ఏ రకమైన దోమ కుడితే ఎలాంటి వ్యాధి వస్తుందో తెలుసా? | World Mosquito Day 2026 check how to Prevention | Sakshi
Sakshi News home page

ఏ రకమైన దోమ కుడితే ఎలాంటి వ్యాధి వస్తుందో తెలుసా?

Aug 19 2026 12:00 PM | Updated on Aug 19 2026 12:28 PM

World Mosquito Day 2026 check how to Prevention

ఆగస్టు 20న ప్రపంచ దోమల  దినోత్సవం

World Mosquito Day 2026 అసలే వర్షాకాలం సీజన్‌.. సరైన పారిశుధ్య చర్యలు చేపట్టక దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో అంటువ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. దోమల ద్వారా సంభవించే వ్యాధులపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో నిధుల లేమి, ఇతరత్రా కారణాల వల్ల పారిశుధ్య చర్యలు చేపట్టడం లేదు. దీనివల్ల దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. దోమలు కుట్టడం ద్వారా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, జికా వైరస్‌ వంటి ప్రమాదకర వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. దీంతో పాటు కొన్ని ఏరియాల్లో ఎల్లో ఫీవర్, ఎలిఫెంటియాసిస్, వెస్ట్‌ నైల్‌ వైరస్‌ వ్యాధులు కూడా అరుదుగా సంభవిస్తున్నాయి. ఈ వ్యాధుల నివారణకు తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఏటా ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 

ఆడ ఎనాఫిలిస్‌ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సంభవిస్తుందనే విషయాన్ని బ్రిటన్‌ వైద్యుడు సర్‌ రోనాల్డ్‌ రాస్‌ 1897 ఆగస్టు 20న కనుగొనడంతో అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ వ్యాప్తంగా దోమల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.   

దోమకాటుపై అలసత్వం వద్దు 
చిన్న దోమ కుట్టడం వల్ల పెద్ద వ్యాధి సోకే అవకాశముంది. దోమల ద్వారా వ్యాధి సోకిన వ్యక్తి సకాలంలో చికిత్స తీసుకోకుండా అలసత్వం వహిస్తే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. దోమల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రతి శుక్రవారం డ్రైడేను పాటిస్తున్నా దోమల ఉధృతి మాత్రం తగ్గడం లేదు. అయితే వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా దోమలను సులభంగా నియంత్రించే అవకాశ«ం ఉంది. సంపూర్ణ పారిశుధ్య చర్యలు పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి అంటువ్యాధులను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2500 రకాల దోమలు ఉండగా అందులో ఏడు జాతులు ఎక్కువ వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. అయితే దేశంలో ప్రధానంగా అనాఫిలిస్, ఏడీఎస్, క్యూలెక్స్‌ దోమల వల్ల దేశంలో విస్తృతంగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మిగతా రకాలైన కులిసేట, మాన్సోనియా, సోరోఫోరా, టోక్సోరిన్కైట్స్‌ జాతి దోమలు స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల అంతగా ప్రభావం చూపలేవు.

దోమల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు 

  • ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత ఉండకూడదు 

  • ఇంటిచుట్టూ మురుగునీరు నిల్వ ఉండకూడదు 

  • సాయంకాలం తరువాత ఇంటి కిటీకీలు, తలుపులు మూసి ఉంచాలి 

  • నిద్రించే సమయంలో దోమలు తెరలు ఏర్పాటు చేసుకోవాలి. 

  • శరీరం పూర్తిగా కప్పి ఉంచేలా పొడవైన దుస్తులు ధరించాలి. 

  • తగినంత నీరు తాగాలి. ఆహార సమతుల్యతను పాటించాలి. 

  • కూలర్లు, కుండీల్లో వారినికోసారి నీటిని మార్చాలి.

ఏ రకమైన దోమ కుడితే  ఏం వస్తుందంటే.. 

  •  ఆడ అనాఫిలిస్‌ దోమ కుట్టడం ద్వారా మలేరియా సోకుతుంది 

  •  సూక్ష్మజీవి ద్వారా డెంగీ వ్యాప్తి చెందుతుంది. 

  • చికున్‌గున్యా ఏడీఎస్‌ దోమ కుట్టడం వల్ల చికున్‌గున్యా వస్తుంది.  

  •  ఏడీఎస్‌ ఈజిప్టు దోమ కుడితే జికా వైరస్‌ సోకుతుంది. ఇది లైంగిక సంపర్కం ద్వారా మరొకరికి కూడా సోకుతుంది. 

  • క్యూలెక్స్‌ దోమ రాత్రి వేళల్లో కుడుతుంది. దీని వలన బోదకాలు వ్యాధి సంభవిస్తుంది.

ఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement