
సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda) నటించిన జాక్ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది. చాలారోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 10న విడుదలైన జాక్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
'జాక్' సినిమా మే 8న ఓటీటీలో విడుదల కానుందని 'నెట్‌ఫ్లిక్స్'(Netflix) ప్రకటించింది. తెలగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్న సిద్ధు.. జాక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. అయితే, ఆయన అంచనాలు తప్పడంతో భారీ నష్టాలను ఈ మూవీ మిగిల్చింది. సిద్ధు గత సినిమా 'టిల్లు స్క్వేర్'కి రూ.23 కోట్లు తొలిరోజే రాబట్టింది. అయితే 'జాక్' చిత్రానికి మాత్రం రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే ఫస్ట్ డే వచ్చాయి. సుమారు రూ. 36 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద ఫైనల్‌గా కేవలం రూ. 7 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.

కథేంటంటే..
పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ కావాలని కలలు కంటాడు. తనకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు. ఆ రిజల్ట్ రాకముందే ఖాలీగా ఉండడం ఎందుకని దేశాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదులు, హైదారాబాద్‌తో పాటు భారత్‌లోని ఇతర ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు.
మరోవైపు జాక్ ఏం పని చేస్తున్నాడో కనుక్కోమని ప్రైవేట్ డిటెక్టివ్ అఫిషాన్ బేగం (వైష్ణవి చైతన్య)కు లక్ష రూపాయలు ఇస్తాడు అతని తండ్రి పాన్ ఇండియా ప్రసాద్(నరేశ్). అఫిషాన్ బేగం భానుమతి పేరుతో జాక్‌కి దగ్గరై జాక్ పనిపై నిఘా పెడుతుంది. టెర్రరిస్టులను పట్టుకునే క్రమంలో పొరపాటున ‘రా’ఏజెంట్ మనోజ్(ప్రకాశ్ రాజ్)ని కిడ్నాప్ చేస్తాడు జాక్. ఆ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్ట్ గ్యాంగ్‌ని జాక్ పట్టుకోగలిగాడా లేదా? అసలు జాక్ ‘రా’ ఏజెంట్ కావాలని ఎందుకు అనుకున్నాడు? చివరకు తను కోరుకున్న ఉద్యోగం పొందగలిగాడా లేదా? అనేదే తెలియాలంటే జాక్(Jack Movie Review) సినిమా చూడాల్సిందే.