేశాడు. కాకపోతే తన తమిళ ప్రేక్షకులకు నచ్చుతుందనో ఏమో గానీ మొత్తం అతితో నింపేశాడు. రాధిక, యోగిబాబు లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్లని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. వాళ్లకు సరైన సీన్స్ పడలేదు. మిగతా నటీనటులు ఓకే ఓకే. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉన్నప్పటికీ మ్యూజిక్ ఏమంత గొప్పగా లేదు. నిడివి రెండు గంటలే కావడం కాస్త రిలీఫ్. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదో యావరేజ్ సినిమా. అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రతివారం ఓ సౌత్ సినిమా స్ట్రీమింగ్
దక్షిణ భారతీయ సినీ ప్రియులకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పేసింది. సౌత్ ఇండస్ట్రీపై తన పెట్టుబడులని, భాగస్వామ్యాన్ని మరింత పెంచుతూ ఈ ఏడాది మిగిలిన సమయంలో ప్రతివారం ఒక కొత్త తెలుగు లేదా తమిళ లేదా మలయాళ సినిమాని స్ట్రీమింగ్ చేస్తామని చెన్నైలో తాజాగా జరిగిన ఈవెంట్లో సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈరోజు(ఆగస్టు 21) ప్యార్ ప్రేమ కళ్యాణం అనే సినిమా నేరుగా ఈ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. దీంతో పాటు థియేటర్లలో సందడి చేసిన రామ్ చరణ్ పెద్ది(ఆల్రెడీ స్ట్రీమింగ్), ధనుష్, విజయ్ దేవరకొండ, నాని తదితర హీరోల క్రేజీ ప్రాజెక్టులు నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్నాయని వివరించారు.కేవలం సినిమాలకే కాకుండా ఓటీటీ ఒరిజినల్స్ కూడా తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తెలుగులో తొలి ఒరిజినల్ సిరీస్ సూపర్ సుబ్బు, తమిళంలో ద గేమ్‌తో పాటు స్టీఫెన్, తక్షకుడు, లెగసీ తదితర క్రేజీ ప్రాజెక్టులని రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2023 నుంచి తెలుగు, తమిళ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 సినిమాల్లో 50 శాతం కంటే ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని, 2025లో ఏకంగా 59 దేశాల్లో దక్షిణాది సినిమాలు టాప్-10 ట్రెండింగ్‌లో చోటు దక్కించుకుని అంతర్జాతీయంగా తమ సత్తా చాటాయని అన్నారు. -
ఓటీటీకి చెన్నై లవ్ స్టోరీ.. ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈసారి థియేటర్లలో రవితేజ హీరోగా నటించిన ఇరుముడి రిలీజ్ కానుంది. దీనిపై ప్రస్తుతానికి బజ్ అయితే బాగానే ఉంది. తండ్రి కూతురు నేపథ్యానికి అయ్యప్ప స్వామి మాల, 41 రోజుల దీక్ష అనే పాయింట్ జోడించి దీన్ని తెరకెక్కించారు. ఈ మూవీతో పాటు అమీర్ లోగ్, ద రెడ్ బ్యాగ్ అనే చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం పెద్దఎత్తున సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ ఫ్రైడే చెన్నై లవ్ స్టోరీ, జన నాయగన్ మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు రెడీ అయిపోయాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.(ఇది చదవండి: బేబీ జంట మూవీ.. క్రేజీ సాంగ్ రిలీజ్)నెట్‌ఫ్లిక్స్ ప్యార్ ప్రేమ కళ్యాణం (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 21 ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21 ఐ స్వేర్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 22జీ5 జన నాయగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 21 ద గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో (హిందీ మూవీ) - ఆగస్టు 21జియో హాట్‌స్టార్ వెల్కమ్ టూ ద జంగిల్ (హిందీ సినిమా) - ఆగస్టు 21సోనీ లివ్ చెన్నై లవ్ స్టోరీ (తెలుగు సినిమా) - ఆగస్టు 21అమెజాన్ ప్రైమ్ క్లీనప్ కంపెనీ (హిందీ సిరీస్) - ఆగస్టు 21లయన్స్ గేట్ ప్లే స్నేక్స్ 5 (చైనీస్ మూవీ) - ఆగస్టు 21 మాంచెస్టర్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21 స్టిల్ వాటర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21ఆపిల్ టీవీ ప్లస్..అట్లాస్కింగ్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 21హెచ్‌బీవో మ్యాక్స్..మదర్మేరీ(హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 21 -
OTT: ‘ఇదయమ్ మురళి’ మూవీ రివ్యూ
ప్రేమ....ప్రతి ఒక్కరికి దక్కే అపూర్వమైన, అందమైన అనుభవం. మరీ ముఖ్యంగా యువత ఈ ప్రేమ కోసం అల్లాడిపోతుంటారు. మనస్సులో ఒకరి పై ప్రేమ పుడితే చాలదు, దానిని వ్యక్తపరిచే ధైర్యం కూడా ఉండాలి. ఉరికే ఉత్సాహమున్న ఉడుకు రక్తపు వయస్సులో కన్ఫ్యూజన్ లో పెట్టే కళ్ళు ఓ వైపుంటే, క్లారిటీ లేని మనసు మరో వైపు ఈ ప్రేమ వైపే లాగుతూనే ఉంటుంది. మరి ఆ కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ యువతకు ఎలా వస్తుందో తెలియచెప్పేదే ఈ ఇదయమ్ మురళి. దాదాపు 35 ఏళ్ళ క్రితం ఓ సినిమా యూత్ ని తెగ ఆకట్టుకుంది. అదే హృదయం సినిమా. దానిలో కూడా కథానాయకుడు తనకు నచ్చిన అమ్మాయికి తన ప్రేమను వ్యక్తపరిచే కథే ఆ హృదయం సినిమా. ఆ సినిమాకి, అలానే ఆ సినిమా కథానాయకుడికి ఇచ్చిన సరైన ట్రిబ్యూటే ఈ ఇదయమ్ మురళి. నాటి హృదయం సినిమా కథానాయకుడు స్వర్గీయ మురళి కొడుకు అధర్వ ఈ ఇదయమ్ మురళి సినిమాలో కధానాయకుడిగా నటించడం విశేషం. స్కూల్ టైమ్ నుండి ఉద్యోగం చేరేవరకు పుట్టే ప్రేమలు ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ సినిమాలో దర్శకుడు ఆకాశ్ భాస్కరన్ కళ్ళకు కట్టినట్టు చూపించాడు. తాను రాసుకున్న కథకు తానే నిర్మాతగా వ్యవహరించి తానే దర్శకత్వం వహించిన ఈ ఇదయమ్ మురళి సినిమా ప్రేక్షకుల హృదయాల్లో పదిలింగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. అంతలా ఈ సినిమాలో ఏముందో ఓ సారి చూద్దాం.కొంతమంది స్నేహితులు న్యూయార్క్ నగరం నుండి భారతదేశానికి వచ్చే ప్రయాణంలో తమ స్నేహితులలో ఒకరైన ఇదయం పెళ్ళి గురించి ఓ అదే విమానంలో పరిచయమైన ఓ అపరిచుతిడికి చెప్పే కథే ఈ ఇదయమ్ మురళి. తన చిన్నతనంలో తన క్లాస్ టీచర్ ని అనుకోని సంఘటనతో ఇష్టపడతాడు మురళి. ఆ పై కాలేజ్ లో మరో అమ్మాయిని, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో మరొకరిని ఇష్టపడతాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మురళి ఎవ్వరితోను తన ప్రేమను వ్యక్తపరచడు. అయితే మరి మురళి పెళ్ళి ఎవరితో అవుతుంది అన్న విషయాన్ని మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఇదయమ్ మురళి సినిమాలోనే చూడాలి. మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్.- హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సినిమాల హడావుడి ఉంటుంది. ఈ వారంలో పెద్దఎత్తున మూవీస్ రిలీజవుతున్నాయి. వాటిలో సూర్య హీరోగా వస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా రిలీజ్ కానుంది. దీంతో పాటు అగధ, పళ్లబురుసు, అనకాపల్లి, మకుటం అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదల కానుంది. వీటిలో ఎక్కువగా విశ్వనాథ్ అండ్ సన్స్పైనే బజ్ క్రియేట్ అయింది.ఇక ఒటీటీల విషయానికొస్తే పలు చిత్రాలు ఈ ఫ్రైడే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. వీటిలో కాక్టెయిల్-2, భారత్ భాగ్య విధాత లాంటి బాలీవుడ్ సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. అంతేకాకుండా పలు డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ శుక్రవారం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ కాక్ టెయిల్ 2 (హిందీ సినిమా) - ఆగస్టు 14 మోరియా (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 14 ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్) - ఆగస్టు 14 మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్‌ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ మూవీ) - ఆగస్టు 14 డోంట్ సే గుడ్ లక్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 14 టు ద మ్యాక్స్(స్పానిష్ మూవీ)- ఆగస్టు 14అమెజాన్ ప్రైమ్..హార్టిన్(తమిళ సినిమా)- ఆగస్టు 14ఆరూపి(మలయాళ మూవీ)- ఆగస్టు 14జియో హాట్‌స్టార్.. 108 బేస్ హాస్పిటల్: ఉరి (హిందీ సిరీస్) - ఆగస్టు 15జీ5 భారత భాగ్య విధాత (హిందీ మూవీ) - ఆగస్టు 14 నిబ్బానిబ్బీ (మరాఠీ సినిమా) - ఆగస్టు 14సన్ నెక్స్ట్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు సినిమా) - ఆగస్టు 14లయన్స్ గేట్ ప్లే ఆఖరి సవాల్ (హిందీ సినిమా) - ఆగస్టు 14 పవర్ బుక్ -3 రైజింగ్ కనన్-సీజన్ 5(హాలీవుడ్ సిరీస్)- ఆగస్టు 14 -
ఓటీటీకి రష్మిక మందన్నా లేటేస్ట్ మూవీ.. అఫీషియల్ ప్రకటన
రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన లేటేస్ట్ బాలీవుడ్ మూవీ కాక్టెయిల్-2. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కృతి సనన్ మరో హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది.అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై అఫీషియల్‌గా ప్రకటన వచ్చేసింది. ఈ మూవీని ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. గతంలో దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన 'కాక్టెయిల్' (2012) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 📢 Official Announcement ▶️#CockTail2 (Hindi) Streaming from August 14 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/jpeSMvWDvR— OTT Trackers (@OTT_Trackers) August 12, 2026 -
ఓటీటీలో రికార్డ్.. ఆ జాబితాలో మొదటి చిత్రంగా దురంధర్
ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాల్లో దురంధర్ ముందు వరుసలో ఉంటుంది. దంగల్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల సరసన చేరింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్వీర్ సింగ్ హీరోగా మెప్పించారు. సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది.తాజాగా ఈ మూవీ మరో రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న దురంధర్ అరుదైన రికార్డ్ సాధించింది. ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. కాగా.. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ధురందర్ పార్ట్-1 డిసెంబర్ 2025లో థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ రిలీజైంది. -
శాన్వీ మేఘన లేటేస్ట్ మూవీ.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్
టాలీవుడ్ నటి శాన్వీ మేఘన, ఎలన్ జంటగా వస్తోన్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ క్రేజీ లవ్. ఈ చిత్రానికి ఎలన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రేమ, పెళ్లి కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు పోస్టర్స్ చూస్తే తెలిసిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి ఓటీటీకి రానుందని తేదీని రివీల్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్యార్ప్రేమకల్యాణ్ అనే సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, సెంథిల్, కుమారవేల్, మారన్, గీతా కైలాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. #CrazyLove song from #PyaarPremaKalyanam is streaming now! 🎶🔗 https://t.co/gZqMcWraOpStreaming on Netflix from Aug 21 pic.twitter.com/37VAgu5Nlj— Sathish Kumar M (@sathishmsk) August 6, 2026 -
ఫ్రైడే ఓటీటీల్లో సందడి.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ ఫ్రైడే వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో పాటు కేజేక్యూ, అనకాపల్లి, అమ్మ నాకు అబ్బాయి కావాలి అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే లోకేశ్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న 'డిసి', మాధవన్ 'జీడీ నాయుడు' లాంటి డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. అంతేకాకుండా మహేశ్ బాబు దూకుడు చిత్రం(ఆగస్టు 09) రీ రిలీజ్ కానుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే అక్కినేని హీరో అఖిల్ మూవీ లెనిన్ సందడి చేయనుంది. జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు విజయ్ ఆంటోనీ వంద దేవుళ్లు, మలయాళ చిత్రం హృదయం మురళి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అంతేకాకుండా పలు హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ శుక్రవారమే ఓటీటీకి రానున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07 ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07 ద లాస్ట్ హౌస్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07 మై వాపస్ ఆవుంగా (హిందీ సినిమా) - ఆగస్టు 07 రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07 అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 07 డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07బిగ్చికెన్.. ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పరసీ(హాలీవుడ్)- ఆగస్టు 07 లవ్ హర్ట్స్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 07 ద రిబ్బన్ హీరో (జపనీస్ ఏనిమే మూవీ) - ఆగస్టు 08జీ5 లెనిన్ (తెలుగు మూవీ) - ఆగస్టు 07 వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07 తుంబడ్ చీ మంజులా (మరాఠీ మూవీ) - ఆగస్టు 07అమెజాన్ ప్రైమ్ ఓ సుకుమారి(తెలుగు సినిమా)- ఆగస్టు 07 వదంది 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07జియో హాట్‌స్టార్ ద సూపర్ మారియో గెలక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 07మనోరమ మ్యాక్స్ పొంగళ (మలయాళ మూవీ) - ఆగస్టు 07సన్ నెక్ట్స్..సత్యతిల్ సంబవిచతు(మలయాళ మూవీ)- ఆగస్టు 07 -
ఓటీటీలోకి రష్మిక కొత్త సినిమా...స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కాక్టెయిల్ 2’.హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 19న థియేటర్స్‌లో విడుదలై..మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఆగస్ట్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.కాక్ టెయిల్ 2 కథేంటంటే..కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. ఓ సారి కునాల్, దియా ఫారిన్లో వెకేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ దియా బెస్ట్‌ఫ్రెండ్ యాలీతో కునాల్‌కి పరిచయం ఏర్పడుతుంది. అయితే కునాల్‌పై యాలీ క్రష్ పెంచుకోవడమే కాకుండా ఓ సమయంలో అతడితో శారీరకంగా కలుస్తారు. ఈ విషయం దియాకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? కునాల్, దియా మధ్యకు యాలీ ఎలా వచ్చింది? దియాతో డేటింగ్ చేస్తున్నప్పటికీ.. యాలీ ఎలా దగ్గరైంది? చివరకు కునాల్ ఎవరినీ పెళ్లి చేసుకొన్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న హిట్ మూవీ.. నంబర్‌వన్‌గా ట్రెండింగ్
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ చిత్రం గట్ట కుస్తీ-2. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను మెప్పించింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, యోగి బాబు, కరుణాస్ కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ జూలై 31 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన రెండు రోజుల్లోనే నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఇండియావ్యాప్తంగా ట్రెండింగ్ సినిమాల లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది. కాగా.. గతంలో వచ్చిన మట్టి కుస్తీకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కేవలం తమిళంలోనే విడుదల చేశారు. అయితే ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. -
థియేటర్లలో శ్రీనివాస మంగాపురం.. ఓటీటీల్లో ఒక్క రోజే 14 సిినిమాలు
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ రోజే శ్రీనివాస మంగాపురం, స్పైడర్ మ్యాన్ సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఈ వారాంతంలో ఈ రెండు చిత్రాలతో పాటు కర్మాఖ్య, రోమియో జూలియట్ అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, సిగ్మా, 418 లాంటి డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. తెలుగులో సత్యదేవ్ హీరోగా వచ్చిన రావు బహదూర్, దీవానా, పోలీస్ కంప్లైంట్ లాంటి చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్కు రాబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్..రావు బహదూర్(తెలుగు మూవీ)- జూలై 31గట్ట కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31ఆవోసి(జపనీస్ సిరీస్)- ఆగస్ట్ 01చికాగో పీడీ(హాలీవుడ్ సిరీస్)- ఆగస్ట్ 01మైఖేల్ పెంబురు దువా ఆలమ్- ఆగస్ట్ 02 అమెజాన్ ప్రైమ్పోలీస్ కంప్లైంట్(తెలుగు సినిమా)- జూలై 31లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 31బ్యాట్మన్: కేప్ట్ క్రూసేడర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31జియో హాట్‌స్టార్ భోజ్‌పురి బవాల్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఆగస్టు 02ఆహా దీవానా (తెలుగు సినిమా) - జూలై 31జీ5 బాలన్ ద బాయ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31 అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు సిరీస్) - జూలై 31 హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ సినిమా) - జూలై 31 వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 31 (రూమర్ డేట్)సోనీ లివ్ద లెజెండ్ ఆఫ్ కర్ణ (హిందీ సిరీస్) - జూలై 31సన్ నెక్ట్స్..పైతాలట్టం(మలయాళ సినిమా)- జూలై 31లయన్స్ గేట్ ప్లే..చుమ్(హాలీవుడ్ మూవీ)- జూలై 31హెచ్‌బీవో మ్యాక్స్..ది డ్రామా(హాలీవుడ్ మూవీ)- జూలై 31 -
ఓటీటీకి లేటేస్ట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ చిత్రం గట్ట కుస్తీ-2. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను మెప్పించింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, యోగి బాబు, కరుణాస్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ నెల 31 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గతంలో వచ్చిన మట్టి కుస్తీకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కేవలం తమిళంలోనే విడుదల చేశారు. అయితే ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Biggest Blockbuster of the season 🔥 #GattaKusthi2 (Tamil)Streaming from July 31 on Netflix in Tamil, Telugu, Kannada, Malayalam Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/EIPUelKlU8— OTT Trackers (@OTT_Trackers) July 28, 2026 -
అఫిషియల్ : నెల లోపే ఓటీటీలోకి ‘రావు బహదూర్’
సత్యదేవ్ కలల ప్రాజెక్టు, ఎంతో కష్టపడి నటించిన చిత్రం ‘రావు బహదూర్’. వెంకట్ మాహా దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. సత్యదేవ్ నటనపై ప్రతిఒక్కరు ప్రశంసలు కురిపించారు కానీ.. కథ, కథనంపై మాత్రం పెదవి విరిచారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో ఈచిత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. థియేటర్స్‌లో రిలీజై నెల కూడా పూర్తికాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ బాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.కథేంటంటే...1991 నేపథ్యంలో ఈ కథనం సాగుతుది. భువన వంశానికి చెందిన రామప్పరావు బహదూర్ అలియాస్ రాముడు(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ బారిన పడతాడు. నాలుగు నెలలకు మించి బతకడని ఓ డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు గానీ ఏడాది దాటిపోయినా సరే రామప్ప అలానే ఉంటాడు. పైపెచ్చు రోజూ తాగుతూ బతికేస్తుంటాడు. నిద్రలో నుంచి లేచి అప్పుడప్పుడు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఇలా జరగడానికి కారణం ఎప్పుడో చనిపోయిన రామప్ప చిన్న కొడుకు కుసుమప్ప. వీడు తనకు పుట్టలేదని రామప్ప 'అనుమానం'. ఇదే విషయాన్ని చెబుతూ తన స్నేహితుడు, డాక్టర్ ఆచారి(వికాస్ ముప్పల) బుర్ర తినేస్తూ ఉంటాడు. మరి రావు బహదూర్ అనుమానం నిజమేనా? కుసుమప్ప ఎందుకు ఎలా చనిపోయాడు? ఈ కథలో రామప్ప భార్య రేణుక (దీపా థామస్) సంగతేంటి? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.Samajika nibandhanalatho mee burrani kadagadaniki Rao Bahadur osthunnadu! 😎👑 pic.twitter.com/A97zYKYU8i— Netflix India South (@Netflix_INSouth) July 28, 2026 -
ఓటీటీల్లో ఫ్రైడే సందడి.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. ఈ రోజు నుంచే థియేటర్లలో విజయ్ జన నాయగన్ సందడి చేస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత రిలీజైంది. అంతేకాకుండా ఈ వారంలో టాలీవుడ్ నుంచి కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్ కానుంది. దీంతో పాటు కాజల్ 'ద ఇండియా స్టోరీ' సహా హే చికితా, చంద్రప్పన్, కాగితం పడవలు లాంటి చిన్న చిత్రాలు బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.ఇక ఈ ఫ్రైడే ఓటీటీల రిలీజ్ విషయానికొస్తే పల్లిచట్టంబి, కాన్ సిటీ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి సిరీస్‌లు సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) - జూలై 24 72 అవర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24 లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) - జూలై 24 ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24 కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 24జియో హాట్‌స్టార్ స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24 ది డెవిల్ వియర్స్ ప్రద-2(హాలీవుడ్ సినిమా)- జూలై 24 స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్(హాలీవుడ్ సిరీస్)- జూలై 24 బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25అమెజాన్ ప్రైమ్ ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 24 ఈగో రామన్(తమిళ మూవీ)- జూలై 24జీ5 అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) - జూలై 24 ప్రేమ్ షాట్స్ (బెంగాలీ సిరీస్) - జూలై 24సోనీ లివ్ పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24లయన్స్ గేట్ ప్లే ప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 24ఆపిల్ ప్లస్ టీవీ ద డింక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24సన్ నెక్స్ట్ సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) - జూలై 24మనోరమ మ్యాక్స్ట్రిపుల్ డెక్కర్(మలయాళ సినిమా)- జూలై 24 -
ఆపరేషన్ సఫేద్ సాగర్.. ఆమె మాటలకు సిద్ధార్థ్ ఎమోషనల్
కార్గిల్ యుద్ధ నేపథ్యంలోనే వస్తోన్న సరికొత్త వెబ్ సిరీస్ ఆపరేషన్ సఫేద్ సాగర్. 1999లో జరిగిన కార్గిల్ వార్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్‌కు ఓని సేన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశారు. యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న సిరీస్ కావడంతో వైమానికి విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక ముంబయిలో నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ ఎమోషనలయ్యారు. దివంగత స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా భార్య అల్కా అహుజా ట్రైలర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్కా అహుజాను వేదికపైకి ఆహ్వానించారు. అదే సమయంలో ప్రేక్షకులంతా ఆమెకు గౌరవసూచకంగా లేచి నిలబడ్డారు. తన భర్త కథను తెరపైకి తీసుకువచ్చినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాటలు స్పష్టంగా సిద్ధార్థ్‌ను కదిలించాయి.. దీంతో ఆయన వేదికపై కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.ఈ సిరీస్‌పై నమ్మకం ఉంచినందుకు సిద్ధార్థ్ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. నిజ జీవిత యుద్ధ వీరుడి పాత్రను పోషించడానికి తాను మొదట్లో సంకోచించానని సిద్ధార్థ్ తెలిపారు. ప్రస్తుతం మన మధ్య లేని వారి పాత్రను.. ముఖ్యంగా ఒక అమరవీరుడి పాత్రను పోషించినప్పుడు మనపై చాలా పెద్ద బాధ్యత ఉంటుందని అన్నారు. హీరోలు ఎప్పుడూ హీరోల్లా కనిపించరు. వారు తమ చర్యల వల్లే హీరోలవుతారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ అంగీకరించే ముందు తాను ఈ సిరీస్ నిర్మాతలతో చాలాసార్లు చర్చించానని వెల్లడించారు. ఆయన భార్య అల్కా అహుజా అనుమతించారా?' అదే నాకు అత్యంత ముఖ్యమని మేకర్స్‌తో చెప్పానని గుర్తు చేసుకున్నారు. కాగా.. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రస్తుత, పదవీ విరమణ పొందిన భారత వైమానిక దళ అధికారులు కూడా హాజరయ్యారు.అజయ్ అహుజా ఎవరంటే..స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన ఒక భారత వైమానిక దళ అధికారి. కూలిపోయిన విమానంలో తోటి పైలట్‌ను గుర్తించే మిషన్‌లో ఉండగా ఆయన విమానం కూల్చివేశారు. అహుజాకు ఆయన ధైర్యసాహసాలకు, సేవకు గాను మరణానంతరం వీరచక్ర పురస్కారం లభించింది. ఆయనను ఆపరేషన్ సఫేద్ సాగర్‌లోని కీలక వ్యక్తులలో ఒకరిగా గుర్తుంచుకుంటారు. ఈ సిరీస్ కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం పోషించిన పాత్ర ఆధారంగా రూపొందించారు. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో అభయ్ వర్మ, దియా మీర్జా, ప్రాజక్త కోలి, ఆదిల్ హుస్సేన్, మిహిర్ అహుజా, తారుక్ రైనా కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఓటీటీకి ఆపరేషన్ సఫేద్ సాగర్.. ట్రైలర్ అదుర్స్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. తాజాగా మరో ఆసక్తికర కథనంతో వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆపరేషన్ సఫేద్ సాగర్ సిరీస్ తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు.కార్గిల్ యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న ఆపరేషన్ సఫేద్ సాగర్ ట్రైలర్లో యుద్ధ సన్నివేశాలు, వైమానిక దాడులు ఆకట్టుకునేలా ఉన్నాయి. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ పేరే సఫేద్ సాగర్. పాకిస్తాన్‌పై వైమానిక దాడులతో మంచు కొండలపై భారత్ విరుచుకుపడినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 1999 మే 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో ది గోల్డెన్ యారోస్ కీలక పాత్ర పోషించింది.కాగా.. ఈ సిరీస్‌లో సిద్దార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా కనిపించనున్నారు. -
ఓటీటీకి లేటేస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అర్జున్‌దాస్, అన్నాబెన్ జంటగా నటించిన చిత్రం కాన్ సిటీ. కమెడియన్ యోగిబాబు, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించారు. హరీష్ దురైరాజ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. ఈ ఏడాది జూన్ 26న తెలుగు, తమిళంలో రిలీజైంది. మనీ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు.. దాదాపు అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే "కాన్ సిటీ". ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
ఓటీటీకి మా ఇంటి బంగారం.. ఒక్క రోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఐశ్వర్య రాజేశ్ 'ఓ సుకుమారి', మాధవన్ 'జీడీఎన్', వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి, మహేంద్రగిరి వారాహి లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ' థియేటర్లలో సందడి చేయనుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ వారంలో సమంత మా ఇంటి బంగారం స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా వడ్డే నవీన్ మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఓటీటీలోకి రానుంది. వీటితో పాటు కన్నడ మూవీ ది డెవిల్ ఆసక్తిని పెంచుతోంది. దీంతో పాటు ఈ శుక్రవారం పలు హిందీ, బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ సిరీస్) - జూలై 17 ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ సిరీస్) - జూలై 17 డిజైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17 23000 లైవ్స్ (జర్మన్ మూవీ) - జూలై 17 హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17 25 ఇయర్క్ ఆఫ్ యూ(జపనీస్ సినిమా)- జూలై 17 స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ సిరీస్) - జూలై 18అమెజాన్ ప్రైమ్..ది బే (హాలీవుడ్ మూవీ)- జూలై 17ఆహాఓవెల్స్(తమిళ సినిమా)- జూలై 17జియో హాట్‌స్టార్.. మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) - జూలై 17 టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) - జూలై 18జీ5 ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు (తెలుగు సినిమా) - జూలై 17 ది డెవిల్(కన్నడ సినిమా)- జూలై 17శివలోక్ కె కుండక్క మండక్క(యానిమేషన్ సిరీస్)- జూలై 17లయన్స్ గేట్ ప్లే..డెజర్ట్ వారియర్(హాలీవుడ్ మూవీ)- జూలై 17టెక్సాస్ చైన్ సా(హాలీవుడ్ మూవీ)- జూలై 17 -
రామ్ చరణ్ పెద్ది.. ఓటీటీలోనూ ట్రెండింగ్..!
మెగా హీరో రామ్ చరణ్ నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దక్షిణాది భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రంలో ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. స్ట్రీమింగ్కు వచ్చిన కొద్ది రోజుల్లోనే భారీ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో వచ్చేసింది. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో 3వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు వస్తూనే ఉంటాయి. రీసెంట్ టైంలో అలా ప్రీతమ్ అండ్ పెడ్రో, సూపర్ సుబ్బు తదితర సిరీస్‌లు సినీ ప్రేమికుల్ని ఆకట్టుకున్నాయి. వీటిలానే ఎంటర్టైన్ చేసేందుకు ఓ రొమాంటిక్ డ్రామా సిరీస్ రెడీ అయింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పేశారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)విక్రాంత్ మస్సే, వేదిక పింటో, మహిమా మక్వానా ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'ముసాఫిర్ కేఫ్'. దివ్య ప్రకాశ్ దూబే అనే రచయిత్రి రాసిన 'ముసాఫిర్ కేఫ్' నవల ఆధారంగా ఈ రొమాంటిక్ డ్రామాని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 24 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రావొచ్చు.'ముసాఫిర్ కేఫ్' ట్రైలర్ బట్టి చూస్తే.. చందర్(విక్రాంత్ మస్తే) కుర్రతనంలో ఉన్నప్పుడు సుధ(వేదిక పింటో)ని ప్రేమిస్తాడు. రిలేషన్లోకి వెళ్తాడు. కానీ కొన్ని కారణాలతో వాళ్లు విడిపోతారు. కొన్నేళ్లు గడిచిపోయిన తర్వాత చందర్.. ప్రీతి(మహిమా మక్వానా)తో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైంది? ప్రీతికి సుధ గురించి తెలిసినప్పుడు చందర్ ఎలా రియాక్ట్ అయ్యాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ప్రభాస్ ఫౌజీ.. భారీ ధరకు ఓటీటీ డీల్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ ఫౌజీ. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ టాక్ వైరల్‌గా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం బిగ్ డీల్ కుదిరినట్లు టాక్ వినిపిస్తోంది.భారీ ధరకు డిజిటల్ రైట్స్..ఈ మూవీని ఓటీటీ డీల్ భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం ఏకంగా రూ.180 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. సౌతిండియా స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఈ మొత్తాన్ని చెల్లించనుందని సమాచారం. అంతేకాకుండా హిందీ హక్కులను ఏఏ ఫిల్మ్స్ రూ. 60 కోట్లకు థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకుంది.అయితే హిందీకి సంబంధించిన ఓటీటీ డీల్ ఇంకా కుదరలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం సౌత్ ఇండియా భాషలకే డీల్ ఓకే చేశారని టాక్. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. -
ఓటీటీల్లో వీకెండ్ ఎంటర్టైన్మెంట్.. ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో అఖిల్ అక్కినేని సందడి చేయనున్నారు. ఆయన హీరోగా వస్తోన్న లెనిన్ మూవీ జూలై 10న బాక్సాఫీస్ బరిలో నిలవనుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ యాక్షన్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లెనిన్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నటించిన తమిళ మూవీ హృదయం మురళి థియేటర్లలో అలరించనుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే కొత్త సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. ఇప్పటికే పెద్ది నెట్‌ఫ్లిక్స్‌లో అలరిస్తుండగా.. పతి పత్ని ఔర్ వో దో , ఇక్కా లాంటి బాలీవుడ్ మూవీస్ సందడి చేయనున్నాయి. వీటితో పాటు డోస్ లాంచి మలయాళ థ్రిల్లర్ సినిమా ఓటీటీకి రానుంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్పెద్ది(తెలుగు సినిమా)- జూలై 09సింగ్ గీతం(తెలుగు సినిమా)- జూలై 09లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైయరీ(హాలీవుడ్)- జూలై 09 గుర్తుకొస్తున్నాయి(తెలుగు వెబ్ సిరీస్)- జూలై 10 పతి పత్ని ఔర్ వో దో (హిందీ మూవీ) - జూలై 10 ఇక్కా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 10 షిప్ రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 10 ద అపార్ట్మెంట్ జాబ్ (కొరియన్ సిరీస్) - జూలై 11 సుసాన అండ్ ఎల్విరా: నో ప్లాన్ బి (కొలంబియన్ మూవీ) - జూలై 12జియో హాట్‌స్టార్ ద ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 10 ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్(మలయాళ సినిమా)- జూలై 10సోనీ లివ్ బల్టీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 10అమెజాన్ ప్రైమ్ డోస్(మలయాళ సినిమా)- జూలై 10 ద వెస్టీస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 12జీ5 ఫ్రేమ్ (మరాఠీ సినిమా) - జూలై 10 పరిమిళ అండ్ కో (తమిళ మూవీ) - జూలై 10లయన్స్ గేట్ ప్లే ద సెంటినల్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 10 -
ఓటీటీలో పెద్ది.. ఆ విషయంలో నో క్లారిటీ..!
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 9 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ప్రేక్షకులు పెద్ది ఓటీటీ వర్షన్‌పై క్లారీటీ కోరుకుంటున్నారు. ఈ మూవీలోని జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రపై విమర్శలు రావడంతో కొన్ని సీన్స్ తొలగించారు. ఆ తర్వాత మరిన్ని యాడ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేశారు.ఇదే విషయంపై ఓటీటీ ప్రియులు క్లారిటీ కోరుతున్నారు. ఓటీటీలో జాన్వీ కపూర్ పాత సీన్స్‌తోనే పెద్దిని స్ట్రీమింగ్ చేస్తారా అనే సందేహం ఆడియన్స్‌లో నెలకొంది. లేదంటే కొత్త సీన్స్ యాడ్ చేసిన పెద్దిని స్ట్రీమింగ్కు తీసుకొస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మేకర్స్ కూడా ఎలాంటి అనౌన్స్ చేయలేదు. ఈ విషయంలో సినీ ప్రియులకు పెద్ది ఓటీటీ వర్షన్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.కాగా.. గతంలో రామ్ చరణ్ నటించిన గత సినిమా గేమ్ ఛేంజర్ కూడా ఇలాంటి పరిస్థితే చూసింది. థియేటర్స్ లో మొదట వచ్చినా వర్షన్ తర్వాత కొన్ని సీన్స్ తీసేసి నానా హైరానా సాంగ్ పెట్టి తగ్గించేశారు. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చాక ఆ సీన్స్ ఏవీ కూడా అందులో లేవు. అలాగే పెద్ది సినిమాకి కూడా ఇలానే జరుగుతుందా? అని ప్రేక్షకులు భావిస్తున్నారు. -
ఓటీటీకి రూ.6 వేల కోట్ల మూవీ.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ ప్రైడే తెలుగులో నాగబంధం, రావు బహదూర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ చిత్రాలపై ఆడియన్స్‌లో బజ్ నెలకొంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైపోయాయి. ఈ శుక్రవారం హ్యాంగ్ మ్యాన్ తెలుగు మూవీతో పాటు మాలీవుడ్ టైమ్స్, కరక్కం లాంటి మలయాళ సినిమాలు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. వీటితో పాటు బాక్సాఫీస్ వద్ద రూ.6 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ప్రాజెక్ట్ హెయిల్ మెరీ అనే హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్‌లు, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు జూలై 3న ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్డెమోన్స్ ఆఫ్ ది షాడో రియల్(జపనీస్ మూవీ)- జూలై 04స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్ సిరీస్) - జూలై 05అమెజాన్ ప్రైమ్ప్రాజెక్ట్ హెయిల్ మెరీ(హాలీవుడ్ మూవీ)- జూలై 03మ్యాన్ ఆఫ్ వార్(హాలీవుడ్ మూవీ)- జూలై 03ప్రొటెక్టర్(హాలీవుడ్ మూవీ)- జూలై 03జియో హాట్‌స్టార్ మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03 ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 03జీ5 మర్మదేశం (తెలుగు సిరీస్) - జూలై 03 ముతస్సీ (మలయాళ సిరీస్) - జూలై 03 వీరభద్రుని రహస్యం(వీక్లీ సిరీస్)- జూలై 03సన్ నెక్స్ట్ హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) - జూలై 03ఆహా టాప్ తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) - జూలై 03ఆపిల్ టీవీ ప్లస్ సిలో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 03సోనిలివ్కరక్కం(మలయాళ సినిమా)- జూలై 03 హెచ్‌బీవో మ్యాక్స్లీ క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్)- జూలై 03లయన్స్ గేట్ ప్లే..హాఫ్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- జూలై 03 -
నెట్‌ఫ్లిక్స్‌నే మోసం చేసిన డైరెక్టర్.. చివరికీ ఏమైందంటే?
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ కార్ల్ ఎరిక్ రించ్కు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఓ సిరీస్ తీసేందుకు నెట్‌ఫ్లిక్స్ నిధులను తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో దోషిగా తేలడంతో న్యాయస్థానం రెండున్నరేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అతను దాదాపు 11 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.డైరెక్టర్ కార్ల్ ఎరిక్ రిన్స్చ్ ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్ తీస్తానని నెట్‌ఫ్లిక్స్ నుంచి డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ నిధులను తన వ్యక్తిగత అవసరాల కోసం కార్లు, క్రిప్టోకరెన్సీ, ఇతర విలాస వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించుకున్నాడు. దీంతో అతనిపై నెట్‌ఫ్లిక్స్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో దర్శకుడు దోషిగా తేలడంతో న్యాయస్థానం జైలు శిక్షతో పాటు 700 డాలర్ల జరిమానా విధించారు. కాగా.. డైరెక్టర్ కార్ల్ ఎరిక్ రిన్స్చ్ 2013లో వచ్చిన '47 రోనిన్' చిత్రంతో బాగా ఫేమస్ అయ్యారు. -
ఓటీటీలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలో మరో థ్రిల్లర్ మూవీ సందడి చేయనుంది. సన్నీ డియోల్, అక్షయే ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఇక్కా వచ్చేనెలలో ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ చిత్రాన్ని కోర్ట్ రూమ్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. జూలై 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఓ మర్డర్ కేసు చుట్టే కథ ఉండనుందని అర్థమవుతోంది. ఈ కేసును వాదించే డిఫెన్స్ లాయర్‌గా సన్నీ డియోల్ కనిపించనున్నారు. ఈ ట్రైలర్లో కోర్ట్ రూమ్ సీన్స్ ఆసక్తిగా పెంచేస్తున్నాయి. మరి ఈ కేసులో సన్నీ డియోల్ గెలిచారా? అక్షయే ఖన్నా తప్పించుకున్నారా? లేదా అన్నది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.కాగా.. దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు సన్నీ డియోల్, అక్షయే ఖన్నా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
సైలెంట్‌గా ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ రాజా శివాజీ. ఈ చిత్రంలో రితేశ్ దేశ్‌ముఖ్ హీరోగా నటించడమే కాదు.. ఆయనే దర్శకత్వం వహించారు. ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరాఠీలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీ మరాఠీ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా మరాఠీతో పాటు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కించారు. స్వరాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ సాగించిన పోరాటాన్ని ఇందులో చూపించారు. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రంలో జెనీలియా, విద్యా బాలన్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. Vidroh karne aa rahein hai Raje ⚔️ pic.twitter.com/1tnxMXNzGU— Netflix India (@NetflixIndia) June 26, 2026 -
శుక్రవారం ఓటీటీల్లో సందడి.. ఒక్క రోజే 16 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ వారంలో కొత్త సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం థియేటర్లో పెద్దితో పాటు మా ఇంటి బంగారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రెండు మాత్రమే బాక్సాఫీస్ వద్ద అభిమానుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ శుక్రవారం కేవలం రీ రిలీజ్‌ల సందడి నెలకొంది.ఈ ఫ్రైడే కొత్త సినిమాల హడావుడి థియేటర్ల వద్ద లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ శుక్రవారం బాహుబలి ద టార్చ్ బేరర్ డాక్యుమెంటరీతో పాటు లింగం లాంటి డబ్బింగ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే అవతార్-3, బ్లాస్ట్ లాంటి సినిమాలు ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు సడన్‌గా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ క్రిస్మ్ & మార్టినా (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26 లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26 బాహుబలి ద టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ) - జూన్ 26 నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో(హాలీవుడ్ సిరీస్)- జూన్ 26 ఎజెంట్ కిమ్ రియాక్టివేటేడ్(కొరియన్ సిరీస్)- జూన్ 26 లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూన్ 27జియో హాట్‌స్టార్ లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 26 ది బేర్ సీజన్-5(హాలీవుడ్ సిరీస్)- జూన్ 26అమెజాన్ ప్రైమ్ అలియన్స్ (హిందీ సిరీస్) - జూన్ 26జీ5 ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ సిరీస్) - జూన్ 26 మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్) - జూన్ 26 ముతస్సీ (మలయాళ సిరీస్) - జూన్ 26సోనీ లివ్ ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్) - జూన్ 26లయన్స్ గేట్ ప్లే బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26 ద యెతి (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26 దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26హెచ్‌బీవో మ్యాక్స్..అండర్‌టోన్(ఇంగ్లీష్ సినిమా)- జూన్ 26 -
'మగ పిల్లాడి కోసం చిట్కా చెప్పండి సార్'.. సూపర్ సుబ్బు ట్రైలర్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఆపీసర్గా ఓ పల్లెటూరికి వెళ్లిన సందీప్ కిషన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కోణంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అక్షర జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలకు లైంగిక విద్యపై ఎలా అవగాహన కల్పించాడనే కథగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సిరీస్ ట్రైలర్లో కామెడీ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.ఈ టాలీవుడ్ క్రేజీ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్‌లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రలు పోషించారు. -
రామ్ చరణ్ పెద్ది.. ఓటీటీ డేట్ వైరల్..!
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీ దాదాపు రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించగా.. కోలీవుడ్ భామ శృతి హాసన్ ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన టాక్ వినిపిస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. జూలై 2 నుంచి స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో జగపతి బాబు, బొమన్ ఇరానీ, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా తన సేవలందించారు. -
ఓటీటీకి దురంధర్-2.. ఆడియన్స్‌కు బిగ్ సర్ప్రైజ్
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మొదట జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కొచ్చిన ఈ సినిమా.. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులోకి వచ్చేసింది.అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ప్రియులకు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటి వరకు మ్యూటెడ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అన్మ్యూటెడ్ వర్షన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంది. నేటి నుంచి ఇండియన్స్ ఆడియన్స్‌కు కూడా అన్ మ్యూటెడ్ వర్షన్ చూసే అవకాశం దక్కింది. ప్రస్తుతం దురంధర్-2 హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. -
మరో ఓటీటీకి దురంధర్-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2. గతేడాది డిసెంబర్లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే వచ్చిన ఈ సినిమా సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ.1790 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జూన్ 5న స్ట్రీమింగ్కు వచ్చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికిపైగా వీక్షించారని ఓటీటీ సంస్థ ప్రకటించింది.అయితే తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలోనూ సందడి చేయనుంది. ప్రస్తుతం ఓవర్సీస్ ఆడియన్స్‌కు మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. మే 14వ తేదీ నుంచే ఓవర్సీస్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఇండియాలోని ప్రేక్షకులకు సైతం నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ నెల 19 నుంచి ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వీడియోను రిలీజ్ చేసింది. అంటే ఈ శుక్రవారం నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా దురంధర్-2 సందడి చేయనుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ కీలక పాత్రలు పోషించారు. 19 June, on Netflix in Hindi, Tamil, Telugu, Kannada and Malayalam.— Netflix India (@NetflixIndia) June 17, 2026 -
ఓటీటీకి రీసెంట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన ఆయన.. ఇటీవలే తమిళంలో నటించిన బ్లాస్ట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. పెద్దగా బజ్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద అదగొడుతోంది. కేవలం మౌత్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంతో సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.ఈ మూవీ థియేటర్లలో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వైరలవుతోంది. ఈనెల 25 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుందని పోస్టర్స్ సందడి చేస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఓటీటీ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించారు.బ్లాస్ట్ కథేంటంటే..'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్), ఆమె తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) ఈ ముగ్గురూ కరాటే మాస్టర్లే. వీళ్లకు కరాటే ట్రైనింగ్ సెంటర్‌తో పాటు ఓ మెడికల్ షాప్ ఉంటుంది. నీల ఓ రోజు షాప్‌లో ఉన్నప్పుడు కృపాకర్ (పవన్) గ్యాంగ్‌కి చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆమె చేతిలో చావు దెబ్బలు తిని జైలుపాలవుతాడు. కానీ ఈ అరెస్ట్ తర్వాత కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తారు. తర్వాత ఏమైంది? తమని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువుల్ని నీల కుటుంబం ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా సినిమా. #ArjunSarja #Abhirami & #PreityMukundan in Blockbuster Action Movie #Blast Coming to Netflix on 25th June... #BlastOnNetflix pic.twitter.com/48kX1z7Hjp— The South Movies (@TheSouthMovies1) June 16, 2026 -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ వీడియోను రిలీజ్ చేస్తూ డేట్ ప్రకటించారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఈ తెలుగు వెబ్ సిరీస్ జూలై 2 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా వీడియో రిలీజ్ చేస్తూ అఫీషియల్‌గా వెల్లడించింది. తన జాబ్ పర్మినెంట్ కావడం కోసం ఓ గ్రామానికెళ్లిన హీరో.. అక్కడ ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడన్న కథాంశంతో ఈ సిరీస్ రూపొందించారు. ఈ వెబ్ సిరీస్‌లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రలు పోషించారు. Chemistry raani vadu oka ooriki chemistry nerpisthe ela untundhi? 🤭😁 pic.twitter.com/ZCX4U6ZWJD— Netflix India South (@Netflix_INSouth) June 15, 2026 -
ఓటీటీల్లో ఏకంగా 14 సినిమాలు.. ఆ మూవీపైనే అందరి కళ్లు..!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. పెద్ది థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరి కొన్ని చిన్న సినిమాలు సైతం రిలీజయ్యాయి. వాటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో థియేటర్ల వద్ద హడావుడి కనిపించడం లేదు. ఈ వారంలో థియేటర్లలో దీవానా, మా ఇంటి బంగారం లాంటి చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో సమంత మా ఇంటి బంగారంపై కాస్తా బజ్ నెలకొంది. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపే చూస్తున్నారు.ఈ వారంలో ఓటీటీ ప్రియులను అలరించేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. దృశ్యం-3, కెనతా కానోమ్, ఎం4ఎం లాంటి సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మోహన్ లాల్ దృశ్యం-3 కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటితో పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారంలో ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మై అమెరికాస్ స్వీట్‌హార్ట్స్ (వెబ్‌సిరీస్:సీజన్3) జూన్ 16డ్రింకింగ్ బడ్డీస్ -(హాలీవుడ్ మూవీ) జూన్ 15ఐ విల్ ఫైండ్ యూ(హాలీవుడ్ సిరీస్)- జూన్ 18వాయిస్‌మెయిల్స్ ఫర్ ఇసబెల్లె(హాలీవుడ్ సినిమా)- జూన్ 19తుక్రా కె మేరా ప్యార్ సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 19హస్బెండ్స్ ఇన్ యాక్షన్(కొరియన్ మూవీ)- జూన్ 19జియో హాట్స్టార్కెనతా కానోమ్(తమిళ సినిమా)- జూన్ 16 సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు వెబ్‌సిరీస్) జూన్ 19అమెజాన్ ప్రైమ్యువర్ ఫాల్ట్(హాలీవుడ్ మూవీ)- జూన్ 17దృశ్యం-3-(మలయాళ మూవీ)- జూన్ 18ది ఎజెన్సీ- సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 21లయన్స్ గేట్ ప్లే..అలియా బసు గాయబ్ హై(బాలీవుడ్ మూవీ)- జూన్ 19ఎం4ఎం(మోటివ్ ఫర్ మర్డర్)-(తెలుగు సినిమా)- జూన్ 19సోని లివ్..అతిరథి(మలయాళ సినిమా)- జూన్ 19 -
ఓటీటీకి కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్
ఓటీటీకి వచ్చేందుకు మరో సినిమా రెడీ అయిపోయింది. సన్నీ డియోల్, అక్షయే ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఇక్కా. ఈ చిత్రాన్ని సస్పెన్స్ కోర్ట్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. జూలై 10 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది.దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు సన్నీ డియోల్, అక్షయే ఖన్నా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. #Bollywood doesn't make enough courtroom thrillers.#Ikka already has my attention. The poster feels tense, the tagline is intriguing, and #SunnyDeol looks completely locked in. 🔥⚖️Also, you can never count out #AkshayeKhanna in a film like this when it comes to intense,… pic.twitter.com/9SuJeH0vWN— Siddharth R Kannan (@sidkannan) June 13, 2026 -
ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. ఒక్క రోజే 21 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో కూడా థియేటర్లలో పెద్ది హవా కొనసాగుతోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి షురూ అవుతుంది. ఈ నెల 12న ఫ్రైడే రోజున చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సింగ్ గీతం, భారత భాగ్య విధాత, పోలీస్ కంప్లైంట్, కొత్త మలుపు లాంటి సినిమా బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఈ శుక్రవారం ఓటీటీల విషయానికొస్తే సూర్య కరుప్పు(తెలుగులో వీరభద్రుడు)పై ఆసక్తి నెలకొంది. భూత్ బంగ్లా లాంటి బాలీవుడ్ మూవీపై కూడా ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది. వీటితో రమణి కల్యాణం అనే తెలుగు సినిమా సైతం ఓటీటీలో సందడి చేయనుంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ నుంచి సినిమాలతో పాటు పలు ఆసక్తికర వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12ది పాలిగమిస్ట్(వెబ్ సిరీస్)- జూన్ 12అవుట్ లాస్ట్ ది జంగిల్-(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12ది రెస్ట్ ఈజ్ ఫుట్‌బాల్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12అమెజాన్ ప్రైమ్ రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12 కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12 విజిల్(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 డాగ్51(ఫ్రెంచ్ సినిమా)- జూన్ 12 ఓవర్ యువర్ డెడ్ బాడీ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 ఎవరీ ఇయర్ ఆఫ్టర్(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12జియో హాట్‌స్టార్ ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12 అలైస్ అండ్ స్టీవ్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12 బిలో డెక్ మెడిటెరియన్-సీజన్ 11(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12ఆహా ష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12జీ5మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12లయన్స్ గేట్ ప్లే షెల్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12 విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 12సన్ నెక్ట్స్రమణి కల్యాణం(తెలుగు సినిమా)- జూన్ 12హెబీవో మ్యాక్స్దె విల్ కిల్ యూ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12 -
థియేటర్లలో పెద్ది.. ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల మార్క్‌కు దగ్గరకు చేరుకుంది. ఈ వారం కూడా పెద్ది హవానే కొనసాగుతోంది. ఈ ఫ్రైడే రోజు చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సింగ్ గీతం, భారత భాగ్య విధాత, పోలీస్ కంప్లైంట్, కొత్త మలుపు లాంటి సినిమా బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి.ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఓటీటీకి వచ్చేస్తోంది. దీంతో పాటు బాలీవుడ్ మూవీ భూత్ బంగ్లా స్ట్రీమింగ్కు రానుంది. వీటితో పాటు తెలుగులో ష్ అనే తెలుగు వెబ్ సిరీస్ ఆసక్తి పెంచుతోంది. అంతేకాకుండా పలు టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (జూన్ 8 నుంచి 14 వరకు)నెట్ఫ్లిక్స్కలర్స్ ఆఫ్ ఈవిల్ - బ్లాక్ (మూవీ) - జూన్ 10మై ఫ్యామిలీ సీజన్2 (వెబ్‌సిరీస్) - జూన్ 10స్వీట్ మగ్నోలియాస్ -సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 11ది ఈవిల్ లాయర్ (వెబ్‌సిరీస్) - జూన్ 11భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12అమెజాన్ ప్రైమ్ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10ద రెస్ట్ ఈజ్ ఫుట్‌బాల్ (డాక్యుమెంటరీ మూవీ) - జూన్ 10రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12జియో హాట్స్టార్ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12ఆహాష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12జీ5మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12లయన్స్ గేట్ ప్లేషెల్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 12ఆపిల్ టీవీ ప్లస్క్రిమినల్ రికార్డ్ (వెబ్‌సిరీస్) - జూన్ 10 -
ఈ వీకెండ్ పండగే.. థియేటర్లలో పెద్ది.. ఓటీటీలో దురంధర్-2..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వీకెండ్ మొత్తం రామ్ చరణ్ పెద్ది హవా ఉండనుంది. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు నుంచే పాజిటివ్ వస్తోంది. సూపర్ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారాంతం మూడు రోజులు పెద్దికి కలిసి రానుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచే ప్రీమియర్ షోతో దురంధర్ ఓటీటీలో సందడి చేయనుంది. దీంతో పాటు అగ్లీ స్టోరీ, కేడీ ది డెవిల్ లాంటి సినిమాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఈ ఫ్రైడే పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సైతం స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ 29 (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూన్ 05 మెక్సికో 86 (స్పానిష్ సినిమా) - జూన్ 05 ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 05 టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్) - జూన్ 05 ద మార్క్డ్ ఉమన్ (స్పానిష్ సినిమా) - జూన్ 05స్కార్లెట్ (హాలీవుడ్ మూవీ)- జూన్ 06 యూఎస్ఏ 94 (పోర్చుగీస్ చిత్రం) - జూన్ 07జియో హాట్‌స్టార్ ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05అమెజాన్ ప్రైమ్ ద పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్) - జూన్ 05 పీటర్(కన్నడ సినిమా)- జూన్ 05జీ5 పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 05 కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05 బ్రౌన్ (హిందీ సిరీస్) - జూన్ 05సోనీ లివ్ గుల్లాక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05సన్ నెక్స్ట్ ద రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05ఆహాఅగ్లీ స్టోరీ(తెలుగు సినిమా)- జూన్ 5ఆపిల్ టీవీకేప్ ఫియర్(హాలీవుడ్ సినిమా)- జూన్ 05 -
ఓటీటీకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలు వచ్చాక ఏ సినిమా అయినా సరే తెగ చూసేస్తున్నారు. కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఏ భాషలో తెరకెక్కించినప్పటికీ డబ్బింగ్ చేసి ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో కథ నచ్చితే చాలు ఎలాంటి మూవీకైనా ఆదరణ దక్కుతోంది. దీంతో డబ్బింగ్ చేసినా చిత్రాలే ఎక్కువగా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ తమిళ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విధు, ప్రీతి అస్రాని జంటగా నటించిన 29 చిత్రం మే 8న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా స్టార్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు.జూన్ 5 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా 29 స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా రివీల్ చేసింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ సినిమాకు రత్న కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహేంద్రన్ , అవినాష్, షెనాజ్ ఫాతిమా, ప్రేమ్ కుమార్ కీలక పాత్రల్లో మెప్పించారు. -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్కరోజే 16 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఎప్పటిలాగే ఉంటుంది. ఈ గురువారమే మోహన్ లాల్ దృశ్యం-3 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ ఫ్రైడే చిన్న సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే దురంధర్ అన్‌కట్ వర్షన్ కూడా వచ్చేస్తోంది. దీంతో పాటు హిందీ సినిమా సిస్టమ్, మధువిదు లాంటి మలయాళ సినిమా కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు ఓటీటీల్లో ఈ శుక్రవారమే సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్.. లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22 దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22 మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22 దురంధర్(అన్‌కట్ వర్షన్)- మే 22 గబ్బీస్ డాల్‌హౌస్(హాలీవుడ్ మూవీ)- మే 22 గోట్(యానిమేషన్ మూవీ)- మే 24 బ్యాడ్ థాట్స్- సీజన్ 2- మే 24అమెజాన్ ప్రైమ్- సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22 ది బ్రైడ్(హాలీవుడ్ మూవీ)- మే 22సన్ నెక్ట్స్.. బీష్మార్(మలయాళం సినిమా)- మే 22 శేష 2016(కన్నడ సినిమా)- మే 22జియో హాట్‌స్టార్.. స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22 దురంధర్(అన్‌కట్ వర్షన్)- మే 22జీ5 వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22 మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22 సత్రంగి బద్లే కా ఖేల్(హిందీ సినిమా)- మే 22సోనీలివ్.. మధువిదు(మలయాళ సినిమా)- మే 22లయన్స్ గేట్ ప్లే.. పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22ఎంఎక్స్ ప్లేయర్..వు ఈజ్ యువర్ గైనాక్?- సీజన్ 2(బాలీవుడ్ సిరీస్)- మే 22 -
ఓటీటీలో దురంధర్.. అభిమానులకు బిగ్ సర్ప్రైజ్..!
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.ఈ నేపథ్యంలోనే ఓటీటీ స్ట్రీమింగ్పై మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ నెల 22 నుంచి ఓటీటీలో అన్‌కట్ వర్షన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. రెండు ఓటీటీల్లోనూ ఒకేరోజు ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌తో జియోహాట్‌స్టార్‌లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ అన్‌కట్ వర్షన్ దాదాపు 3 గంటల 25 నిమిషాల పాటు ఉండనుందని మేకర్స్ రివీల్ చేశారు. దీంతో ధురంధర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. సోమవారం నుంచే జనాలంతా వర్క్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇక వారం సినిమాల విషయానికొస్తే పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఉండడంతో పెద్ది మూవీ సైతం జూన్‌లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటిపై ఆడియన్స్‌లో పెద్దగా బజ్ లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే మెగా కోడలు నటించిన సతీ లీలావతి, మేము కాపులం అనే వెబ్ సిరీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో సోనాక్షి సిన్హా, జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్, మలయాళ హిట్ మూవీ మధువిదు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలకు రానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్..డెసిబ్లింగ్-సీజన్-1(హాలీవుడ్ సిరీస్)- మే20కరీజ్మా సీజన్ 1(స్పానిష్ సిరీస్)- మే 20వన్ త్రీ హిల్(హాలీవుడ్ సిరీస్)- మే 21జేమ్స్ సీజన్-1(స్పానిష్ సిరీస్)- మే 21ది బోరోగ్స్(హాలీవుడ్ సిరిసీ)- మే 21లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22అమెజాన్ ప్రైమ్-ది క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్ మూవీ)- మే 19సతన్ ది డార్క్-(తమిళ సినిమా)- మే 20జాక్ ర్యాన్..ఘోస్ట్ వార్(హాలీవుడ్ మూవీ)- మే20సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22 సన్ నెక్ట్స్..సతీ లీలావతి(తెలుగు సినిమా)- మే 20బీష్మార్(మలయాళం సినిమా)- మే 22శేష 2016(కన్నడ సినిమా)- మే 22జియో హాట్‌స్టార్..స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22జీ5వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22సోనీలివ్..మధువిదు(మలయాళ సినిమా)- మే 22లయన్స్ గేట్ ప్లే..పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22 -
పాక్ లో ధురంధర్ ఫీవర్.. సినిమా విడుదలైన కొద్ది నిమషాల్లోనే సర్వర్ క్రాష్
-
శత్రుదేశంలో ఓటీటీ నం.1 ట్రెండింగ్‌లో 'ధురంధర్ 2'
విదేశాల్లో 'ధురంధర్ 2' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశంలో మాత్రం జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుందని అధికారికంగానే ప్రకటించారు. అయితే ఈ మూవీ అంతా పాక్‌లోని లయరీ ప్రాంతంలో జరిగే గ్యాంగ్ వార్స్, రాజకీయాలు, ఉగ్రవాద చర్యలు తదితర అంశాల ఆధారంగా తీశారు. దీంతో పాక్‌తో పాటు అరబ్ దేశాల్లో దీనిపై నిషేధం విధించారు. దీంతో అక్కడి ప్రేక్షకులు ఎవరూ ఈ చిత్రాన్ని చూడలేకపోయారు.(ఇదీ చదవండి: నాపై చేతబడి.. రక్తం వాంతులు, నరకం చూశా : జయం రవి)అయితే 'ధురంధర్ 2' థియేటర్లలో రిలీజైన తర్వాత పైరసీని పాక్‌లో విపరీతంగా చూశారు. అక్కడి కరెన్సీలో రూ.50కే ప్రింట్ అమ్మారు. ఇప్పుడు అధికారికంగా దాయాది దేశంలో ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చిన మరుక్షణం నుంచే ఓటీటీ సర్వర్ క్రాష్ అయిందని, అలానే గడిచిన 24 గంటల నుంచి తమ దేశంలో నం.1 ట్రెండింగ్‌లో ఉందని పాక్ ఇన్ఫ్లూయెన్సర్ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.'ధురంధర్ 2 పాకిస్తాన్లో ఇప్పుడే రిలీజైంది. సర్వర్స్ క్రాష్ అయ్యాయి. పాకిస్థానీలు అర్థరాత్రి ఎప్పుడవుతుందా? నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడొస్తుందా అని చూశారు. రాగానే క్లిక్ చేశారు. అందుకే మూవీ ప్లే కావడానికి టైమ్ పడుతోంది. అంతలా క్రేజ్ సంపాదించుకుంది. అయితే సినిమాలో చూపించింది నిజమా అబద్దమా అనేది వేరే విషయం. కానీ పాకిస్థానీలు మాత్రం మూవీ ఎలా తీసుంటారా అని చూసేందుకు ఎగబడుతున్నారు. రణ్వీర్ సింగ్ పాత్ర ఏంటనేది అందరికీ తెలుసు. లయరీలో అలా జరిగింది లేదా అనేది తర్వాత మాట్లాడుదాం' అని సదరు ఇన్ఫ్లూయెన్సర్ చెప్పుకొచ్చాడు.'ధురంధర్' రెండు భాగాలుగా రిలీజైంది. తొలి పార్ట్ గతేడాది డిసెంబరులో, సీక్వెల్ ఈ ఏడాది మార్చిలో థియేటర్లలోక వచ్చింది. మొత్తంగా రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. జస్కీరాత్ సింగ్ అనే వ్యక్తి.. హంజా అలీ మజారీ అనే మారుపేరుతో పాకిస్తాన్లోకి గూఢచారిగా వెళ్లి.. అక్కడ మాఫియాని, భారత్‌కి చేటు చేసిన పలువురు ఉగ్రవాదుల్ని ఎలా అంతం చేశాడనే స్టోరీతో ఈ సినిమా తీశారు. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by maviya umer farooqui (@kaam_wali_baat) View this post on Instagram A post shared by maviya umer farooqui (@kaam_wali_baat) -
ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. అది మాత్రం సస్పెన్స్
పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమా 'ధురంధర్ 2' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది కానీ ఇక్కడే ఓ ట్విస్ట్. ఇంకా ఓ విషయంలో సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. ఆడియెన్స్ ఏమో ఎదురుచూస్తున్నారు. కానీ ఓటీటీ సంస్థ మాత్రం షాక్ ఇచ్చింది. ఇంతకీ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ సంగతేంటి? తెలుగు వెర్షన్ ఎందులోకి వచ్చింది?గతేడాది డిసెంబరులో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించిన మూవీ 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.1300 కోట్ల మేర వసూళ్లు సాధించింది. మూడు నెలలు తిరిగేసరికల్లా అంటే ఈ ఏడాది మార్చి 19న రెండో భాగాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఈసారి తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. సీక్వెల్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్లో 'గొడవ'.. చేయిదాటిపోయిన పరిస్థితి)అయితే తొలి భాగాన్ని థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. సీక్వెల్ కూడా ఇదే ఓటీటీలో వస్తుందని అంతా అనుకున్నారు కానీ డిజిటల్ హక్కుల్ని మన దేశం వరకు హాట్‌స్టార్ దక్కించుకుంది. విదేశాల వరకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా గురువారం సాయంత్రం నుంచి అమెరికా, న్యూజిలాండ్, మలేసియాతో పాటు ఇతర దేశాల్లో 'ధురంధర్ 2' స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కానీ మన దగ్గర మాత్రం ఎప్పుడొస్తుందనే సస్పెన్స్ ఇంకా తీరలేదు. మరి ఇప్పుడు రిలీజ్ చేస్తారా? వచ్చే వారం స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి?'ధురంధర్ 2' విషయానికొస్తే.. ఆపరేషన్ 'ధురంధర్'లో భాగంగా జస్కిరాత్ సింగ్(రణ్వీర్ సింగ్) తన పేరుని హమ్జా అలీ మజారీగా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి లయరీ నగరంలో బలోచ్ నాయకుడు రెహమాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా)ని చంపేస్తాడు. ఇదే టైంలో మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) తనని తాను లయరీకి కింగ్‌గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు? ఈ క్రమంలో హమ్జా ఎలాంటి ప్లాన్స్ వేశాడు? ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? హమ్జా భారత గూఢచారి అని మిగతా వాళ్లకు తెలిసిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా) -
ఓటీటీకి దురంధర్-2.. ఫ్రైడే ఒక్క రోజే 16 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి షరామామూలే. ఈ వారంలో కోలీవుడ్ హీరో కరుప్పు ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు అరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం అనే తెలుగు మూవీస్ విడుదలవుతున్నాయి. కానీ వీటిపై పెద్దగా బజ్ లేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.ఇక ఈ ఫ్రైడే ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సినిమా మే 15 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్(ఓవర్సీస్ ఆడియన్స్‌కు మాత్రమే) కానుంది. దీంతో పాటు తిమ్మరాజుపల్లి టీవీ, తెరచార లాంటి టాలీవుడ్ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా కర్తవ్య లాంటి డబ్బింగ్ సినిమా, పలు డబ్బింగ్ సిరీస్‌లు రెడీ అయిపోయాయి. ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ధురంధర్ 2 (హిందీ సినిమా) - మే 15 (ఓవర్సీస్ రిలీజ్)కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15ఇట్స్ నాట్ లైక్ దట్(హాలీవుడ్ సిరీస్)- మే 15ది వండర్ ఫూల్స్(కొరియన్ సిరీస్)- మే 15ది క్రాష్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 15అమెజాన్ ప్రైమ్ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 15డ్రైవర్స్ ఈద్(హాలీవుడ్ సినిమా)- మే 15జియో హాట్‌స్టార్ ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 15ఆహా తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా) - మే 15సన్ నెక్ట్స్..తెరచాప(తెలుగు సినిమా)- మే 15జీ5..టిఘీ (మరాఠీ మూవీ) - మే 15మనోరమ మ్యాక్స్..కప్(మలయాళ సినిమా)- మే15లయన్స్ గేట్ ప్లే..కౌచర్(హాలీవుడ్ మూవీ)- మే 15హులు..రివల్స్(హాలీవుడ్ సినిమా)- మే 15ముబీ..ది మిస్టిరీయస్ గేజ్ ఆఫ్ ది ఫ్లైమింగో(హాలీవుడ్ సినిమా)- మే 15 -
ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ కామెడీ సినిమా
మెగాడాటర్ నిహారిక నిర్మించిన హారర్ కామెడీ సినిమా 'రాకాస'. గత నెలలో థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. రీసెంట్గా ఓటీటీలోకి కూడా వచ్చి అందులోనూ దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ఛార్ట్‌లో టాప్ 7కి చేరుకుంది. 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతోందని సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి)ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో 'రాకాస' పలు అంతర్జాతీయ చిత్రాల సరసన నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంటే డిజిటల్ స్ట్రీమింగ్‌లో మరింత ఆదరణ లభిస్తోందని ఈ లెక్కలే చెబుతున్నాయి.సంగీత్ శోభన్ –గెటప్ శ్రీను ట్రాక్, వెన్నెల కిషోర్ నటన ఈ సినిమాను పదేపదే చూసేలా చేయడంలో ఎంతగానో దోహదపడ్డాయి. పిల్లలకు ఈ చిత్రంలోని ఫాంటసీ నచ్చితే.. పెద్ద వాళ్లకి కామెడీ, ఎంటర్టైన్మెంట్ నచ్చాయి. అలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని 'రాకాస' ఆకట్టుకోవడంతో ఓటీటీలోనూ దుమ్ములేపేస్తోంది. ఈ మూవీ మానస శర్మ దర్శకురాలు కాగా సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. (ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్) -
'మనీ హీస్ట్' ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్
ఓటీటీల్లో కంటెంట్‌ని రెగ్యులర్‌గా చూసేవాళ్లకు 'మనీ హీస్ట్' సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదు సీజన్ల ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. చివరిదైన ఐదో సీజన్ వచ్చి ఐదేళ్లు గడిచిపోయింది. దీని తర్వాత 'బెర్లిన్' పాత్ర ఆధారంగా సిరీస్ వచ్చింది. ఇప్పుడు 'మనీ హీస్ట్' ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)2021లో ఐదో సీజన్‌తో ఈ సిరీస్‌ని ముగించినప్పటికీ.. ఈ ఫ్రాంచైజీని మరింత విస్తరించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త టీజర్ రిలీజ్ చేసింది. మనీ హీస్ట్ ప్రపంచం కొనసాగనుంది అనే పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆరో సీజన్ మొదలుపెడతారా అని మీలో చాలామంది అనుకోవచ్చు. కానీ ఈ సిరీస్‌లోని ఫ్రొఫెసర్ లేదా ఇతర పాత్రల్ని తీసుకుని కొత్తగా సిరీస్ మొదలుపెట్టొచ్చేమో అనిపిస్తుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అప్పటివరకు ఎదురుచూడటమే.(ఇదీ చదవండి: చిరుని కలిసిన మలయాళ డైరెక్టర్.. రీమేక్‌పై క్లారిటీ) -
దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి కావడంతో డేట్ రివీల్ చేసింది. మే 14వ తేదీ నుంచి ఓవర్సీస్లో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. అయితే ఓటీటీలో అన్‌కట్ వర్షన్ ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో దురంధర్-2 ఉండనుందని పేర్కొంది.అయితే ఇండియాలోని ప్రేక్షకులకు స్ట్రీమింగ్ తేదీ ఇంకా రాలేదు. మనదేశంలో జియో హాట్‌స్టార్ ఈ మూవీ రైట్స్ దక్కించుకుంది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ సంస్థ ప్రకటించనుంది. తాజా సమాచారం ప్రకారం మే 15 నుంచే ఇండియాలో దురంధర్-2 స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం దురంధర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దురంధర్-2 కథేంటంటే?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్‌పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
వీకెండ్ సినిమాల సందడి.. ఓటీటీల్లో ఒక్కరోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడావుడి మామూలే. ఈ వారంలో గోదారి గట్టుపైన, సతీ లీలావతి, రేజర్, స్పిరిట్ లాంటి సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. వీటిలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి, రవిబాబు 'రేజర్' మూవీస్‌పై ప్రేక్షకుల్లో కాస్తా ఆసక్తి నెలకొంది. తెలుగు చిత్రాలతో పాటు రిషభ్ శెట్టి హీరోగా చేసిన 'ఏ ఫిల్మ్ బై గిరి' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ కానుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే పలు సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. తెలుగు హిట్ మూవీ డెకాయిట్‌తో పాటు మలయాళ బ్లాక్‌బస్టర్స్ వాలా-2, భరతనాట్యం 2 ఓటీటీలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు ఈ శుక్రవారం స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్భరతనాట్యం 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08మై రాయల్ నెమిసిస్(కొరియన్ మూవీ)- మే 08రిమార్కబుల్లీ బ్రైట్ క్రియేచర్స్(హాలీవుడ్ సినిమా)- మే 08అమెజాన్ ప్రైమ్ డెకాయిట్ (తెలుగు మూవీ) - మే 08 లుక్కే (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 08సతన్ ది డార్క్(తమిళ సినిమా)- మే 08నో ప్లేస్ టు బీ సింగిల్(హాలీవుడ్ సినిమా)- మే 08జియో హాట్స్టార్వాలా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08 సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ మూవీ) - మే 08ఎమ్ఐఏ(హాలీవుడ్ సినిమా)- మే 08జీ5 లవ్ మాక్‌టైల్ 3 (కన్నడ సినిమా) - మే 08సన్ నెక్స్ట్ ఓ బటర్ ఫ్లై (తమిళ మూవీ) - మే 08 సూపర్ హిట్ (కన్నడ సినిమా) - మే 08ఆపిల్ టీవీఅన్కండీషనల్(హాలీవుడ్ మూవీ- మే 08 -
స్టార్ హీరో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కర్తవ్య. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి పుల్కిత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇవాళ ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సైఫ్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్లో క్రైమ్ సీన్స్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రం మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో రసిక, సంజయ్, సౌరభ్ కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీకి సూపర్ హిట్ డార్క్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతన్నాయి. చిన్న సినిమాలైనా సరే వసూళ్లపరంగా రాణిస్తున్నాయి. ఇటీవల వాలా-2 సైతం అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత మరో మలయాళ మూవీ భరతనాట్యం- 2 మోహినియాట్టం సైతం కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.50 కోట్లు వసూలు చేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ శుక్రవారం అంటే మే 8వ తేదీ నుంచి ఓటీటీ సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. ఈ డార్క్ కామెడీ మూవీలో సూరజ్ వెంజరమూడు, సైజు కురుప్ కీలక పాత్రల్లో నటించారు. Recent Malayalam Blockbuster Dark Comedy Movie 😂!!#Bharatanatyam2 : #Mohiniyattam (Malayalam) streaming from May 8 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/74wi4zutEy— OTT Trackers (@OTT_Trackers) May 3, 2026 -
నేరుగా ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించిన లేటేస్ట్ మూవీ కర్తవ్య. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీకి పులకిత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ డేట్‌పై రూమర్స్ రాగా.. అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 15 నుంచి ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది. ఈ సినిమాని విధి వర్సెస్ కర్మ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీలో పోలీసు అధికారి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. #Kartavya 🔥#SaifAliKhan in a gripping tale of duty vs conscience ⚖️Directed by Pulkit 🎬Streaming on Netflix from May 15 ✅ pic.twitter.com/wSQiOCnuss— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) April 30, 2026 -
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 20 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారం బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ నుంచి జెట్లీ బరిలో ఉన్నాడు. కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో పాటు ధనుశ్ కర సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ రెండు మూవీస్ వీకెండ్లో ప్రేక్షకులను అలరించనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్ నుంచి బైకర్, రాకాస లాంటి సినిమాలు ఫ్రైడే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ-2 సైతం రేపటి నుంచే ఓటీటీలో అలరించనుంది. అంతేకాకుండా పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా మరిన్ని కొన్ని సినిమాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20 సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ బైకర్ (తెలుగు మూవీ) - మే 01 రాకాస (తెలుగు సినిమా) - మే 01 గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01స్వాప్డ్(యానిమేషన్ మూవీ)- మే 01మై డియరెస్ట్ సెనోరిటా(హాలీవుడ్ సినిమా)- మే 01బే బ్లాడెక్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మే 01మై ఫేవరేట్ వెడ్డింగ్(హాలీవుడ్ మూవీ)- మే 01సన్ ఇన్ లా(హాలీవుడ్ మూవీ)- మే 01యూ ఆల్వేస్(హాలీవుడ్ సినిమా)- మే 01బుబా సీజన్-6(హాలీవుడ్ సిరీస్)- మే 01పార్ట్‌టైమ్ వైఫ్(హాలీవుడ్ సిరీస్)- మే 03క్లీకా (హాలీవుడ్)- మే 03ఆహాసోదర(తెలుగు మూవీ)- మే 01అమెజాన్ ప్రైమ్ సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01 యూ ఆర్ డేటింగ్ ఏ నార్సిస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 01జీ5ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01సోనీ లివ్ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01హెచ్‌బీవో మ్యాక్స్..ఉథరింగ్ హైట్స్(హాలీవుడ్ సినిమా)- మే 01సన్ నెక్ట్స్మనితదేయివమగలం(తమిళ సినిమా)- మే 01హులు..హలో రోడ్(హాలీవుడ్ సినిమా)- మే 01 -
ఓటీటీలో రాకాస.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా విడుదలైన కొత్త సినిమా రాకాస... బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. రాకాస చిత్రంలో సంగీత్ శోభన్- నయన్ సారిక హీరో హీరోయిన్గా నటించారు. ఓటీటీ సిరీస్‌లతో బాగా పాపులర్ అయిన దర్శకురాలు మానస శర్మ ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటించారు.రాకాస చిత్రం 2026 మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సదరు ఓటీటీ యాప్ కేటలాగ్‌లో అధికారికంగా చేర్చబడింది. అయితే, ఓటీటీ ప్రేక్షకుల కోసం తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఇతర భాషలలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన రాకాస చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓటీటీ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో రూ. 10 కోట్లకు ఢీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా రాకాస చిత్రం నిర్మాత నిహారికకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.కథేంటంటే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్ వీరు(సంగీత్ శోభన్).. తన ప్రియురాలు సుకన్యను పెళ్లి చేసుకోవాలని సొంతూరుకి వస్తాడు. కానీ అప్పటికే వేరే వ్యక్తితో సుకన్య పెళ్లికి రెడీ అవుతుంది. బ్రేకప్ బాధలో ఉన్న సమయంలోనే సోము(వెన్నెల కిశోర్) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని పాస్‌పోర్ట్‌ని పోలీసులు తీసుకెళ్తారు. సోము జాడని కనిపెడితే తన పాస్‌పోర్టు తిరిగి వస్తుందని.. స్నేహితుడు బాలు(గెటప్ శ్రీను)తో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు.అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా తిష్టవేసుకొని ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరంతా కలిసి ఓ ముసలాడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. చివరి క్షణంలో అతను చనిపోతాడు. అతనికి బదులుగా బాలు పోవాల్సి ఉండగా.. వీరూ అడ్డుపడతాడు. దీంతో బాలుకి బదులుగా వీరూ ఆ కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ కోట ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఏంటి? నిజంగానే ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడా? సుబ్బులక్ష్మి(నయన్ సారిక) ఎవరు? ఆమె ఎందుకు కోటలోకి వెళ్లింది? సోము సంగతి ఏంటి? నిజంగా చనిపోయాడా? లేదా బతికే ఉన్నాడా? బలి కోసం కోటలోకి వెళ్లిన తర్వాత వీరూకి ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి ప్రాణాలలో బయటకు వచ్చాడా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 20 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. వాళా-2 తెలుగు డబ్బింగ్ వర్షన్‌తో పాటు గేదేల రాజు లాంటి సినిమాలపై అంతగా బజ్ లేదు. వాళా-2 మలయాళ హిట్ మూవీ కావడంతో కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఫ్రైడే సినిమాలు అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో తెలుగు మూవీ బ్యాండ్మేళంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. దీంతో పాటు జీవీ ప్రకాశ్ హ్యాపీ రాజ్ డబ్బింగ్ సినిమా, మలయాళ మూవీ ప్రతిఛాయ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే అన్ని కలిపి దాదాపు 20 చిత్రాలు ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ అపెక్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 24 నుక్కడ్ నాటక్(హిందీ సినిమా)- ఏప్రిల్ 24 ఇఫ్ విషెస్ కుడ్ కిల్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24 నీ ఫరెవర్(హిందీ మూవీ)- ఏప్రిల్ 24 సోనిక్3 ది హెడ్జ్హాగ్(హాలీవుడ్)- ఏప్రిల్ 24 అన్‌కామన్ వాలర్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24 మై డ్రెస్‌అప్ డార్లింగ్(జపనీస్ మూవీ)- ఏప్రిల్ 2528యర్స్ లేటర్- ది బోన్ టెంపుల్(హాలీవుడ్)- ఏప్రిల్ 26జియో హాట్‌స్టార్ ప్రతి ఛాయ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 24 24 (హిందీ సిరీస్) - ఏప్రిల్ 24సన్ నెక్స్ట్జేసీ ది యూనివర్సిటీ(కన్నడ మూవీ)- ఏప్రిల్ 24జీ5 బ్యాండు మేళం (తెలుగు మూవీ) - ఏప్రిల్ 24 జిరాక్స్ (కన్నడ సిరీస్) - ఏప్రిల్ 24అమెజాన్ ప్రైమ్ హ్యాపీరాజ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 24 నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24 మార్టీ సుప్రీమ్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24 న్యూ బండిట్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 24 ఇమ్మార్షల్ కాంబాట్(హాలీవుడ్)- ఏప్రిల్ 24లయన్స్ గేట్ ప్లే గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 24ఆపిల్ టీవీ ప్లస్ మై బ్రదర్ ద మినోటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24హులు..నో అదర్ ఛాయిస్ (హాలీవుడ్)- ఏప్రిల్ 24ముబీ..సౌండ్ ఆఫ్ ఫాలింగ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24 -
ఓటీటీకి సోషల్ ఓరియంటెడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో ఆసక్తికర మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. తన్మయ శేఖర్ దర్శకత్వం వహించిన సోషల్ ఓరియంటెడ్ మూవీ నుక్కడ్ నాటక్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఈ నెల 24 నుంచే ఓటీటీ ప్రియులను అలరించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.కాగా.. ఈ చిత్రంలో మోల్శ్రీ, శివంగ్ రాజ్‌పాల్, నిర్మల హజ్రా, డానిష్ హుస్సేన్ కీలక పాత్రల్లో మెప్పించారు. ఓ కాలేజీ నుంచి బహిష్కరించిన ఇద్దరు విద్యార్థుల ప్రయాణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కాలేజీ క్యాంటీన్లో దొంగతనం చేస్తూ ఇద్దరు స్నేహితులు దొరికిపోతారు. తిరిగి కాలేజీలో చేరేందుకు ఒక బస్తీలోని ఐదుగురు పిల్లలకు విద్యనందించే బాధ్యతను తీసుకుంటారు. ఆ తర్వాత వీరిద్దరు తిరిగి కాలేజీకి వెళ్లారా? లేదా అన్నదే మిగతా స్టోరీ. Hindi LGBTQ Movie #NukkadNaatak (Hindi) streaming from April 24 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/7wt7ZEVEmO— OTT Trackers (@OTT_Trackers) April 20, 2026 -
ఓటీటీకి బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సందడి చేసేందుకు మరో సినిమా వచ్చేస్తోంది. తమిళంలో రిలీజైన ప్రేక్షకులను మెప్పించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. సుదర్శన్ గోవింద్, అర్చన రవి జంటగా నటించిన నీ ఫరెవర్ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ ఏప్రిల్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గత నెలలో థియేటర్లలో కేవలం తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ సినిమాకు అశోక్‌కుమార్ కలైవాణి దర్శకత్వం వహించారు. అశ్విన్ హేమంత్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో వై జీ మహేంద్రన్, రవి, ఎం.జె.శ్రీరామ్, రేతిక శ్రీనివాస్, శ్రీజ రవి, చెల్లా, డాక్టర్ విద్య, వీజే ప్రతు, నోబుల్ కె జేమ్స్, స్నేహ శక్తి కీలక పాత్రల్లో మెప్పించారు. Indha love fake ah thaan thodanguchu, but the feelings got all too real ♥️😢 pic.twitter.com/1vg34zTrlb— Netflix India South (@Netflix_INSouth) April 21, 2026 -
'యూత్'ను ఢీ కొట్టలేకపోయిన పవన్ కల్యాణ్
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక డైలాగ్ చెప్తారు. 'నా అభిమానుల్ని లెక్కపెట్టడానికి నీ జీవితం మొత్తం సరిపోదు' అంటూ విలన్‌కు కౌంటర్ ఇస్తారు. అయితే, రియాలిటీ మరోలా ఉంది. అందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారని చెప్పిన పవన్‌కు ఈ చిత్ర ఫలితం పునరాలోచనలో పడేసింది. కెరీర్లోనే ఎక్కువ నష్టాలను మిగిల్చిన చిత్రంగా ఉస్తాద్ భగత్ సింగ్ నిలిచింది. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారనుకుంటే వాళ్లు కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయారు. చివరకు ఓటీటీలో కూడా ఒక చిన్న సినిమా ఉస్తాద్‌ను దాటి ట్రెండింగ్‌లో నిలిచింది.ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పాపులర్ సినిమాతో యూత్ అనే చిన్న సినిమా ఢీ కొట్టి ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా యూత్ సినిమా ట్రెండింగ్ చార్టులో 2వ స్థానంలో ఉంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం 3వ స్థానంతో సరిపెట్టుకుంది. పవన్ మూవీకి స్టార్డమ్, క్రేజీ కాంబినేషన్ ఉన్నప్పటికీ, తక్కువ బడ్జెట్‌తో వచ్చిన హిట్ తమిళ సినిమాతో పోలిస్తే ఉస్తాద్ సినిమా ఓటీటీలో కూడా పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. -
29 ఏళ్ల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌కు బైబై చెప్పిన కోఫౌండర్
ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ను దాదాపు మూడు దశాబ్దాల పాటు అగ్రపథంలో నడిపిన సహ-వ్యవస్థాపకుడు, ప్రస్తుత ఛైర్మన్ రీడ్ హేస్టింగ్స్ (65) తన 29 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికారు. ఆయన సంస్థ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ కీలక పరిణామం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. బలమైన ఆదాయ గణాంకాలు నమోదైనప్పటికీ హేస్టింగ్స్ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తతో సంస్థ షేరు విలువ ఒక్కరోజులో ఏకంగా 9% పడిపోయింది.కీలక సమయంలో వీడ్కోలువార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో కంపెనీ విలీన చర్చలు విఫలమై పోటీ పెరిగిన క్లిష్ట సమయంలో హేస్టింగ్స్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. రాబోయే జూన్ వార్షిక సమావేశంలో ఆయన తిరిగి ఎన్నికలకు నిలబడబోరని, ఇకపై తన సమయాన్ని దాతృత్వ కార్యక్రమాలకు, ఇతర వ్యాపారేతర కార్యకలాపాలకు కేటాయిస్తానని స్పష్టం చేశారు.డీవీడీ అద్దె నుంచి స్ట్రీమింగ్ సామ్రాజ్యం వరకు..1997లో ఒక చిన్న డీవీడీ-బై-మెయిల్ సర్వీస్‌గా నెట్‌ఫ్లిక్స్‌ను ప్రారంభించిన హేస్టింగ్స్ ప్రపంచ వినోద రంగం గమనాన్ని మార్చేశారు. 2011లో ‘క్విక్ స్టార్’ నిర్ణయం వంటి వైఫల్యాలు ఎదురైనా, కొవిడ్ మహమ్మారి వంటి కీలక సమయాల్లో సంస్థను లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన పుస్తకం ‘నో రూల్స్ రూల్స్’లో పేర్కొన్నట్లుగా ఉత్పాదకతతో కూడిన పని సంస్కృతిని ఆయన సృష్టించారు.భవిష్యత్తు లక్ష్యాలుహేస్టింగ్స్ వారసుడు కంపెనీ కో-సీఈఓ గ్రెగ్ పీటర్స్ సంస్థ వృద్ధిపై ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక బిలియన్ మంది ప్రేక్షకులను చేరుకునే సామర్థ్యం తమకుందని ఆయన పేర్కొన్నారు. 2026 నాటికి ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 3 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. కేవలం సినిమాలు, సిరీస్ లే కాకుండా జపాన్ వరల్డ్ బేస్ బాల్ క్లాసిక్ వంటి ప్రత్యక్ష క్రీడలు, వీడియో పాడ్‌కాస్ట్‌లపై సంస్థ దృష్టి పెడుతోంది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి! -
శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్..!
అప్పుడే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడే సందడి. ఈ ఫ్రైడే నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్, తెరచాప, గాలి లాంటి చిత్రాలతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమా పల్లి చట్టంబి థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలపై ఆడియన్స్‌లో బజ్ ఏర్పడింది.ఇక ఓటీటీల విషయానికొస్తే తెలుగులో పోచమ్మ వెబ్ సిరీస్, హిందీ నుంచి అస్సీ, దో దివానే షహర్ మే, మట్కా కింగ్ వెబ్ సిరీస్‌లు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని చిత్రాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఏ ఓటీటీకి రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్..దో దివానే షహర్ మే(బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17ఆల్ఫా మేల్స్ సీజన్-5(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17180(మూవీ)- ఏప్రిల్ 17రూమ్మేట్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17గోరిల్లా స్టోరీ(డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 17ఫుల్ స్వింగ్- సీజన్-4(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 17ట్విస్టెడ్(హాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 17లెగో — ఫ్రెండ్స్ ది నెక్ట్స్ చాప్టర్-(హాలీవుడ్ సిరీస్) -ఏప్రిల్ 17బెబెఫిన్సింగ్-ఎలాంగ్మూవీ ఇన్ టూ ద పింక్‌ఫాంగ్ వరల్డ్(కొరియన్ మూవీ)- ఏప్రిల్ 19అమెజాన్ ప్రైమ్మట్కా కింగ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17బాలిస్టిక్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17బ్రదర్స్ అండర్ ఫైర్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 17ది నాపాబాయ్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17ది విజిలర్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17జీ5..అస్సీ (హిందీ సినిమా)- ఏప్రిల్ 17ఆశకల్ అయిరామ్(మలయాళసినిమా)- ఏప్రిల్ 17ఆహా..పోచమ్మ(తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17బుక్ మై షోది బ్రైడ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17హెచ్‌బీవో మ్యాక్స్..డస్ట్ బన్నీ(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17హులు..షెల్బీ ఓక్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17లయన్స్ గేట్ ప్లేగుడ్ బాయ్(హాలీవుడ్)- ఏప్రిల్ 17 -
OTT: ‘థ్రాష్’ రివ్యూ.. ముచ్చెమటలు పట్టించే థ్రిల్లర్ సినిమా
భయం....నవరసాలలో ఈ భయానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ సినిమాలలో భయం అనే ఎమోషన్ ను రకరకాలుగా రక్తగట్టిస్తుంటారు దర్శకులు. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ, సౌండ్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుడిని ముచ్చమటలు పట్టించడం నల్లేరు మీద నడకే. చాలా సినిమాలలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి కాని కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. పైగా హాలివుడ్ లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు కొదవే ఉండదు. గడచిన కొన్నేళ్ళలో నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అని చెప్పుకునే హాలివుడ్ సినిమాలు ఎన్ని వచ్చినా అలరించినవి కొన్నే. కాని ఇటీవల నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయిన థ్రాష్ సినిమా మాత్రం చూసే ప్రేక్షకులను కుర్చీ అంటుకుపెట్టుకునేలానే కాదు ఒళ్ళంతా ముచ్చెమటలు పోయించినా ఆశ్చర్యపోనక్కరలేదు. హాలివుడ్ టామీవిర్కోలా రాసిన కథను తానే దర్శకత్వం వహించి తెరకెక్కించిన విధానం నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు. అంతలా ఈ థ్రాష్ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం.అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో అనీవిలే అనే నగరంపై కాటగిరీ5 తో హరికేన్ హెన్రీ విరుచుకుపడుతుంది. ఇంత పెద్ద తుఫాను వస్తుంది అని తెలిసినా తన తన తల్లి ఇల్లుని వదలలేక ఒంటరిగా ఉండిపోతుంది డకోటా.మరో పక్క లీసా తన డెలీవరీ కోసం వెళుతూ డకోటా ఇంటి ముందే నీటిలో చిక్కుకుపోతుంది. ఇంకో వైపు డీ, రాన్ తమ చెల్లేలితోపాటు డబ్బులు కోసం ఆశపడే జంట దగ్గర ఆశ్రయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అనుకున్నట్టుగానే హరికేన్ ధాటికి అనీవిలే రిజర్వాయర్ గోడ కూడా కూలి నీళ్ళు నగరాన్ని ముంచెత్తుతాయి. నీటి తో పాటు తుఫాను సముద్రంలోని సొర చేపలను కూడా నగరంలోకి తీసుకువస్తుంది. ఇక్కడే ఉంది పెద్ద ట్విస్టు. ఓ పక్క నీళ్ళు, మరో పక్క సొరచేపలు వీటి మధ్య డకోటా, లీసా, అలాగే డీ రాన్ లు ఎలా బ్రతికి బట్టకడతారో అన్నదే థ్రాష్ సినిమా. మొత్తం సినిమాలో ఒకే ఒక దగ్గర దర్శకుడు సినిమా లిబర్టీ తీసుకున్నాడు. మిగతా అంతా మనకు యదార్ధంగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అయ్యాక చాలా కాలం తరువాత మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అప్పట్లో హాలివుడ్ సినిమా సెన్సేషన్ ట్విస్టర్ తరువాత అంతకన్నా ఎక్కువ థ్రిల్లింగ్ కలిగించే సినిమా ఈ థ్రాష్ అవుతుంది. మస్ట్ వాచ్ ఫర్ థ్రిల్లర్ లవర్స్.- హరికృష్ణ ఇంటూరు -
ప్రభాస్ స్పిరిట్.. భారీ ధరకు ఓటీటీ డీల్..!
ప్రభాస్- యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ ప్రభాస్ కెరీర్లో 25వ సినిమాగా నిలవనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ టాలీవుడ్లో వైరల్‌గా మారింది.రూ.250 కోట్ల ఆఫర్..!ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన క్రేజీ టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ ఓటీటీ డీల్ భారీ ధరకు కుదిరినట్లు తెలుస్తోంది. డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.250 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ డీల్‌పై నిర్మాణ సంస్థ కానీ.. ఓటీటీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.మరోవైపు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా దక్కించుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ చరిత్రలోనే భారీ ధరకు ఈ సినిమా రైట్స్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని 2027 మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు ముందే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు జపనీస్, కొరియన్ భాషల్లో కూడా స్పిరిట్ విడుదల కానుంది. -
OTT: హాయిగా అనిపించే, ఆహ్లాదం కలిగించే సినిమా కావాలా?
పెద్దవాళ్లకు మధ్య వయస్కులకు కొరియా ఒక దేశం అని మాత్రమే తెలుసునేమో గానీ నేటి యువత, టీనేజర్స్‌కు అదొక ఎమోషన్. కొరియన్ కల్చర్‌కు పట్టం కట్టే వెబ్ సిరీస్, కె–పాప్...వంటివి ఇప్పుడు భారతీయ యువతని ఉర్రూతలూగిస్తున్న అతిపెద్ద వినోదాలు. అలా మన యువత అభిరుచులలో అగ్రగామిగా మారిన ఆ కొరియన్ కల్చర్... బహుశా ఈ సినిమా కధకు స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు.విదేశీ కలల విహారం... ఓ చిన్న గ్రామానికి చెందిన అమ్మాయి తన కలల్ని నమ్ముకుని విదేశాలకు వెళ్లే సినిమా కథలు మనం గతంలో చూశాం. పడమటి సంధ్యారాగం...లాంటి సినిమాల్ని గుర్తుకు తెస్తూనే కొత్తగా అనిపించే సినిమా ‘‘మేడ్ ఇన్ కొరియా’’. తమిళనాడులోని అందాల ఊటీకి దగ్గరలో ఉన్న లవ్ డేల్ అనే చిన్న గ్రామానికి చెందిన షెన్బా అనే యువతి కలల కధే ఈ మేడ్ ఇన్ కొరియా. చిన్నప్పటి నుంచే కొరియా అంటే మక్కువ పెంచుకుంటూ వచ్చిన ఓ అమ్మాయి ఏదో ఒకరోజు అక్కడికి వెళ్లాలని కలలు కంటుంది. అయితే తాను ఆశించిన విధంగా కాకుండా ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోయి కొరియాలో అడుగు పెట్టాల్సి రావడం, అనుకోని పరిస్థితుల్లో ఒంటరిగా కనీసం మాట్లాడడానికి తనకు భాష కూడా రాని మనుషుల మధ్య గడపాల్సి రావడం...వీటి వల్ల ఆమె జీవితం ఎలాంటి కొత్త మలుపులు తిరుగుతుంది ఒంటరితనం నుంచి ఆత్మవిశ్వాసం వరకు ఆమె ప్రయాణం ఎలా సాగుతుంది? అనేదే ఈ కథ.కొన్ని నవ్వులు...కొన్ని భావోద్వేగాలు...కథలో కొత్తదనం ఉన్నప్పటికీ, దాన్ని చెప్పే విధానం మాత్రం చాలా సేఫ్‌గా, ఎక్కడా రిస్క్ తీసుకోకుండా సాగుతుంది. ఇది కామెడీ సినిమా కాదు. అలాగే హెవీ మెలో డ్రామా కూడా ఉండదు. కొరియాలో షెన్బా కొత్త జీవితం ప్రారంభించే భాగాలు ఆసక్తికరంగా కొన్ని చోట్ల నవ్విస్తూ సాగుతాయి. అలాగే ప్రత్యేకంగా మంచాన పడి ఉన్న వృద్ధురాలితో పెరిగిన అనుబంధం వారిరువురి నడుమ ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ మనసును తాకుతాయి. యువత ఆశలకు, తల్లిదండ్రుల నమ్మకాలకు నడుమ సాగే వాగ్వివాదాలు ఎప్పుడూ ఉన్నవే అయినా ఇప్పటికీ ప్రస్తావనార్హమే కాబట్టి ఈ సినిమాలోనూ కొన్ని అలాంటి బలమైన సన్నివేశాలు ఉంటాయి. అవకాశం ఉన్నా సినిమాలో ఎవరినీ విలన్ని చేయకపోవడం హాయిగా అనిపిస్తుంది. అలాగే కధానాయిక పుట్టిన ఊరు లవ్ డేల్ కూడా ప్రకృతి రమణీయతతో అలరారుతూ మనల్ని ఆకట్టుకుంటుంది.ఓజీ చిత్రంలో మనకు సాదా సీదాగా కనిపించిన ప్రియాంక మోహన్ ఈ సినిమా ద్వారా తన నటనలోని సత్తాను మనకు ప్రదర్శిస్తుంది. ఓ అమాయక అబల అనే పరిస్థితి నుంచి ఆత్మవిశ్వాసం గల సబలగా మారే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన బలం కాగా ఇండో–కొరియన్ కల్చర్ మిక్స్ కొత్తగా అనిపించడం మరో బలం.అయితే కథలోని భావోద్వేగాల్ని లోతుగా అన్వేషించే ప్రయత్నం చేయకుండా, సింపుల్‌గా ముగించేయడం ఎమోషన్స్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు కొంత మేర నిరాశ కలిగిస్తుంది. ప్రారంభంలో కధానాయికకు కొరియా అంటే ఎంత ఇష్టమో అనేది చెప్పడంలో పెట్టిన శ్రద్ధ...ఆమె కొరియా వెళ్లిన తర్వాత ఆమె పొందిన ఉద్వేగం గురించి చెప్పడం మీద పెట్టలేదు. మొత్తంగా చూస్తే ‘‘మేడ్ ఇన్ కొరియా’’ ఒక లైట్, ఫీల్ గుడ్ సినిమా. ఒక వీకెండ్లో సరదాగా కుటుంబంతో కలిసి ఒక మంచి సినిమా చూసిన ఫీల్‌ని పొందాలంటే నిస్సందేహంగా మేడ్ ఇన్ కొరియా బెస్ట్ ఛాయిస్. ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. -
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్.. సబ్స్క్రైబర్ల నంబర్ ఎంతో తెలుసా?
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారత మార్కెట్లో జోరు పెంచింది. సుమారు మూడేళ్ల క్రితం సబ్స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించి వినియోగదారులను తనవైపు తిప్పుకుంది. భారత్‌లో అమలు చేసిన ఈ ప్లాన్ విజయవంతం కావడంతో పలు దేశాల్లో దీనిని అమలు చేస్తుంది. ఎక్కువ కంటెంట్‌తో భారత ప్రజలను అలరించిన అమెజాన్ ప్రైమ్ వీడియోను దాటి నెట్‌ఫ్లిక్స్ ముందుకు వచ్చేసింది.నివేదికల ప్రకారం, భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సంస్థకు 92 మిలియన్ల (9.2 కోట్లు) నెలవారీ వినియోగదారులు ఉన్నారు. ప్రైమ్ వీడియోకు 67 (6.7కోట్లు) మిలియన్ల నెలవారీ వినియోగదారులతో వెనుకపడింది. దీంతో ఇప్పుడు భారతదేశంలో ప్రైమ్ వీడియోపై నెట్‌ఫ్లిక్స్ పైచేయి సాధించింది. నెట్‌ఫ్లిక్స్ రోజురోజుకు కొత్తవారిని తనవైపు తిప్పుకుంటూ వృద్ధిని సాధిస్తుండగా, ప్రైమ్ వీడియో మాత్రం నిరంతర క్షీణతను చవిచూస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు చిత్రనిర్మాతలకు ప్రధాన వేదికగా మారింది. భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన కథలతో కూడిన ఒరిజినల్స్‌పై దృష్టి సారించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ తన స్థాయిని కూడా పెంచుకుంది. ధరలు కొద్దిగా తగ్గించడం కూడా బాగా కలిసొచ్చింది. అయితే, ప్రైమ్ వీడియోలో ప్రకటనలను ప్రవేశపెట్టడం మేలు కంటే కీడే ఎక్కువ చేసింది, ఆపై సబ్స్క్రిప్షన్ ఖర్చు కూడా పెరిగింది. అయితే, భారత్‌లో జియోహాట్‌స్టార్ టాప్‌లో ఉంది. ఏకంగా 500 మిలియన్ల ( 50 కోట్ల) నెలవారి వినియోగదారులు ఈ సంస్థకు ఉన్నారు. -
ఓటీటీలోకి లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘యూత్’. మార్చి 19న తమిళ్లో విడుదలైన ఈ చిత్రం..అక్కడ సూపర్ హిట్ టాక్‌తో భారీ కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇక అదే నెల 27న తెలుగులో విడుదలైంది. అయితే తమిళ్‌తో పోలిస్తే..తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో రాబోతుంది. ఏప్రిల్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.యూత్ కథేంటంటే..ప్రవీణ్ (కెన్ కరుణాస్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. తండ్రి ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు) బెకరీ నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తాడు. తల్లి సరోజ(దేవదర్శిని) ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కొడుకు అంటే ప్రాణం. తండ్రికి మాత్రం ప్రవీణ్ చేసే పనులు నచ్చవు. చదువు పక్కకు పెట్టి.. అమ్మాయిలకు సైట్ కొడుతుంటాడు. ఆయన చేష్టలకు స్కూల్లో ఏ అమ్మాయి అతని వైపు చూసేది కాదు. కానీ ఇంటర్లో మాత్రం గంగవల్లి (అనీషా అనిల్ కుమార్), ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనాల్ (ప్రియాన్షీ యాదవ్).. ముగ్గురు తన జీవితంలోకి వస్తారు. ఆ ముగ్గురి వల్ల ప్రవీణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? బ్రేకప్స్, అవమానాలతో ప్రవీణ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి? తల్లి సరోజకు వచ్చిన సమస్య ఏంటి? బాగా చదువుకోవాలని ఆశపడ్డ తల్లిదండ్రుల కోరికను ప్రవీణ్ నెరవేర్చాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.Ada ennada ithu kaadhaluku vandha sodhanai? 🤭💔 pic.twitter.com/gJHkSEqa9N— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026 -
ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు కాస్త లేటుగా ఓటీటీలోకి వస్తాయి. ఫ్లాప్ సినిమా అయినా సరే థియేటర్స్‌లో రిలీజ్ అయిన తర్వాత కనీసం నాలుగు వారాల గ్యాప్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ పవన్ కల్యాణ్ తాజాగా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నెలలోపే ఓటీటీలోకి వచ్చింది. ఏప్రిల్ 16 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెటిఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.థియేటర్స్‌లో ఫ్లాప్ టాక్.. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. శ్రీలీల, రాఖీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. మరోవైపు అదే రోజు వచ్చిన దురంధర్ 2 చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో ఉస్తాద్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఎంతలా అంటే నిర్మాణ సంస్థ కనీసం కలెక్షన్స్ పోస్టర్ కూడా వేసుకోలేకపోయింది.నెలలోపే.. వాస్తవానికి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని కనీసం 5-6 వారాల గ్యాప్‌తో ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారట. కానీ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ముందే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16 నుంచి నెట్‌ఫ్లిక్‌లో అందుబాటులోకి వస్తుంది. తెలుగులో పాటు హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. మరి ఓటీటీలో అయినా పాజిటివ్ టాక్ సంపాదించుకుంటుందో లేదో తెలియాలంటే ఏప్రిల్ 16 వరకు ఆగాల్సిందే. Peru Bhagat, kaani udhyamam ey thana gurthimpu 🔥🚨 pic.twitter.com/5tYUxKmuKA— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026 -
ఓటీటీల్లో శుక్రవారం సందడి.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త హడావుడి ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న డకాయిట్, కోలీవుడ్ నుంచి ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి ఎల్ఐకే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో డకాయిట్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎల్ఐకే మూవీపై కూడా కాస్తా బజ్ ఏర్పడింది.ఇక ఓటీటీల్లోనూ ఫ్రైడే సినిమాల సందడి ఉంటుంది. ఈ శుక్రవారం పలు సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటిలో తాయ్ కిజవి, తూ యా మైన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్తు యా మై (హిందీ సినిమా) - ఏప్రిల్ 10త్రాష్ (ఇంగ్లీష్ చిత్రం) - ఏప్రిల్ 10టర్న్ ఆఫ్ ది టైడ్- సీజన్-3-(హాలీవుడ్ సిరీస్) ఏప్రిల్ 10అమెజాన్ ప్రైమ్ క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 10 ఓ రోమియో(హిందీ సినిమా)- ఏప్రిల్ 10జియో హాట్స్టార్తాయ్ కిజవి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10హ్యాక్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 10సోనీ లివ్ తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 10జీ5ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్) - ఏప్రిల్ 10ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్ హండా(హిందీ మూవీ)- ఏప్రిల్ 10సన్ నెక్స్ట్ హాళ్(మలయాళ సినిమా) - ఏప్రిల్ 10 కనిమంగళం కొవిలకమ్ (మలయాళ చిత్రం) - ఏప్రిల్ 10ఆపిల్ టీవీ ప్లస్ ఔట్‌కమ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 10లయన్స్ గేట్ ప్లే వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10 -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడవుడి ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్లో శర్వానంద్ బైకర్ రిలీజ్ కానుంది. దీంతో పాటు సంగీత్ శోభన్ కొత్త సినిమా రాకాస థియేటర్లలో సందడి చేయనుంది. వీటితో పాటు సముద్రఖని కార్మేని సెల్వం ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటిలో బైకర్ మూవీపై ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ అయింది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ మృత్యుంజయ్ ఈ ఫ్రైడే ఓటీటీలో సందడి చేయనుంది. మరో తెలుగు సినిమా సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని కూడా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియన్స్ విషయానికొస్తే ఈ రెండు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫిక్స్..మృత్యుంజయ్-(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03మామ్లా లీగల్ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03వధ్-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03బ్లడ్‌హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03గ్యాంగ్స్ ఆఫ్ గెలిసియా- సీజన్-2-(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03అమెజాన్ ప్రైమ్..మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 03జియో హాట్‌స్టార్..ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03జీ5..బాబ్జీ ఘర్ పర్ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03ఆపీల్ టీవీ ప్లస్..యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03సన్ నెక్ట్స్..వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03సోనీ లివ్సితారే జమీన్ పర్(బాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 03 -
ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు.. ఆ రెండు మాత్రమే స్పెషల్
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో మనకు కాస్తా రిలీఫ్ ఇచ్చేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అలా మిమ్మల్ని అలరించేందుకు ఈ వారం కూడా బోలెడ్ సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ శుక్రవారం ఎంటర్టైన్ చేసేందుకు శర్వానంద్ బైకర్, సంగీత్ శోభన్ రాకాస, సముద్రఖని కార్మేని సెల్వంతో పాటు లెజెండ్ శరవణన్ హీరోగా వస్తోన్న లీడర్ కూడా గ్రాండ్ రిలీజ్ కానుంది. వీటిలో బైకర్, రాకాస, కార్మేని సెల్వం చిత్రాలపై బజ్ ఉంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ వారంలో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. టాలీవుడ్ నుంచి సుహాస్ మూవీ హే బల్వంంత్, శ్రీ విష్ణు థ్రిల్లర్ మృత్యుంజయ్ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి సితారే జమీన్ పర్, హ్యాపీ పటేల్, వధ్-2 లాంటి మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లోకి రానున్నాయి. ఓవరాల్‌గా చూస్తే దాదాపు 16 మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్..రిపుల్(హాలీవుడ్ సిరీస్)- మార్చి 31హ్యాపీ పటేల్(హిందీ మూవీ)- ఏప్రిల్ 01జో కిట్టీ- సీజన్-3(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 02మృత్యుంజయ్(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03మామ్లా లీగల్ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03వధ్-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03బ్లడ్‌హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03అమెజాన్ ప్రైమ్..మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 04జియో హాట్‌స్టార్..సెండ్ హెల్ప్(హాలీవుడ్ హారర్ మూవీ)- మార్చి 31ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03జీ5..హే బల్వంత్(తెలుగు సినిమా)- మార్చి 31బాబ్జీ ఘర్ పర్ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03ఆపీల్ టీవీ ప్లస్..యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03సన్ నెక్ట్స్..వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03సోనీ లివ్సితారే జమీన్ పర్(బాలీవుజ్ మూవీ)-ఏప్రిల్ 03 -
ఓటీటీలో శ్రీవిష్ణు థ్రిల్లింగ్ సినిమా.. ప్రకటన వచ్చేసింది
టాలీవుడ్లో హీరో శ్రీవిష్ణు నటించిన కొత్త చిత్రం 'మృత్యుంజయ్' ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తన కామెడీ జానర్‌ని వదిలి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీతో థియేటర్లోకి వచ్చాడు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 6న విడుదలైంది. ఇందులో రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, చిన్నా, సుదర్శన్, రచ్చ రవి, బాలాదిత్య తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సందీప్ గున్నం మరియు వినయ్ చిలకపాటి నిర్మించగా, కాల భైరవ సంగీతం అందించారు.'మృత్యుంజయ్' సినిమా ఏప్రిల్ 3న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్(Netflix) అప్‌కమింగ్ చిత్రాల జాబితాలో అధికారికంగా ప్రకటించింది. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించంది. అయితే, ఓటీటీలో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఈ వీకెండ్లో థ్రిల్ తెప్పించే సినిమాగా 'మృత్యుంజయ్' ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.కథేంటంటే.. జయ్ (శ్రీవిష్ణు)..ఓ ప్రముఖ దినపత్రికలో యాడ్ డిపార్ట్మెంట్లో పని చేస్తుంటాడు. ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్‌గా మారాలనేది తన కల. ‘శ్రద్ధాంజలి’ యాడ్స్ కోసం చనిపోయిన వారి ఇంటికి వెళ్లి.. వాళ్ల గురించి గొప్పలు చెబుతూ కుటుంబ సభ్యుల నుంచి ప్రకటనల్ని తీసుకోస్తుంటాడు. అలా ఓ సారి అచ్యుత్‌రావు (బాలాదిత్య) అనే వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని.. వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ సైలెంట్‌గా ఉన్న అచ్యుత్‌రావు కూతురు అంజలిని చూడగానే అతని బ్యాల్యం గుర్తొస్తుంది. ఆమె అమాయకంగా ‘మా నాన్నకు అలా ఎందుకైంది’ అని ప్రశ్నించడం చూసి చలించిపోతాడు.చిన్నారి ప్రశ్నకు సమాధానం చెప్పాలకుంటాడు. మూడు రోజుల తర్వాత అచ్యుత్ తరహాలోనే విక్రాంత్ అనే వ్యక్తి కూడా మరణిస్తాడు. అయితే ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన మరణాలే అని పోలీసులు నిర్ధారణకు వస్తారు. కానీ ఏసీపీ సీత(రెబా మోనికా జాన్) మాత్రం ఈ మరణాల వెనుక ఏవైనా రహస్యాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ మొదలుపెడుతుంది. అవి ప్రమాదాలు కావని హత్యలని జయ్ తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ఏసీపీ సీతతోనూ చెబుతాడు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆమె పట్టించుకోదు. జయ్ మాత్రం ఈ హత్యల వెనుక ఉన్నదెవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు.నిజంగానే జయ్ చెప్పినట్టుగా అవి హత్యలేనా? ఎవరు చేసారు? ఎందుకు చేశారు? హంతకుడిని కనిపెట్టే క్రమలో జయ్‌కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. -
థియేటర్లలో బ్యాండ్ మేళం, సుయోధన.. ఓటీటీల్లో ఒక్క రోజే 11 సినిమాలు..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ వారం తెలుగులో 'కోర్ట్' జంట నటించిన బ్యాండ్ మేళం, ప్రియదర్శి సుయోధన థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ చిత్రాలైన 'యూత్', 'హ్యాపీరాజ్' రిలీజ్ అవుతున్నాయి .ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే క్రేజ్ ఉన్న మూవీస్ ఏమీ రావట్లేదు. విజయ్ సేతుపతి 'కాట్టాన్' సిరీస్ మస్తిష్క మరణం, మర్దానీ 3 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ అనిపించేలా ఉన్నాయి. ఈ శుక్రవారం ఓటీటీల్లో దాదాపు 11 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓవరాల్‌గా చూస్తే ఈ ఫ్రైడే పెద్దగా ఆసక్తి పెంచే చిత్రాలేవీ కనిపించడం లేదు. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మస్తిష్క మరణం(మలయాళ మూవీ)- మార్చి 27మర్దానీ 3 (హిందీ సినిమా)-మార్చి 27ది రిటర్న్(డాక్యుమెంటరీ)- మార్చి 2753 సండేస్(హాలీవుడ్ మూవీ)- మార్చి 27అమెజాన్ ప్రైమ్ఓ రోమియో (హిందీ మూవీ) - మార్చి 27హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27జియో హాట్స్టార్కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 27జీ5ప్రజాపతి 2 (బెంగాలీ సినిమా) - మార్చి 27హే కాయ్ నవీన్ (మరాఠీ సిరీస్) - మార్చి 27ఆపిల్ టీవీ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27సన్ నెక్ట్స్మాయ బింబుమ్(తమిళ సినిమా)- మార్చి 27 -
‘నెట్‌ఫ్లిక్స్’లో ‘బీటీఎస్’ పచ్చి నిజాలు?
సియోల్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న పాప్ సెన్సేషన్ బీటీఎస్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. తన సొంత సంస్థ ‘హైబ్’(HYBE)తోనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ కొరియన్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, ముఖ్యంగా మాతృభాషలో పాటలు పాడేందుకు ‘బీటీఎస్ ’ ఏడుగురు సభ్యులు చేసిన అంతర్గత పోరాటం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సాక్షిగా వెలుగులోకి వచ్చింది.ఇంగ్లీష్ వద్దు.. కొరియన్ ముద్దు!బీటీఎస్ కొత్త ఆల్బమ్ ‘అరిరంగ్’ (Arirang) నిర్మాణ సమయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ త్వరలో విడుదల చేయనున్న ‘బీటీఎస్ : ది రిటర్న్స్’ డాక్యుమెంటరీ ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఆల్బమ్‌లో ఎక్కువ ఇంగ్లీష్ పాటలు ఉండాలని ‘హైబ్’ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. అయితే ఆర్ఎం,సుగా, జిన్, జె-హోప్, జిమిన్, వీ, జంగ్‌కుక్.. ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ‘కనీసం రాప్ భాగాల్లోనైనా కొరియన్ పదాలు ఉండాల్సిందే’ అని వారు మేనేజ్మెంట్తో వాదించినట్లు సమాచారం. ముఖ్యంగా జిమిన్ తన ఇంగ్లీష్ ఉచ్చారణ వల్ల పాట సహజత్వం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేయగా, లీడర్ ఆర్ఎం తమ మూలాలను వదులుకోవడానికి ఇష్టపడలేదు.నికోల్ కిమ్ వ్యాఖ్యలపై ‘ఆర్మీ’ ఆగ్రహంబిగ్ హిట్ మ్యూజిక్ వైస్ ప్రెసిడెంట్ నికోల్ కిమ్ తీరు ఇప్పుడు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. బీటీఎస్ కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిన ‘ఆన్’, బ్లాక్ స్వాన్’వంటి పాటలు జనాలకు అంతగా కనెక్ట్ కాలేదని ఆమె వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. ఇంగ్లీష్ పాటలు ఉంటేనే గ్లోబల్ సక్సెస్ సాధ్యమని ఆమె వాదించడాన్ని సోషల్ మీడియాలో ‘ఆర్మ్మీ’(బీటీఎస్ ఫ్యాన్స్) తప్పుబడుతున్నారు. ‘మాతృభాషలో పాడి ప్రపంచాన్ని జయించిన వారిని మార్చాలని చూడటం మూర్ఖత్వం" అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.వివాదాల నడుమ రికార్డుల వర్షంఇలాంటి విమర్శలు వివాదాలు ఎన్ని వస్తున్నా ‘అరిరంగ్’ మాత్రం రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే స్పాటిఫైలో 110 మిలియన్ల స్ట్రీమ్స్ సాధించడమే కాకుండా, కేవలం మూడు రోజుల్లోనే 40 లక్షల ఆల్బమ్ కాపీలు అమ్ముడయ్యాయి. గ్వాంగ్వామున్ ఈవెంట్లో రద్దీ వల్ల ‘హైబ్’ షేర్లు స్వల్పంగా తగ్గినప్పటికీ, మ్యూజిక్ చార్ట్స్‌లో మాత్రం బీటీఎస్ తిరుగులేని విధంగా దూసుకుపోతోంది.ఇది కూడా చదవండి: Bengal: బీజేపీ సంచలనం.. ‘ఆర్జీ కర్’ బాధితురాలి తల్లికి న్యాయం? -
దురంధర్, బోర్డర్-2 కాదు.. ఆ చిన్న సినిమానే నంబర్‌వన్..!
ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీపై పలువురు సౌత్ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు.ఈ మూవీ ఓటీటీకి వచ్చిన తొలివారంలోనే నంబర్ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. రెండు వారాలు పూర్తి అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో నానా-ఇంగ్లీష్ కేటగిరీలో బోర్డర్-2, దురంధర్ చిత్రాలను వెనక్కి నెట్టి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.వరుసగా రెండవ వారం కూడా మేడ్ ఇన్ కొరియా ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఒక దక్షిణాది చిత్రం ఇటువంటి ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించడం మరింత ప్రత్యేకంగా నిలిచిందని రాసుకొచ్చారు. ఈ మూవీకి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన మీ ప్రేమకు, సందేశాలకు, ఫోన్ కాల్స్‌కు ధన్యవాదాలు.. మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. ఓ మహిళా ఓరియంటెడ్ మూవీ ఇంతటి ఆదరణను పొందడం మాకు ఎంతో గర్వకారణమన్నారు. ప్రియాంక మోహన్.. నీ నీ కృషికి తగిన ఫలితం రావడం నాకు చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Really happy to share that #madeinkorea is trending globally NO 1 for the 2nd week in the Non-English Movies category on Netflix 🌍For the first time, a South Indian film has reached this kind of global scale and to sustain it into the second week makes it even more special ❤️… pic.twitter.com/3LNAdVkxpM— Ra.Karthik (@Rakarthik_dir) March 25, 2026 -
ఈ వారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 17 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వీక్‌లో పెద్ద సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. బాలీవుడ్ నుంచి దురంధర్-2, టాలీవుడ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే దురంధర్ బాక్సాఫీస్‌ను షేర్ చేయగా సీక్వెల్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికొస్తే టాలీవుడ్లో మాత్రమే కాస్తా బజ్ ఉంది. అంతకుమించి ఈ మూవీపై పెద్ద అంచనాల్లేవు.ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. వీటిలో టాలీవుడ్ నుంచి సీతాపయనం, జటాధర, బాలీవుడ్ మూవీ బోర్డర్-2 స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే జటాధర ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా జీ5లో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు చిరాయ, ల్యాండ్ లార్డ్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్..రేడియోయాక్టివ్ ఎమర్జన్సీ(వెబ్ సిరీస్)- మార్చి 18ప్యూరియస్ సీజన్-2- (వెబ్ సిరీస్)- మార్చి 18పీకీ బ్లైండర్స్ ది ఇమ్మార్షల్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- మార్చి 20బోర్డర్-2(హిందీ మూవీ)- మార్చి 20ది రైజ్ ఆఫ్ ది రెడ్‌హాట్ చిల్లి పెప్పర్స్(డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20 ఏ డిఫరెంట్ మ్యాన్ (హాలీవుడ్ సినిమా)- మార్చి 20అమెజాన్ ప్రైమ్..ఇన్విసిబుల్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 18ది హౌస్‌మెయిడ్(హాలీవుడ్ మూవీ)- మార్చి 19డెడ్ లాక్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 20 అమోర్ యానిమల్ (వెబ్ సిరీస్): మార్చి 20జీ5..ల్యాండ్ లార్డ్(డబ్బింగ్ సినిమా)- మార్చి 19కాసర్గడ్ ఎంబసీ(డబ్బింగ్ మూవీ)- మార్చి 20జటాధర(తెలుగు సినిమా)- మార్చి 20జియో హాట్‌స్టార్..చిరైయా(హిందీ మూవీ)- మార్చి 20యాపిల్ టీవీ..ఇమ్పర్ఫెక్ట్ ఉమెన్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ).. మార్చి 18సోనీ లివ్..జజ్ సిటీ(బెంగాలీ మూవీ)- మార్చి 19సన్ నెక్ట్స్..సీతా పయనం (తెలుగు సినిమా)- మార్చి 20 -
ఓటీటీలో దూసుకెళ్తోన్న ఓజీ హీరోయిన్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.ప్రస్తుతం ఈ మూవీపై పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కోలీవుడ్ ప్రమఖులు ముఖ్యంగా ప్రియాంక మోహన్ నటనను కొనియాడుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం ట్వీట్ చేశారు. మనసుకు నచ్చే అద్భుతమైన కథనం, దృశ్యాలు, ప్రియాంక మోహన్ పాత్రలోని అమాయకత్వం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ప్రియాంక మోహన్ చాలా అద్భుతంగా నటించారని అన్నారు. డైరెక్టర్‌తో పాటు చిత్రబృందానికి అభినందనలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేశారు.నంబర్‌వన్‌గా ట్రెండింగ్..ఈనెల 12న స్ట్రీమింగ్ వచ్చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నంబర్‌వన్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. #MadeInKorea… Such a Warm, feel-good storytelling with lovely visuals. The small-town innocence of @priyankaamohan’s character stands out.. she delivered a beautiful performance… @Rakarthik_dir keeps it simple and engaging! Congratulations to the entire team 🫶 @NetflixIndia… pic.twitter.com/a3jKrMKep1— Naga Vamsi (@vamsi84) March 15, 2026 -
నెట్‌ఫ్లిక్స్‌తో హైదరాబాద్‌కు హాలీవుడ్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు హాలీవుడ్‌ను రప్పించాలనే తన కల నెట్‌ఫ్లిక్స్ ద్వారా నిజం కాబోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీల పెట్టుబడులను హైదరాబాద్‌కు రప్పించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారానికి చిరునామాగా ఉన్న తెలంగాణకు వచ్చే పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో గురువారం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినిమారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటుండగా, బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఇక్కడ నుంచే వచ్చాయి. ప్రపంచ సంస్థలకు వేదికగా నిలుస్తున్న హైదరాబాద్ అన్ని రకాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ విస్తరణకు అవసరమైన అన్ని సదుపాయాలు, సహకారాన్ని మా ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చూపే అద్భుత అవకాశం వినోదరంగంలో పేరొందిన నెట్‌ఫ్లిక్స్, ఐలైన్ ద్వారా లభిస్తుంది. క్రీడా రంగంలో మౌలిక వసతుల కల్పన, క్రీడా విశ్వ విద్యాలయాల ఏర్పాటు వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలో క్రీడల ప్రసార రంగంలోనూ అడుగుపెడుతున్న నెట్‌ఫ్లిక్స్ నుంచి సహకారాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో నెటిఫ్లిక్స్ ఆఫీసు నిర్మాణానికి అవసరమైన భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీసును ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలి’అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఐలైన్ స్టూడియో కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు, దిల్‌రాజు, రానా, సంజయ్‌జాజు, జెఫ్షాపిరో తదితరులు తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం: మంత్రి దుద్దిళ్ల యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్‌లో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవుతుంది. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్‌లైన్‌లో నగరం నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుంది. ప్రపంచస్థాయి నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణల వాతావరణంతోపాటు స్థానిక యువత కు భవిష్యత్తు నైపుణ్యాలు ఐలైన్ స్టూడియో ద్వారా అందుబాటులోకి వస్తాయి. పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నెట్‌ఫ్లిక్స్ భాగస్వామిగా మారాలి’అని శ్రీధర్‌బాబు చెప్పారు. ఆవిష్కరణలకు కేంద్రం: సంజయ్‘వేగంగా విస్తరిస్తున్న మీడియా, వినోద రంగ మౌలిక సదుపాయాలతో.. ప్రతిభకూ, ఆవిష్కరణలకూ శక్తిమంతమైన కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. సాంకేతిక ఆవిష్కరణలను కథన కళారీతులతో మేళవిస్తూ దక్షిణాసియాలో ముఖ్యమైన కేంద్రంగా ఐలైన్ స్టూడియోస్ సేవలందిస్తుంది. అలాగే దృశ్య శ్రవణ, వినోద రంగాల్లో సరికొత్త అవకాశాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 15వేల పాఠశాలలు, కాలేజీల్లో 500 కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించింది. తద్వారా సృజనాత్మక రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. భారత సృజనాత్మక సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) త్వరలోనే హైదరాబాద్‌లో ప్రాంతీయ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించనున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా హైదరాబాద్‌లో ఐలైన్ స్టూడియోస్ 32వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. ఇందులో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, జనరేటివ్ వర్చువల్ ఎఫెక్ట్స్ కోసం ఆధునిక సాంకేతికత ఉంటుంది, ఈ స్టూడియో లాస్ ఏంజెలిస్, వాంకోవర్, సియోల్, లండన్‌లో స్థాపించిన నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో సినీ నటుడు రానా దగ్గుబాటి, ఐలైన్ స్టూడియోస్ సీఈఓ జెఫ్ షాపిరో, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ కార్యకలాపాలు (ఫోటోలు)
-
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్.. ఐలైన్ స్టూడియో ప్రారంభం
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.ఓ వైపు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే... మరోవైపు స్కిల్లింగ్, రీ – స్కిల్లింగ్, అప్ – స్కిల్లింగ్ పై దృష్టి సారించిందన్నారు. గురువారం హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ కు నెట్ ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్ లో ‘తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్‌లైన్‌లో నగరం ఓ నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్స్, అడ్వాన్స్డ్ టూల్స్, ఇన్నోవేషన్-లెడ్ వర్క్ ఫ్లో ఇక్కడి ఎకో సిస్టంలో భాగమవుతాయని, ఇక్కడి యువతకు ఫ్యూచర్ రెడీ స్కిల్స్ లభిస్తాయన్నారు.పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులను కోరారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో స్టూడియోను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. -
నెట్‌ఫ్లిక్స్‌తో నా కల నిజం కాబోతుంది: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్రబింధువుగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు ఆ సంస్థ కొనసాగించనుంది. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను మీడియా ద్వారా పంచుకున్నారు.సినిమాలపై తనకు కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా అన్నారు. 'నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయి. బాహుబలి,కల్కి,ఆర్ఆర్ఆర్ ,అరుంధతి వంటి అత్యనున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయి. చెన్నైలో ఉన్న సినిమాను ఎన్టీఆర్ ,అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. ఇప్పుడు కాలంతో పాటు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే . మా దృష్టి హాలివుడ్పైనే అని నేను గతంలోనే చెప్పాను. నెట్‌ఫ్లిక్స్‌తో నా కల నిజం కాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు మా పూర్తి సహకారం ఉంటుంది ..ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నాం ..నెట్‌ఫ్లిక్స్ వ్యాపార విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణలో పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారానికి అనుకూలత ప్రదేశమని సీఎం అన్నారు. -
ఓటీటీకి మలయాళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అక్కడ సూపర్ హిట్ అయినా సినిమాలను డబ్ చేసి అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో మలయాళ హిట్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ పెన్నుమ్ పోరాట్టమ్.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.ఈ సినిమాకు రాజేశ్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాజేశ్ మాధవన్, రైనా రాధాకృష్ణన్, సుభాష్ చంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కేరళలోని ఓ గ్రామం చుట్టూ తిరిగే కథాంశంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ గ్రామంలోని రూల్స్‌ను ఓ యువతి, ఓ కుక్క ఎలా బ్రేక్ చేశారనే కోణంలో సెటైరికల్‌గా తెరకెక్కించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. Watch Pennum Porattum on Netflix, out 13 March, in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada#PennumPorattumOnNetflix@dawn1720 @ArunCThampi22 @stkframes @binugeorgealex@akhilvishnu_vs— Netflix India South (@Netflix_INSouth) March 10, 2026 -
హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్.. భారీగా అవకాశాలు
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో అతిపెద్ద కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్రబింధువు కానుంది. ఇక్కడ ప్రపంచస్థాయి వీఎఫ్ఎక్స్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్ హౌజ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధి కూడా కల్పించనుంది. ‘నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్’ హైదరాబాద్‌కు రావడంతో టాలీవుడ్ పరిశ్రమలో కొత్త శకం మొదలు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో అడుగు పెట్టి పదేళ్లు పూర్తి అయింది.ఈ నేపథ్యంలోనే కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనుంది. అయితే, ఇప్పటికే ముంబై నుంచి నెట్‌ఫ్లిక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్‌లో రెండో కార్యాలయం అవుతుంది. ఇక నుంచి హైదరాబాద్‌లోనే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (ఏవీజీసీ) రంగం మరింత మరింత బలోపేతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రతిభ ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ సేవలను కూడా ఇక నుంచి హైదరాబాద్ నుంచే కొనసాగనున్నాయి. -
ఫ్రైడే ఓటీటీ సినిమాల సందడి.. ఒక్క రోజే ఏకంగా 12 చిత్రాలు..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో శ్రీ విష్ణు మృత్యుంజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ సరస్వతి లాంటి సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. వీటితో పాటు చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి లాంటి చిన్న సినిమాలు థియేటర్లకు వచ్చేస్తున్నాయి. అయితే వీటిపై పెద్దగా బజ్ లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే విత్ లవ్, గాంధీ టాక్స్ అనే డబ్బింగ్ మూవీస్ సందడి చేయనున్నాయి. వీటితో పలు వెబ్ సిరీస్‌లు, చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. అంతేకాకుండా మరికొన్ని సినిమాలు సడన్‌గా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ ఫ్రైడే ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06 హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - మార్చి 06 వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 06బాయ్ ఫ్రెండ్ ఆన్ డిమాండ్(హాలీవుడ్ సిరీస్)- మార్చి 06 స్టిల్ షైనింగ్(కొరియన్ వెబ్ సిరీస్)- మార్చి 06జియో హాట్‌స్టార్ విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) - మార్చి 06 టెడ్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మార్చి 06సోనీ లివ్ లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) - మార్చి 06సన్ నెక్స్ట్ డియర్ రథి (తమిళ సినిమా) - మార్చి 06 గ్రానీ (తమిళ మూవీ) - మార్చి 06జీ5 గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06 జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) - మార్చి 06 -
ఓజీ హీరోయిన్ ఓటీటీ మూవీ.. ఎమోషనల్‌గా ట్రైలర్
మొబైల్ ఫోన్ వినియోగం పెరిగాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. అలాగే ఓటీటీలు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ అంతా ఎంచక్కా ఉన్నచోటునే చూసే అవకాశం లభించింది. అలా చాలామంది కొరియన్ సినిమాలు, సిరీస్‌లకు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా కొందరమ్మాయిలైతే బానిసలైపోయారు!ఓటీటీ సినిమాదీంతో ఈ కొరియన్ కాన్సెప్ట్‌తో ఓ మూవీ తీశారు. ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ వదిలారు. అందులో ఓ అమ్మాయికి చిన్నప్పటినుంచి కొరియా అంటే చాలా ఇష్టం. కనీసం ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలన్నది తన కోరిక. అనుకున్నట్లుగా పెద్దయ్యాక ఎలాగోలా కొరియా వెళ్తుంది. కానీ అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అదే ట్రైలర్లో చూపించారు.మనసు చెప్పేది వినండిమనకు నచ్చిన పనిచేయడం కోసం ఎంతదూరమైనా వెళ్లొచ్చు. నీవల్ల కాదు అంటారు. తెలియనివారు మనపై ప్రేమ చూపిస్తారు.. బాగా తెలిసినవారు మనల్ని బాధపెడతారు. ఎంత ఏడ్చినా, ఎంత నవ్వినా.. మనల్ని చీరప్ చేసి మేమున్నామంటూ మనకోసం నలుగురు వస్తారు. ఈ అనుభవాల్ని మీకు ఎదురవ్వాలంటే మీ మనసు చెప్పేది వినండి అని హీరోయిన్ చెప్పే డైలాగ్ బాగుంది. మేడ్ ఇన్ కొరియా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 12న విడుదల కానుంది. చదవండి: ఆస్తుల్లేవ్.. అద్దె ఇంట్లో ఉంటున్నా: వరలక్ష్మి -
ఓటీటీలో హిట్ సినిమా.. విత్ లవ్ రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకుడిగా, హీరోగా తొలి సినిమాలకే హిట్టు కొట్టి సెన్సేషన్ అయ్యాడు అభిషన్ జీవింత్. ఇతడు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం ఏకంగా రూ.90 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. నెక్స్ట్ సినిమా ఎవరితో అనుకుంటున్న తరుణంలో ఈ యంగ్ డైరెక్టర్ హీరోగా మారాడు. విత్ లవ్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు.ఓటీటీలో విత్ లవ్అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించాడు. సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా వ్యవహరించింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా విత్ లవ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తుంది. మార్చి 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి మరి.కథేంటంటే?సత్య (అభిషన్ జీవింత్) ఆర్కిటెక్ట్.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అలా ఒకరోజు అక్క బలవంతంతో కాఫీ షాప్‌లో ఓ అమ్మాయిని చూసేందుకు వెళ్తాడు. ఆ అమ్మాయే మోనీషా (అనస్వర రాజన్). మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్లో చదివామని, ఇద్దరూ సీనియర్- జూనియర్ అని తెలుస్తుంది. తమ చిన్నతనంలో ఎవర్నైతే ప్రేమించారో వారిని ఒకసారి కలవాలనుకుంటారు. మరి తర్వాతేం జరిగింది? వాళ్లని కలిశారా? ఈ పెళ్లి చూపులు ఏమయ్యాయి? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే! #WithLove will be streaming from March 6 on NETFLIX. pic.twitter.com/IoSzc2TXwW— Christopher Kanagaraj (@Chrissuccess) March 1, 2026 చదవండి: దుబాయ్‌లో చిక్కుకున్నా.. నన్ను భారత్‌కు తీసుకురండి: బాలీవుడ్ నటి -
ట్రంప్ వ్యూహం.. వార్నర్ బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్ బిగ్ డీల్‌కు బ్రేక్..
వార్నర్ బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్ మధ్య కుదిరిన భారీ డీల్‌కు బ్రేక్ పడింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు కొద్దిరోజుల క్రితం ఆసక్తి చూపిన నెట్‌ఫ్లిక్స్ (Netflix).. ఇప్పుడు వెనక్కు తగ్గింది. ఈ నిర్ణయంతో మీడియా దిగ్గజంగా ఎదగాలనుకున్న నెట్‌ఫ్లిక్స్ ఆశలకు గండి పడింది.నెట్‌ఫ్లిక్స్- వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మధ్య కుదిరిన డీల్‌కు అంతరాయం కలిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం రచించారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న పారామౌంట్ స్కైడ్యాన్స్ రంగంలోకి రానుందని వార్తలు వస్తున్నాయి. వార్నర్ బ్రదర్స్‌ను చేజిక్కించుకునేందుకు 108.4 బిలియన్ డాలర్ల బిడ్‌ను పారామౌంట్ వేసింది. ఈ బిడ్ వెనక ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ ఉన్నట్లు అక్కడి మీడియా కథనం రాసింది.వార్నర్ బ్రదర్స్ సంస్థతో నెట్‌ఫ్లిక్స్ కుదుర్చుకున్న 72 బిలియన్ డాలర్ల ( రూ.6.48 లక్షల కోట్లు) ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ ట్రంప్ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన హ్యూహం వల్లే ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన డీల్ బ్రేక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వార్నర్ బ్రదర్స్‌ను సులువుగా పారామౌంట్ స్కైడ్యాన్స్ సంస్థ దక్కించుకునే ఛాన్స్ ఉంది. -
ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒక్కరోజే ఏకంగా 11 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం రాగానే కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ ఫిబ్రవరిలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఈ చివరి వారంలో బాక్సాఫీస్ సందడి చేసేందుకు విష్ణు విన్యాసం అంటూ వచ్చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈ మూవీపైనే ఆడియన్స్‌లో కాస్తా బజ్ క్రియేట్ అయింది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా 'ఉత్తుత్త హీరోలు', 'సన్నాఫ్' చిత్రాలు రిలీజ్ కానున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్ థ్రిల్లర్ మూవీ హనీ భయపెట్టేందుకు వచ్చేస్తోంది. దీంతో పాటు తెలుగు సినిమా డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, అక్యూజ్డ్ అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సైతం ఈ ఫ్రైడే ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 27అమెజాన్ ప్రైమ్హనీ(తెలుగు సినిమా)- ఫిబ్రవరి 27జియో హాట్‌స్టార్ రోస్లిన్ (తెలుగు వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 27 బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28 బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28జీ5 డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27 తడయమ్ (తమిళ సిరీస్) - ఫిబ్రవరి 27 క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) - ఫిబ్రవరి 27అబార్ ప్రోలోయ్- సీజన్-2(బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 27 అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) - ఫిబ్రవరి 28ఆహా సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ షో) - ఫిబ్రవరి 27సన్ నెక్స్ట్ హనీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 27 నీలి హక్కీ (కన్నడ మూవీ) - ఫిబ్రవరి 27ఆపిల్ టీవీ ప్లస్ మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 27 -
కలల ప్రయాణం
తమిళనాడులోని ఒక చిన్న పట్టణానికి చెందిన శెన్బాకి దక్షిణ కొరియాకు వెళ్లాలన్నది పెద్ద కల. ఆ కల నిజమవుతున్న ప్రయాణాన్ని చూపించే ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం మార్చి 12న నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ‘స్క్విడ్ గేమ్’ ఫేమ్ దక్షిణ కొరియా నటుడుపార్క్ హ్యే–జిన్,నో హో–జిన్ ఈ సినిమాలోని ప్రధానపాత్రల్లో నటించారు. ఆర్ఏ కార్తీక్ దర్శకత్వంలో రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.ఈ చిత్రవిశేషాల గురించి ప్రియాంక చెబుతూ– ‘‘మేడ్ ఇన్ కొరియా’ కథ విన్నప్పుడే శెన్బాపాత్రతో నాకు బలమైన అనుబంధం ఏర్పడింది. ఇంత అద్భుతమైనపాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘కొరియన్, తమిళ సంస్కృతుల మధ్య ఉన్న చారిత్రక అనుబంధాలు నాకు ఎంతో ఆసక్తిని కలిగించాయి. ఆ స్ఫూర్తితోనే ఈ కథ తయారు చేశాను. మనసుల్ని హత్తుకునే స్లైస్ ఆఫ్ లైఫ్ చిత్రం ఇది.భాషల్ని దాటి ప్రపంచ సంస్కృతులను కలుపుతున్న కథలను ప్రోత్సహించిన నెట్‌ఫ్లిక్స్‌కు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు ఆర్ఏ కార్తీక్. ‘‘దక్షిణాది కథలపై మా దృష్టిని బలోపేతం చేస్తూ, స్థానిక సంస్కృతిలోపాతుకుపోయిన కథలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్. -
అలియా భట్ 'ఆల్ఫా'.. రూ. 215 కోట్ల ఢీల్ వద్దంటూ..
అలియా భట్. శార్వరీ వాఘ్ నటించిన స్పై థ్రిల్లర్ చిత్రం 'ఆల్ఫా'. దర్శకుడు శివ్ రావేల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, మొదట డిసెంబర్ 25, 2025న రిలీజ్ అనుకున్నారు. తర్వాత ఏప్రిల్ 17, 2026కి వాయిదా వేశారు.'ఆల్ఫా' సినిమాను థియేటర్లో కాకుండా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకోసం రూ. 215 కోట్లు నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ చేసినట్లు తెలిసిందే. అయితే, దానిని యశ్‌రాజ్ ఫిల్మ్స్ తిరస్కరించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ చిత్రం థియేటర్లలోనే విడుదల అవుతుందని తాజాగా ఆ సంస్ధ ధృవీకరించింది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించే సినిమాలన్నీ కూడా థియేటర్ స్లేట్లోని ఉంటాయని పేర్కొంది. ఎట్టిపరిస్థితిల్లోనూ నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో తమ భారీ చిత్రాలను ఉంచదని, ప్రేక్షకులకు సినిమాటిక్ అనుభవాలను అందించడంలో ప్రాముఖ్యతను ఇస్తామని యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతినిధి పేర్కొన్నారు. -
ఈ శుక్రవారం ఓటీటీ చిత్రాలు.. ఒక్కరోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఫ్రైడే వచ్చిందంటే చాలు కొత్త సినిమాలపై ఆడియన్స్‌లో ఆసక్తి ఓ రేంజ్లో ఉంటోంది. ఈ శుక్రవారం తెలుగులో సుహాస్ హీరోగా వస్తోన్న హే బల్వంత్, నవాబ్ కేఫ్ లాంటి చిన్న చిత్రాలు సందడి చేయనున్నాయి. వీటిలో హే బల్వంత్పైనే ఆడియన్స్ కొంతమేర బజ్ ఉంది. నవాబ్ కేఫ్‌పై కూడా ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం దాదాపు 13 సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. వీటిలో తెలుగు హారర్ థ్రిల్లర్ ఈషా మూవీతో పాటు కన్నడ, మలయాళ, తమిళ మూవీస్ సందడి చేయనున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ మూవీ కెన్నడీతో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి మీకిష్టమైన సినిమాలు చూసేయండి.నెట్ఫ్లిక్స్స్ట్రిప్ లా (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20పవనే(కొరియన్ మూవీ)- ఫిబ్రవరి 20 ఫైర్ బ్రేక్(స్పానిష్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 20 అమెజాన్ ప్రైమ్ ఈషా(తెలుగు హారర్ థ్రిల్లర్)- ఫిబ్రవరి 20తీర్థరూప తాండేయవారిగే-(కన్నడ సినిమా) — ఫిబ్రవరి 20హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 20జియో హాట్‌స్టార్ లక్కీ: ద సూపర్‌స్టార్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 20ఆహా హాట్‌స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 20జీ5 రాక్షస(కన్నడ క్రైమ్ థ్రిల్లర్)- ఫిబ్రవరి 20 పాతిరాత్రి(మలయాళ థ్రిల్లర్)- ఫిబ్రవరి 20 కెన్నడీ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 20సన్ నెక్ట్స్..అమోజ్ అలెగ్జాండర్-(మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్)- ఫిబ్రవరి 20ఒండిమునియుమ్ నల్లపడనుమ్- (తమిళ సినిమా)- ఫిబ్రవరి 20లయన్స్ గేట్ ప్లే హీటెడ్ రైవల్రీ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20ఆపిల్ టీవీ ప్లస్ద లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20 -
నెట్‌ఫ్లిక్స్ సినిమాల పండగ.. నేరుగా స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే..!
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే తీరు పూర్తిగా మారిపోయింది. నెల రోజుల్లోపే కొత్త సినిమాలు సందడి చేస్తుండడంతో ఆడియన్స్ ఇంట్లోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందించడంలో ఓటీటీలు సైతం పోటీ పడుతున్నాయి.తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాదిలో ఇండియా స్ట్రీమింగ్ సినిమాల జాబితాను ప్రకటించింది. 2026లో నేరుగా ఓటీటికీ వచ్చే చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌ల జాబితాను వెల్లడించింది. వీటిలో తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి.తెలుగు సినిమాలు..తక్షకుడు (మూవీ)సూపర్ సుబ్బు (తెలుగు వెబ్ సిరీస్)హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు..హమ్ హిందుస్థానీ(మూవీ)హలో బచ్చో..(మూవీ)ఇక్కా..(మూవీ)టోస్టర్..(మూవీ)మా బెహన్..(మూవీ)గాంధారి..(మూవీ)కర్తవ్య..(మూవీ)బాలీవుడ్ వెబ్ సిరీస్లుఫ్యామిలీ బిజినెస్..(వెబ్ సిరీస్)తలాశ్: ఎ మదర్స్ సెర్చ్..(వెబ్ సిరీస్)మిస్ మ్యాచ్డ్ : సీజన్4..(వెబ్ సిరీస్)ముజాఫర్ కేఫ్..(వెబ్ సిరీస్)లస్ట్ స్టోరీస్ సీజన్ 3..(వెబ్ సిరీస్)చుంబక్..(వెబ్ సిరీస్)ఖుస్కోర్ పండిట్..(వెబ్ సిరీస్) మామ్లా లీగల్ హై -సీజన్2..(వెబ్ సిరీస్)గ్లోరీ.. (వెబ్ సిరీస్)ఆపరేషన్ సఫేద్ సాగర్..(వెబ్ సిరీస్)కోలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు..మేడ్ ఇన్ కొరియా (మూవీ)లవ్ (తమిళ వెబ్ సిరీస్)లెగసీ (తమిళ వెబ్ సిరీస్)టాక్ షోగ్రేట్ ఇండియన్ కపిల్ షో- సీజన్-5 -
60 కోట్లు ఇస్తానన్న నెట్ ఫ్లిక్స్.. షాకిచ్చిన విజయ్
-
ఓటీటీల్లో సినిమాల పండగ.. ఒక్క రోజే 13 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. గతవారంలో థియేటర్లలో చిన్న సినిమాలు రిలీజైనా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ వారంలో విశ్వక్ సేన్ ఫంకీ మూవీ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచుతోంది. దీంతో పాటు అమరావతికి ఆహ్వానం, నీలవే, కపుల్ ఫ్రెండ్లీ లాంచి చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ సందడి చేస్తున్నాయి. ఈ ఫ్రైడే మరిన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. తెలుగు సినిమాలు లేకపోయినా పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ మూవీస్ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే దాదాపు 13 చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం ఓటీటీ సినిమాలునెట్ఫ్లిక్స్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13 మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ సిరీస్) - ఫిబ్రవరి 13 ద ఆర్ట్ ఆఫ్ సారా (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 13అమెజాన్ ప్రైమ్.. బ్యాండ్వాలే( హిందీ వెబ్ సిరీస్)-ఫిబ్రవరి 13 లవ్ మీ లవ్ మీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 13జియో హాట్‌స్టార్..ద కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 13జీ5భానుప్రియ భూతర్ హోటల్(బెంగాలీ హారర్ మూవీ)- ఫిబ్రవరి 13పాతిరాత్రి(మలయాళ సినిమా)- ఫిబ్రవరి 13ఉత్తర్(మరాఠీ సినిమా)- ఫిబ్రవరి 13సన్ నెక్స్ట్ సూర్య: పవర్ ఆఫ్ లవ్ (కన్నడ చిత్రం) - ఫిబ్రవరి 13 మాయబిమ్‌బుమ్(తమిళ సినిమా)-ఫిబ్రవరి 13ఆపిల్ టీవీ ప్లస్ ఎటర్నటీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13ది లయన్స్ గేట్ ప్లే..ది రఫ్‌నెక్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 13 -
డబుల్ థమాకా.. గతంలో బాలయ్య, నాని.. ఇప్పుడు శ్రీవిష్ణు
గతంలో ఒకసారి నందమూరి బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ , బంగారు బుల్లోడు చిత్రాలకు.. మరోసారి హీరో నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జండాపై కపిరాజు చిత్రాలకు ఇలాంటి సమస్యనే ఎదురైంది. తమ సినిమాల విడుదల విషయం తమ చేతిలో లేకపోవడం. ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి రావడం. ఇప్పుడు శ్రీవిష్ణుకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ఈ నెల చివర్లో ఓ ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. తను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. బాలయ్య రెండు చిత్రాలు ఒకేరోజు (1993 సెప్టెంబర్ 3) విడులైయ్యాయి. అలాగే నాని నటించిన రెండు చిత్రాలు 2015 మార్చి 21న విడుదలయ్యాయి.అయితే ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. కానీ స్లాట్ ఈ నెలలోనే ఇచ్చింది. అయితే అదే శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమాను మరో ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఆ సంస్థ కూడా ఇదే నెలకు డేట్ ఇచ్చింది. ఈ విషయంపై చర్చలు జరిగాయి కానీ నో యూజ్. ఇద్దరూ ఒకే తేదీపై పట్టుబడటంతో నిర్మాతలు, హీరో శ్రీవిష్ణు కూడా ఏం చేయలేని పరిస్థితి. రెండు సినిమాలు తనవే కావడంతో, రెండింటినీ సమానంగా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత శ్రీవిష్ణుపై పడింది. ఇప్పటికే మృత్యుంజయ్ టీజర్ విడుదలైంది. మరో రెండు రోజుల్లో విష్ణు విన్యాసం టీజర్ కూడా రానుంది. ఆ వారం ఈ రెండు సినిమాలు తప్ప మరే పెద్ద రిలీజ్ లేకపోవడం శ్రీవిష్ణు అదృష్టమే. రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. అయితే ఏదో ఒకటి ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ కంటెంట్ బలంగా ఉంటే మాత్రం రెండూ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి శ్రీవిష్ణుకు ఒకవైపు ఎంబ్రాసింగ్, మరోవైపు ఎక్సైటింగ్ కూడా. ఎందుకంటే ఒకేసారి రెండు సినిమాలు తనవే అని చెప్పుకోవడం అరుదైన విషయం. చూడాలి మరి చివరికి ఏమౌతుందో. విష్ణు విన్యాసం టీజర్ రిలీజైతే ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన అక్యూజ్డ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సినిమాకి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ చిత్రంలో కొంకణాసేన్ శర్మ కీలక పాత్రలో నటించారు. గతంలో ఆమె లైఫ్ ఇన్ ఏ మెట్రో, వేకప్ సిద్, ‘మెట్రో ఇన్ దినో’ లాంటి సినిమాల్లో నటించారు. Meera's living her dream life. Will a secret turn it into a nightmare?Watch Accused, starring Konkona Sensharma and Pratibha Rannta, out 27 Feb, only on Netflix. #AccusedOnNetflix pic.twitter.com/J1Nuk2x3f1— Netflix India (@NetflixIndia) February 9, 2026 -
‘ధురంధర్’ ని ఎగబడి చూస్తున్న పాక్ ప్రజలు.. అక్కడ నెం. 1
ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ‘ధురంధర్’..ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 7.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. భారతీయులు మాత్రమే కాదు పాకిస్తాన్ ప్రజలు కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్‌లో పాక్ ప్రజలు చూస్తున్న టాప్ 10 సినిమాల్లో దురంధర్ మొదటి స్థానంలో ఉంది.గతేడాది డిసెంబర్ 5న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలైంది. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. అయితే పాకిస్తాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. అయినా కూడా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో రణ్వీర్ హీరోగా నటించగా.. విలన్‌గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుంది. ధురంధర్ 2 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
ఓటీటీలో దురంధర్.. పాక్, బంగ్లాతో సహా ఏకంగా 22 దేశాల్లో..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ చిత్రాల జాబితాలో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.టాప్‌లో ట్రెండింగ్..థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. గతంలో పలు అరబ్ దేశాలు ఈ మూవీపై నిషేధం విధించాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు సౌదీ, యూఏఈ సహా ఏకంగా 22 దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే దురంధర్ దెబ్బ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దురంధర్ ప్రభంజనం 22 దేశాల్లో కొనసాగుతోందని ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ఇండియాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్డమ్, మొరాకో, మారిషస్, నైజీరియా, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, జోర్డాన్, కువైట్, లెబనాన్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాప్‌లో కొనసాగుతోంది. దురంధర్ ఓటీటీకి వచ్చేసిన కేవలం 48 గంటల్లోనే గ్లోబల్‌గా టాప్-10లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం 32 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న దేశాల్లో దురంధర్ టాప్‌లో కొనసాగడం విశేషం.కాగా.. ధురంధర్లో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారి పాత్రలో కనిపించారు. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. Taking 22 countries by storm 🔥 Dhurandhar trends at #1 globally!#DhurandharOnNetflix pic.twitter.com/fZeVoSqqcw— Netflix India (@NetflixIndia) February 4, 2026 -
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం శ్రీ చిదంబరం గారు, సుమతీ శతకం, యూఫోరియా, బరాబర్ ప్రేమిస్తా లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో సుమతీ శతకం, యూఫోరియా లాంటి సినిమాలపై కాస్తా బజ్ ఉంది. పెద్ద సినిమాలేవీ ఈ ఫ్రైడే బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో సినీ ప్రియులు కాస్తా నిరాశకు గురవుతున్నారు.ఇక ఈ శుక్రవారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే సంక్రాంతి మూవీ సందడి చేయనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఈ ఫ్రైడ్ ఓటీటీకి వస్తోంది. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ మూవీ రాణించలేకపోయింది. ఈ మూవీతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06 సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06 ట్రాన్స్ఫార్మర్స్ వన్(యానిమేటేడ్ మూవీ)- ఫిబ్రవరి 06 యో బెస్టీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 06అమెజాన్ ప్రైమ్ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06 ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06 వయోలెంట్ ఎండ్స్(హాలీవుడ్ మూవీ)-ఫిబ్రవరి 06జియో హాట్‌స్టార్ ది రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06జీ5 షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06 పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 07సన్ నెక్స్ట్ నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06సోనీ లివ్ జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06టెంట్ కోట్టాకోంబుసివీ(తమిళ సినిమా)- ఫిబ్రవరి 06హెచ్‌బీవో మ్యాక్స్బాయ్స్ గో టూ జూపిటర్(యానిమేషన్ చిత్రం)- ఫిబ్రవరి 06ముబీ..లా గ్రేజియా(హాలీవుడ్)- ఫిబ్రవరి 06హులు..స్పిట్స్‌విల్లే(హాలీవుడ్)- ఫిబ్రవరి 06 -
2026పై నెట్‌ఫ్లిక్స్ దండయాత్ర.. ఇన్ని సినిమాలు, సిరీస్‌లా?
ఇప్పుడు ఓటీటీ జమానా నడుస్తోంది. ఏ సినిమాని థియేటర్లో చూడాలి? దేన్ని ఓటీటీలో చూడాలని ముందే ఫిక్సయిపోతున్నారు. చిన్న మూవీస్‌ని చాలా వరకు ఓటీటీల్లోనే చూసేందుకు బాగా అలవాటు పడిపోయారు. అందుకే తెలుగు చిన్న చిత్రాల పరిస్థితి దారణంగా తయారైంది. మరోవైపు ఆయా ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్ కంటెంట్‌తో రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే తెలుగులో, తమిళంలో పేరున్న చిత్రాల హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. ఈ ఏడాది దాదాపు 30 వరకు ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్‌లతో రాబోతుంది. ముంబైలో మంగళవారం సాయంత్రం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన ఈ సంస్థ.. 2026లో వచ్చే తమ అప్‌కమింగ్ ప్రాజెక్టుల గురించి బయటపెట్టింది.(ఇదీ చదవండి: మహేశ్‌తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్‌పై క్లారిటీ)ఆనంద్ దేవరకొండ 'తక్షకుడు', సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' లాంటి సినిమాలతో పాటు చాలానే మూవీస్, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ డబ్బింగ్‌తో రాబోతున్నాయి. హిందీలో మీడియం రేంజ్ స్టార్స్ అందరూ కూడా వీటిలో నటించడం విశేషం. ఇంతకీ ఏ సినిమాలు, సిరీస్‌లు.. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోతున్నాయంటే?తక్షకుడు (తెలుగు సినిమా) - ఆనంద్ దేవరకొండసూపర్ సుబ్బు (తెలుగు సిరీస్) - సందీప్ కిషన్మేడిన్ కొరియా (తమిళ సినిమా) - ప్రియాంక మోహన్లవ్ (తమిళ సిరీస్) - ఐశ్వర్య లక్ష్మి, అర్జున్ దాస్ఫ్యామిలీ బిజినెస్ (హిందీ సిరీస్) - అనిల్ కపూర్, విజయ్ వర్మహమ్ హిందుస్థానీ (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, ప్రతీక్ గాంధీహలో బచ్చోన్ (హిందీ సిరీస్) - వినీత్ కుమార్ సింగ్, గిరిజా ఓక్కొహ్రా సీజన్ 2 (హిందీ సిరీస్) - మోనా సింగ్, బరుణ్ సోబ్తితలాష్: ఏ మదర్స్ సెర్చ్(హిందీ సిరీస్) - పరిణీతి చోప్రాఇక్కా (హిందీ సినిమా) - సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నామిస్ మ్యాచ్డ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - ప్రజక్తా కోలీ, రోహిత్ షరాఫ్ముసాఫిర్ కేఫే (హిందీ సిరీస్) - విక్రాంత్ మస్సే, వేదికా పింటోలస్ట్ స్టోరీస్ 3 (హిందీ సిరీస్) - రాధిక ఆప్టే, కొంకన్ సేన్ శర్మటోస్టర్ (హిందీ మూవీ) - రాజ్ కుమార్ రావ్, సన్యా మల్హోత్రామా బెహన్ (హిందీ సినిమా) - మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రిచుంబక్ (హిందీ సిరీస్) - నీనా గుప్తాద గ్రేట్ ఇండియా కపిల్ షో సీజన్ 5 (కామెడీ షో) - కపిల్ శర్మమామ్లా లీగల్ హై సీజన్ 2 (హిందీ సిరీస్) - రవి కిషన్గాంధారి (హిందీ సినిమా) - తాప్సీ, ఇష్వాక్ సింగ్గ్లోరీ (హిందీ సిరీస్) - దివ్యేందు, పులకిత్ సామ్రాట్గోస్కోర్ పండిట్ (హిందీ సినిమా) - మనోజ్ బాజ్‌పాయ్, శ్రద్ధాదాస్లెగసీ (తమిళ సిరీస్) - మాధవన్, అభిషేక్ బెనర్జీకర్తవ్య (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, రషిక దుగల్ఆపరేషన్ సఫేద్ సాగర్ (హిందీ సిరీస్) - సిద్ధార్థ్లాకప్ (రియాలిటీ సిరీస్) - ఏక్తా కపూర్, శోభా కపూర్దిండోరా 2 (హిందీ సిరీస్) - భువన్ బామ్, రోహిత్హే దిల్ సున్ రహా హై (హిందీ సిరీస్) - కపిల్ శర్మదేశీ బ్లింగ్ (హిందీ రియాలిటీ షో) - కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాశ్అక్యూజ్డ్ (హిందీ సిరీస్) -కొంకన్ సేన్ శర్మ, ప్రతిభ రత్న(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్) -
నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)
-
నేరుగా ఓటీటీకి ఆనంద్ దేవరకొండ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
అనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తక్షకుడు. ఈ సినిమాకు వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మిడిల్‌క్లాస్ మెలొడీస్ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. టీజర్ చూస్తుంటే ఆనంద్ దేవరకొండ మునుపెన్నడు చేయని డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. 'వాడు ఇక్కడే ఉన్నాడు.. నా కళ్లముందే ఉన్నాడు.. కానీ కనిపెట్టలేకపోతున్నాను..' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.కాగా.. ఈ మూవీలో లపతా లేడీస్ ఫేమ్ నీతాన్షీ గోయెల్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. -
ఓటీటీలో దురంధర్ క్రేజ్.. ఏకంగా పాకిస్తాన్లో నంబర్‌వన్‌గా ట్రెండింగ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించడమే కాదు.. ఏకంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.ఈ మూవీని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తెరకెక్కించారని పాక్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. అయితే ఓటీటీలో విడుదలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో దురంధర్ దూసుకెళ్తోంది. పాకిస్తాన్‌లోనూ ఈ మూవీ నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా పాకిస్థాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో అగ్రస్థానంలో ఉందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్‌లో థియేటర్లలో విడుదల కాని ఈ చిత్రం.. ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే దేశంలో నంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. ఈ సినిమా 'తేరే ఇష్క్ మే', 'హక్', 'ది బిగ్ ఫేక్' లాంటి బాలీవుడ్ చిత్రాల కంటే ముందుంది.కాగా.. ఈ చిత్రంలో సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సీక్వెల్ సైతం ఈ ఏడాది మార్చి 19న విడుదల కానుంది. -
'హైకూ' షూటింగ్ స్టార్ట్.. ఓటీటీ రైట్స్ కొనేసిన నెట్‌ఫ్లిక్స్
తమిళ చిత్రం ‘హైకూ’ షూటింగ్ కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో పూజా కార్యక్రమాలతో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. పేరన్బు, తరమణి వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ ముహూర్తపు సన్నివేశంపై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సినిమాకు యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా.డి.అరుళనందు, మాథ్యూ అరుళనందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘జో’ వంటి సూపర్ హిట్ సినిమాతో గుర్తింపు పొందిన హరిహరన్ రామ్ ఈ చిత్రానికి అడిషనల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.ఈ సినిమాకు ప్రియేష్ గురుస్వామి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేస్తుండగా.. శక్తి ప్రణేశ్ ఎడిటర్‌గా, ‘బేబీ’, ‘కోర్ట్’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. నటీనటుల విషయానికి వస్తే.. ‘జో’, ‘కోళి పన్నై చెల్లదురై’ చిత్రాల ఫేమ్ ఏగన్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన ‘మిన్నల్ మురళి’, ‘శేషం మైకిల్ ఫాతిమా’ వంటి చిత్రాల్లో మెప్పించిన ఫెమినా జార్జ్, అలాగే ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తాయి. కానీ ‘హైకూ’ సినిమా విడుదలకు ముందే డిజిటల్ డీల్ క్లియర్ కావడం పెద్ద విషయం. -
ఓటీటీలో తగ్గిన దురంధర్ రన్‌టైమ్.. అసలు కారణలేంటి?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఆదిత్య ధార్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానం సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబ్టటిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. ఈ సూపర్ హిట్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్ల వర్షన్ కంటే ఓటీటీలో 9 నిమిషాల నిడివి తగ్గడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఓటీటీకి వచ్చే సినిమాలు దాదాపు ఇంకా సన్నివేశాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా దురంధర్ మూవీని కట్ చేయడంపై అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకు ఆ తొమ్మిది నిమిషాలు ఎందుకు తొలగించారన్న దానిపై ఆడియన్స్‌లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.రన్‌టైమ్ అసలు వెర్షన్ కంటే ఎందుకు తక్కువగా ఉందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభంలో 3 గంటల 34 నిమిషాలు ఉండగా.. నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ 3 గంటల 25 నిమిషాలు మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సంభాషణలు, బూతులను మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కోసం అనవసరమైన సీన్స్ తొలగించి ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యంగా బలూచ్ నేపథ్యంలో తెరకెక్కించిన సంజయ్ దత్ సీన్స్‌పై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలను సవరించాలని చిత్రనిర్మాతను ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఆ తర్వాత కొత్త వర్షన్ జనవరి 1న థియేటర్లలోకి వచ్చింది. డిసెంబర్ 4, జనవరి 5 నాటి సెన్సార్ సర్టిఫికేట్ల ప్రకారం సవరించిన రన్‌టైమ్ సుమారు 209 నిమిషాలు(సుమారు 3 గంటల 29 నిమిషాలు). అందువల్లే నెట్‌ఫ్లిక్స్‌లోని వర్షన్ సుమారు మూడు నిమిషాలు తక్కువగా ఉంది. అంతేకాకుండా యాడ్స్ కూడా ఓటీటీలో కనిపించకపోవచ్చని.. ఇది కూడా రన్‌టైమ్ తగ్గడానికి కారణమని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఏదైనా సీన్స్ తొలగించారో లేదో అధికారికంగా ప్రకటించలేదు.నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫారమ్‌కు ఒక సినిమాను కత్తిరించడానికి హక్కు లేదు. అయితే మేకర్స్ అనవసర సీన్స్ తొలగించినట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్మాతలు అందించిన వర్షన్ మాత్రమే ప్లే చేయాల్సి ఉంటుంది. ఓటీటీలు ప్రాథమికంగా కేవలం పంపిణీదారులుగా మాత్రమే పనిచేస్తాయి. అంతే తప్ప సినిమాలో ఏవైనా మార్పులు జరిగితే అవి కేవలం నిర్మాత వైపు నుంచే జరగాలి. లేదంటే కొన్నిసార్లు ప్లాట్‌ఫారమ్ అభ్యర్థన మేరకు మార్పులు చేసే అవకాశం ఉంది. కాగా.. డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురందర్' బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ స్పై థ్రిల్లర్‌లో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. 'ధురందర్' సీక్వెల్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో సినిమాల సందడి మొదలవుతుంది.ఈ వారంలో టాలీవుడ్ నుంచి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటించిన ఓం శాంతి శాంతి శాంతిః మూవీ సందడి చేయనుంది. ఈ మూవీపై మాత్రమే ఆడియన్స్‌లో బజ్ ఏర్పడింది. దీంతో పాటు ఒకట్రెండ్ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్ ఓటీటీకి రానుంది. దీంతో పాటు సర్వం మాయ లాంటి డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 12 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ధురంధర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30 మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 30 97 మినిట్స్(హాలీవుడ్)- జనవరి 30అమెజాన్ ప్రైమ్ దల్ దల్ (హిందీ సిరీస్) - జనవరి 30 క్రిస్టీ(హాలీవుడ్ మూవీ)-జనవరి 30 ది లాంగ్ వాక్(హాలీవుడ్ మూవీ)- జనవరి 30జియో హాట్‌స్టార్ సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30సన్ నెక్స్ట్ పతంగ్ (తెలుగు సినిమా) - జనవరి 30ఆపిల్ టీవీ ప్లస్ యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 30జీ5 దేవ్‌కెళ్ (మరాఠీ సిరీస్) - జనవరి 30మనోరమ మ్యాక్స్..గులాబ్ జామూన్(మలయాళ సినిమా)- జనవరి 30హులు..ఎల్లామెక్‌కే(హాలీవుడ్ సినిమా)- జనవరి 30 -
దురంధర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. అదొక్కటే నిరాశ
రణ్వీర్ సింగ్ నటించిన స్రై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'దురంధర్'. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-2 చిత్రాలను అధిగమించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈనెల 30 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ థియేట్రికల్ వెర్షన్ రన్‌టైమ్ 3 గంటలా 34 నిమిషాలు కాగా.. ఓటీటీలో దాదాపు 9 నిమిషాలు తగ్గించారు. ఓటీటీలో అన్‌కట్ వెర్షన్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగినా రన్‌టైమ్ తగ్గడం ఆడియన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది.కాగా.. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఛావా, కాంతార-2 చిత్రాలను దాటేసింది. అంతేకాకుండా తాజాగా దేశీయంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఘనత సాధించింది. It’s official! 🔒🔥Dhurandhar drops on Netflix TONIGHT! pic.twitter.com/gsAGMURqj7— Fozzy (@fozzywrites) January 29, 2026 -
ఓటీటీలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరిగిపోయింది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మీ ముందు వచ్చేస్తోంది. ఇప్పటికే రిలీజై క్రేజ్ దక్కించుకున్న కొహరా వెబ్ సిరీస్ సీజన్-2 స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో మోనా సింగ్, బరున్ సోబ్తి కీలక పాత్రల్లో నటించారు.ఈ నేపథ్యంలోనే కొహరా సీజన్-2 ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే హత్యల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మర్డరీ మిస్టరీ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు ఇష్టపడేవారు కొహరా చూసేయండి. -
ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక సంక్రాంతి సినిమాల సందడి కూడా దాదాపు ముగిసిపోయింది. ఇక ఈ వారంలో కొత్త సినిమాలేవీ రావడం లేదు. ఒకట్రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ వాటిపై పెద్దగా బజ్ లేదు. దీంతో ఈ వీకెండ్ కోసం సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.ఈ ఫ్రైడే థియేటర్లలో సినిమాలు రాకపోయినా.. ఓటీటీల్లో మాత్రం సందడి చేయనున్నాయి. ఈ శుక్రవారం శోభిత ధూళిపాల చీకటిలో, హెబ్బా పటేల్ మరియో.. టాలీవుడ్ ఆడియన్స్‌కు స్పెషల్‌గా అనిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి మస్తీ-4, గుస్తాక్ ఇష్క్, కన్నడ నుంచి 45 లాంటి సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. అంతేకాకుండా పలు తమిళ, మలయాళ డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్‌లు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23 తేరే ఇష్క్ మైన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23 ద బిగ్ ఫేక్ (ఇటాలియన్ సినిమా) - జనవరి 23 అమెజాన్ ప్రైమ్ చీకటిలో (తెలుగు సినిమా) - జనవరి 23 గుస్తాక్ ఇష్క్(హిందీ సినిమా)- జనవరి 23 ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25జియో హాట్‌స్టార్ మార్క్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 23 స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 23ఆహామరియో(తెలుగు సినిమా)- జనవరి 23జీ5 45 (కన్నడ సినిమా) - జనవరి 23 మస్తీ 4 (హిందీ మూవీ) - జనవరి 23 సిరాయ్ (తమిళ సినిమా) - జనవరి 23 కాళీపోట్కా (బెంగాలీ సిరీస్) - జనవరి 23సన్ నెక్ట్స్..షెషిప్పు(మలయాళ సినిమా)- జనవరి 23ముబీ లా గ్రేజియా (ఇటాలియన్ మూవీ) - జనవరి 23 -
ఓటీటీకి దురంధర్.. ఆ డేట్ ఫిక్స్..!
రణ్వీర్ సింగ్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం హిందీలోనే రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దాదాపు రూ.130 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈనెల 30 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్స్ వైరలవుతున్నాయి. అయితే స్ట్రీమింగ్ డేట్‌పై నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.అయితే ముందు నుంచే జనవరి 30 నుంచి స్ట్రీమింగ్కు రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే దురంధర్ ఈ నెలాఖర్లోనే ఓటీటీకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ దురంధర్ స్ట్రీమింగ్ కానుంది. The wait ends on January 30.Experience #Dhurandar on Netflix power, performance, and presence.#RanveerSingh #OTTRelease#Dhurundhar #Netflix pic.twitter.com/jpm66gvAhL— Abhi (@Abhi1879734) January 21, 2026 -
నెట్‌ఫ్లిక్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది.. ఈ ఏడాది స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే!
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత పెద్ద సినిమా అయినా సరే థియేటర్స్‌లో రిలీజ్ అయిన నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మొన్నటి వరకు రిలీజ్‌కి ముందు సదరు సినిమా నిర్మాతలు ఓటీటీ సంస్థలతో డీల్ కుదుర్చుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఓటీటీ డీల్‌ను పూర్తి చేసుకుంటున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అలా తమతో డీల్ కుదుర్చుకొని.. ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాల జాబితాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్రకటించింది. అందులో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ ‘పెద్ది’తో పాటు ‘ఛాంపియన్, ఫంకీ లాంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.2026లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా అలరించే చిత్రాలివే..టైటిల్: ఉస్తాద్ భగత్ సింగ్నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీలదర్శకత్వం : హరీశ్ శంకర్టైటిల్: పెద్దినటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్దర్శకత్వం : బుచ్చిబాబుటైటిల్: ది ప్యారడైజ్నటీనటులు: నాని, సొనాలి కులకర్ణి, మోహన్ బాబుదర్శకత్వం: శ్రీకాంత్ ఓదెలటైటిల్: ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47నటీనటులు: వెంకటేశ్, శ్రీనిధి శెట్టిదర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్టైటిల్: ఆకాశంలో ఒక తారనటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లిదర్శకత్వం: పవన్ సాదినేనిటైటిల్: ఛాంపియన్నటీనటులు : రోషన్, అనస్వర రాజన్దర్శకత్వం: ప్రదీప్ అద్వైతంటైటిల్: ఫంకీనటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహార్దర్శకత్వం : అనుదీప్ కేవీటైటిల్: ‘రాకాస’సంగీత్ శోభన్, నయనసారికదర్శకత్వం: మాససా శర్మటైటిల్: బైకర్నటీనటులు : శర్వానంద్, రాజశేఖర్దర్శకత్వం : . అభిలాష్ రెడ్డిటైటిల్: వీడీ 14(వర్కింగ్ టైటిల్)నటీనటులు: విజయదేవరకొండ, రష్మికదర్శకత్వం : రాహుల్ సాంకృత్యన్ -
సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్మెంట్.. ఒక్కరోజే ఓటీటీకి 15 సినిమాలు
సంక్రాంతి పండుగ ముగిసింది. ఈ ఏడాది టాలీవుడ్లో ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ది రాజాసాబ్తో పాటు మనశంకరవరప్రసాద్గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు సందడి చేశాయి. ఇందులో కొన్ని మూవీస్ హిట్ కాగా.. మరికొన్ని ఫర్వాలేదనిపించాయి.అయితే ఈ పొంగల్ ముగిసిన వెంటనే ఓటీటీ ప్రియులకు పండగ వచ్చేసింది. థియేటర్లకు ఫ్యామిలీతో వెళ్లలేనివారికి ఓటీటీలు సిద్ధమైపోయాయి. ఈ ఫ్రైడే ఒక్క రోజే దాదాపు 15 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి, 120 బహదూర్, మస్తీ-4 చిత్రాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు మలయాళ డబ్బింగ్ సినిమాలు, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు వచ్చాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. నెట్ఫ్లిక్స్ద రిప్-ట్రస్ట్ హ్యాజ్ ఏ ప్రైస్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 16క్యాన్ దిస్ లవ్ బీ ట్రాన్స్లేటేడ్- జనవరి 16బ్లాక్ ఫోన్-2(హాలీవుడ్ మూవీ)-జనవరి 16కిల్లర్ వాలే(హాలీవుడ్ మూవీ)-జనవరి 16ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ(హాలీవుడ్ మూవీ)- జనవరి 17 అమెజాన్ ప్రైమ్ వీడియో..120 బహదూర్(బాలీవుడ్ మూవీ)- జనవరి 16జియో హాట్స్టార్పోనీస్-పర్సన్ ఆఫ్ నో ఇంటరెస్ట్(హాలీవుడ్ మూవీ)- జనవరి 16సోనీ లివ్..కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 16జీ5గుర్రం పాపిరెడ్డి (తెలుగు మూవీ) - జనవరి 16భా భా భా (మలయాళ సినిమా) - జనవరి 16మస్తీ-4(హిందీ మూవీ)- జనవరి 16ఆపిల్ టీవీ ప్లస్హైజాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 16లయన్స్ గేట్ ప్లే..బ్యాండ్బుక్(కన్నడ సినిమా)- జనవరి 16షెల్- జనవరి 16హులు..ట్విన్ లెస్(హాలీవుడ్ మూవీ)- జనవరి 16 -
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో 'అడాల్సెన్స్'.. విన్నర్స్ ప్రకటన
ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుక ‘గోల్డెన్ గ్లోబ్స్ 2026’ ఘనంగా జరిగింది. 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో 'అడాల్సెన్స్' సిరీస్ సత్తా చాటింది. ప్రస్థుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ సిరీస్‌కు రెండు అవార్డ్స్ దక్కడం విశేషం. ఉత్తమ నటుడు, సహాయనటుడి విభాగాల్లో అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది.'అడాల్సెన్స్' చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డ్స్ అందుకుని ఆదరణ పొందింది. అయితే, ఈ మూవీలో నటించిన స్టీఫెన్ గ్రాహం ఉత్తమ నటుడిగా తొలిసారి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆపై సిరీస్‌లో తన నటనతో మెప్పించిన 13 ఏళ్ల ఓవెన్ కూపర్ ఉత్తమ సహాయనటుడిగా అతి చిన్న వయసులోనే అవార్డ్ అందుకున్నాడు. ఈ అవార్డ్ కార్యక్రమంలో భారత్ నుంచి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు.సినిమా రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిచ్చే ఉద్దేశంతో హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (హెచ్. ఎఫ్. పి. ఎ) వారు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నాంది పలికారు. 1944 నుంచి ఈ అవార్డు కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ప్రారంభంలో వారు నిర్వహిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను కూడా గుర్తించి వాటికి పురస్కారాలు ఇస్తుంటారు. ప్రస్తుతం హెచ్. ఎఫ్. పి. ఎ టీమ్‌లో సుమారు 60 దేశాలకు చెందిన 105 మంది సభ్యులున్నారు. వారందరూ ఓకే అనుకున్న తర్వాతే గోల్డెన్ గ్లోబ్స్ ఖరారు చేస్తారు. సినిమా రంగంతో పాటు టెలివిజన్ రంగంలో ప్రతిభ చూపిన వారికీ అవార్డులు ఇస్తుండటం విశేషం. గోల్డెన్ గ్లోబ్స్- 2026అవార్డ్ విజేతలు (సినిమా) -ఉత్తమ నటుడు : తిమోతీ చలమెట్ (మార్టీ సుప్రీం) - ఉత్తమ నటి : రోజీ బేర్నీ (ఇఫ్ ఐ హేడ్ లెగ్స్ ఐడిడ్ కిక్ యూ)- ఉత్తమ సహాయ నటుడు: స్టెల్లన్ స్కార్స్‌గార్డ్ (సిన్నర్స్)- ఉత్తమ సహాయ నటి: టెయానా టేలర్ (ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్)గోల్డెన్ గ్లోబ్స్- 2026అవార్డ్ విన్నర్స్ ( టెలివిజన్ సిరీస్)- ఉత్తమ టెలివిజన్ సిరీస్ (డ్రామా): ది వైట్ లోటస్- ఉత్తమ నటుడు : ఎరిన్ డోహెర్టీ (అడోలెసెన్స్)- ఉత్తమ సహాయ నటి : ఎరిన్ డోహెర్టీ (అడోలెసెన్స్)- ఉత్తమ సహాయ నటుడు : స్టీఫెన్ గ్రాహం (అడోలెసెన్స్) -
'అఖండ-2' ఫ్యాన్స్‌కు ట్విస్ట్ ఇచ్చిన 'నెట్‌ఫ్లిక్స్'
బాలకృష్ణ- బోయపాటి శ్రీను సినిమా 'అఖండ2: తాండవం'.. డిసెంబర్ 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సంక్రాంతి కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు యాప్‌లో పేర్కొంది. అప్‌కమింగ్ చిత్రాల జాబితాలో కూడా పోస్టర్‌తో పేర్కొంది. దీంతో ఈ పండుగనాడు సినిమాను మరోసారి చూడొచ్చని బాలయ్య ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే, తాజాగా నెట్‌ఫ్లిక్స్ ట్విస్ట్ ఇచ్చింది.'అఖండ2: తాండవం' నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 9న స్ట్రీమింగ్కు వస్తుందని యాప్‌లో ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా పోస్టర్‌ను కూడా ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ (యాప్) అప్‌కమింగ్ చిత్రాల విభాగంలో కనిపించింది. కానీ, ఇప్పుడు దానిని తొలగించారు. మూవీ లింక్‌ను కూడా తప్పించారు. అయితే, సోషల్‌మీడియాలో మాత్రం ఇప్పటివరకు అఖండ-2 స్ట్రీమింగ్ వివరాలను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించలేదు. త్వరలో అధికారికంగా మరో కొత్త తేదీని ఎంపిక చేసుకుని వివరాలు తెలిపే ఛాన్స్ ఉంది.'అఖండ 2' నిర్మాతలకు భారీనష్టాలే తెచ్చిపెట్టిందని బాక్సాఫీస్ లెక్కలు తెలుపుతున్నాయి. 2025లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ మూవీ కోసం సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌ను 14 రీల్స్ ప్లస్ సంస్థ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 93 కోట్ల నెట్ రాబట్టినట్లు ప్రముఖ వెబ్సైట్ సాక్నిల్ తెలిపింది. అంటే ఏకంగా రూ. 100 కోట్ల మేరకు నష్టాలను నిర్మాతలకు మిగిల్చినట్లు తేలుతుంది. -
బాలయ్య అఖండ-2.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన మరో యాక్షన్ చిత్రం అఖండ-2. మైథలాజికల్ టచ్‌తో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేసింది. వారం రోజులు ఆలస్యంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అయితే అఖండ మూవీ థియేట్రికల్ రన్‌టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఉంది. కానీ ఓటీటీ విషయానికొస్తే రన్ టైమ్ భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. ఓటీటీలో కేవలం రెండు గంటల 20 నిమిషాలు ఉండనున్నట్లు సమాచారం. దాదాపు 25 నిమిషాల సీన్స్ కోత పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఏయే సీన్స్ కట్ చేశారనేది ఓటీటీలో చూశాకే క్లారిటీ రానుంది. దీనిపై వచ్చే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. కాగా.. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, సాయి కుమార్, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ కథేంటంటే..చైనా ఆర్మీ జనరల్ తన కొడుకు చావుకు కారణమైన భారత్‌పై పగ తీర్చుకునేందుకు భారీ కుట్ర చేస్తాడు. మాజీ జనరల్ సహాయంతో బయోవార్ ద్వారా భారత్‌ను దొంగదెబ్బ తీయాలనుకుంటాడు. ఇందుకుగాను భారత్‌లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాకూర్(కబీర్ దుల్షన్ సింగ్) ని పావుగా వాడుతాడు. అతని సహాయంతో భారతీయులు బలంగా నమ్మే దేవుడు లేడని నిరూపించి..వారిమధ్య చిచ్చు పెట్టాలనుకుంటాడు. అందులో భాగంగా మహా కుంభమేళకు వచ్చిన భక్తులు స్నానం చేసే నదిలో డేంజర్ కెమికల్ కలిపిస్తాడు. దీంతో నదిలో స్నానం చేసినవారందరూ క్షణాల్లో కుప్పకూలిపోతారు. ప్రతిపక్ష నేత ఠాకూర్ ఈ ఘటనను రాద్ధాంతం చేసి దేవుడే ఉంటే ఇలా జరిగేకాదు..అసలు దేవుడు అనేవాడే లేడంటూ సామాన్యులను నమ్మిస్తాడు. జనాలు కూడా దేవుళ్లకు పూజలు చేయడం ఆపేస్తారు. మరోవైపు భక్తులకు వచ్చిన కొత్త రోగానికి వాక్సిన్ కనిపెట్టే పనిలో ట్రైనీ సైంటిస్ట్, ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ(బాలకృష్ణ) కూతురు జనని(హర్షాలి మల్హోత్రా) సక్సెస్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఠాకూర్ తన మనషులతో ఆ సైంటిస్టులను చంపేయిస్తాడు. జనని తప్పించుకొని పారిపోగా..ఠాకూర్ మనషులు ఆమెను వెతుకుతుంటారు. అదే సమయంలో రంగంలోకి దిగుతాడు అఖండ(బాలకృష్ణ). ఆ తర్వాత ఏం జరిగింది? ఠాకూర్ మనషుల నుంచి జననిని ఎలా కాపాడాడు? దేవుడే లేడని నమ్మిన జనాలకు.. ఆయన ఉన్నాడు? ఆపద వస్తే వస్తాడు? అని ఎలా నిరూపించాడు? సనాతనధర్మం పాటించే భారతీయులను దొంగదెబ్బ కొట్టాలనుకున్న చైనా ఆర్మీకి ఎలాంటి గుణపాఠం నేర్పించాడు? ఇందులో నేత్ర(ఆదిపినిశెట్టి), అర్చనగోస్వామి(సంయుక్త) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.📢 Streaming Date 🔒#Akhanda2 🔱 (Telugu) streaming from January 9 on Netflix in Telugu , Tamil, Kannada, Malayalam & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/UQ6Ldm3DA8— OTT Trackers (@OTT_Trackers) January 4, 2026 -
కొత్త ఏడాదికి ఓటీటీ సినిమాల వెల్కమ్.. ఏకంగా 19 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో ఏడాది కాల గర్భంలో కలిసిపోయింది. కొత్త ఏడాదికి ఎన్నో ఆశలతో స్వాగతం పలికారు సినీ ప్రేక్షకులు. కొత్త సంవత్సరంలో తొలిరోజే టాలీవుడ్ నుంచి సైక్ సిద్ధార్థ్, వనవీర లాంటి చిత్రాలు ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేశాయి. నూతన ఏడాది తొలివారంలో పెద్ద సినిమాల హవా లేకపోయినా.. చిన్న సినిమాలు అలరిస్తున్నాయి.ఇక థియేటర్ల సంగతి పక్కన పెడితే.. కొత్త ఏడాదిలో ఓటీటీల్లోనూ సినిమాల సందడి నెలకొంది. ఈ శుక్రవారం తెలుగు సినిమా బ్యూటీ ఓటీటీలో సందడి చేయనుంది. దీంతో పాటు బాలీవుడ్ నుంచి హాక్, కోలీవుడ్ నుంచి ఎల్బీడబ్ల్యూ, కుంకీ-2 లాంటి సినిమాలు అలరించనున్నాయి. కొత్త ఏడాదిలో రెండు రోజుల్లోనే దాదాపు 17 చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. న్యూ ఇయర్లో మీకు నచ్చిన సినిమాలు ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి. నెట్ఫ్లిక్స్రన్ అవే(హాలీవుడ్ మూవీ)- జనవరి 01మై కొరియన్ బాయ్‌ఫ్రెండ్- జనవరి 01స్ట్రేంజర్ థింగ్స్ సీజన్-5(ఫైనల్ ఎపిసోడ్)- జనవరి 01లవ్ ఫ్రమ్ 9 టు 5(హాలీవుడ్ సిరీస్)- జనవరి 01టైమ్ ఫ్లైస్(హాలీవుడ్ సినిమా)- జనవరి 01ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01హాక్(హిందీ సినిమా)- జనవరి 02ఆఫ్టర్ ది క్వేక్(జపనీస్ సినిమా)-జనవరి 02ఫిజికల్.. వెల్కమ్ టూ మంగోలియా(రియాలిటీ షో)-జనవరి 02ల్యాండ్ ఆఫ్ సిన్(క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)-జనవరి 02యువర్ టర్న్ టూ కిల్(జపనీస్ మూవీ)-జనవరి 02జియో హాట్స్టార్ఎల్బీడబ్ల్యూ(తమిళ మూవీ)- జనవరి 01అమెజాన్ ప్రైమ్ సీగే మీ వోస్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 02 ఫాలో మై వాయిస్(స్పానిష్ మూవీ)-జనవరి 02 డ్రకులా ఎ లవ్ టేల్(హాలీవుడ్ మూవీ)-జనవరి 02 కుంకీ-2(తమిళ మూవీ)- జనవరి 03జీ5బ్యూటీ (తెలుగు సినిమా)- జనవరి 02బుక్ మై షోది స్మాషింగ్ మెషీన్(హాలీవుడ్ మూవీ)-జనవరి 02సన్ నెక్స్ట్ ఇతిరి నేరమ్ (మలయాళ సినిమా) - జనవరి 01 -
బాక్సాఫీస్ హిట్‌గా దురంధర్.. ఓటీటీ డీల్ ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఏకంగా 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1100 కోట్ల మార్కును దాటేసింది. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దురంధర్ మూవీ ఓటీటీ డీల్‌పై చర్చ నడుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు రానుందనే విషయంపై సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌కు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా రెండు పార్ట్స్‌కు కలిపి రూ.130 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్కో పార్ట్‌కు రూ.65 కోట్లతో ఒప్పందం చేసుకుంది.అయితే ఈ సినిమా డీల్ మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఒప్పందం డబుల్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రూ.130 కోట్ల డీల్ చాలా తక్కువ అని బాలీవుడ్లో చర్చ మొదలైంది. దీంతో ఈ డీల్ విలువ రూ.275 కోట్ల వరకు చేరుకొవచ్చని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ఒక హిందీ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్‌తో జరిగిన బిగ్ డీల్‌గా నిలవనుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన స్టార్ సినిమాలు రూ.150 కోట్లకు పైగా ఓటీటీ వసూళ్లు దక్కించుకున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వచ్చిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేష్ బేడి, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది. -
ఓటీటీలో వివాదస్పద సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ- యామీ గౌతమ్ జంటగా నటించిన చిత్రం 'హక్'. ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. దర్శకుడు సుపర్ణ్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ 7న విడుదలైంది. ఈ చిత్రం మహిళల హక్కులకు మద్దతు ఇచ్చిన షా బానో వర్సెస్ అహ్మద్ ఖాన్ కేసు ఆధారంగా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కించారు. అయితే, ‘హక్’ సినిమాలో ఇస్లాం విడాకుల పద్ధతిని ప్రశ్నిస్తూ సాగే ఒక సీన్‌పై వివాదం మొదలైంది. దీంతో బ్యాన్ చేయాలని ఆ సమయంలో డిమాండ్ కూడా చేశారు.హక్ సినిమా జనవరి 2, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ కోర్ట్ డ్రామా మూవీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందింది. విమర్శకుల నుంచి కూడా అభినందనలు వచ్చాయి. షా బానో నిజజీవిత కథ మళ్లీ ఒకసారి దేశవ్యాప్తంగా చర్చల్లోకొచ్చింది. హక్ సినిమాకు షా బానో త్రిబుల్ తలాక్ కేసే ప్రేరణగా తీశారు. మహిళల హక్కులు, లౌకికవాదం, మతం వంటి అంశాలపై ఈ మూవీ ఉంటుంది. పెళ్లైన 40 ఏళ్ల తర్వాత త్రిబుల్ తలాక్ ద్వారా విడాకులు ఇస్తే పరిస్థితి ఏంటి..? న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం ఏంటి అనేది హక్ మూవీలో చూడొచ్చు. -
ఓటీటీలో మలయాళ హిట్ థ్రిల్లర్.. ఎక్కడంటే?
మలయాళంలో ఈ ఏడాది (క్రిస్మస్ ముందువరకు) 184 సినిమాలు రిలీజైతే వాటిలో కేవలం 15 మాత్రమే లాభాల బాట పట్టాయని అక్కడి నిర్మాతల మండలి అధికారికంగా వెల్లడించింది. వాటిలో పెద్ద హీరోల సినిమాలతో పాటు ఎకో అనే చిన్న చిత్రం కూడా చోటు దక్కించుకుంది. చిన్న సినిమా ఘన విజయంసందీప్ ప్రదీప్ హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 31న అందుబాటులోకి రానుంది. సినిమాఎకో.. మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ప్రసారం కానుంది. ఈ సినిమాకు బహుల్ రమేశ్ కథ అందించగా దిన్జిత్ అయ్యతన్ దర్శకత్వం వహించాడు. మార్క్ జయరామ్ నిర్మించాడు. వినీత్ నరైన్, సౌరభ్ సచ్దేవ, బిను పప్పు కీలక పాత్రలు పోషించారు. ముజీబ్ మజీద్ సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: మలయాళ బాక్సాఫీస్ రిపోర్టు- 2025పై హీరో ఆగ్రహం -
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్'.. క్రిస్మస్ కానుకగా స్ట్రీమింగ్
'బాహుబలి: ది ఎపిక్' ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియాను ఊపేసిన బాహుబలి ప్రాంఛైజ్ రెండు సినిమాలు పదేళ్ల తర్వాత ఒక్కటిగా 'బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న విడుదలైన విషయం తెలిసిందే. ప్రభాస్- ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి రెండు భాగాలు సంచలన విజయం సాధించాయి. అయితే, బాహుబలి ది ఎపిక్ పేరుతో 3 గంటల 40 నిమిషాల నిడివితో మరోసారి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది.'బాహుబలి: ది ఎపిక్' నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్టిక్స్ (NETFLIX) తన లిస్ట్‌లో చేర్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సత్తా చాటింది. ఏకంగా రూ. 55 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రీరిలీజ్ చిత్రాలలో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చిన ఈ చిత్రాన్ని మరోసారి చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కథేంటి..?బాహుబలి కథ అందరికి తెలిసిందే. థియేటర్స్‌తో పాటు టీవీ, ఓటీటీల్లో ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటారు. మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాత శివగామి(రమ్యకృష్ణ) ప్రాణత్యాగం చేసి మహేంద్ర బాహుబలి(ప్రభాస్)ని కాపాడుతుంది. ఓ గూడెంలో పెరిగి పెద్దవాడైన మహేంద్ర బాహుబలి.. అవంతిక(తమన్నా)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆశయం నెరవేర్చడం కోసం మాహిష్మతి రాజ్యానికి వెళతాడు. అక్కడ బంధీగా ఉన్న దేవసేన(అనుష్క శెట్టి) తీసుకొచ్చి అవంతికకు అప్పజెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. బంధీగా ఉన్న దేవసేన తన తల్లి అని.. భళ్లాలదేవుడు(రానా) కుట్ర చేసి తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపిచాడనే విషయం తెలుస్తుంది. కట్టప్ప (సత్యరాజ్) సహాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేసి బళ్లాల దేవుడిని అంతం చేస్తాడు. -
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఫుల్ క్రేజ్ ఉంది. అలా వచ్చి నాలుగు సీజన్స్ ప్రేక్షకులను అలరించిన స్ట్రేంజర్ థింగ్స్ మరో సీజన్ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో వచ్చిన నాలుగు సీజన్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడుస్ట్రేంజర్ థింగ్స్ సీజన్- 5 కూడా వచ్చేస్తోంది.స్ట్రేంజర్ థింగ్స్ సీజన్- 5లోని 5,6,7 ఎపిసోడ్లు డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులోని చివరి ఎపిసోడ్ జనవరి 1 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. 2022లో రిలీజైన సీజన్-4 అత్యధిక వ్యూస్ సాధించిన సిరీస్‌గా నిలిచింది. దీంతో ఈ సిజన్పై కూడా ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌కు రాస్ డఫర్ దర్శకత్వం వహించారు. Hitman aa raha hai upside down ko seedha karne ❤️🔥Watch Stranger Things 5: Volume 2, out 26 December at 6:30 AM IST, only on Netflix.#Collab pic.twitter.com/V9F1B4izDM— Netflix India (@NetflixIndia) December 23, 2025 -
ఓటీటీకి గురిపెట్టిన రివాల్వర్ రీటా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ 'రివాల్వర్ రీటా'. ఈ మూవీకి జేకే చంద్రు దర్శకత్వం వహించారు. లేజీ ఓరియంటెండ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరమ్, రూట్స్ ప్రొడక్షన్స్ జగదీశ్ పళనిస్వామి కలిసి నిర్మించారు. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుందని పోస్టర్‌ను పంచుకుంది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు.రివాల్వర్ రీటా కథేంటంటే..పాండిచ్చేరికి చెందిన రీటా(కీర్తి సురేశ్) నాన్న చిన్నప్పుడే ల్యాండ్ విషయంలో ఓ గ్యాంగ్‌స్టర్ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఓ బేకరీలో పని చేస్తూ తన తల్లి చెల్లమ్మ(రాధిక శరత్‌కుమార్), ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంది. తన అక్క కూతురు తొలి పుట్టిన రోజును జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంట్లోకి పాండిచ్చేరిలోనే పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ పాండ్యన్(సూపర్ సుబ్బరాయన్) వస్తాడు. తాగిన మత్తులో దారితప్పి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్‌తో రీటా ఫ్యామిలీకి చిన్న గొడవ జరుగుతుంది. మాట మాట పెరిగి.. రీటా తల్లి అతన్ని కిందకు తోసేయ్యగా.. తలకు గట్టిదెబ్బ తగిలి చనిపోతాడు. ఈ విషయం తెలిస్తే పాండ్య కొడుకు బాబీ(సునీల్)..కచ్చితంగా తమల్ని చంపేస్తాడనే భయంలో శవాన్ని ఇంట్లోనే దాచి.. బర్త్‌డేని సెలెబ్రేట్ చేస్తారు.మరుసటి రోజు ఓ కారులో ఆ శవాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలోనే తండ్రి ఇంట్లో లేడనే విషయం బాబీకి తెలిసి..తనదైన శైలీలో వెతుకుతుంటాడు. మరోవైపు పాండ్య శవాన్ని రీటా ఇంటి నుంచి దొంగిలించి.. మరో డాన్ నర్సిరెడ్డి(అజయ్ గోష్) అప్పగించి రూ. 5 కోట్లు తీసుకోవాలి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో రీటాపై పగ పెంచుకున్న సీఐ(జాన్ విజయ్)కి.. ఆమె ఓ కారుని దొంగతనంగా కొనుగోలు చేసిందనే విషయం తెలిసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరు గ్యాంగ్స్టర్స్, పోలీసుల మధ్య నుంచి రీటా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నది అనేదే ఈ సినిమా కథ.Watch Revolver Rita on Netflix out 26 December in Tamil, Telugu, Kannada and Malayalam#RevolverRitaOnNetflix@KeerthyOfficial @Jagadishbliss @Sudhans2017 @realradikaa @dirchandru @PassionStudios_ @TheRoute @RSeanRoldan @dineshkrishnanb @Cinemainmygenes @dhilipaction @mkt_tribe…— Netflix India South (@Netflix_INSouth) December 21, 2025 -
ఓటీటీలో 'ఆంధ్రకింగ్ తాలుకా'.. ప్రకటన వచ్చేసింది
రామ్ పోతినేని, ఉపేంద్ర కలిసి నటించిన మూవీ 'ఆంధ్రకింగ్ తాలుకా'.. నవంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వరుస పరాజయాల తర్వాత రామ్ భారీ అంచనాలతో ఈ మూవీని చేశారు. సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు పి.మహేశ్‌బాబు తెరకెక్కించారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే, రావు రమేశ్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు నటించారు‘ఆంధ్రకింగ్ తాలుకా’ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 25న స్ట్రీమింగ్కు రానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ,మలయాళం, తమిళ్లో విడుదల అవుతుందని ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ మూవీ కోసం సుమారు రూ. 60 కోట్లు బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. అయితే, ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2000-2003 మధ్యకాలంలో సాగుతుంది. సూర్య(ఉపేంద్ర) ఓ స్టార్ హీరో. ప్లాప్ సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ తెప్పించే అభిమానులు ఉన్నారు. అయితే వరుసగా తొమ్మిది సినిమాలు డిజాస్టర్ కావడంతో.. తన కెరీర్లో 100వ మూవీతో ఎలాగైన భారీ హిట్ కొట్టాలనే కసితో ఉంటాడు. అయితే 100వ సినిమా షూటింగ్ మొదలైన కొన్నాళ్లకే ఆగిపోతుంది. ఇక సినిమా చేయలేనంటూ నిర్మాత చేతులెత్తేస్తాడు. ఆ సినిమా పూర్తి చేయాలంటే మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ డబ్బు కోసం మరో నిర్మాతకు ఫోన్ చేస్తే.. తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో తండ్రి పాత్ర చేయమని అడుగుతాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా..తర్వాత ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకుంటాడు.ఈ విషయం నిర్మాతకు చెప్పేలోపే.. సూర్య అకౌంట్లో రూ. 3 కోట్లు వచ్చి చేరుతాయి. ఆ డబ్బు ఎవరేశారని ఆరా తీయగా..తన వీరాభిమాని సాగర్(రామ్ పోతినేని) గురించి తెలుస్తుంది. రాజమండ్రి సమీపంలోని గోడపల్లిలంక అనే ఒక చిన్న పల్లెటూరికి చెందిన సాగర్‌కు అంత డబ్బు ఎలా వచ్చింది? అసలు సాగర్‌కి హీరో సూర్య అంటే ఎందుకు అంత పిచ్చి? ప్రియురాలు మహాలక్ష్మీ(భాగ్యశ్రీ బోర్సె)ని దక్కించుకోవడం సాగర్ చేసిన చాలెంజ్ ఏంటి? ఆ చాలెంజ్‌లో సాగర్ గెలిచాలడా ఓడాడా? హీరోపై ఉన్న అభిమానం..సాగర్ని, తన ఊరిని ఎలా మార్చేసింది? అభిమానిని వెతుక్కుంటూ వచ్చిన హీరో సూర్యకి.. తెలిసొచ్చిన విషయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. -
టాప్ ఓటీటీలో AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ స్ట్రీమింగ్
నేటి తరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయిన పదం ఏ.ఐ.ఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్).. ఇదే టైటిల్‌తో ఒక వెబ్ సిరీస్‌ను దర్శకుడు జోసెఫ్ క్లింటన్ తెరకెక్కించాడు. ఇందులో ‘కోర్ట్’ మూవీ ఫేం హర్ష్ రోషన్, సునీల్, వైవా హర్ష, సందీప్ రాజ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ తాజాగా మరో ఓటీటీలోకి వచ్చేసింది.AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్‌కు సోషల్‌మీడియాలో భారీ క్రేజ్ ఉంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్కు వచ్చేసింది. తమ పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. అందుకోసం తమకు స్థోమత లేకపోయినప్పటికీ మంచి కాలేజీలో చేర్పిస్తారు. వారి చదువుల కోసం అప్పులు చేసేందుకు కూడా వెనకాడరు. పిల్లల చదువల కోసం తమ జీవితాల్ని త్యాగం చేసే చాలామంది తల్లిదండ్రులు ఆలోచించేది వారి ర్యాంకుల గురించే.. ఈ కాన్సెప్ట్‌తోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. -
ఫ్రైడే మూవీ లవర్స్‌కు పండగే.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం అనగానే థియేటర్ల వైపు చూస్తాం. ఏ సినిమా వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం. అయితే ఈ వారంలో సినీ ప్రియులను అలరించేందుకు జేమ్స్ కామెరూన్ అవతార్-3 థియేటర్లకు వస్తోంది. దీంతో పాటు టాలీవుడ్ నుంచి సకుంటుబానాం, గుర్రం పాపిరెడ్డి, జిన్ లాంటి సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే అవతార్-3పైనే ఆడియన్స్‌లో ఎక్కువగా బజ్ ఉంది.అయితే ఫ్రైడే రోజు అనగానే ఓటీటీ ప్రియులు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ వీకెండ్ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసేవారి కోసం ఓటీటీ మూవీస్ కూడా రెడీ అయిపోయాయి. టాలీవుడ్ నుంచి ప్రియదర్శి ప్రేమంటే, చాందిని చౌదరి సంతాన ప్రాప్తిరస్తూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేలా ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఫ్రైడే స్ట్రీమింగ్ కానున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ప్రేమంటే (తెలుగు సినిమా) - డిసెంబరు 19 రాత్ అఖేలీ హై- ద బన్సాల్ మర్డర్స్ (హిందీ మూవీ) - డిసెంబరు 19 ద గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సినిమా) - డిసెంబరు 19 ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (హిందీ టాక్ షో) - డిసెంబరు 20అమెజాన్ ప్రైమ్ వీడియో ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - డిసెంబరు 19 హ్యుమన్ స్పెసిమన్స్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 19 సంతాన ప్రాప్తిరస్తు(తెలుగు సినిమా) - డిసెంబరు 19 జియో హాట్‌స్టార్ మిసెస్ దేశ్‌పాండే (హిందీ సిరీస్) - డిసెంబరు 19 ఫార్మా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 19 సంతాన ప్రాప్తిరస్తు(తెలుగు సినిమా) - డిసెంబరు 19జీ5 నయనం (తెలుగు సిరీస్) - డిసెంబరు 19 డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ (మలయాళ సినిమా) - డిసెంబరు 19సన్ నెక్స్ట్ దివ్యదృష్టి (తెలుగు సినిమా) - డిసెంబరు 19 ఉన్ పార్వైల్ (తమిళ మూవీ) - డిసెంబరు 19ఆపిల్ టీవీ ప్లస్ బార్న్ టుబీ వైల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 19లయన్స్ గేట్ ప్లే రూఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 19 -
ఓటీటీకి ప్రియదర్శి రొమాంటిక్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రియదర్శి పులికొండ, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ప్రేమంటే. ఈ మూవీలో సుమ కనకాల ముఖ్యపాత్రలో నటించారు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కంచారు. రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. నవంబర్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.ప్రేమంటే కథేంటంటే..మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీ. Andhamaina vaibhavala veduka ey kadha premante 🤩❤️ pic.twitter.com/NF7ic6xETm— Netflix India South (@Netflix_INSouth) December 14, 2025 -
ఫ్రైడే ఓటీటీ మూవీస్ ధమాకా.. ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం మొదలైందంటే చాలు అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీల్లో సినిమాల సందడే సందడి. ఇక ఈ వారంలో బిగ్ స్క్రీన్‌పై అలరించేందుకు అఖండ-2, మౌగ్లీ చిత్రాలు వచ్చేస్తున్నాయి. గత వారమే రిలీజ్ కావాల్సిన అఖండ-2 వాయిదా పడడంతో చిన్న సినిమాలన్నీ రిలీజ్ చేయడం లేదు. కేవలం మౌగ్లీ మాత్రమే అఖండతో పోటీ పడనుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ కాంత మాత్రమే ఈ ఫ్రైడే కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇది మినహాయిస్తే తెలుగులో 3 రోజేస్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12సింగిల్ పాపా (హిందీ సిరీస్) - డిసెంబరు 12ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) - డిసెంబరు 12వేక్ అప్ డెడ్ మ్యాన్-ఏ నైస్ అవుట్ మిస్టరీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12కాంత (తెలుగు సినిమా) - డిసెంబరు 12సిటీ ఆఫ్ షాడోస్(స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- డిసెంబర్ 12జియో హాట్స్టార్అరోమలే (తమిళ మూవీ) - డిసెంబరు 12 (రూమర్ డేట్)ది గ్రేట్ షంషుద్దీన్ ఫ్యామిలీ(కామెడీ సిరీస్)- డిసెంబర్ 12టేలర్ స్విఫ్ట్- ది ఎరాస్ టూర్(డాక్యుమెంటరీ)- డిసెంబర్ 12అమెజాన్ ప్రైమ్టెల్ మీ సాఫ్టీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12ఆహా3 రోజెస్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - డిసెంబరు 12 జీ5సాలీ మొహబ్బత్ (హిందీ మూవీ) - డిసెంబరు 12సన్ నెక్స్ట్అంధకార (మలయాళ సినిమా) - డిసెంబరు 12ఆపిల్ టీవీ ప్లస్ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 12మనోరమ మ్యాక్స్ఫెమించి ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 12 -
ICC: అనూహ్యం.. రేసులోకి ప్రసార్ భారతి!
