రామాయణలో 'కుంభకర్ణ'గా ఆ నటుడు! | Buzz: Faisal Malik is Kumbhakarna in Ramayana Movie | Sakshi
Sakshi News home page

కుంభకర్ణుడిగా పంచాయత్‌ నటుడు.. షూటింగ్‌ పూర్తి!

Mar 15 2026 7:28 PM | Updated on Mar 15 2026 7:28 PM

Buzz: Faisal Malik is Kumbhakarna in Ramayana Movie

ఇండియన్‌ బిగ్‌స్క్రీన్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. నితీశ్‌ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఈ రెండు భాగాలకు కలిపి దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. అంటే సినిమాను ఎంత విజువల్‌ వండర్‌గా తెరకెక్కిస్తున్నారో ఇక్కడే అర్థమైపోతోంది.

రామాయణ సినిమా
ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్‌ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే సన్నీడియోల్‌ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. తాజాగా రావణుడి సోదరుడు, కుంభకర్ణుడి పాత్ర గురించి ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొన్నటివరకు బాబీ డియోల్‌ కుంభకర్ణుడిగా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది.

కుంభకర్ణుడిగా..
అతడే ఫైజల్‌ మాలిక్‌. పంచాయత్‌ వెబ్‌ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడిని కుంభకర్ణుడిగా ఎంపిక చేయగా, అతడిపై సీన్స్‌ చిత్రీకరించారని తెలుస్తోంది. అతడి అవతారం కుంభకర్ణుడి పాత్రకు సరిగ్గా సరిపోయిందని ఇన్‌సైడ్‌ వర్గాల టాక్‌! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే మార్చి 27న శ్రీరామనవమిని పురస్కరించుకుని రామయణ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తుండగా రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్‌ చేయనున్నారు.

సినిమాలు, సిరీస్‌లు
ఫైజల్‌ మాలిక్‌.. గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌ సినిమాలో కామెడీ పోలీస్‌గా నటించాడు. పంచాయత్‌ వెబ్‌ సిరీస్‌లో డిప్యూటీ ప్రధాన్‌ ప్రహ్లాద్‌చాగా అలరించాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాలు, సిరీస్‌లు చేశాడు. చివరగా హారర్‌ కామెడీ మూవీ థామాలో పోలీస్‌గా కనిపించాడు.

చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి..: ప్రియదర్శన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement