breaking news
Kumbhakarnas
-
ఒక్కరోజు భోజనం.. ఆరు నెలలు నిద్ర! కుంభకర్ణుడికి ఈ వరం ఎలా?
రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మ గురించి తపస్సు చేశారు. ‘ఏ వరమూ లేకుండానే కావరంతో వీడు పెట్టే బాధలు భరించరానివిగా ఉన్నాయి. ఇక వరములిస్తే లోకాలు తట్టుకోగలవా దేవా? కనుక, ఏ వరాలూ కుంభకర్ణుడికి ఇవ్వవలదు’ అని బ్రహ్మదేవుడిని ప్రార్థించారు దేవతలు.కుంభకర్ణుడిపై కారుణ్యత్వము మాని, అతడిని మాయావివశుడిని జేసి, ఏదో ఒక చిన్న వరాన్ని ప్రసాదిస్తే లోకాలకు శుభం జరుగుతుంది అన్నారు. వెంటనే బ్రహ్మదేవుడు ‘సకల జీవుల రసనలపై నిలిచి నాట్య మాడే నీవు, ఈ కుంభకర్ణుడి రసనపై ఇప్పుడు నిలిచి, నీ చాతుర్యంతో వ్యర్థ ప్రలాపాలను పలికించి, లోకాలకు హాని కలిగించే వరం ఏదీ అతడు కోరుకోకుండా చేయుము!’ అని సరస్వతీదేవిని ఆదేశించాడు. అలాగేనంది ఆమె.అప్పుడు బ్రహ్మ, తపస్సులో ఉన్న కుంభకర్ణుడి ముందు ప్రత్యక్షమై ‘కుంభకర్ణా! నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో’ అన్నాడు. బ్రహ్మ చెప్పినట్లుగా సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకపై చేరి, ఆ క్షణం కుంభ కర్ణుడి చేత ‘ఆరుమాసాలు సుఖనిద్ర, ఒకరోజు భోజనం’ ప్రసాదించమని అడిగించింది. ‘నిజమే, అదే మేలు. నీవు కోరిన ప్రకారమే సుఖ నిద్రలో ఉండు’ అని కుంభకర్ణుడికి వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. కుంభకర్ణుడు వెంటనే నిద్రలోకి జారు కున్నాడు. దేవతలు సంతోషించారు.‘ఉత్తర రామాయణం’ కావ్యం, ద్వితీయాశ్వాసంలోని ఈ సందర్భాన్ని ఆధారం చేసుకుని, ఆ కావ్యకర్తయైన కంకంటి పాపరాజు ఇలా వ్యాఖ్యానించాడు: క. పౌరుషంబునకు దైవం/ బారయ ఫలకారి యందు రాదైవంబే/ వైరస్యము వహించిన/ నేరూపున పురుషుడొందు నిష్టార్థంబుల్. మనిషి కోరుకునే కోరికలను, ఆ కోరికలు సఫలం కావాలని చేసే ప్రయత్నాలను దైవం ఫలవంతం చేస్తాడు. అటువంటిది, ఆ దైవమే, చేసే ప్రయత్నాలపట్ల విముఖు డైతే, ఆ వ్యక్తి తన కోరికలను ఎలా తీర్చుకుంటాడు? తీర్చుకోలేడు. ఆ పరిస్థితి రాకుండా ధర్మయుక్తమైన జీవితం గడుపుతూ, దైవం పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉండటం మనిషి చేయవలసిన పని.– భట్టు వెంకటరావుఇవి చదవండి: కుటుంబం: సామాజిక సౌధానికి పునాది -
రామాయణలో 'కుంభకర్ణ'గా ఆ నటుడు!
ఇండియన్ బిగ్స్క్రీన్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఈ రెండు భాగాలకు కలిపి దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అంటే సినిమాను ఎంత విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారో ఇక్కడే అర్థమైపోతోంది.రామాయణ సినిమాఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే సన్నీడియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. తాజాగా రావణుడి సోదరుడు, కుంభకర్ణుడి పాత్ర గురించి ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొన్నటివరకు బాబీ డియోల్ కుంభకర్ణుడిగా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది.కుంభకర్ణుడిగా..అతడే ఫైజల్ మాలిక్. పంచాయత్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడిని కుంభకర్ణుడిగా ఎంపిక చేయగా, అతడిపై సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. అతడి అవతారం కుంభకర్ణుడి పాత్రకు సరిగ్గా సరిపోయిందని ఇన్సైడ్ వర్గాల టాక్! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే మార్చి 27న శ్రీరామనవమిని పురస్కరించుకుని రామయణ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తుండగా రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు.సినిమాలు, సిరీస్లుఫైజల్ మాలిక్.. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాలో కామెడీ పోలీస్‌గా నటించాడు. పంచాయత్ వెబ్ సిరీస్‌లో డిప్యూటీ ప్రధాన్ ప్రహ్లాద్చాగా అలరించాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాలు, సిరీస్‌లు చేశాడు. చివరగా హారర్ కామెడీ మూవీ థామాలో పోలీస్‌గా కనిపించాడు.చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి..: ప్రియదర్శన్ -
కలియుగ కుంభకర్ణుడు: ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే!
రామాయణంలో కుంభకర్ణుడి సంగతి అందరికీ తెలిసిందే! కుంభాలకు కుంభాలు భోంచేశాక శుభ్రంగా ఆరునెలల పాటు ఏకధాటిగా గుర్రుపెట్టి నిద్రపోయేవాడు. సుదీర్ఘకాలం నిర్విరామంగా నిద్రపోవాలంటే, ఎంతటి బద్ధకస్తులకైనా సాధ్యమయ్యే పనికాదు. అయితే, నాగపూర్‌లో పుర్ఖారామ్ అనే వ్యక్తిని మాత్రం అక్కడి జనాలు కలియుగ కుంభకర్ణుడని అంటున్నారు. అతగాడు ఒకేసారి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు నిర్విరామంగా నిద్రపోగలడట! ఆయనకు ‘యాక్సిస్ హైపర్సోమ్నియా’ అనే అరుదైన నిద్ర వ్యాధి ఉంది. ఈ వ్యాధి కారణంగా శరీరం క్రమంగా అలసిపోతుంది, మెదడు వేకప్ బటన్‌నే మరచిపోతుంది. ఈ వ్యాధి ఫలితంగానే పుర్ఖారామ్‌కు నిద్రే జీవితం అయ్యింది. ఇలా ఇతను ఒక సంవత్సరం మొత్తంలో 300 రోజులు నిద్రలోనే గడిపేస్తాడు. ఇతడి కథ విన్నవారు ‘ఒకవైపు ప్రపంచం రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరి అని పోరాడుతుంటే, ఇతనికి మాత్రం నిద్రలోనే జీవితం గడిచిపోతోంది’ అంటూ ఆశ్చర్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇతడి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, నిద్ర సంబంధ వ్యాధులపై అనేక చర్చలు మొదలయ్యాయి. -
గుండెపోటుతో కుంభకర్ణ పాత్రధారి మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ నేపధ్యంలో అక్కడక్కడా విషాదకర ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.దేశ రాజధానిలోని చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో వేదికపై రామలీలను ప్రదర్శిస్తుండగా విషాదం చోటుచేసుకుంది. రావణుని సోదరుడు కుంభకర్ణుని పాత్రను పోషిస్తున్న 60 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు.ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ నివాసి విక్రమ్ తనేజా రామ్‌లీలలో కుంభకర్ణుడి పాత్రను పోషిస్తున్నాడు. వేదికపై ఆయన తన పాత్ర పోషిస్తుండగా ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే అతనిని పీఎస్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తనేజా మృతి చెందినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి -
మెలకువ వచ్చాక తేదీలు చూసుకుంటారు!
ఆ ఊర్లో కోడికూతలుండవు. ఒకవేళ కోడి కూసినా.. నిద్రలేవడం కాదు కదా.. కనీసం ఉలిక్కిపడేవారూ ఉండరు. ఎందుకంటే.. ఊరు ఊరంతా నిద్రమత్తులో జోగుతోంది. ఒకసారి నిద్ర ముంచుకొచ్చిందంటే.. కొన్ని రోజులు గడిస్తే గానీ వారికి మెలకువ రాదు. కుంభకర్ణుడి వారసులతో నిండినట్లున్న ఆ ఊరు ఉత్తర కజాఖ్‌స్థాన్‌లో ఉంది. పేరు కలాచీ. జనాభా ఆరొందలే. నాలుగేళ్ల నుంచీ జనాలంతా బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా నిద్రలోకి జారుకుంటున్నారు. మెలకువ వచ్చాక తేదీలు చూసుకుని అవాక్కవుతున్నారు. ఇప్పటికే కొంతమందికి భ్రమలు, జ్ఞాపకశక్తి సమస్యలూ మొదలయ్యాయట. కొందరు నిలబడలేకపోతుండగా, మరికొందరు అడ్డదిడ్డంగా నడుస్తూ, పరుగెడుతున్నారట. ఆ ఊరి ప్రజల మెదళ్లలో అప్పుడప్పుడూ అదనపు నీరు చేరుతుండటం వల్లే ఇలా జరుగుతోందని ఎట్టకేలకు వైద్యులు గుర్తించారు. కానీ అతినిద్ర వ్యాధి గానీ, వైరల్, బ్యాక్టీరియల్ వ్యాధులేమీ లేకపోవడంతో ఈ అతినిద్ర ఎందుకొస్తోందో తేల్చలేకపోతున్నారు. అక్కడి మట్టిలో, నీటిలో కూడా ప్రమాదకర రసాయనాలు లేవని పరిశోధనల్లో తేలింది. అయితే, ఈ గ్రామానికి సమీపంలో సోవియెట్ కాలం నాటి మూతపడిన యురేనియం గనుల నుంచి వస్తున్న రేడియేషన్ వల్లే నిద్రరోగం వస్తోందని కొందరు, గ్రామం వద్ద విషపూరిత వ్యర్థాలను పాతిపెట్టారని మరికొందరు భావిస్తున్నారు. గ్రామంలో రేడియేషన్ సాధారణం కంటే 16 రెట్లు ఎక్కువగా ఉన్నా, ఈ నిద్రరోగానికి రేడియేషన్‌కు సంబంధం లేదనీ తేలడంతో ఇది మరింత మిస్టరీగా మారింది.