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశంలో క్రికెట్ ఓ మతం లాంటిది. అందుకే మిగతా ఏ క్రీడలకు లభించని క్రేజ్ ఈ ఆటకు మాత్రమే ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ప్రసార మాధ్యమాలు ఎల్లప్పుడూ ముందే ఉంటాయి.అనూహ్య రీతిలోముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహించే టోర్నీలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా దండిగా ఆదాయం పొందాలనే యోచనతో ఉంటాయి. అయితే, అనూహ్య రీతిలో కొన్నాళ్ల క్రితం ఐసీసీ మీడియా హక్కులను వదులుకునేందుకు జియో హాట్‌స్టార్ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.భారత్‌లో ఐసీసీ మ్యాచ్‌ల స్ట్రీమింగ్ హక్కుల కోసం రెండేళ్ల క్రితం.. నాలుగేళ్ల కాలానికి గానూ జియో హాట్‌స్టార్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని విలువ దాదాపు మూడు బిలియన్ డాలర్లకు పైమాటే. అయితే, టీ20 మెన్స్ ప్రపంచకప్-2026కు ముందు తాము ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఈ సంస్థ ఐసీసీకి సమాచారం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.రేసులోకి ప్రసార్ భారతి!ఆర్థిక నష్టాల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో హాట్‌స్టార్ తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఐసీసీ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రేసులోకి ఊహించని విధంగా ప్రసార్ భారతి (ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి గల సంస్థ) దూసుకువచ్చింది. పూర్తి హక్కులు దక్కించుకోలేకపోవచ్చుఈ విషయం గురించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘మొత్తానికి మొత్తంగా ఐసీసీ మీడియా హక్కులను ప్రసార్ భారతి దక్కించుకోలేకపోవచ్చు. అయితే, బ్రేకప్ విధానంలో కొన్ని మ్యాచ్‌లను ప్రసారం చేసే వీలు ఉండవచ్చు.ఉదాహరణకు టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు.. లేదంటే ఫార్మాట్లకు అతీతంగా టోర్నమెంట్ల వారీగా మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను పొందవచ్చు. ఏదో ఒక విధంగా ఐసీసీ మీడియా హక్కులలో భాగం కావడమే సంస్థ లక్ష్యం.దూర్దర్శన్, డీడీ ఫ్రీడిష్.. ఓటీటీ ప్లామ్‌ఫామ్‌లు.. ఇలా వివిధ వేదికల ద్వారా మ్యాచ్‌ల ప్రసారానికి ఆసక్తిగా ఉన్నాము. ముందుగా చెప్పినట్లు మొత్తం ప్యాకేజీ మేము దక్కించుకోలేకపోవచ్చు. అయినప్పటికీ బిడ్డింగ్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా టీమిండియా మ్యాచ్‌లనైనా ప్రసారం చేసే హక్కులు పొందాలని భావిస్తున్నాము’’ అని తెలిపినట్లు ఇన్‌సైడ్‌స్పోర్ట్ వెల్లడించింది.చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే! -
నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఢీల్.. మనకు 'సినిమా'నేనా..?
హాలీవుడ్‌కు పునాది లాంటి వార్నర్ బ్రదర్స్‌తో నెట్‌ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకుంది.దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్‌ను కొనుగోలుకు నెట్‌ఫ్లిక్స్ భారీ ధరనే కోట్ చేసింది. ఏకంగా రూ. 6.50లక్షల కోట్లకు డీల్ సెట్ చేసుకుంది. హాలివుడ్లో ఎంతో విలువైన కంపెనీగా కొనసాగుతున్న నెట్‌ఫ్లిక్స్ ఈ రేంజ్లో కొనుగోలు చేపట్టడం ఇదే తొలిసారి.ఇండియన్ సినిమాలో పెను మార్పులుఈ డీల్ ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ఇండియన్ సినిమా పరిశ్రమలో పెను మార్పులు తెస్తుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌కు ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇకనుంచి నెట్‌ఫ్లిక్స్ ( Netflix) దీర్ఘకాలిక థియేట్రికల్ రన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వదు. అంటే ఎంతపెద్ద సినిమా అయినా సరే కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి తీసుకురానుంది. 6–8 వారాల థియేట్రికల్ రన్స్ అనే రూల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఉండకపోవచ్చు. అయితే, థియేటర్లలో విడుదలలు కొనసాగుతాయని నెట్‌ఫ్లిక్స్ హామీ ఇచ్చింది. కానీ, విడుదల అయ్యే థియేటర్స్ సంఖ్య తప్పకుంగా తగ్గుతుంది. కేవలం మల్టీఫ్లెక్స్‌లలో మాత్రమే సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. దీంతో చిన్న సినిమాలకు మరింత గడ్డుపరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.వార్నర్ బ్రదర్స్ స్ట్రీమింగ్ జెయింట్స్ స్టూడియోలను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేస్తే.., థియేటర్లకు నిరంతర సినిమాల సరఫరా తగ్గిపోతుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) హెచ్చరించింది. నెట్‌ఫ్లిక్స్‌కు ఇండియన్ సినిమా నుంచి మంచి మార్కెట్ ఉంది కాబట్టి వారి వ్యాపార దృష్టి ఇక్కడ తప్పకుండా పడుతుందని పేర్కొంది. అదే జరిగితే భారత్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌కు మరింత ప్రమాదమని తెలిపింది. ఇక నుంచి పెద్ద స్టూడియో సినిమాలను నెట్‌ఫ్లిక్స్ టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలో మల్టీఫ్లెక్స్ (PVR, INOX) వంటి వాటితో తమ స్టూడియోలతో డీల్ చేసుకోవచ్చు. కానీ, చిన్న థియేటర్స్‌కి ఆ అవకాశాలు తక్కువ. నెట్‌ఫ్లిక్స్‌కు అలవాటు పడినప్పుడు రానురాను పెనుమార్పులు వస్తాయి. థియేటర్స్ ఎక్సిపీరియన్స్ తగ్గిపోవడం వంటి జరుగుతాయి. దీంతో మల్టీఫ్లెక్స్‌లు ఎదోలా కొనసాగినప్పటికీ చిన్న థియేటర్స్ మూతపడే ప్రమాదం ఉంది. పెద్ద స్టూడియో సినిమాలు లేకపోతే సింగిల్ థియేటర్స్ నడవడం కష్టం అవుతుంది. ఆపై OTTలో త్వరగా సినిమాలు వస్తే.., థియేటర్‌కి వెళ్లే ఉత్సాహం కూడా ప్రేక్షకులలో తగ్గుతుంది.థియేటర్స్ రిలీజ్ అవసరమేనెట్ఫ్లిక్స్ ఎంత స్ట్రాంగ్ పుంజుకున్నా సరే థియేటర్ ఇండస్ట్రీని నాశనం చేయలేదు. అవెంజర్స్, బ్యాట్‌మెన్ గాడ్జిల్లా డ్యూన్ వంటి సినిమాలు ఇంట్లో కూర్చొని చూడలేం. ఇలాంటివి పెద్ద స్క్రీన్లోనే చూసేందుకు ఇష్టపడుతారు. నెట్‌ఫ్లిక్స్‌కు కూడా థియేటర్స్ రిలీజ్ ఉంటేనే మేలు అనుకుంటుంది. పెద్ద స్క్రీన్‌లో సినిమా విడుదలైతేనే తన మార్కెట్‌కు మరంతి బలం చేకూరుతుంది. సులువుగా ఆ చిత్రానికి ప్రమోషన్ దొరుకుతుంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ కూడా థియేటర్లలో విడుదలలు కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. -
ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సీక్వెల్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలు వచ్చాక ఆడియన్స్ సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. క్రైమ్ అండ్ సెస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. కంటెంట్ నచ్చితే చాలు ఓటీటీల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అలా 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మర్టర్ మిస్టరీ థ్రిల్లర్ రాత్ అకేలి హై. కోవిడ్ సమయంలో ఈ మూవీ రిలీజైంది.తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా రాత్ అకేలి హై.. ది బన్సల్ మర్డర్స్ పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సీక్వెల్ మూవీ డిసెంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదకగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే మరోసారి తమ పాత్రల్లో అలరించనున్నారు. ఈ సీక్వెల్లో కొత్తగా చిత్రాంగద సింగ్, రజత్ కపూర్, రేవతి, దీప్తి నావల్, సంజయ్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని ఇటీవల గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రీమియర్ షో ప్రదర్శించారు.ఈ సినిమాకు హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించారు. స్మితా సింగ్ రాసిన ఈ థ్రిల్లర్ మూవీని ఆర్వీఎస్‌పీ, మాక్‌గఫిన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. #RaatAkeliHai : #TheBansalMurders Tamil Dubbed Movie OTT Release Sets To Premiere From December 19th on Netflix Also In Telugu Hindi pic.twitter.com/dxhpWaJ15l— SRS CA TV (@srs_ca_tv) December 7, 2025 -
ఓటీటీలో 'కాంత'.. ప్రకటన వచ్చేసింది
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా 'కాంత'.. నవంబరు 14న విడుదలైన ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. పీరియాడిక్ జానర్లో వచ్చిన ఈ మూవీని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషించారు. కాంత ఓటీటీ (Kaantha OTT)పై ప్రకటన రావడంతో షోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉండనుంది.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1950 బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్టార్ హీరో- దర్శకుడి చుట్టూ తిరుగుతుంది. అయ్య(సముద్రఖని) ఓ గొప్ప సీనీ దర్శకుడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శాంత’. ‘నట చక్రవర్తి’ టీకే మహదేవన్ అలియాస్ టీకేఎం(దుల్కర్ సల్మాన్) హీరోగా ప్రారంభమైన ఈ సినిమా ఓ కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఈ కథను టీకే మహదేవన్‌తోనే తెరకెక్కించాల్సి వస్తుంది.అయ్యకు ఇష్టంలేకపోయినా..ప్రొడ్యూసర్ కారణంగా టీకేఎంతో సినిమా చేసేందుకు ఒప్పుకుంటాడు. కానీ టీకేఎం ఈ సారి ఈ కథ క్లైమాక్స్‌ని మార్చి దానికి ‘కాంత’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తాడు. అంతేకాదు అయ్యను కేవలం కుర్చీకే పరిమితం చేసి తనకు నచ్చినట్లుగా సినిమాను తీస్తుంటాడు. ఇందులో కొత్త అమ్మాయి కుమారి(భాగ్యశ్రీ) హీరోయిన్. ఆమెను నటిగా తీర్చిదిద్దింది కూడా అయ్యనే. అటు హీరో, ఇటు దర్శకుడి మధ్య ఈగో వార్ జరుగుతున్నప్పటీకీ..సినిమా షూటింగ్ మాత్రం ఆగదు.చివరి రోజు ఒకే ఒక్క సీన్ మిగిలి ఉండగా..హీరో-దర్శకుడి మధ్య గొడవ జరిగి షూటింగ్ ఆగిపోతుంది. అదే రోజు స్టూడియోలో ఓ హత్య జరుగుతుంది. అది ఎవరిది? ఎందుకు చేశారు? గురు శిష్యులైన అయ్య, టీకేఎం మధ్య ఎందుకు విబేధాలు వచ్చాయి? వీరిద్దరి ఈగోల కారణంగా కుమారికి జరిగిన నష్టం ఏంటి? స్టూడియోలో జరిగిన హత్య కేసును పోలీసు అధికారి ఫీనిక్స్(రానా) ఎలా సాల్వ్ చేశాడు?అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
నెట్‌ఫ్లిక్స్ బిగ్ డీల్.. వార్నర్ బ్రదర్స్ కోసం బిడ్!
ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బిగ్ డీల్ ఖరారు కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ఒప్పందం కోసం బిడ్ వేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్‌కు చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 72 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6.47 లక్షల కోట్లు)గా ఉంది.ఈ లెక్కన ఒక్కో వార్నర్ బ్రదర్స్ షేరుకు 27.75 డాలర్లు చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్ (Netflix) బిడ్ వేసినట్లు తెలిసింది. సీఎన్ఎన్, టీబీఎస్, టీఎన్టీ వంటి కేబుల్ ఛానళ్లలో ప్రారంభించిన మార్పుల ప్రక్రియను వార్నర్ బ్రదర్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. హాలివుడ్లో అత్యంత విలువైన కెంపెనీగా ఎదిగిన నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి బిగ్ డీల్ చేపట్టడం ఇదే తొలిసారి.ఈ బిగ్ డీల్ కొనుగోలుతో హెచ్‌బీఓ నెట్వర్క్ నెట్‌ఫ్లిక్స్ సొంతం కానుంది. అలాగే ది సొప్రానోస్, ‘ది వైట్ లోటస్ వంటి హిట్ షోల లైబ్రరీలతో పాటు హ్యారీ పోటర్, ఫ్రెండ్స్ వంటి సినిమా, టీవీ ఆర్కైవ్స్ కూడా నెట్‌ఫ్లిక్స్ చేతుల్లోకి వెళ్లనున్నాయి. నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అసాధారణమైన వినోదాన్ని అందిస్తామమని తెలిపింది. Today, Netflix announced our acquisition of Warner Bros. Together, we’ll define the next century of storytelling, creating an extraordinary entertainment offering for audiences everywhere. https://t.co/rXPFMNIs1A pic.twitter.com/0pdsMUEob8— Netflix (@netflix) December 5, 2025 -
ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద హడావుడి మామూలుగా ఉండదు. కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉంటాయి. ఈ వారం టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ-2 బాక్సాఫీస్ సందడి చేయనుంది. దీంతో పాటు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ దురంధర్ రిలీజవుతోంది. రెండు కూడా అగ్ర హీరోలు కావడంతో సినీ ప్రియుల్లోనూ అదేస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఇక ఫ్రైడే వచ్చిందంటే చాలు.. థియేటర్ మూవీస్‌తో పాటు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్కు వచ్చేస్తుంటాయి. అలా ఈ శుక్రవారం పలు సూపర్ హిట్ మూవీస్ రెడీ అయిపోయాయి. వీటిలో రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలు కాస్తా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వీటితో పాటు ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ లాంటి తెలుగు వెబ్ సిరీస్, డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ మూవీస్ స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్‌ఫ్లిక్స్ ద గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు మూవీ) - డిసెంబరు 05 జే కెల్లీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 05 స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05 ద న్యూయర్కర్ ఎట్ 100 (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 05 ది నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్ట్మస్-2-డిసెంబరు 05ది బ్యాడ్ గాయ్స్- బ్రేకింగ్ ఇన్- (యానిమేషన్ సిరీస్)- డిసెంబర్ 06ఆహా ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 05జియో హాట్‌స్టార్ డీయస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05జీ5 ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు సినిమా) - డిసెంబరు 05 ఘర్వాలీ పెడ్వాలీ (హిందీ సిరీస్) - డిసెంబరు 05 బే దునే తీన్ (మరాఠీ సిరీస్) - డిసెంబరు 05 పరియా(బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్)- డిసెంబరు 05సోనీ లివ్ కుట్రమ్ పురిందవన్ (తమిళ సిరీస్) - డిసెంబరు 05సన్ నెక్స్ట్ అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ సినిమా) - డిసెంబరు 05ఆపిల్ టీవీ ప్లస్ ద ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 05 -
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్... రిలీజ్‌కు ముందే సంచలనం!
ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్ అయితే ‘చికిరి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తోంది. అంతకు ముందు విడుదలైన గ్లింప్స్‌తో పాటు ఈ పాట కూడా హిట్ కావడంతో పెద్దిపై అంచనాలు అమాంతం పెరిగాయి.సినిమాకు వచ్చిన బజ్‌తో పలు ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం పోటీపడ్డాయట. ముఖ్యంగా రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీలో నిలవగా.. భారీ ధరకు నెటిఫ్లిక్స్ డిజిటల్ రైట్స్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) కోనుగోలు చేసిందట నెట్‌ఫ్లిక్స్. అన్ని భాషలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించబోతుందట. షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కాబోతున్న చిత్రాలకే ఓటీటీ బిజినెస్ అవ్వడం లేదు. అలాంటిది ఇంకా షూటింగ్ కూడా పూర్తికాని పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సిద్ధం చేయించిన భారీ సెట్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌చరణ్, ఇతర ఫైటర్లతో పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కూడా పాల్గొంటున్నారు. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తండ్రి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తుండగా, నవకాంత్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘ప్రతి ఫైట్ సీక్వెన్స్‌ను ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో, ఉత్కంఠభరితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బుచ్చిబాబు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ ఓ హైలైట్‌గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. -
నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'ది గర్ల్‌ఫ్రెండ్'
ఏ సినిమాలో అయినా హీరోహీరోయిన్ కలిస్తే జనం చప్పట్లు కొడతారు. కానీ, ఈ సినిమాలో మాత్రం వాళ్లిద్దరికీ బ్రేకప్ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఆ మూవీయే ది గర్ల్‌ఫ్రెండ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా, దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.నెల తిరగకముందే ఓటీటీలోనవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 5న అందుబాటులోకి వస్తున్నట్లు వెల్లడించారు. నెలరోజులు కాకముందే ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీలో సందడి చేయనుందన్నమాట! తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమ్ అవనుంది. ఇది చూసిన అభిమానులు.. ఈ మూవీ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నామో అని కామెంట్లు చేస్తున్నారు.కథేంటంటే?The Girlfriend Movie: భూమా (రష్మిక మందన్నా) తండ్రి (రావు రమేశ్)చాటు కూతురు. పీజీ చదివేందుకు తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వెళ్లి ఓ కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) కూడా చేరతారు. దుర్గ.. విక్రమ్‌ను ప్రేమిస్తే.. అతడు మాత్రం భూమాను లవ్ చేస్తాడు. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకుంటూనే భూమా కూడా అతడితో ప్రేమలో పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? భూమా జీవితం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్లిందని తెలుసుకుని ఆమె ఏం చేసింది? అన్నదే మిగతా కథ. ఈ శుక్రవారం ఎంచక్కా ఓటీటీలో గర్ల్‌ఫ్రెండ్ చూసేయండి.. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: బ్రహ్మానందంపై నోరు జారిన రాజేంద్రప్రసాద్.. అంతమాటన్నాడా? -
ఓటీటీకి జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ ఏడాది ఎడాపెడా సినిమాలు చేస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సరసన పెద్దిలోనూ కనిపించనుంది. ఇక హిందీలో హిట్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలతో అలరిస్తోంది. అలా ఈ ఏడాదిలో వచ్చిన మరో రొమాంటిక్ కామెడీ మూవీ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి.ఈ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన మెప్పించింది దేవర భామ. ఈ సినిమా దసరా కనుకగా థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2 న థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.98.35 కోట్లు వసూలు చేసింది.దాదాపు నెలన్నర్ర రోజుల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోంది సన్నీ సంస్కారీ కి తులసి కుమారి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. Muhurat nikal gaya guys 🥳#SSKTKonNetflix pic.twitter.com/xU2N5bKcej— Netflix India (@NetflixIndia) November 26, 2025 -
బెస్ట్ హారర్ సినిమా.. ఎట్టకేలకు తెలుగులో స్ట్రీమింగ్
మీలో చాలామంది అమెజాన్ ప్రైమ్‌లో 'టాక్ టు మి' Talk to Me (2022) చిత్రాన్ని చూసే ఉంటారు. ఆస్ట్రేలియన్ హారర్ మూవీ సంచలన విజయం సాధించింది. దీనిని తెరకెక్కించిన దర్శకులు డానీ, మైఖేల్ ఫిలిప్పో మరోసారి అద్బుతమైన హారర్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. 'బ్రింగ్ హర్ బ్యాక్' (Bring Her Back) పేరుతో మరో హారర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఆకట్టకున్నారు. ఈ ఏడాది మే నెలలో విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి తెలుగు వర్షన్ వచ్చేసింది. అయితే, ఇప్పటికే ఇంగ్లీష్ వర్షన్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.'బ్రింగ్ హర్ బ్యాక్' తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. తెలుగు వర్షన్‌తో పాటు తమిళ్, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా సూపర్‌నేచురల్ హారర్, బాడీ హారర్, సైకాలజికల్ హారర్ అంశాలతో నిండి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ హారర్ చిత్రంగా కూడా ఎంపికైంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. కానీ, దీన్ని చూడటానికి రూ. 75 చెల్లించాలి. అంతేకాకుండా, తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు.


